నా తండా కథలు-5 – ‘తీజ్’ – డా.బోంద్యాలు బానోత్ (భరత్)

                                                                1
త్వరలోనే ‘తీజ్’పండుగ వస్తుందని తెలుసుకోని, తండా అమ్మాయిలు ‘తీజ్’ పండుగకు సంబందించిన హడా-హుడి మొదల్బెటిండ్రు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ‘తీజ్’పండుగను ఘనంగా చెయ్యాలని అమ్మాయిలు(పెళ్ళికాని అమ్మాయిలు) మంచినీళ్ళబాయికాడి మర్రిచెట్టుకింద గుమ్మిగూడి మాట్లాడుకుంటున్నరు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆ తండాలో ఒకేసారి- అంబాలి, సోనీ, సామ్ణీ, చాంది,భూరి ఈ ఐదుగురమ్మాయిలకు పెళ్ళిచేసి, అత్తగారింటికి పంపనున్నారు, కాబట్టి వాళ్ళకు పెళ్ళికాకముందు వాళ్ళ జీవితంలో ఇక అదే ఆకరి ‘తీజ్’ పండుగ కావడంతో, ఆ పండుగను తమ జీవితాంతం మరవని విదంగా చేసుకోవాలని సమాలోచనలు చేస్తున్నరు.

ఆ ఐదుగూరిలో ‘అంబాలి’ తారల్లో నెలవంక వంటిది, ఆమె అదే తండాలోని ఒక అబ్బాయిని ప్రేమించింది, అతన్నే పెళ్ళిచేసుకోవాలనుకుంది, కాని కొన్నికారణాలవలన సాధ్యంకాలేదు, కాని ఆ ప్రేమ జ్ఞాపకాలు, ఈ ‘తీజ్’ పండుగ గుర్తులు జీవితాంతం గుర్తుండి పోయేలా, పండుగను ఘనంగా చెయ్యాలని సంకల్పించింది. మిగతా నలుగురు కూడా వారి వారి కోరికలకు అనుగూణంగా ‘తీజ్’పండుగను చేసుకోవాలని నిర్ణయించుకున్నరు.

ఐతే, అమ్మాయిలు అందరుకలిసి తండానాయకుని ఇంటికి పోయి ‘తీజ్’ పండుగ చేసుకుందామని ప్రస్థావించగా, తండానాయకుడు అంగీకరించి, తన బొటనవేలు తో వేళ్ళమీద లెక్కబెట్టి రేపు మంగళవారం మంచ్చి రోజు, కాబట్టీ రేపు సాయంత్రం గోదుమలు తెచ్చి నానబెట్టుకోని, ‘తీజ్’బుట్టలు తెచ్చుకోవచ్చని, అనుమతించిండు.

ఇగ ఆ అమ్మాయిలు చాలా సంతోసించి, గోదుమలు మరియు ‘తీజ్’ బుట్టలు కొనుక్కోవడానికీ అవసరమైన పైసలు ఇంటింటికి చందావసూలుచేసి, ఒక మగమనిషిని తోడుగా వెంటబెట్టుకోని, ఊళ్ళో కోమటోళ్ళ ఇంటికి పోయి గోదుమలు కొనుక్కున్నరు. అట్లనే ఎరుకలోళ్ళ ఇంటికి పోయి, రెండు దేవుని బుట్టలు, మిగతావి ఇంటికోబుట్టచొప్పున అల్లమని, వాటితోపాటుగా ఐదు చడక్లీ(చిన్న బుట్టలు) అల్లించుకోని వాటిని తీసుకోని తండానాయకుని ఇంటికి పోయి, చాలా పవిత్రతతో ఆ బుట్టలు ఒకచోట పెట్టి, ఈ గోదుమలు నీళ్ళలో నాన పెటిండ్రు.

                                                                        2
ఆ మర్నాడు ఇద్దరు యువకులు అడవికి పోయి, పంగల గుంజలు నాలుగు, వాటి మీదికి తగినంతలావటి నాలుగు బడితెలు, వాటికి తోడుగా ఇంకొన్ని దొడ్డుబడితెలు నరికి వాటిని మంచిగ చెలిగి తండా నాయకుని ఇంటికి తెచ్చి, ఇంటిముందు నాలుగు గుంజల్నాటే గోతులు తవ్వి, ఆ నాలుగు గుంజలు నాటి, వాటి పైన తగిన లావటీ రెండు బడితెలు నిలువు, రెండు బడితెలు అడ్డంగా పెట్టి, మధ్యలో మిగతా బడితెలు పెట్టి వాటిని తాటాకులతో కదలకుండా గట్టి, వాటి మీదినుండి కందిపొరక పరిచి వాటిని కూడా కదలకుండ కట్టి ‘తీజ్’ బుట్టలు పెట్టే మంచ్చెను తయ్యారు చేసిండ్రు.

                                                                               3
అదే విధంగా ఆ ఐదుగురు అమ్మాయిలు కలిసి, ఎంతో భక్తిశ్రద్ధలతో, రెండు తట్టలు, ఒక చిన్న గడ్డపార, ఒక దేకీసపార పట్టుకోని, అడవిలోకి పోయి, పుట్టమట్టి తవ్వి, ఆ పుట్టమట్టిని తట్టలేసుకోని, ఆ తట్టనెత్తుకోని వస్తూ దారిలో వాళ్ళ చెలకలోని రేగుచెట్టు మొదట్లో తవ్వి, కొద్దిగంత మట్టిని తీసి దాన్ని ఆ పుట్టమట్టిలో కలిపి, ఆ మట్టి తట్టని ఎత్తుకోని వస్తూ దారిలోని ఏరులోనుండి సరిపడ ఇసుకను వేరుగా ఇంకోతట్టలో నింపుకోని, ఇంటికి చేరుకున్నరు. అదే విధంగా తగినంత గొర్లఎరువు కూడా తెచ్చుకున్నరు.

ఇప్పుడూ ఆ ‘తీజ్’బుట్టల్లో ముందుగ ఇసుక దానిపైనుండి పుట్టమట్టి ఆ తర్వాత రేగుచెట్టు మొదట్లోనుంచి తెచ్చిన మట్టి ఆ తర్వాత గొర్ల ఎరువును ఒక పద్దతిప్రకారం ఒకదాని తర్వాత ఒకటి పోసి పరిచీండ్రు. వాళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలు, ఒక ఇత్తడి బిందె, ఇత్తడి అడ్డా(చిన్న బిందె), ఇత్తడిచెంబుతోపాటుగా కొద్దిగంత చింతపండు, కొంచమంత పిడకబూడిద తీసుకోని మంచ్చినీళ్ళ బాయి కాడికి పోయి ఆ బిందె, అడ్డా(చిన్న బిందె), చెంబులను, చింతపండు మరియు పిడకబూడిదతో బాగా తోమి, శుబ్రంగా కడిగి, వాట్లో నీళ్ళు నింపుకోని, ఆ మూడీటిని ఒకదాని మీద మరోటి పెట్టుకోని, నెత్తిమీది ఎత్తుకోని నడిసి వస్తూంటే, ఆ కాళ్ళ గజ్జల సవ్వడి సహాజ సంగీతమై, ఒణ్ణి(చున్ని)కొసకు కట్టిన ‘తీత్రి’మీద కుట్టిన అద్దాలు తళతళ మెరుస్తూ,ఆ ఇత్తడి బిందెలమీద పడిన సూర్యకిరణాలు తిరిగి వెదజల్లుతూ, ఛంఛం నడిసి ‘తీజ్’ కాడికి వస్తూంటే సాక్షాత్తు ఆ ‘డండియాడియే’ దేవలోకంనుండి భూలోకానికి దిగి వస్తూందా!? అని అనిపిస్తుంది, ఈ నీళ్ళను, ఆ మట్టీపరిచిన ‘తీజ్’బుట్టల్లో తగినన్ని పోసి తడిపి.. తర్వాత ఆ బుట్టలు పెట్టే మంచ్చెమీద
రెండు దేవుని ‘తీజ్’ బుట్టలు ముందువరస మధ్యలో పెట్టి, మిగతా బుట్టలను వరుసగా పెట్టి, దాని మీదినుండి ఓ మీటర్ ఎత్తులో ఒక పల్చటి బటను నిట్టాడిలా నిలబెట్టి కట్టిండ్రు.

ఐతే, ఆ అమ్మాయిలు, ఈ ‘తీజ్’ బుట్టల్లో గోదుమ మొలకలు ఎండిపోకుండా,అందులో రోజుకు మూడుసార్లు నీళ్ళు పోస్తారు, ఆ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తూ, తొమ్మిది బావులనుండి నీళ్ళు తెచ్చి పోసి, ఆ ‘తీజ్’ మొలక నారును, ఏపుగా పెంచ్చుతరు.

                                                                            4
ఐతే, ఆ రోజు సాయంత్రం నుండే ‘తీజ్’ బుట్టలు పెట్టిన మంచ్చెముందు, ఆటలు-పాటలు మొదలైనయి. రోజంతా కష్టంచేసి, సాయంత్రం ఇంటికొచ్చి, చిన్నా-చిత్కా పనులు చేసుకోని, ఇంత అన్నం తినీ, పిల్లలు, యువకులు, పెద్దలు..అందరు ఆ ‘తీజ్’ కాడికి చేరుకుంటుంన్నరు. అంతకు ముందే డప్పుకొట్టే ‘గోవిందు’ అక్కడికి చేరుకోని డప్పుకొడుతున్నడు.

చిన్న పిల్లలు, యువతి-యువకులు, పెద్దలు.. తమ తమ కళలను ప్రదర్శిస్తూండగా, మధ్యలో ‘మంగ్తా నాయక్’ వచ్చి కోలాటం ఆడుదామని ప్రస్థావించగా, అందుకు సరేనని అందరు పైకలిపి(కైకలిపి) గుండ్రంగా తిరుగుతూ, లయబద్దంగా,దానికి తగిన పాట పాడుకొంటూ, కోలాటం ఆడుతున్నరు.

పక్కన్నే మరోచోటా మహిళలు తమ సంప్రదాయ వస్త్రాలు- ‘పాటేరో’ ఫేటియ(స్వతహాగ కుట్టుకున్నా లంగా) కాఁళి(స్వతహాగా కుట్టుకున్నా రవిక) ఘూంగ్టేవాళ్ టూగ్రి( అద్దాలు,గవ్వలు, మువ్వలతో కుట్టినపట్టిని ఆ ముసుగు లేదా పెద్ద పన్నకలిగిన వస్త్రమాంచున కుట్టి దాన్ని నెత్తిమీద కప్పుకుంటారు), చేతులకు ‘బల్యా'( పెద్ద పెద్ద తెల్లటి గాజులు), కానేమాఁ కన్యా(చెవ్వులపైనుండి వేలాడే ఆభరణాలు), నాకేమాఁ ఫూలి, భూర్య( ముక్కూకు ముక్కుపుల్లా, ముక్కెర), హాతేరి ఆఁగళీమాఁ ఫూల(చేతివేళ్ళకు రూపాయి బిళ్ళ ఉంగురాలు), కాళ్ళకు వాఁక్డీ లు, కస్సెఁ,( కాళ్ళకు కడియాలాంటివి) ఆభరణాలు ధరించ్చి, గుండ్రంగా తిరుగుతూ, లయబద్దంగా పైకలుపుతూ, భక్తిగీతాలు పాడుతున్నరు.

అమ్మాయిలు(బంజారా కుమారీలు), తీరోక్కఫూల లంగాలు, ఓణ్ణీలు(చున్నీలు), టాఁగేపర ఘూగ్ర(కాళ్ళకు గజ్జలు) కట్టుకోని, ‘గోవిందు’ ఛోర డప్పు కొడుతుంటే ఆ డప్పు చప్పూడుకు అనుగూణంగా, లయబద్దంగా నృత్యం చేస్తున్నారు.

ఐతే, రకరకాల నృత్యాలు, ఆ బంజారాల సొంతం, అవి ఝమ్మరిరొ నాచ్(ఝమ్మరి నృత్యం), ‘మోరేరో నాచ్'(నెమలి నృత్యం), ఘోడేరో నాచ్(గుఱ్ఱపు నృత్యం), ‘లల్లాయిరో నాచ్'(లల్లాయి నృత్యం), డపడియరో నాచ్(డపడియ నృత్యం), సాపేరో నాచ్(నాగిని నృత్యం), ‘సర్కేరో నాచ్'( బ్రెకు డ్యాన్స్) మొదలగునవి..వాటిల్లో వాళ్ళకు నచ్చిన నృత్యం చేస్తున్నరు..

ఐతే, మధ్య మధ్యలో కొందరు, హాస్యం పండించడానికి రకరకాల వేశాలు వేసుకోని ఆ ‘తీజ్’ కాడికి వస్తున్నరు, వాళ్ళల్లో ‘జాద్య’ గొల్లవారి వేశధారణ లో వచ్చి, ఆ గొల్లవారి యాష-భాషలో మాట్లాడి అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నడు. ఐతే,ఆవిధంగా రోజు రాత్రిపూట, పడుకొనేముందుగా, తొమ్మిది రోజులు ఆడి-పాడి ఆనందపడుతరు.

ఐతే, ఎనమిదోవరోజున ‘ఘణగోర్’ చేస్తరు. ఆ రోజున అమ్మాయిలు(కుమారీలు), ఈ ‘ఘణగోర్’ చేస్తరు. ఈ ‘ఘణగోర్’ ని చేసేదానికి, ఆ అమ్మాయిలందు కలిసి, తమకు దగ్గరలో ఉన్న చెరువు లేదా కుంట్టకాడికి పోయి, అందలో నుండి బంకమట్టిని తీసుకోని, ఒక తట్టలేసుకోని, ఆమట్టితట్టను నెత్తిన ఎత్తుకోని ఆ సందర్భానికి తగిన భక్తి గీతాలు తమ భాషలో పాడుకొంటూ ‘తీజ్’ దగ్గరికి తీసుకోవచ్చి, ఆ మట్టి ని బాగ పిసికి , దానితో ఆది దంపతులైన శివ-పార్వతుల నగ్నరూపాల, బొమ్మలను తయ్యారు చేసి, వాటిని ఆ ‘తీజ్’ మంచ్చెకింద పెట్టి, ఆ రోజు ప్రసాదం వండి, ఈ ప్రసాదాన్ని, ఆ ఆది దంపతులకు సమర్పించ్చి, ఆ తర్వాత తమ ఉపవాసదీక్ష విరమిస్తారు.

ఐతే, ఆ ప్రసాదం వండిన వెంటనే కొంతమంది అబ్బాయిలు(పెళ్ళికాని వాళ్ళు) వచ్చి ఆ ప్రసాదపు పాత్ర(గిన్నె)ను సాటుంగా దొంగలించ్చి, ఆ ఉపవాస దీక్షలో ఉన్న అమ్మాయిలను ఆటపట్టిస్తారు. అందుకు ఆ అమ్మాయిలు ఈ ప్రసాదం దొంగలించ్చినవాళ్ళను బ్రతిమిలాడి, బుజ్జగించి ” మేము తొమ్మిది రోజులుగా ఉపవాసదీక్ష చేస్తున్నము, తొమ్మిదిరోజులు, రోజుకు మూడుసార్లు, తొమ్మిది బావులనుండి, నీళ్ళను మోసుకొచ్చి ఆ ‘తీజ్’ లో పోసినం, ఇప్పటివరకు ఆ దేవుడికి కూడా నైవేద్యం సమర్పించలేదు, మాకు చాలా ఆకలిగా వుంది, కావునా మా యందు దయతలచి ఆ ప్రసాదపు పాత్ర (గిన్నె)ను మాకిచ్చెేయండి” అని వేడుకుంటరు, ఐన, ఇవ్వకపోవటంతో ” మేము, మీకు ఒ జత బట్టలు కొనిపెడతం, తలావక తువ్వాల కొనిపెడతం, కావాలంటే మీ తలకు పగ్డీలు కట్టిస్తం, ఐనా వినకపోతే ‘మీ చేతికి గడియారాలు’ కొనిపెడతం, అవి నచ్చకపోతే వేళ్ళకు వెండి ఉంగురాలు చేయిఁస్తం, కాని దయచేసి ఆ దేవుని ప్రసాదపు పాత్ర (గిన్నె) మాకిచ్చెేయండి” అని ఆశపెట్టగా, వాళ్ళు ఆ ప్రసాదపు పాత్ర(గిన్నె) తిరిగి ఇచ్చేస్తరు. అప్పుడు ఆ ప్రసాదంలోనుండి, కొద్దిగంత తీసి ఆ ఆది దంపతులైన శివ-పార్వతులకు సమర్పించ్చిన తర్వాత వాళ్ళు తమ ఉపవాసదీక్ష విరమించ్చి, ఆ ప్రసాదాన్ని, తలాయింత తింటారు.
                           

                                                                 5
ఐతే, ఎనిమిదవ రోజున అమ్మాయిలు తమ వంతు పండుగ కార్యక్రమాలు చేసుకున్నరు. తెల్లారితే తొమ్మిదవరోజు, ఆ రోజున తండా నాయకుడు ఉపవాసముండి ‘భోగ్ భండారో’ (యజ్ఞం, నైవేద్యం,ప్రసాదం..) చేస్తడు.

ఐతే,9దవనాడు తండా నాయకుడు పొద్దున్నే లేసి, కాళ్ళకృత్యాలు తీర్చుకోని,స్నానంచేసి, తనకు తోడుగా నలుగురిని కలుపుకోని, ఆ ‘యజ్ఞ’ కార్యక్రమాలు చేస్తారు. తండా నాయకుడు, ఆ ‘తీజ్’ మంచ్చె కు ముందట యజ్ఞకార్యక్రమాలు చేసుకొనుటకు వీలుగా ఒక ‘యజ్ఞస్థలి’ని తవ్వి, దానికి కావలసిన కట్టెలు పగలచీరి, ఆపక్కన పెట్టి, పక్కింటికి పోయి, పొయిలోనుండి కొద్దిగ నిప్పులు తెచ్చి, మంటవెలిగించిండు.
ఆ నలుగురిలో ఒక్కరు, ఇంటింటికి పోయి,ఇంటికోపావుసేరు బియ్యం వసూలుచేసి, వాటిని ఇసిరి నైవేద్యం/ప్రసాదం వండే దానికి తైయ్యారుగా చేసి పెటిండు. మూడోతను దుకానంకు పోయి యజ్ఞానికి కావలసిన- ఆవునెయ్యి, తెల్లబెల్లం, అగర్బత్తీలు, అగ్గిపెట్టే, కుంకుమా..తెచిండు.

ఇప్పుడు ఆ వెలిగించిన మంటమీద, దేవుని ప్రసాదం వండిండు. తర్వాత ఒక ధాన్యం బస్తాను ఆ ‘తీజ్’ మంచ్చె ముందు పెట్టి దాని ముందు శుభ్రం చేసి, జొన్నపిండితో ‘స్వస్థిక్’ ముగ్గేసి, దానిమీద ఇస్తారాకేసి, దీపం వెలిగించ్చి, ఆ యజ్ఞగుండంలో నిప్పుకణికలను పోగుచేసి, ఇసునకర్రతో ఇసిరి, కుడిచేతిలో ప్రసాదం, ఎడమచేతిలో నెయ్యగ్లాసు పట్టుకోని, సేవాలాల్ మహారాజ్ ను, మెరామ యాడిని, హాథీరాం బాలాజిని, మదిలో తలుచుకొంటూ, ఆ ఎర్రటి నిప్పుకణికల మీద, నెయ్యిధారపోస్తూంటే వచ్చేమంటలో కుడిచేతితో ప్రసాదపు ముద్దలను ఆ మంటలో మూడుసార్లు జారవిడిచి, తర్వాత నీటిచెంబును ఎడమచేతపట్టి, ఆనీళ్ళను కుడిచేతిలో కొంచం పోసుకోని, వాటిని ఆ యజ్ఞస్థలికి కుడిపక్కా చల్లి, తర్వాత ఎడమపక్కాచల్లి, ఇంటి మీదికి చల్లి, ఆ తర్వాత యజ్ఞం కాడికి వచ్చిన వారిపై ఆ నీటిచినుకులు పల్చగా పడేవిదంగా పైకి చలిండు. ‘భోగ్’ (యజ్ఞం) మంచిగా జరగడంతో అందరు సంతోషపడి ఆ దేవునికి విన్తి(వినతి)” యా బాపు.. సాయి వేజాయేస్, పాపిన్ పర్కేస్, ధర్మిన వళ్కేస్, సావుకారేన్ సమ్నఁగ్ లాయేస్,

గరీబేర్ ఉద్ధార్ కరేస్,
యా బాపు సాయి వేజాయేస్
పాఁట-పైరేమఁ బర్కత్ దేస్, ఏక్ దాణార్ సొదాణా కరేస్, గావ్డి-గోదామఁ బర్కత్ దేస్,
యా బాపు సాయి వేజాయేస్
తావో-తేద్రొ న ఆవజుఁ కరేస్,
లూలేనఁ, టూఁటేనఁ గట్లాచడాయేస్, వాఁజుఆనఁ ఆంఖి దేస్, బ్యారేనఁ కాన్ దేస్,
బాల్బచ్చానఁ యానఁ దేకేస్, ఊఁదేర్ పడాయిమాఁ బడాయిఁ కరేస్, బాపూ! సాయి వేజాయేస్,
తారొపూజ తోనఁ పూఁచదేరేచఁ..” అని మొక్కి, ఆ దేవుని ప్రసాదం అందరికి సమానంగా పంచగా, తమ తమ ఇంటికి తీసుకోని పోయిండ్రు.

ఆవిదంగా శ్రీ సేవాలాల్ మహారాజ్ ది ‘భోగ్ భండారో’ కార్యక్రమం అయిపోయింది. ఐతే, అదేరోజు సాయంకాలం 4గంటలకు ఇంకోకార్యక్రమం మొదలయింది. అది ‘డండియాడి’ లేదా ‘డండిభవాని’ కి చేసే కార్యక్రమం. తండా నాయకుడితోపాటుగా ఇంకో నలుగురు కలిసి, గొర్రెపోతు లేదా మేకపోతును కొనితెచ్చి, డండిభవాని ముందు ధడ్ధడి చేసుకోవాలని మొక్కి, ధడ్ధడి చేసుకున్నంకా, దాన్ని కోసి మాంసం పోగులు పెట్టగా, అందరు తమ తమ పోగులు తీసుకోని ఇంటికి పంపిండ్రు. అందలోనుండి కొంత మెత్తటి మాంసం, ఐదారు నల్లిబొక్కలు తీసి పక్కకు పెట్టిండ్రు.

తర్వాత పొట్ట-పేగులను మంచిగా శుభ్రం చేసి, మసులుతున్న వేడినీళ్ళలో వేసి, ఇంకా శుభ్రం చేసి, తగినంత మోతాదులో ముక్కలుగా కోసి, ఆ మెత్తటి మాంసం, నల్లిబొక్కలతో కలిపి, దాన్ని బాగా ఉడకబెట్టి, ఉప్పు-చింతపండు కలిపిన ఆ గొర్రెపోతు రక్తాన్ని చివరికి అందలో పోసి సళోయి వండి, అందలోనుండి ఆ నల్లిబొక్కలను వేరుతీసి, వాటిని మెరామ భవాని/డండిభవాని ముందు పెట్టి, మిగతా ఆ సళోయి(బంజారాల విషేషమైన వంటకం)ని అందరు సమానంగా పంచుకోని తీసుకోపోయిండ్రు. తర్వాత అందరు కలిసి దేవునికి విన్తి (వినతి) చేసి, దేవుని దగ్గర పెట్టిన ఆ నల్లిబొక్కలను తండా నాయకుడు,తన తోటి పెద్ద మనుషులకు తలావక్కటి ఇచ్చి, తాను కూడా ఒక నల్లిబొక్క తీసుకోని అందరు కలిసి అక్కడే తిని, సాయంకాలం 5గంటలకే, ఆ కార్యక్రమాన్ని ముగించుకోని వెళ్ళిపోయిండ్రు.

                                                                           6
ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత, రాత్రి 7గం.ల. సమయాన అందరు భోజనాలుచేసి, ‘తీజ్’ వద్దకు వచ్చి, ‘తీజ్’ నిమజ్జన కార్యక్రమం మొదలు పెటిండ్రు.ఐతే,అందరు అక్కడికి చేరుకోని, ఒ గంటసేపు ఆడి-పాడిన తర్వాత సమయం ఆసన్నమవడంతో, తండా నాయకుని అనుమతి తీసుకోని, ఆ రెండు దేవుని ‘తీజ్’ బుట్టలముందు ఊదుబత్తీలు వెలిగించ్చి, కొబ్బరికాయలుకొట్టి, ఆ ‘తీజ్’బుట్టలను ఒక్కొక్కటిగా తీసి అందరికి అందిస్తుంటే,

అమ్మాయిలు,మహిళలు ‘తీజ్’ బుట్టలను తమ తమ చేతుల్లో పట్టుకోని, హర్శ్యాత్మకమైన పాటలు పాడుతూ, క్రమపద్దతిలో కూర్చున్న పురుషుల, పగ్డీ(రుమాల్)లో ‘తీజ్’ నార్ను తెంపీ పెడుతున్నరు. తర్వాత అందరు కలిసి ‘తీజ్’బుట్టల నిమజ్జనానికి బయలుదేరి, తమకు దగ్గరలో ఉన్న చెరువు, కుంట్టా లేదా ప్రవహిస్తున్న ఏరు లేదా వాగులో నిమజ్జనం చేయడానికి మునుముందుకు కదిలిపోతున్నరు. అమ్మాయిలు, మహిళలు ‘తీజ్’ తమను విడిచి వెళ్ళిపోతుందని విరహగీతాలు పాడుతు ముందుకు సాగుతున్నరు. కొంతమంది పోరగాండ్లు, యువకులు, సన్నటి మోదుగు బడితెను కొట్టి, దాని మొదటివైపునుండి నాలుగు పాయలుగా చీరి, సిబ్బితీగలతో రింగులు చేసి, వాటిని ఆ నాలుగు పాయలుగా చీరినదానికి తొడిగి, ఆ రింగులు బిర్రుగయ్యేతవరకు అందలో బాగాఎండిన కట్టేపుల్లలను, మంచంకూసాలకు పేడుకొట్టినట్టు కొట్టి, కలోట(కాగడ)ను తయ్యారు చేసి, దానిమీద కొంచమంత గ్యాసునూనే పోసి వెలిగించ్చి, ఆ వెలుగుతున్న కాగడ పట్టుకోని ముందుకు సాగి పోతుంటే, ఆ వెలుతురులో మిగతా వాళ్ళు అందరు ముందుకు కదిలి పోతున్నరు.

చివరికి నిమజ్జన చెరువు కాడికి చేరుకోని, ఆ ‘తీజ్’ బుట్టలను నీళ్ళలో నిమజ్జనం చేసి, ఆ నీళ్ళల్లోనే, అన్నలు తమ తమ చెల్లెంల్ల కాళ్ళు కడిగి, వెనుదిరిగి తండాకు వచ్చి, తమ తమ ఇంటికి వెళ్ళిపోయిండ్రు.

ఆ విదంగా బంజారా అమ్మాయిలు, అబ్బాయిలు, యువతి-యువకులు, మహిళలు,పురుషులు అందరు కలిసి ‘తీజ్’ పండుగను ఘనంగా చేసుకున్నరు.

– డా.బోంద్యాలు బానోత్ (భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో