*ది రైటర్*(కథ )- కౌలూరి ప్రసాదరావు

చల్లని సాయంత్రం వేళ.చల్లగాలి మెల్లగా వీస్తూ హాయిగొలుపుతోంది. అప్పుడే తలంటుకుని వచ్చి ఈజీ ఛైర్ లో కూర్చుని వేడివేడి టీ తాగుతూ, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాకు ఇష్టమైన అక్కినేని పాట “నేను పుట్టాను ఈ లోకం నవ్వింది”వింటూ తాదాత్మ్యంలో మునిగిపోయాను. తెలుగు భాషలో నాకు అత్యంత ప్రీతి పాత్రమైన పదం ‘ఆహ్లాదకరం’.ఇప్పుడు దాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాను.పాట చివరికొచ్చేసరికి రసభంగమైంది.సెల్ ఫోన్ లో సాంగ్ ఆగిపోయి,రింగ్ టోన్ వినిపించింది.మెల్లగా కళ్ళు తెరిచి చూసా.ఏదో అన్ నోన్ నెంబర్ .

ఆన్ చేసి ‘హలో’అన్నాను విసుగ్గా. అప్పటికే తపోభంగమైన ముని కమండలం ఎత్తినప్పటి పరిస్ధితి.ఇక శపించటమే తరువాయి.’హలో’అంటూ ఓ తీయని గొంతు వీణతీగ మీటిన శబ్దంలా వినిపించింది.మనసులోని ఒక మూలనుండి కోకిల కచేరీ ప్రారంభిం చేసింది.చప్పున ఆగ్రహం చల్లారిపోయి ఆసక్తిగా రూపాంతరం చెందింది.ఇంతలో “రచయిత ప్రవీణ్ గారేనండి?” పట్టు నుండి తేనె కారుతున్నట్టుగా మళ్ళీ విని పించింది ఆమె స్వరం.అంతరాయం వల్ల దూరమైన ఆహ్లాదం తిరిగొచ్చింది.”అ.. అ..అవునండీ”అన్నాను,సాధ్యమైనంత మృదుత్వానికి కాస్త పంచదారని గొంతులో మిళితం చేస్తూ.”నేను మీ అభి మానినండీ,రెగ్యులర్ గా మీరచనలు చదువుతుంటాను” మళ్ళీ వీణానాదం,
ఈసారి తేనెతుట్టె చితికిపోయి, ఒక్కసారిగా మీద ఒలికిన అనుభూతి. “అలాగా!చాలా సంతోషమండీ!” మాటలు తడబడుతున్నాయి,అప్పటికే గర్వంలాంటి ఫీలింగేదో హృదయాన్ని మత్తుగా ఊపేస్తోంది.బహుశా కవులకు కావాల్సిన గుర్తింపు ఇదే కాబోలు. “మీకథలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి.సమాజాన్ని నిశితంగా పరిశీ లిస్తుంటారనుకుంటా.ప్రతీ కథలోనూ ఏదొక సందేశం ఉండి తీరుతుంది.నీతి అంతర్లీనంగా ప్రవహిస్తూంటుంది.సామా జిక సృహ అంటారే అది మీ రచనల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది” అందామె.

ఒక అభిమాని’పైగా మహిళా పాఠకు రాలు,ఆపై మధురమైన స్వరంగలావిడ అంత క్షుణ్ణంగా పరీక్షించి,విశ్లేషిస్తుంటే రచయితగా నాజన్మ ధన్యమైనట్టే. అందుకే ఉబ్బితబ్బిబై,రెక్కలగుర్రంపై స్వారీ మొదలెట్టాను.ఆమె స్వరాన్ని బట్టి శరీరసౌష్టవం ఊహించే ప్రయత్నం కూడా చేసాను.”ఐతే నాకథల్లో మీకు నచ్చినది ఏది?”అన్నాను,గొంతులో కొంచెం చిలిపి దనాన్ని ఒంపుతూ.”అన్నీ బానే ఉంటాయి.దేనికదే సాటి.ముఖ్యంగా ఈ మధ్య రాసిన”తాగుబోతు” కథ నా మనసుని హత్తుకుంది.మద్యపానం మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం అది.ప్రజల డబ్బూ,ఆరోగ్యం ఎలా హరించుకు పోతాయో,జీవితాలు ఎలా ఛిద్ర మౌతాయో కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని ఎండ గట్టిన తీరు అద్భుతం”అంది పొగుడుతూ.

ఆ మాటలకు తనువు పులకించింది. అప్పటికే మనసులోని కోకిలగానం పతాక స్ధాయికి చేరుకుంది.”నాకథల్ని బాగా ఫాలో అవుతున్నారన్నమాట” అన్నాను పరవశంగా.”ఔను!మిమ్మల్ని కూడా”ఆమె గొంతు అదోలా ధ్వనించింది మంచినీటిలో బ్లీచింగ్ పౌడర్ కలిసినట్ట నిపించి “ఎందుకూ?”అన్నాను.ఎందుకో గాని ఆహ్లాదంలో ఒకపాలు తగ్గినట్టనిపిం చింది.”అది తెలియాలంటే మీరొక కథ వినాలి”ఆమె గొంతులో ఏదో అధికారం ధ్వనించింది.”కథా రచయితకే కథ వినిపి స్తారా? సరే చెప్పండి?”అన్నాను ఏమనాలో తెలీక.కానీ చల్లగాలిలోకి గ్రీష్మతాపం చేరుతున్న సూచనలు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.

“ఓసారి రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒక స్త్రీ తన పిల్లవాడిని తీసుకు వచ్చి’వీడు రసగుల్లాలు తెగ తింటున్నాడు,కడుపులో పురుగులు పడి ఆరోగ్యం పాడవుతోంది.మీరు కాస్త మందలించి ఆ అలవాటును మాన్పించండి స్వామీ!’అని వేడుకొంది. ఆయన కొద్దిగా ఆలోచించి’వచ్చేవారం రండి’అని చెప్పి పంపాడు.ఆమె మరుసటి వారం వచ్చింది.పరమహంస ఆపిల్లవాడి తల నిమురుతూ’నాయనా! స్వీట్లు ఎక్కువగా తినకూడదు. అనారోగ్యం కలుగుతుంది.ఇకనుండి మానెయ్యి’అన్నాడు ఆప్యాయంగా.ఆ మాటలకి కోపం ముంచుకొచ్చిన ఆ స్త్రీ ‘పోయినసారి వచ్చినపుడే ఈమాట చెబితే సరిపోవును కదా స్వామీ’ అంది ఆగ్రహాన్ని అణుచుకుంటూ.

పరమహంస మందహాసం చేస్తూ ‘అమ్మా!మీపిల్లవాడికున్న అలవాటే నాకూ ఉంది.నేను తింటూ మీపిల్లవాడిని తినొద్దనే అర్హత నాకెక్కడిది?అందుకే వారం రోజులు గడువు తీసుకుని అతి కష్టమ్మీద ఈ వ్యసనం మానుకున్నాను. ఇప్పుడు మీ కుర్రాడికి బోధించే అధికారం నాకు వచ్చింది.నామాటకి శక్తీ పరిపూర్ణత కలిగాయి.ఇక మీవాడు తన అలవాటుని వదిలిపెడతాడు’అని ఆశీర్వదించి పంపించాడు”అని ఒక క్షణం ఆగింది నాఅభిమాన పాఠకురాలు. ఎందుకో తెలీదుగానీ నా శరీరం స్వల్పంగా కంపించటం మొదలెట్టింది. “ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు?” హీనస్వరంతో అడిగాను.

హఠాత్తుగా మంచుకొండ పగిలి లావా వెలిగక్కింది.”ఎందుకా?మద్యం నా పద్యమనే కవి మద్యపాన నిషేధం గురించి రాస్తే అసహ్యంగా ఉంటుంది గాబట్టి.మీరు పాటించని నీతిని పరులకు బోధించటం కృతకంగా ఉంటుంది కాబట్టి మలయమారుతంలా సాగాల్సిన ఆమె మాటలు మండుటెండలోని చండ్ర నిప్పుల్ని కురిపించాయి.వెన్నుపూసలో ప్రారంభమైన వణుకు శరీరమంతా వ్యాపించింది.”అంటే రాత్రి పార్టీలో మీరు ఉన్నారా?”అతి కష్టమ్మీద గొంతు పెగిలింది.”ఆహా!అతి త్వరగానే కనిపెట్టే సారే!ఎంతైనా పాపులర్ రైటర్ గదా? మీరు తప్పతాగి చేసిన అల్లరంతా చూసాను”అంది కూల్ గా,
‘ఓరి భగవంతుడా!కొంప మునిగింది పరువు పోయింది.ఇప్పుడెలా?”అని ఆక్రోశించాను.అంతలో ఆమె మరో బాణం వేసింది.”అంతేకాదు!మీ హంగామా అంతా సెల్ ఫోనులో వీడియో తీసాను.మంచి క్వాలిటీ రికార్డింగ్ “.తల పట్టుకుని కూలబడి పోయాను.సర్వనాశనమైపోయింది. ఆ వీడియో గనుక బైటికొస్తే రచయిత ప్రవీణ్ చరిత్ర ఈనాటితో అంతమై పోతుంది.కన్నీరు సెలయేరులైంది. “ఏమిటీ?రచయితగారికి దిమ్మ తిరిగిందా?మీ కథల్లో ఎన్నో మలుపులు సృష్టించే మీరు ఈ ట్విస్ట్ ని ఊహించ లేక పోయారా? మీరు రాసే కథలు చదివి ఎంతో మంది మీరు ఎంతో ఉన్నతులని భావిస్తారు” ఒక్కక్షణం ఆగిందామె.

చెప్పింది వినటం మినహా ఏమీ చేయలేని స్ధితిలో పడిపోయాను. “మిమ్మల్ని అనుసరించాలనుకుంటారు. అనుకరిస్తారు కూడా.తీరాచూస్తే మీ అసలు స్వరూపం ఇది.చెప్పేదొకటి చేసే దొకటి.మీరు బోధించే నీతి మీలో లేనపుడు,మీరు వల్లించే ఆదర్శాలు మిమ్మల్నే సంస్కరించలేనపుడు, సమాజానికెందుకు?ప్రజల్ని మార్చాలను కుంటే,ముందు మీరు మారి చూపించాలి అన్ని వ్యసనాలుండి గొప్పవాడినని భ్రమ పెట్టే వాడికంటే,ఏబలహీనతలూ లేని పరిపూర్ణవ్యక్తిత్వం గల సామాన్యుడు ఎంతో ఘనుడు.గుడ్ బై”అంటుంటే ఒక్క సారిగా “ఆగండి!”అని అరిచాను.

“ఏంటీ?”అంది కఠినంగా.నేను కొంచెం తగ్గి,బతిమాలుతూ”సెల్ లో ఫుటేజీ”అని నసిగాను.ఆమె నవ్వింది, మునపట్లానే.అదృశ్యమైన ఆహ్లాదం తిరిగి అరుదెంచింది.”భయపడకండి, చెప్పానుగా నేను మీ వీరాభిమానినని. ఎవరికీ చూపించను.మీలో నిజంగా మార్పు వచ్చిందని నమ్మకం కుదరగానే డిలీట్ చేసేస్తాను”అంది.వెంటనే కాల్ కట్ అయిపోయి,ఆగిపోయిన పాట తిరిగి స్టార్టయింది.”ఎదుటి మనిషికి చెప్పేటం దుకే నీతులు ఉంటాయి”

-కౌలూరి ప్రసాదరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో