సంపాదకీయం మార్చి నెల – అరసి శ్రీ

ప్రతి ఏటా మహిళా దినాలు వస్తూనే ఉన్నాయి . ఆరోజు కార్యక్రమాలు, కొంత సేపు చర్చలు జరపడంతో రోజు గడిచి పోతుంది. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని సత్యం. మహిళా దినోత్సవం అనగానే ప్రముఖ రంగాల్లో విజయాలను సాధిస్తున్న మహిళల అభ్యున్నతి మాత్రమే కాదు. కార్మిక, శ్రామిక మహిళల భాగస్వామ్యం కూడా ఉండాలి. నేటి ఎన్నో రంగాల్లో ముఖ్యంగా శ్రామిక మహిళలు పడుతున్న ఇబ్బందులే నిదర్శనం. కార్మిక స్త్రీలు తమ యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి కొంత వరకు తమ సమస్యలను పరిష్కరించుకోగలిగిన సంఘటనలు మన దేశంలో అతి తక్కువ గానే కన్పిస్తున్నాయి .

అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిన జరుపుకుంటున్నాము . భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. అవి ఎంత వరకు ఆమలు అవుతున్నాయి అనేది ప్రశ్నార్ధకమే.

                                                                         గత ఏడాదిని ఒకసారి తిరిగి చూసుకుంటే కరోనా సమయంలో మహిళలు తమ తమ ఉద్యోగాల ద్వారా , స్వచ్చంద కార్యక్రమాల ద్వారా చేసిన సేవ అనిర్వచనీయం. కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్త ఒకింత ఆనందాన్ని కలిగించింది . మహిళా దినోత్సవం రావడానికి ముందే కాస్త సందడిని తీసుకు వచ్చింది . అదే ఇండియన్ స్టార్ అథ్లెట్, పరుగుల చిరుత హిమదాస్‌ను అస్సాం పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా నియమించారు అనే వార్త. ఓ ప్రత్యేక కార్యక్రమంలో అస్సాం పోలీస్ బాస్ భాస్కర్ జ్యోతి మహాత్మ స్వయంగా హిమదాస్‌ భుజాలపై స్టార్లు తొడిగి డిఎస్పీగా నియమించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ కూడా పాల్గొన్నారు.

2018 లో జరిగిన ‘ఆసియన్ గేమ్స్’ లో జకార్త లో ‘అండర్ 20’ ప్రపంచ స్థాయిలో పాల్గొన్నది 400 మీటర్లు 50.79 సెకన్లలో పూర్తిచేసింది .IAAF బంగారు పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.

2018 లో గోల్డ్ కోస్ట్ లో 400 mts రిలే 51.32 సెకన్ల వేగ0. తో విజయం సాధించింది.

జులై 2018 లో ఫిన్లాండ్ లో అంతర్జాతీయ స్థాయి లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది.

ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘adidas’ హిమా దాస్ తో ఎండోర్సుమెంట్స్ చేసుకుంది.

భారత ప్రభుత్వం హిమా దాస్ ప్రతిభను గుర్తించి సెప్టెంబర్ 25, 2018 న ప్రతిష్ఠాత్మక “అర్జున్ అవార్డు ” ను అంద జేసింది.

UNICEF 2018 బ్రాండ్ అంబాసిడర్ గా హిమాదాస్ ను ఎంపిక చేసింది. భోగేశ్వర్ బారువ తర్వాత అస్సాం నుండి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ గా మారిన హిమాదాస్ ను తమ రాష్ట్ర’ బ్రాండ్ అంబాసిడర్’ గా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈశాన్య రాష్టాల పరుగుల చిరుతకు తను పడిన కష్టానికి గుర్తింపుగా , తన మన దేశానికి అందించిన పథకాల సాక్షిగా ఈ హోదా దక్కడం దేశంలోని మహిళలు అందరూ అభినందించదగిన విషయం.

విహంగ చదువరులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు

 -అరసి శ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో