స్వప్న భాష్యాలు -4-నో వన్ న్యూ ( సమీక్ష )-స్వప్న పేరి

కధ పేరు: నో వన్ న్యూ
రచయిత: రెనీ ఓలివర్
ప్రక్రియ: కధ

కధా పరిచయం:
2020 లో నేను చదివిన చాలా పుస్తకాల్లో నన్ను కలిచివేసిన కధ, రినీ ఓలివర్ వ్రాసిన తన కధ – ‘ నో వన్ న్యూ ‘ . ఇది ఒక స్త్రీ ఎదురుకున్న గృహహింస కధ. మనిషి రూపంలో ఉండే ఒక మృగానికి తన సర్వస్వం కోల్పోయిన ఒక ఆమె కధ. ప్రేమ, పెళ్లి అనే రెండు బంధాలని తనకి తెలియకుండా ఒక వ్యసనంగా మార్చేసి ఆ తరువాత మానసిక హింసకు గురిచేసిన ఒక ప్రౌఢ కధ.

కధపైన నా సమీక్ష:
Domestic abuse is a gendered crime which is deeply rooted in the societal inequality between men and women. It is a form of gender-based violence, violence “directed against a woman because she is a woman or that affects disproportionately.” (CEDAW, 1992).

ఈ చట్టం ఎందుకు ఖచ్చితంగా, కఠినంగా పాటించరో తెలియదు. స్త్రీలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం అంత సులభమా? మహిళలు పోరాడటానికి ధైర్యంగా లేరా? ఒకవేళ శక్తి ఉన్నా సమాజం కోసం, కుటుంబం కోసం తమ బాధల్ని అణిచివేసుకుంటారా? రెనీ ఆలివర్ రాసిన ఈ కధ చదివేటప్పుడు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు ప్రేమ, అప్యాయతలనీ కోరుకుంటారని, ఎదుటి వారి తప్పులని ఎప్పటికీ అంతం కానీ తమలో సహజంగా ఉండే క్షమా గుణంతో, ఒక మార్పు కోసం చూస్తారని అర్ధమైంది. కానీ ఇలా ఎంత కాలం? ఇదే అలుసుగా తీసుకుని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని ఎన్ని విధాలుగా హింసించారో?

ఈ కధలో, రెనీ ఆలివర్ ఆమె జ్ఞాపకలని, అనుభవాలని పంచుకున్నారు. ఆమె పార్ట్నర్ ఒక సోషియోపథ్ అని, అది తనకి చాలా కాలం తరువాత తెలిసిందని ఆమె చెప్పారు. ఒక్కోసారి ఆడవాళ్ళు తమ పార్త్నెర్స్లోని హావభావాలను, అలవాట్లను కొంచం కొత్తగా అనిపించినా వాటిలిపైన పెద్దగా ఆలోచన చేయరు. కొన్ని సందర్భాల్లో అవి శ్రుతిమించగానే తెలుసుకొని కౌన్సెల్లింగ్ ద్వారా తమ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. కానీ చాలామంది మాత్రం అదొక మామూలు విషయం గా తీసుకుని, తాము ఒక రకమైన మానసిక హింసకు గురౌతున్నామని గుర్తించరు. తమ ఇష్టా ఇష్టాలను, తమ నిర్ణయాలను పట్టించుకోకుండా, ఒక ఆటబొమ్మలాగా చూస్తున్నారని కూడా గమనించరు.

ఈ కధలో రెనీ తన పార్ట్నర్ జో సంగతి తెలిసినా, ఒక హాప్ తో చాలా కాలం వరకు వెయిట్ చేసింది. సోషల్ గాథెరింగ్స్ లో అవమానించినా, చులకనగా చూసినా భరించింది. తన మొదటి పెళ్లిద్వారా కలిగిన పిల్లలని జో దెగ్గర తీసుకున్నాడని ఆనందపడింది. రెనీతో రేలేషన్లో ఉన్న తరువాత కూడా, జోకి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు ఉన్నాయని తెలిసి సర్దుకుంది. జో విడాకులు తీసుకున్నాకా మొదటి భార్య వల్ల కలిగిన పిల్లలను సైతం రెనీ సాకింది. అయినా కూడా జో ఆమెను చాలా మానసిక హింసకు గురిచేశాడు.
ఒకానొక సమయంలో ఇంక భరించలేక, తన చిన్ననాటి స్నేహితుని సహాయంతో రెనీ తన పిల్లల్ని తీసుకుని జో ఇంటి నుండి బయటపడడం ఒక సినిమా కధ తరహాలో మనకి కనిపిస్తుంది.

ప్రతి పేజీ అయిపోతుండగా కధలో రెనీ పడ్డ బాధకి నాకు కోపం, బాధ & ఉక్రోషం వచ్చింది. ఇది కేవలం ఒక్క స్త్రీ కధ కాదు. మన చుట్టూ ఎంతమంది ఇలా శిక్ష అనుభవిస్తున్నారో అన్న ఆలోచనే భయపెట్టింది. ఈ తన కధ ద్వారా రెనీ ఆడవాళ్లందరిని అలెర్ట్ చేసిందని నేను అనుకున్నాను. సమాజానికి భయపడకుండా, ధైర్యంగా తమ ఉనికిని చాటుకోవాలని రెనీ కధ ముగింపులో చాలా బాగా చెప్పారు.
ఇదే పంధాలో ఇటీవల కాలంలో వచ్చిన మలయాళీ సినిమా The Great Indian Kitchen స్త్రీ స్వేచ్ఛకి, గౌరవానికి చాలా క్యాసువల్ గా జరిగే నష్టాన్ని బాగా చూపించారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ రంగాలలో ఉన్నతి కనపడుతోంది కానీ, స్త్రీ స్వేచ్ఛ లో ఇంకా ఎప్పుడు కనపడుతుందో?.

-స్వప్న పేరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో