పున్నమికోసం….(కవిత )-డా||బాలాజీ దీక్షితులు పి.వి

ఆశ కలువ వాడి పోయి చాలా రోజులైంది

మంచితనం మసివడి
మానవత్వం తగలబడి
న్యాయం -ధర్మం, దారిద్య్రం దాపురించి
బ్రతుకు నమ్మకమే పోయి
ఎందుకు పుట్టామా ఈ లోకంలో అని అలమటిస్తున్నా

నా వాళ్ళు అనుకున్న వాళ్ళు
ఎప్పుడో నన్ను పూడ్చేసారు

కుళ్ళు కళ్ళ జ్వాలలకు
నే నమ్మిన సన్మార్గం ఎపుడో తగలడిపోయింది

ఓర్వలేని మనుషులు
ఎదుగుదల చూడలేని మనసులు
మెాసుకుపోలేని నడమంతర సిరికోసం
వెన్నులేని వాడికి కూడా వెన్నుపోటు

పొడుస్తున్న లోకంలో ఎందుకు పుట్టామా అనిపించదా|

ఆశ చచ్చినా – ఆశయం వదలకూడదని
బ్రతుకు బుగ్గైనా- భవితకు స్ఫూర్తి చూపాలని
అంపశయ్యపై నున్నా …
నే నెందుకు విజయుడిని కాకూడదని పోరాడుతున్నా

మనుషులను పుట్టించిన భగవంతుడే
భయపడి మంచిని ఓడిస్తున్నా …
నా బ్రతుకు సన్మార్గ హితం
నా జీవనం సహేతుక విజయగీతం కావాలని
పున్నమి కోసం ఎదురుచూస్తున్నా…
తిరిగి విరబూయాలని

-డా||బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో