“అమ్మ తనానికే అపహాస్యం”(కవిత )-డా.పెరుగుపల్లి బలరామ్

 

 

 

 

దినం దినం ఏదో ఘోరం
మళ్ళీ మళ్ళీ మాన హరణం
పడతుల్ని పంచే విధము
కన్నపేగుల్ని తెంచే కథనము
వయసు అడ్డు కాదు
వాంఛ ఊరుకోదు
హింస ఆగలేదు

కోరికతో ప్రాణం తీస్తాడొకడు
ప్రాణం తీసైనా కోరిక తీర్చుకుంటాడొకడు
వావి వరుస లేదు
ఇష్టాయిష్టాలతో పనేలేదు
ప్రపంచమంతా ఇదే దహనం
ఆడతనాన్ని నిర్వీర్యం చేయబూనినట్లు

పసికందుని చెరిచి పాశవికంగా చంపి
పొదలమాటున పారేస్తాడొకడు
ముసలవ్వని మరచి ఇల్లంతటిని దోచి
నిప్పుల్లతొ తగలేస్తాడొకడు
వికలాంగుల వాంఛించి
వికృతముగ వేదించి విగతజీవులుగ పాతేస్తాడొకడు

పసికందా పండు ముసలా
వికలాంగులా వీధి బాలలా
విమర్శలేదు విచక్షణలేదు
మాంసం ముద్దలపై వాలే రాబందుల్లా
ఆడతనాన్ని అపహసిస్తున్నార
ఈ కన్నీటి పరంపరలు
నిరంతర నిట్టూర్పులు
తల్లడిల్లే హృదయ రోదనలు
ఆగాలో! ….. సాగాలో!
మీరే తేల్చాలి.

-డా.పెరుగుపల్లి బలరామ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో