జ్ఞాపకం-64– అంగులూరి అంజనీదేవి

అంతలో తిలక్ రాజారాంకి దగ్గరగా వెళ్లి వాకర్ మీద చేయివేసి సడెన్ గా “నాన్న ఏడి?” అనటంతో ఉలిక్కిపడి చూశాడు రాజారాం. భార్య ఆలోచనలోంచి బయటకొచ్చాడు. తమ్ముడి వాలకం చూసి నిశ్చేష్టుడయ్యాడు.

తమ్ముడి దగ్గర నుండి తాగిన వాసనని బబుల్ గం వాసన డామినేట్ చేస్తూ రాజారాం ముక్కుల్ని సోకింది.
ఆశ్చర్యపోతూ నమ్మలేనట్లు “నువ్వు తాగావా తిలక్?” అని అడిగాడు.

“తాగాను. నీ డబ్బులతో కాదు” వెంటనే ఎదురు సమాధానం ఇచ్చాడు తిలక్.
“డబ్బులు ఎవరివైతేనేంరా? తాగటం తప్పుకదా!”
“గొప్ప ధర్మసూత్రాన్ని చెప్పావ్ లే !”
“ధర్మసూత్రం కాదు. తాగితే లంగ్స్ చెడిపోతాయ్. సొసైటీలో గౌరవం పోతుంది”
“ఎవరికి? నీకా? నాకా?”
“నువ్వు నా తమ్ముడి విరా! ఎవరికి ఏం జరిగినా ఇద్దరం బాధపడాల్సిందే!”

“అలాంటి దేం నాకు అన్పించడం లేదే! నీకు కాళ్లు దెబ్బతిని నడవలేకపోతే నేను నడుస్తున్నానుగా!”
అవాక్కయ్యాడు రాజారాం.

తమ్ముడు తనని చూడగానే ‘ఎలావుంది అన్నయ్యా! నడుస్తున్నావా? లేదా?’ అని పరామర్శించకపోవడం బాధగా అన్పిస్తుంది. పైగా తాగటం ఇంకా మనోవ్యధకు గురిచేస్తోంది.

“అదిసరే! ఇప్పుడు పొలమెందుకు అమ్ముతున్నారు?” అడిగాడు తిలక్ దబాయింపుగా
“చెల్లెలి పెళ్లికోసం. నాన్న నీకు చెప్పారుగా” అన్నాడు రాజారాం.

“అదేదో నా పెళ్లికి అమ్ముతున్నట్లు నన్ను పిలిపించారెందుకు?”

“అవేం మాటలు తిలక్! మగపిల్లవాడి పెళ్లికి పొలం అమ్ముతారా ఎవరైనా? అసలేం మాట్లాడుతున్నావ్?” ఆశ్చర్యపోయాడు రాజారాం.
తిలక్ ఎటో చూస్తూ “అయితే నేనెందుకు సంతకం పెట్టాలి?” అన్నాడు.

“ఎందుకంటావేంటి? అది నీ చెల్లెలు. దానికో జీవితాన్ని ఇవ్వటం కోసమే నువ్విప్పుడు సంతకం పెట్టేది. ఇదికూడా చెప్పాలా తిలక్ నీకు?”

“నాకేదీ చెప్పనవసరం లేదు. జీవితం కావలసింది దానికే కాదు. నాకూ కావాలి. పొలం అమ్మిన డబ్బులతో నాకేదైనా షాపు పెట్టివ్వండి! అలా అని మాట ఇవ్వండి! అప్పుడు పెడతాను సంతకం. గనుల్లో మట్టి తట్టలు మొయ్యలేకపోతున్నాను”

రాజారాం వెంటనే “నువ్వు మట్టితట్టలు మోసినా, రాళ్లు మోసినా తప్పులేదు. నీ అర్హతకు తగినవి నువ్వేం చేసినా ఎవరూ అడగరు. ఆడపిల్లకి పెళ్లి చెయ్యకపోతే ఎవరైనా అడుగుతారు. చెల్లెలు పెళ్లికి నీ పనికీ లింక్ పెట్టకు” అన్నాడు.

తిలక్ ఆగ్రహంగా చూస్తూ “నేను పెడతాను. పొలం ఎలా అమ్ముతారో చూస్తాను. కొనేవాడు ఎవడో రమ్మను చెబుతా!” అన్నాడు. అనేటప్పుడు చుట్టూ చేయిచూపిస్తూ, అక్కడ వున్న జనాలను భయపెడ్తూ ఉద్రేకంతో వూగిపోయాడు.

తిలక్ ను చూస్తుంటే రాజారాంకు భయంగా వుంది. వాకర్ ని గట్టిగా పట్టుకున్నాడు. అయినా చేతులు వణుకుతున్నాయి.

మనిషి ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తే బావుంటుందో తెలుసుకునే స్థితిలో లేడు తిలక్.
బిక్కుబిక్కుమని చూస్తూ వణకటం తప్ప ఏం చేయాలో తోచటం లేదు రాజారాంకి.
ఎవరైనా వచ్చి తిలక్ కి నచ్చచెబితే బావుండని అటుఇటూ చూసాడు రాజారాం.
అప్పటికే ఇక్కడేదో జరుగుతుందన్నట్లు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజారాం కూర్చున్న గట్టుపక్కన నిలబడ్డారు. కానీ వాళ్లేం మాట్లాడటం లేదు. వాళ్లు కూడా తిలక్ ని చూసి భయపడుతున్నారు. తిలక్ చేస్తున్న రచ్చ చూసి, రాఘవరాయుడు ఆ పొలం అమ్మలేడని నిర్ధారణకి వచ్చారు. లోలోన తిలక్ ని తిట్టుకున్నారు.

“ఈ మూర్ఖుడు ఎప్పుడూ ఇంతే! కడుపుకింత తాగగానే సరిపోయిందా! ఆడపిల్లకి పెళ్లి చెయ్యొద్దా?” అని
ఎటువంటి దుర్దశకైనా ధైర్యమే మందు అన్నట్లు ధైర్యం కూడదీసు కుంటున్నాడు రాజారాం. అయినా తాగివున్న తమ్ముడు పొలం కొనేవాళ్లు కన్పిస్తే వాళ్లను అక్కడి నుండి వెళ్లగొడతాడేమోనని ఆందోళనగా చూస్తున్నాడు.

తిలక్ తండ్రి కోసం అటు ఇటు చూస్తూ “ఏడీ ఆ ముసలాడు ఎక్కడున్నాడు?” అని గద్దిస్తున్నట్లే అడిగాడు తిలక్.

తిలక్ ని ఎలా ఆపాలో తెలియడం లేదు. తండ్రి కన్పిస్తే ఏమాత్రం విచక్షణ లేకుండా కొట్టేలా వున్నాడు.
తండ్రి గాని, పొలం కొనేవాళ్లుగాని అక్కడికి వచ్చేలోపలే తిలక్ కి నచ్చచెప్పాలని “తిలక్! నామాట వినరా. నాన్న పెద్దవాడైపోయాడు. నా దిగులుతో ఇప్పటికే బాగా కుంగిపోయి వున్నాడు. నాక్కూడా కాళ్లు వస్తాయో రావో. చెల్లె పెళ్లి ఆపకు. ఇప్పుడు ఆగితే ఇక దాని పెళ్లి చెయ్యలేం. నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు. అది తప్పురా. మనకోసం మనం ఏం చేసుకున్నా అది మనతోనే అంతరించిపోతుంది.

ఇతరుల కోసం ఏం చేసినా అది నిలిచిపోతుంది. ఇప్పుడు నువ్వు గొడవ చెయ్యకుండా ప్రశాంతంగా సంతకం పెట్టావనుకో భవిష్యత్తులో “తిలక్ చూడు చెల్లెలి పెళ్లి కోసం ఎంత త్యాగం చేశాడో” అని మన ఆదిపురి వాళ్లంతా నిన్నే పొగుడుతారు. ఆ పొగడ్త చాలదారా?” అన్నాడు సౌమ్యంగా, ప్రేమగా.“నీ సోది మాటల్ని కొద్దిసేపు ఆపు. నువ్వీమధ్యన కాళ్లుపోయాయని కడుపు విషయం పూర్తిగా మరచిపోయినట్లుంది. లేకుంటే నువ్వేంటి? జ్ఞానోదయం అయిన వాళ్లు మాట్లాడినట్లు ఈ మాటలేంటి? కాళ్లుండి, ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో తమ్ముడి చేతిలో, చెల్లెలు చేతిలో ఒక్క రూపాయి పెట్టావా? వచ్చిన జీతం మొత్తం తెచ్చి వదిన చేతిలో పోసేవాడివి. ఇప్పుడేమో ఇతరుల గురించి ఆలోచించటానికే పుట్టినట్లు మాట్లాడుతున్నావ్. ఎవరు వింటారని ఈ నీతి కబుర్లు? కుంటోడివి కుంటోడిలా పడివుండు” అన్నాడు. అంతేకాదు విచక్షణ మరచి రాజారాం ని తీవ్రంగా కసురుకున్నాడు. అసహ్యంగా చూశాడు.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
151

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో