కథ-7 ‘ నా తండాలో తలెత్తుకున్న రబాబ్(వీణ) -– డా.బోంద్యాలు బానోత్ (భరత్)

ఆ తండాలో ‘బాణోత్ వస్రాం నాయక్’ ఉండేవాడట, ఆయనకు ఇద్దరు కుమారులు- బాణోత్ హన్మా నాయక్, బాణోత్ హేమ్లా నాయక్. ఐతే ఈ బాణోత్ హన్మా నాయక్ ‘హపావత్ ధాని’ ని వివాహం చేసుకొన్నడట, ఈ ‘హపావత్ ధాని’ గారి తల్లిగారు సన్నూరు తండేనట. ఐతే ఈ బాణోత్ హన్మా-హపావత్ ధాని’ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించిండ్రట- ‘బాణోత్ చీమా నాయక్’ ‘బాణోత్ హట్యా నాయక్.

ఇగా ‘బాణోత్ హేమ్లా నాయక్’ ‘సూడ్తీ’ ని వివాహం చేసుకొన్నడట, ఐతే ఈ ‘బాణోత్ హేమ్లా’-‘సూడ్తీ’ దంపతులకు ఏకైక సంతానం-‘బాణోత్ లక్యా నాయకట’.

ఐతే ‘బాణోత్ లక్యా నాయక్’, ‘రక్మా’ను వివాహం చేసుకొన్నడట(వివాహమైన మరుసటిరోజున ‘రక్మా’ భర్త ‘బాణోత్ లక్యా నాయక్’ మరణించాడట,

ఐతే ‘బాణోత్ చీమ నాయక్’ భార్య ‘ద్వాలీ’నట,
ఐతే ఈ ‘ద్వాలీ’, ‘రక్మా’ లు ఇద్దరు వరసకు అక్కాచెల్లెంన్లేనట. ఐతే, ‘పోయినోడైతే స్వర్గానికి పాయే, కానీ పెళ్ళైన తన భార్య పారాణి ఆరకముందే పరలోకనికి పోయిండు కానీ కొత్తగా పెళ్ళైన ‘రక్మా’ పేరుబద్నామాయే, ఇప్పటికి ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్ళిచేసుకొంటారు? ఆమె జీవితం ఏంగావాలే? ఆమె భవిశ్యత్తు ఏంటీ?’ అని ఇంటి పెద్దలు సమాలోచనలు చేసింరట.

ఐతే, ఈ ‘రక్మా’, ఆ ‘చీమా నాయక్’ కు మరదలు వరసవ్వడం, అదే విదంగా ఒకే కుటుంబం, కాబట్టీ ‘రక్మా’ను రెండోపెళ్ళిచేసుకొమ్మని, పెద్దలు సూచించిండ్రట. ఆయన కూడా ‘రక్మా’ను రెండోపెళ్ళికి ఇష్టపడే ఒప్పుకున్నడట, ఆ విధంగా మా తాత ‘చీమా’, ‘రక్మా’ను ఇష్ఠపడే, ప్రేమతోనే రెండోపెళ్ళి చేసుకొన్నడట.

తర్వాత, మా తాత ‘చీమా నాయక్’కు ఇద్దరు భార్యలు-‘ద్వాలీ’ మరియు ‘రక్మా’లతో కుటుంబం కళకళలాడుతొందట. భగవంతుడు ఆయనకు కడుపునిండా సంతానమిచ్చి, దీవించిండట. పెద్దభార్యకు నలుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. కొడుకులు- మఁజ్యా, బాలు,సీతారాం,చాఁప్లా. బిడ్డలు-‘నాజీ’, ‘మారోణీ’,మొత్తం ఆరుగురట.

ఐతే,చిన్నభార్య ‘రక్మా’కు నలుగురు కొడుకులు, నలుగురు బిడ్డలట. కొడుకులు- భీలు,హరి,ఘన్యా,షూక్యా లట. బిడ్డలు- గంగీ,ఘమాలి,రంగీ,కన్కీ(కన్నీ) లట.

ఐతే,ఈ ఉమ్మడి కుటుంబం కొన్నాళ్ళపాటు మూడుపువ్వులు-ఆరుకాయలుగా వర్దిల్లిందట.
ఐతే, ‘నూరేంళ్ళకు చావు తప్పదు, ఏడేండ్లకు ఏరు తప్పదు’ అన్నచందంగా, అప్పటిదాకా కలిసి-మెలిసి ఉన్న ఉమ్మడి కుటుంబం, ఆ తర్వాత వేరుపడిందట. మా తాత సంపాదించిన భూమి ఇద్దరు భార్యలకు, చెరీనలుగురు కొడుకులకు సమానంగా పంచ్చిఇచ్చిండంట. అంటే ఎనిది సమానభాగాలుగా పంచ్చి ఇచ్చిండన్నమాట.ఇగా ఎవ్వరాడిబిడ్డల(చెల్లేంన్ల), అన్నదమ్మల, పెండ్లీ-పేరంటం వాళ్ళే చేసుకోవాలని అనుకున్నరట. ఐతే రెండు కటుంబాలు వేరైన తర్వాత, మా తాతా ‘చీమా’ తన చిన్న భార్య ‘రక్మా’ తోనే ఉన్నడట, కాని రెండు కుటుంబాలను సమానంగా చూసుకొనేవాడట. మా తాతకు ఆ చుట్టుపక్కల తండాల్లో, ఊళ్ళల్లో మంచ్చిపేరుండేదట, మా ఊరి దొర ‘సంధి నారణ్ రెడ్డి’తో మంచ్చి దోస్తాన్ ఉండేదట, మా ఊరి దొర’సంధి నారణ్ రెడ్డి’ మరియు మా తండా నాయకుడు మా తాతా ‘చీమా నాయక్’, ఇద్దరు కలిసి దారెమ్మటి పోతుంటే, వాళ్ళ గురించ్చి ఆ ఊళ్ళోవాళ్ళూ, ఈ తండావాళ్ళు, గొప్పగా మాట్లాడుకొనేవారట.

అంత మంచ్చిపేరు-ప్రఖ్యాతులు కలిగిన మా తాతకు మృత్యు కూడా అంతే తొందరగ కబళించిందట, తన కొడుకులకు లోకజ్ఞానం రాకముందే, ఈ లోకాన్నివిడిచి పరలోకానికి ప్రయాణమైయిండట.
మా తాత చనిపోవడంతో ఇంటి బరువు-బాద్యతలన్నీ పెద్దకొడుకైన ‘భీలు నాయక్’ పైన పడ్డాయట. నలుగురు చెల్లేంన్ల పెళ్ళిళ్ళు భీలు నాయకే చేశాడట, ముగ్గురు తమ్మూళ్ళలో ఒక్కడు(షూక్య) పెళ్ళికాకముందే పరలోక ప్రాప్తీ పొందిండట, ఇక మిగిలిన ఇద్దరు(హరి,గన్యా)ల పెళ్ళిళ్ళు, భీలు నాయకే చేశాడట. ఐతే ‘గన్యా నాయక్’ పెళ్ళైన కొన్నాళ్ళకే చనిపోయిండట, ఐతే వీళ్ళంద్దరి పెళ్ళిళ్ళకు, చావులకు ఐయ్యేఖర్చులన్నీ ‘రక్మా’తరుపునుండి పెద్దోడైన ‘భీలు నాయకే’ ఉమ్మడిగానే భరించిండట.

ఐతే వాళ్ళందరు ఒకే తండ్రికి పుట్టినప్పటికి తల్లులు ఇద్దరు కావడంతో పెద్దభార్య కొడుకులు, చిన్న భార్య కొడుకులుగా విడిపోయారట. ఇగా పెద్దభార్య కొడుకుల మనస్సులో ఒక నీచమైన ఆలోచన/భావన మొదలైందట, అదీ ‘ మా అమ్మ ఉండగా, ఈ చిన్నామెను,రెండవపెళ్ళి చేసుకోడం మూలంగా, ఆమెకు కూడా నలుగురు మగవాళ్ళు పుట్ట్యారు, దాని కారణంగా సగంభూమి ఆ చిన్నామె కొడుకులకు పోయింది, కాబట్టీ ఎలాగోలాగా వాళ్ళ పాలుకు పోయిన భూమిని తిరిగి గుంజుకోవాలని, పెద్దభార్య ‘ద్వాలీ’ కొడుకులు లోలోన పదురుకొన్నరట.’ సమయ- సంధర్భాన్ని బట్టీ, చిన్నాభార్య’రక్మా’ కొడుకుల పాలునుండి భూమిని అక్రమంగా లాక్కోవడం మొదలు పెట్ట్యారట.

‘రక్మా’ కొడుకులు ‘ఘన్యా’ ‘సూక్యా’ ఇద్దరు అనారోగ్య కారణాలవలన మరణించిండ్రట, ఐతే ‘ద్వాలీ’ కొడుకులు కుట్రబన్నీ, వాళ్ళు ఇద్దరు మరణించిండ్రు కాబట్టీ, ‘ఆ రెండుపాళ్ళకొచ్చిన భూమి మీకు ఎక్కువ ఉందని’, ఆ రెండుపాళ్ళను తీసేసి మొత్తం భూమిని ఆరుపాళ్ళుచేసి మళ్ళీ పంచుకొన్నరట, భూమైతే లాక్కున్నరట, కాని ఆ మరణించిన ఇద్దరిపైన పెట్టిన పెళ్ళి,చావుల.. కర్చులు మాత్రం కట్టీవలేదంట. అదే విధంగా రకరకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తూ, వీళ్ళకుటుంబాలను ఆర్థికంగా ఎదగకుండా చెయ్యాలనే కుట్రకొనసాగుతునే ఉన్నదట.. వీళ్ళ కుట్రల కథలు మహాభారతాన్ని తలపిస్తాయట, ఈ ‘ద్వాలీ’ కడుపుల పుట్టన సంతానం అంధరు కౌరవులకన్నా కృూరమైన బుద్ధి గలిగిన వాళ్ళట.పార్థీవదేహాల పైన పేలాలు ఏరుకోని తినేవాళ్ళకంటే నీచమైన బుద్ధి కలిగినవారట, ఇగా ఈ ‘రక్మా’ కడుపుల పుట్టిన సంతానం పాండవులకు ప్రతీకగా ఉంటారట. ధర్మాన్ని,దైవాన్ని, న్యాయాన్ని, నమ్మినవాళ్ళట.

ఐతే, సీతారం తన ఇంటి ముందు కొట్టం కట్టడం కోసం కొంత భూమిని అక్రమంగా లాక్కోవడం జరిగిందట. ఇటీవలనే రెండు సంవత్సరాల క్రితం,మఁజ్యా కొడుకు ‘కాళు’ ట్రాక్టర్ తో గెట్టుదున్నించి(మాళేర్ ఖేతేర్ గెట్టు), గొడవపడి, గుంటా-రెండుగుంటల భూమిని సీతారం తనపాల్లో కలుపుకోనే విధంగా ఉపయేగా పడ్డాడట, చాఁప్లా పాల్లో పదిగుంటల భూమి ఎక్కువ ఉన్నదని తేలినా, తెలిసినా, ఒప్పుకోకుండా, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్నట్టుగా, ఎవరిమాట వినడట. భోజ్యకు అమ్మింది నాలుగు గుంటలైతే, ఇంకోగుంట ఎక్కువ ఆక్రమించ్చి, మొత్తం ఐదుగుంటలు కబ్జాచేసి తండ్రీ కి తగ్గ తనయుడనిపించాడట, చాఁప్లా కొడుకు లక్పతి కూడా కొంత కబ్జాచేద్దామని కొన్నళ్ళు ప్రయత్నంచేసి, ఇంటి వెనకాల గెట్టు పొడుగూత ఒక గజంమందం భూమి ఆక్రమించ్చి మిక్కిలి రాక్షాసానందపడుతున్నడట, ఇక ఈ పైఆధారలు చాలట.. వాళ్ళు ‘పార్థీవ దేహాలపైన పేలాలు ఏరుకొనే రకమని! చెప్పడానికి.

ఐతే ఒక భూమేకాదు, వీళ్ళ సంతానం కూడా ఎదగా కుండా చేశేవాళ్ళంట, ‘రక్మా’ పెద్ద కొడుకు ‘భీలు-సీత’ కు ఆరుగురు సంతానం కలిగీ, కలిగిన వెంట వెంటనే మరణించటం జరిగిందట, ఆ బాదలు వర్ణనాతితమట, అనేక బాదలు,సమస్యలు.. వాటికితోడుగా పాలి కుట్రలతో ఆ కుటుంబం సతమతమైతుందట. అదే సమయంలో ఏడవ సంతానంగా కొడుకు జన్మించిండట, ఐతే అతన్నీ కంటకిరెప్పలా కాపాడుకొన్నరట, ఆ సమయంలో దవాఖానలు, మందులు,డాక్టర్లు అంతగా అందుబాటులో లేవట, ఒకవేళ ఉన్నా, వీళ్ళకు వాటిపట్ల అవగాహన చాల తక్కువగా ఉండేదట, నాటువైద్యం, దయ్యం-భూతం, వంటి మూడనమ్మకాలు ఎక్కువగా ఉండేవట, ‘భీలు నాయక్’ గారి, అక్కా-బావా గారిది గార్లలోని సీతంపేట ఊరట, అక్కడా వాళ్ళకు తెలిసిన మంచ్చి నాటువైద్యుడు ఉండేవాడట, ఐతే ఈ బాబుకీ వైద్యంకోసం, వాళ్ళ బావాగారింటికి అంటే గార్లకు తీసుకొపోయిండ్రట, ఐతే ఆ నాటువైద్యడు, తాయత్తులు, బిళ్ళలు(బిల్లలు) కట్టీ, ఈ బాబు పేరు “బోంద్యాలు” అని నామకరణంచేసి, ఆ పేరుకు గల అర్థాన్నీ వివరిస్తూ-” ‘బోంద్యాలు’ అనగా మళ్ళీ జన్మించాడు లేదా తిరిగి జన్మించాడు లేదా కారణజన్యుడు అని అర్థం, అంటే జన్మీంచిన తర్వాత మరణంపొంది, మరణించినాతన్ని, భూమిలో బొందతీసి ఆ బొందలో పెట్టిన పిదపా మళ్ళీ జన్మించిండు అని దాని అర్థం..” అనీ వివరించిండట. అదే విదంగా- ”బోంద్యాలు,బోందయ్యా, బిక్షమయ్యా,బిక్షాలు, భికారి, ఇస్తారి,పెంటయ్యా, యాదయ్యా,ఐలయ్యా, మల్లయ్యా…” ఇలాంటి పేర్లు కలిగిన వ్యక్తులపైన నరజిష్ఠీ తక్కువగా ఉంటదట, అందుకే అటువంటి పేర్లు పెడతారట.

ఐతే, పైన చెప్పిన విషయాలు నిజమైనయట, ఎందుకంటే? ఆ బోంద్యాలు తర్వాత ఈ ‘భీలు-సీత’ దంపతులకు ముగ్గురు సంతానం బతికిండ్రట, వాళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలు- భద్రమ్మా, ఈరమ్మా, ఒక్కడు అబ్బాయి- అతని పేరు ‘మోహన్’నట.

చూస్తూండగానే రోజులు గడుస్తనే ఉన్నాయట, ‘బోంద్యాలు’ ఐదు సంవత్సరాల పిలగాడైయిండట. ఐతే అదే సంవత్సరం తండాకు ప్రాథమిక పాఠశాల మంజూరైందట, ఐతే ఒక సారు రోజు వస్తూండేవాడట, అతని పేరు ‘తిరుపతి రెడ్డి’ అట. ఐతే ఐదు సంవత్సరాలు వయస్సు వున్న పిల్లలందరు తప్పకుండా బడిలో చేరాలని చెప్పీ, వాళ్ళనందరిని బడిలో చేర్పించారట, అందరితో పాటుగా ‘భీలు నాయక్’ కూడా తన కొడుకు ‘బోంద్యాలు’ ను తండా సర్కారు బడలో చేర్పించారట. ఆ బడిని సీతారం పషువుల కొట్టంలో నడిపేవారట, వర్షాకాలంలో ఆ పషువుల కొట్టంలో పెండరొచ్చు ఉండేదట, ఐతే బురుదలో నుండి కమలం మోలిచి పూసినట్లుగా, ఆ పషువుల పెండరొచ్చు బడినుండి ‘బోంద్యాలు’ చదువులపూవై పూసిండట.

పంతూలు చెప్పింది చెప్పినట్టే నేర్చుకొనేవాడట, చదువుల్లో,ఆటల్లో అన్నిట్లోను ముందుండేవాడట, ఆ విదంగా చూస్తూండగానే మూడు సంవత్సరాలు గడిసినయట, ‘బోంద్యాలు’ కూడా మూడవ తరగతి కీ వచ్చాడట, ఇప్పుడు ‘బడి’ ‘గుగులోత్ దామా’ ఇంటికి మారిందట. అక్కడా గుగులోత్ దామా ఇంటి(భవంతి) గోడకు వసార (ఒక్కసైడుకు) గుంజలు నాటి వాటి పైన వాసాలు తాడుతో బిగించ్చి, వాటి పైన గడ్డి కప్పి, చుట్టుపక్కల సలేంద్ర పొరకతో తడక అల్లి, ఒక గది మాదిరిగా ఆ ‘బడి’ ఉండేదట. ఐతే ఈ బోంద్యాలు ఆ ‘గురిషే బడి’ ముందు పూలాచెట్లకు నీళ్ళు పోస్తండేవాడట, అదేవిదంగా ఒకరోజు సాయంకాలం ఆ ‘బడి’ముందు పూలాచెట్లకు నీళ్ళు పోస్తూంన్నసమయంలో, తండా నాయకుడు మూడుమేకలను, తీసుకోని తండకొచ్చిన తర్వాత వాటిని వదిలేసి, బడికాడి పూలచెట్లకు నీళ్ళు పోస్తూంన్న ఆ ‘బోంద్యాలు’ను పిలిచి ఆ మూడు మేకలను ఇంటికి కొట్టుకొని రమ్మన్నాడట. ఐతే అతను ఆ పనిచెయ్యలేదట, అందుకు, బాగతాగీ నిషామీదవున్న ఆ నాయకుడు ‘బోంద్యాలు’ను దగ్గరికి పిలిచి కొట్టపోయాడట, అందకు బోంద్యాలు దొరకుండా ఉరికి చెట్లాల్లో దాకున్నాడట. ఆ కసాయి నాయకుడు వెతికి వెతికి ఎక్కడా దొరకక పోవడంతో తమ ఇంటికి వెళ్ళి పోయిండట.

ఇగా ఈ విషయం తెలుసుకొన్న బోంద్యాలు తల్లిదండ్రులు, ఈ పాపిష్ఠు నరుని కళ్ళముందునుండి తమ పిల్లవాణ్ణి దూరంగావుంచాలని భావించి మూడవ తరగతి చదువుతున్న ‘బోంద్యాలు’ను ఊళ్ళో భూస్వాముల వద్ద పషువుల కాపరి పాలేరుగా పెట్ట్యారట. పషువులకాసే పాలేరుగా ఎనిమిది ఏండ్లు ఉన్నడట, ఐనా చదువును మరవలేదట, ఎప్పుడు చూసిన చేతిలో పెన్ను-పుస్తకముండేదట, రాస్తూ-చదువుతు వుండేవాడట, ఒక సారు సహాయంతో మళ్ళీ బడిలో ఏడవ తరగతిలో చేరాడట. ఇగ వరసగా అన్నితరగతులు ఉత్తీర్ణుడవుతూ, దేశంలోనే ఉన్నతమైన ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం’లో పీహెచ్ డీ, పీడీఎఫ్ దాకా చదివాడట, యూనివర్శిటీలో ‘బోంద్యాలు’ని, అందరు ముద్దుగా ‘భరత్’, భరతన్నా అని పిలిచేవారట, టీఎస్ఎ(తెలంగాణా స్టూడెంట్స్ అసోసియేషన్ కు ఫౌండర్ ప్రసిడేంట్ గా రెండు సంవత్సరాలు తెలంగాణా ఉద్యమంలో చరుకుగా పాల్గొన్నడట, తర్వాత కూడా తెలంగాణాకు మద్దత్తుగా ఉద్యమాల్లో పాల్గొన్నడట.

బాబాసాహేబ్ డా.బిఆర్. అంబేద్కర్ 125వ జయంతి సంధర్బగా అమేరికా స్టడీటూర్ కు ఎంపికై కొలంబియ యూనివర్శిటీని సందర్శించాడట. ఐతే,ఇంత చదివిన ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబందులు పడుతున్నాడట, దానికితోడు ఈ మధ్యలో స్పాండీలిటిస్(మెడవెన్నుపూస బొక్కనొప్పితో తీవ్రంగా బాద పడుతున్నాడట..

-– డా.బోంద్యాలు బానోత్ (భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో