గజల్-18 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

గజల్ ప్రేమికులకు నమస్సులు.
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడిన
మన తెలుగుభాష గురించి ఎంత చెప్పినా తక్కువే. గజల్ ప్రక్రియలో వ్రాయబడిన ఈ గీతాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 

పాలకడలి తరగలలో పుట్టినదే తెలుగుభాష
తేనెపూల తోటలలో పూసినదే తెలుగుభాష

గోదావరి గలగలలో కృష్ణానది కిలకిలలో
కలసిపోయి కరగిపోయి పారినదే తెలుగుభాష

పద్యములో గద్యములో కవితలలో పాటలలో
భావాలను అందముగా చూపినదే తెలుగుభాష

శ్రీనాథుని చాటువులో కవిపోతన పద్యములో
పదములతో సుధలెన్నో నింపినదే తెలుగుభాష

కవితిలకుని కవితలలో కృష్ణశాస్త్రి గీతములో
భావుకతకు అర్థాలను తెలిపినదే తెలుగుభాష

ఆటవెలది వెలుగులలో తేటగీతి తేనెలలో
చంపకాల పరిమళాన మునిగినదే తెలుగుభాష

శార్దూలపు శౌర్యముతో మత్తేభపు నడకలతో
సాహిత్యపు వీథులలో సాగినదే తెలుగుభాష

శతాబ్దాల చరిత్రతో అద్భుతమై అజంతమై
తెలుగువారి గుండెలలో నిలిచినదే తెలుగుభాష

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో