అందమైన అరకులో ఆదివాసీల జీవన సంస్కృతి – అభివృద్దినెరుగని జీవితాలు(సాహిత్య వ్యాసం)- ఏర్పుల నర్సింహ

అరకులోయ :

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గ్రామం అరకు మండల కేంద్రానికి కేంద్రం. ఇది విశాఖ పట్టణానికి 114 కిలోమీటర్ల దూరం ఉంది. అరకులోయ అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు నుండి అణువణువునా ప్రకృతి రమణీయతతో విరాసిల్లుతున్న తీవాచి పరిచినట్టుండే పచ్చిక మైదానాలు, బొర్ర గుహలు, అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ది. మరియు చల్లటి వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆదివాసీలు : కొండా కోనలు ఆవాసంగా చేసుకొని ప్రకతి మధ్య స్వచ్ఛ జీవనం గడుపుతూ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు కలిగి వారినే ఆదివాసీలు అంటారు.
1. కొండదొర 2. బగట 3.గడబ 4.నుకదొర 5.కులియా 6.కోటియా 7. కొండ కమ్మర 8. వాల్మీకి 9. గౌడు 10.మాలి 11.రెడ్డిదొర 12. రేన 13. మన్నెదొర 14. పోర్జ 15.కోండ్ 16.పుటియా17. జెవరా 18.జెటవు 19.కొండరెడ్డి దులియా

జీవన విధానం : చుట్టూ దట్టమైన అరణ్యం.. కొండకోనల మధ్య ఆవాసం. విలువైన సాంప్రదాయాలు కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. అడవి తల్లి నీడలో తరతరాల పయనం.. భిన్నమైన సంస్కతి విభిన్నమైన సంప్రదాయాలు, వైవిధ్యమైన ఆహార్యం తరతరాల నాటి జీవనశైలి. పాశ్చత్య పోకడలు విస్తరిస్తూనే నేటి రోజుల్లో తమయైన ఆచారాలను పాటిస్తూ, తమదైన జీవనశైలిని కొనసాగిస్తూ కొండకోనల్లో అజాణతవాసం చేస్తున్నారు. ఆదివాసీలు మనిషిమూలాల చరిత్రతో పెనవేస్తున్న జీవితాలు వీరివి. తమ సంస్కతిని కాపాడుకుంటూ భవిష్యత్‌పై కోటి ఆశలతో మనుగడ సాగిస్తున్నారు. వీరే అభం శుభం ఎరగని ఆదివాసీలు. వీరే దేశానికి మూలవాసులు.

తరతరాలుగా అడవితల్లితో పెనవేసుకున్న బంధం, నిండైన అమాయకత్వం.. కపటమెరుగని మనస్తస్త్వం, ప్రకతి ఒడిలో ఓలలాడుతూ.. ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో 5వేల ఆదివాసీ తెగలున్నాయి. 6700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్లపైనే. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసీల సాంస్కతికి జీవనాన్ని, వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి 1993వ సంవత్సరంలో తీర్మానించింది. ఆ తీర్మానం అమలులో భాగంగా అడవులపై హక్కులు ఆదివాసీలకే ఉన్నాయని 2010 సంవత్సరం జూలై 14న జాతీయ అభివృద్ది మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. ఆధునిక ప్రపంచానికి దూరంగా కొండ కోనల్లో ప్రత్యేక భాష, సంస్కతి సాంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతుంది. విద్యాగంధం అంటని, ఆధునికతకు దూరంగా కొండ కోనల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకొని జీవిస్తున్న గిరిజనుల్లో నేటికి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లలో ఎలాంటి మార్పులేదు. బాహ్య సమాజానికి దూరంగా అడవిబిడ్డలు ఆ అరణ్యంలోనే పరిసర ప్రాంతాలతో మమేకమై ప్రకృతి ప్రసాదించిన వనరులను ఉపయోగించుకుంటూ తమ మనుగడను సాగిస్తున్నారు. అందుకే వీరు ప్రకృతిని ఆరాధిస్తున్నారు.
వ్యవసాయం : అడవి ఉత్పత్తులను సేకరించడంతో పాటు చెట్టు, పుట్ట, నీరునే ఆరాధిస్తు సాంప్రదాయ వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తుంటారు.

వీరు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తుంటారు. అందులో భాగంగా వరి, జొన్న, సామలు, అరికెలు, కొర్రలు, కాఫీ, క్యాబేజీ వంటి పంటలను సేంద్రియ ఎరువులతో కృత్రిమ యంత్రాలను ఉపయోగించకుండా ఎడ్లు, నాగలి, గొర్రు వంటి నాడు ఉపయోగించిన వ్యవసాయ పనిముట్లను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు. అందులో ప్రధాన పంటలైన వరి, జొన్నలను పండిస్తారు. వీటినే వారి ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను పండిస్తారు. మరోవైపు జిగిరు, ఇప్పపువ్వు, చింతపండు వంటి వివిధ రకాల అటవి పండ్లను సేకరించి సంతలకు తీసుకొచ్చి వాటిని విక్రయించి తమకు కావాల్సిన వస్తువులను వస్తుమార్పిడి విధానం ద్వారా దక్కించుకుంటారు. మరియ ఆదివాసీలలో కొన్ని తెగల వారు అడవిలో జంతు వేటను ఉపాధిగా చేసుకొని జీవిస్తుంటారు. అందుకే వీరి సాంప్రదాయం అపురూపం. వారి వేషభాషలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. స్థానికంగా దొరకే ఆభరణాలను ధరిస్తారు. ఆసక్తి గొలిపే వస్రధారణ గావిస్తారు. ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉంటాయి. విలక్షణమైన ఆహార్యం వీరి సొంతం. పుట్టుక, వివాహం, మరణం తదితర సమయాలలో తమ సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు. పండుగ, ఉత్సవాల సమయంలో తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తారు. ప్రకృతిలో భాగమైన భూమి, చెట్టు, పుట్ట, నీరు, ప్రకృతి వంటివాటిని ఆదరిస్తారు. పంటలు వేసేటపుపడు, నాటేటపుడు, కోసేటపుడు, ప్రత్యేక శైలిలో భూమి పూజలు పిల్లలు, పెద్దలు ఆనందోత్సహాలతో చేస్తారు. ఇలాంటి ప్రత్యేక పండుగలకు ఆదివాసీ తెగలవారు నృత్యాలు చేస్తారు. అటవి ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం, వ్యవసాయ పంటల దిగుబడి వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండుగని జరుపుకోవడం గిరిజనుల సంప్రదాయం. ఆదివాసీలు జరుపుకునే పండుగలు వారు పండించే సంప్రదాయ పంటలకు, ప్రకృతికి పరిమితమవుతాయి.

పండుగలు:

చైత్ర పండుగ/ఇటుక పండుగ: ఆదివాసీలు వ్యవసాయ క్షేత్రమునందు మొదటగా దుక్కి దున్నేటప్పుడు నిశాని దేవత, భైరవ దేవుడిని ఆరాధించి చైత్ర పండుగ చేస్తారు. ఈ పండుగ మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో 12 రోజుల పాటు జరుపుకుంటారు.

భీమదేవుడి పండుగ: పశుసంపద వృద్ది చెంది వాటిని రక్షించడానికి భీమదేవుడి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ మే-జూన్ నెలలో ఒక రోజు జరుపుకుంటారు.

కొర్రసాములు కొత్తపండుగ: కొర్రలు, సాముల కొత్తకలుసుటకు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని జూలై-ఆగస్టు నెలలో ఒక రోజు జరుపుకుంటారు.

బాలి/గౌరమ్మ పండుగ : క్షేత్ర సారవంతం మరియు విత్తనం ఫలవంతమును వృద్ది చేయుటకు ఔంకారి దేవతను ఆరాధించి పూజలు చేస్తారు. ఈ పండుగను ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో 12 రోజుల పాటు జరుపుకుంటారు.

మెట్ట ధాన్యం కొత్తపండుగ : మెట్ట ధాన్యం కొత్త కలుసుటప్పుడు ఈ పండుగను చేస్తారు. దీనిని సెప్టెంబరు-అక్టోబరు నెలలో ఒక రోజు జరుపుకుంటారు.

చిక్కుడు కొత్త – ముకమదేవి: ఈ పండుగను తెగ మరియు జాతి సంక్షేమం కొరకు ముకమదేవి మరియు గంగాదేవిని ఆరాధిస్తారు. దీనిని డిసెంబర్-జనవరి నెలలో 27 రోజుల పాటు జరుపుకుంటారు.
నంది దేవుడి పండుగ: ఇండ్లను కొత్తగా మార్చుటకు నందిదేవుని ఆరాధించి పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను జనవరి-ఫిబ్రవరి నెలలో ఒక రోజు జరుపుకుంటారు.

ఆదివాసీల జీవనమే ఒక శాస్త్రీయ జీవనం. విగ్రహం ఆధారం లేని పూజలు, ఈ సృష్టిలో భూగోళాన్ని మించిన దైవం లేదని భూమిని కొలిచే భూమి పండుగ, మనిషికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే ఉత్పత్తికి మూలమైన విత్తనాలను దైవంగా పూజించే విత్తన పండుగ ఆదివాసీల విశిష్ట జీవన శైలికి దర్పణాలు. ఉత్పత్తి ప్రక్రియను, ప్రక్రియను అంతర్భాగంగా భావించి పండుగలు చేసుకోవడం ఆదివాసీల విలక్షణత.

నృత్యాలు:

దింసా నృత్యం : అరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులు, యువకులు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు దింసా నృత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్టజీవులైన గిరిజనులకు ఈ కార్యక్రమాలు అంతులేని ఆనందాన్నిస్తాయి. దింసా నృత్యం అందరిని అలరించడమే కాక, గ్రామీణ ప్రజల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది. దింసా నృత్యాన్ని చైత్ర పర్వంలోనూ, వివాహ సమయంలోనూ, పండుగ పర్వదినాలలోను ప్రదర్శిస్తారు. దింసా నృత్యంలో విలక్షణమైన సంగీత వాయిద్యాలున్నాయి. ‘తుండి’, ‘మోరి’, ‘కిరిడి’, తుడుము, డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో లయబద్దంగా సాగుతుంది. ఈ నృత్యంలో కళఆకారుల్ని ఉత్తేజ పర్చడానికి మధ్య మధ్య.. జోడు కొమ్ము బూరలను ఊదుతారు, స్త్రీ పురుషలందరూ సాంప్రదాయకమైన ఆభరణాలు ధరించి, రంగురంగుల దుస్తులను అలంకరించుకుని, నృత్యానికి హాజరువాతారు. దింసా నృత్యంలో ఎనిమిది నకాలున్నాయి. అవి.1. బోడె దింసా 2.గుండేరి దింసా 3.పోతార్ తాలం 4.బాగ్ దింసా 5.నాటికారి 6.కుందా దింసా 7.బాయా దింసా అనే నృత్యాలు ఉన్ానయి. వీటితో పాటు కొందులు ప్రదర్శించే ‘మయూరి నృత్యం’బోదోమరలు ప్రదర్శించే ‘డుడుగా నృత్యం’ భగత్‌లు ప్రదర్శించే ‘పెండ్లి నృత్యం’, గడభలు ప్రదర్శించే ‘కంగారి నాట్యం’, కోయ వారు ప్రదర్శించే కొమ్ము నృత్యం, మరియు సవరలు ప్రదర్శించే అందెళ రవ్వ నృత్యం వంటి మొదలగు నృత్యాలను ప్రదర్శిస్తూ ఆనందోత్సాహాలతో మునిగిపోతారు.

అభివృద్దిని ఎరుగని జీవితాలు:

ఆదిలాబాద్ జిల్లా గోండ్ తెగకు చెందిన కొమురం భీమ్ అనే పోరాట యోధుడు జల్ జంగల్ జమీన్ అనే నినాదాలతో 1928 సంవత్సరం నుంచి 1940 సంవత్సరం వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పోరాడి వీరమరణం పొందారు. ఈ విధముగా నాటి నుండి నేటి దాకా ఆదివాసీల పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అయితే యుగాలు గడుస్తున్నా కర్రలతో కట్టుకున్న పాకలే నేటికీ వారికి ఇంద్రభవనాలు, కొండల్లోని ెలమలే ఆ అభాగ్యు లదప్పిక తీర్చే నీటి ప్లాంట్లు. ఈ నీరు తాగి కలరా, డయేరియా, విషజ్వరాలు వంటి వచ్చి మరణిస్తున్నారు. వీరికి సరియైన వైద్య సదుపాయం కూడా లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పడు రోడ్డు మార్గం లేక కొండలు, వాగులు దాటుకుంటూ కాలినడకనే ప్రయాణించాలి. లేదా డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాలి. వీరికి పక్కా ఇండ్లు లేవు. విద్యుత్ సౌకర్యమూ లేదు. ఇలాంటి దయనీయ పరిస్తితుల మధ్య ఎంతోమంది ఆదివాసీలు ప ్రాణాలను కోల్పోతూ అంధకార జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి ఇవ్వవలిసినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలను నడుపుతూ, బాక్సైట్, గ్రానైట్ వంటి ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. కొండలను పిండి చేసి గిరిజనులను పోడు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. టైగర్ ప్రాజెక్టులు, రంగురాళ్ల తవ్వకం, జలయజ్ఒం, పోలీసులు దుర్మార్గం, ఒక్కటేమిటీ గత పాతికేళ్లలో ఎణ్నోసార్లు ఆదివాసీల హక్కులకు విఘాతం ఏర్పరిచారు.

ఒకప్పుడు కొందరు భూస్వాములు, మైదాన ప్రాంతం వారు, అటవీ శఆఖ అధికారులు మాత్రమే ఆదివాసీలను దోపిడీ చేసేవారనుకునేవారు. కానీ రాను రాను ప్రభుత్వ విధానాలే ఆదివాసీల మనుగడ లేకుండా చేస్తున్ానయి. ఆదివాసీలకు రక్షణ కల్పించాల్సిన 1ఆఫ్ 70 పిసా అటవీ హక్కుల చట్టం మొదలైన అటవీ చట్టాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను అధికారికంగా నిర్వహించడం లేదు. దీనిని బట్టి వీరిపట్ల ప్రభుత్వాల వైఖరి, చిన్నచూపుతు తెలిసిపోతుంది. ఇలా అడవిలో అల్లుకున్న ఆ బతుకులు.. తరాలు మారినా నేటికీ వెలుగులు చూడడం లేదు. అనంతలోకంలో ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తూ జీవన్మరణ సమస్యగా కాలం వెల్లదీస్తున్న గిరిజన గూడెం ప్రజల బతుకులు వెలుగు చూడకుండానే తెల్లారుతున్నాయి. ఆదివాసీల ప్రపంచం అభివృద్ది ముసుగులో అంతం కాబోతుంది.

ఆదివాసీల డిమాండ్లు:

– తరతరాల నుండి సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలను మంజూరు చేయాలి.
– రైతులకు రుణమాపీ, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించాలి.
– గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.
– కనీస అవసరాలైన పక్కా ఇండ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మంచినీటి ప్లాంట్లు, రోడ్డు, రవాణా, విద్యా, వైద్య సదుపాయం కల్పించాలి.
– మాతృభఆషలోనే విద్యను బోధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పరచాలి. అదేవిధంగా వీరికి ఉపాధిని కల్పించాలి.
– ఆదివాసీల జీవనానికి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
– గిరిజనుల సంస్కృతిని, భాషని అంతరించిపోకుండా ప్రభుత్వాలు గుర్తించి ముందు తరాలకు అందజేయాలి. వీరందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా ప్రత్యేక దృష్టి సారించాలి.
– ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి.

ముగింపు :

ఆదివాసీలు చరిత్ర నిర్మాతలు, సంస్కృతి సాంప్రదాయల రక్షకులు. పచ్చని ప్రకృతి ఒడిలో అటవీ తల్లినే నమ్ముకొని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్న అడవి బిడ్డలు ఆదివాసీలు. ప్రపంచవ్యాప్తంగా 370 మిలయన్ల ఆదివాసీలు ఉండగా ప్రపంచ జనాభాలో 5 శాతం ఆధివాసీలు ఉన్నారు. వీరు 7000 భాషల్లో మాట్లాడుతున్నారు. 5 వేల భిన్న సంస్కృతులు వీరివి. మనదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6 శాతం ఆదివాసీలు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి 12 లక్షలకు పైగానే ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆదివాసీల, తెగలు మొత్తం 23 వరకు ఉంటాయి. ఆధునిక పోకడలు, పాశ్చాత్య వెలుగులు, సాంకేతిక విస్తరణలో జీవన విధానం మారిపోతున్నా కొన్ని ఆదిమ తెగలు మాత్రం మూలాలే పునాదులుగా పట్టుకున్నాయి. ాదివాసీల పర్యావరణహిత జీవనం ప్రకృతికి సత్కారం అసకంల్పితంగానే ప్రపంచానికి ఇచ్చే సందేశం. ప్రకృతిని రక్షించే ఈ బిడ్డల విలక్షణ మనుగడను కాపాడడం ప్రభుత్వాల నైతిక కర్తవ్యం.

ఏర్పుల నర్సింహ
పరిశోధన విద్యార్థి
జానపద కళల శాఖ
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

ఆధార ఉపయుక్త గ్రంధాలు:
తెలుగు వారి జానపద కళారూపాలు – మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
ఆదివాసీ ఆత్మగానం – డాక్టర్ విఎన్‌వికే శాస్త్రి
ఆదివాసీ జీవన విధ్వంసం – మైపతి అరుణ్ కుమార్
ఆదివాసీలు (వైద్యం, సంస్కృతి, అణచివేత)  – కే.బాలగోపాల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో