జానపద స్త్రీ, మహిళాభ్యుదయం నాడు నేడు – -తాటికాయల భోజన్న

స్త్రీ అంటేనే సర్వ శక్తివంతురాలు ఓపికలో సంయమనం పాటించడంలో, ప్రేమానురాగాలలో, దయ, కరుణ మొదలైన అంశాలలోస్త్రీకి స్త్రీయే సాటి. ఆమె నేర్పు ఆమెదే మరొకరికి సాధ్యం అయ్యేది కాదు. కాబట్టే భారతదేశం స్త్రీకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది.జానపదులు నిర్మలమైన మనస్సు కలవారనడంలో సందేహమే లేదు. కానీ ప్రస్తుతం జానపదుల మనస్తత్వంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. పూర్వపు మనస్తత్వం, మానవ సంబంధాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ప్రేమానురాగాలు ప్రస్తుతం అక్కడక్కడ మనకు కనిపిస్తాయి.

ప్రపంచ దేశాల మహిళలకి, భారతీయ మహిళలకి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం రానురాను కనుమరుగౌతుంది. ప్రాచీన కాలంలో స్ప్రష్టంగా కనబడిన భాషా, వేషం అలంకరణ, ప్రవర్తన నేడు మెల్లి మెల్లిగా మారుతున్నాయి. ఈ మార్పు పట్టణాల నుండి పల్లెలదాక సాగుతుంది. పట్టణ స్త్రీలకి, జానపద స్త్రీలకి కొద్ది మొత్తంగా మార్పులు నేడు కనిపిస్తున్నాయి. ముందు తరాలలో ఏమాత్రం వైరుద్యాలు ఉండకపోవచ్చు. పట్టణ ప్రాంతాలలోని మహిళలు అవకాశాలను అదునుచూసి అందుకొని ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతుంటే గ్రామీణ మహిళలు నేటికి వంట పనులకు, వ్యవసాయ, ఇతర పనులకు కేటాయించబడుతున్నారు. అతి తక్కువ మొత్తంలో గ్రామీణ మహిళలు ఉన్నతిని సాదిస్తున్నారు. వీరిలో కొందరు జీవితాంతం అదే స్థితిలో కొనసాగితే మరికొందరు మధ్యలోనే పూర్వపు స్థితిని చేరుకుంటున్నారు. అందుకు అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి.

మహిళలపై వివక్షత, మహిళలు పనిచేస్తేనే గానీ గడువని కుటుంబ జీవనం, అవగాహణ రాహిత్యం, స్త్రీలలోనూ నెలకొన్న అనాసక్తత, మహిళలు జీవితాంతం ఎవరో ఒకరి రక్షణ కవచంలో ఉండడానికి ఆసక్తి చూపడం, కుటుంబ వ్యవహారాల్లో తీరిక లేకుండా తనను తాను మార్చుకోవడం , బానిసత్వాన్ని ప్రేమగా తలుస్తూ తనను తాను త్యాగం చేయడం, మానసికంగా దృర్భలంగా ఉండటం, ప్రాచీనులు గీసిన మూస పద్ధతుల గీతల్లో ఇమిడిపోవడం, వారికి వారే అనేక స్వంత గీతలు గీసుకోవడం మొదలైన అనేక అంశాలు మహిళను జీవితంలో వెనుకపడేస్తున్నాయి. ప్రాచీన గ్రంధాలలో మహిళల గురించి అనేక రకాలుగా రాయడం మనకు కనిపిస్తుంది. వీటి వలన కూడా మహిళల స్థితి మరింత దిగజారుతుందని చెప్పవచ్చు. త్రయంబక యజ్వ రాసిన ఆపస్తంబ సూత్ర సమయంస్త్రీ ధర్మ పద్ధతిలో “ ముఖ్యోధర్మః స్మితిషు విహితో భర్తృశుశ్రుషాణం హిం’’ స్త్రీకి ఆమె భర్త యొక్క సేవ ప్రాథమిక కర్తవ్యంగా చెప్పినట్లు తెలుస్తుంది. నేటికి సమాజంలో చాలా భాగం ఇలాంటి సూత్రాల ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ప్రాచీన కాలంలో పురుషాదిక్య సమాజం ఏర్పరచిన కట్టుబాట్లకు లోబడి వందల వేల సంవత్సరాల తరువాత కూడ జీవించడం నేటి మానవుల పరిపక్వతను సూచిస్తుంది. తరువాతి కాలంలో అనేక మంది సంఘ సంస్కర్తలు స్త్రీలకు పురుషులతో సమాన హక్కు ఇవ్వడానికి అనేక సంవత్సరాలు పోరాటం చేసారు.

ప్రాచీన గ్రంథలలో మహిళల గురించి అనేక రకాలుగా రాయడం మనకు కనిపిస్తుంది. వీటి వలన కూడా మహిళల స్థితి మరింత దిగజారిందని చెప్పవచ్చు. సమాజాన్ని చూసి కందుకూరి వీరేశలింగం, రాజారామ్ మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అనిబిసెంట్ మొదలైన వారు మహిళాభ్యుదయానికి కృషి చేసారు. ప్రాచీన కాలంలో గమనిస్తే పతంజలి కాత్యాయనుని కాలంలో మహిళలు చదువుకునే వారని, యుక్త వయసులోనే పెళ్లి చేసుకునేవారని, భర్తను వారే ఎన్నుకునే హక్కు గలవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపుతున్నాయి. గార్కి, మైత్రేయి లాంటి విద్యావేత్తల గురించి ఋగ్వేదం ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. ఎన్నో శతాబ్దాల పూర్వమే మహిళలు ఎంతో పురోగతి సాధిస్తే నేటి యువతులు తమకు సానుకూల స్థితిగతులు లేవని, ఎన్నో రకాలుగా అవస్థలు తమను చుట్టు ముట్టి వారి పురోగతిని అడ్డుకుంటున్నాయని వాపోతున్నారు.

గ్రామీణ మహిళలైతే మరింత ముందడుగు వేసి ప్రయత్నం చేయడం కూడా వృధా అన్నట్టుగా పొలం పనులు, పశుపోషణ, చిన్న పిల్లల సంరక్షణ, బీడీలు, కూలిపనులు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితాలను మార్చుకోడానికి కనీస ప్రయత్నాలు సైతం చేయకుండా వారి జీవితాలను ఎవరో అదుపుచేస్తున్నారని వారి పురోగతిని అడ్డుకుంటున్నారని, బంధీలుగా ఉంటారని తమ యొక్క చాతగాని, చేవలేని తనాన్ని ఈ రకంగా వెల్లడిస్తారు. మరికొందరు కఠిన పరిస్థితులను ఎన్నో దాటుకొని గమ్యాన్ని చేరినవారున్నారు.

ఉదాహరణ : కిరణ్ బేడి, సుష్మాస్వరాజ్, ప్రతిభా పాటిల్ మొదలైన వారెందరో మనకు కనిపిస్తారు.ముస్లీం రాజుల కాలంలో చాంద్ బిబీ, నూర్జ హాన్, జహానారా, జేబున్సిసా మొదలైన మహిళలు తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు. శివాజీ తల్లి జిజియాబాయి యోదురాలిగా, పాలకురాలిగా తనను తాను నిరూపించుకొని చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది.

అణచివేతలు ఉన్నటువంటి ఆ కాలంలోనే రజియా సూల్తానా, గోండు రాణి దుర్గావతి 15 సంవత్సరాల పాలన సాగించారు. మీరాబాయ్ అక్క మహాదేవి, రామిజనాభాయ్, లాల్ దేడ్, మహాన్ భవ్, వర్కారి, మొల్ల, తిమ్మక్క, మొదలైన వారు వారి రచనలతో స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డారు.

స్త్రీలు సంఘ సంస్కర్తలుగా మహిళల ఉన్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. వారిలో చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ, ఆనంది గోపాల్ జోషి మొదలైన వారు అత్యున్నత డిగ్రీలు పొందిన తొలితరం మహిళలు. వీరు తరువాతి తరాలకి ఎంతో స్పూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించారు. బికాజికామా, ప్రీతింత వడ్డేదార్ విజయలక్ష్మీ పండిట్, రాజకుమారి, అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపాలనీ, కస్తుర్భా గాంధీ, ముత్తుల లక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ ముఖ్ రమ బాయి వంటి వారెందరో మహిళల కోసం కృషి చేసారు.

సతిసహగమనం, పరదాపద్దత, జౌహర్, దేవదాసి మొదలైన సాంప్రదాయాలు మహిళలను ఎన్నో కష్టాలకు గురిచేశాయి, నేటికి చేస్తున్నాయి. ప్రస్తుత మహిళలు తమ స్థితిని తెలుసుకొని ఉద్యమాలు, రచనలు, వేదికలపై తమ గొంతును వినిపిస్తున్నారు. కానీ జానపద మహిళలింకా ఇలాంటి వాటిని వినడం కానీ, చూడటం కానీ, చేయడం కానీ జరగడం లేదు. ఇంటి పనులతో సతమతమౌతూ, రోజువారీ సిరియేల్స్ కి అలవాటుపడి తమ అభ్యున్నతనే మరిచిపోయారనిపిస్తుంది. కానీ వీరి కోసం సమాజంలో ఉద్యమాలు, పోరాటాలు, రచనలు మనకు కనిపిస్తాయి.

వేదకాలంలో సమాన హక్కులు ఉంటే మనుస్మృతి కాలంవరకు అల్పంగా దిగజారాయి. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి రకరకాల అణచివేతలను అడ్డుకుంది. సిక్కుల తొలి గురువు గురునానక్ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఉండాలని బోధించేవారు.

మన చరిత్రలో అడ మగ సమానత్వం నుండి వ్యత్యాసాల దిశగా పయనించి ఒకరు గొప్ప మరొకరు వారికి సేవిక అనే దిశగా మారిపోయి ప్రస్తుతం అనేక మార్పులతో పూర్వపు దశను అందుకునే క్రమంలో సమాజంలో అనేక మార్పులు కనిపిస్తాయి. నేటికి అంతో ఇంతో సమానత్వం గల్గిన సమాజంలో జానపద సమాజం ఒకటి. ఉన్నత స్థానాలను అందుకోకపోయిన ఉన్నంతలో స్త్రీ పురుషులు సమానంగా పనులు చేసుకుంటూ, బాధ్యతలను పంచుకొని ఆనందమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో ప్రశాంతత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాలుగా వీరు కోల్పోయిన వాటి కంటే పొందినవే ఎక్కువనే చెప్పాలి. కానీ రాను రాను గ్రామాల్లో సైతం తారతమ్య బేధాలు పొడచూపుతున్నాయి. స్త్రీ పురుషుల మధ్య అనేక వైరుధ్యాలు, అంతరాలు వారి జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి.

–తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో