నా తండా కథలు-5 – ఆడదంటే గాడిదా !? – డా.బోంద్యాలు బానోత్ (భరత్)

                                                                   1
పటేలు ఆ ఊరికి పెద్దభూస్వామి. పెద్దగ చదుకోలేదు కాని పూర్వీకుల నుండి పొందిన సామాజికజ్ఙానం కొంత అబ్బింది. రామాయణ, మహాభారత కథలు కొద్దికొద్దిగ తెలిసినోడు.ఆయన మాట్లాడితే మాటకు దగ్గట్టుగా ఒక సాత్రం, సంధర్భోచితంగా చెప్పి మెప్పిస్తాడు కాబట్టీ అతని మాటకు ఆ ఊళ్ళో ఎవ్వరు ఎదురు చెప్పరు. అందుకనే ఊళ్ళోవాళ్ళూ అతన్ని ‘మాటకారి పటేల్’ అని అంటారు. అంతే కాదు, అతడు లేకుండా ఆ ఊళ్ళో పంచాయితులు చెయ్యరు అంటే అతిశయేక్తి కాదు.

అత్తా-కోడళ్ళ మధ్య గొడవ, అక్రమ సంబంధాలు, భూతగాదాలు, అన్నాదంమ్ముల మధ్య గొడవలు.. అలా అనేక పంచాయితులకు అతను ఉండవలసిందే.

అతని చేతి కింద పాలేర్లు, పనివాళ్ళు వున్నారు. వాళ్ళల్లో ఒక్కడు మాత్రం చాల సంవత్సరాల నుండి వాళ్ళ వద్దనే పాలేరుపని చేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నడు.

ఐతే, ఆ పటేల్ ఇంట్ల దేనికి కొదువలేదు, ధన- ధాన్యాలతో తులతూగుతున్నది ఆయన కుటుంభం. ఐతే ‘దున్నపోతు దున్నిచావాలే, మొగాడన్నాకా తినీ, తాగి చావాలే’ అనే సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్నాడు పటేలు. అందుకే కావచ్చూ, హద్దు-పద్దులేని తిండి, యాల్ల-పాల్ల లేని తాగుడు, దాని ఫలితంగా శరీరం లావెక్కీ, కడపు బొజ్జగన్పయ్యలాగా బయటికి వచ్చింది. ఆయన లుంగ్గీ చుట్టుకున్నా, ధోతీ కట్టుకున్నా అచ్చంగా వినాయకుడి విగ్రహానికి చుట్టినట్టే ఉంటుంది, పైగా, ఎత్తుపళ్ళు, బొంగుమూతి ఆ మూతి పైన పల్చటి మిసాలు, పెద్ద పెద్ద డొప్ప చెవ్వులు ఆ చెవ్వులపైన వెంట్రుకలు, దోసకాయలాంటి తలకాయ మొత్తంగా నాటకంలో ‘బుడ్డర్కాఁ ‘ మొఖం కంటే అద్వానంగా ఉంది. ఆయన సాధారణ మనుషుల కంటే కొద్దిగ పొడుగెక్కువ, దానికితోడు అతనకి ఆనెకాళ్ళు ఉండడంతో నడుస్తూంటే రెండు మోకాళ్ళు ఒక్కదానికొక్కటి రాసుకోని కింద పడి పోతడేమో! అనీ అనిపిస్తది.

ఆయన రోజు కోడికూత పొద్దుకు లేసి గొడ్లకొట్టం కాడికి పోయి, పడ్లపుల్లా తెంపుకోని నములుకుంటూ తండాకు పోతడు. అప్పటికి తండావాళ్ళు ఎవ్వరు నిద్రలేవకపోగా, పాలేరు ఇంటికి పోయి ఒక్కటే
లొల్లి పెడతడు. ” అసలు మనిషనేవాడు గీయాల్ల దాక పంటడారా!?, నిద్రెట్లపడ్తదిరా నీకు!? దరీద్రపు
గాడిదకొడక!.” అంటూ నిద్రలో వున్నోన్ని బలవంతంగా లేపి,

“నేను గీ చుట్టా అంటు పెట్టుకోని వస్తున్న, గాని నువ్వు బాయికాడికి పోయి మోటర్ బెట్టి తర్వాత దొడ్డి(గొడ్ల కొట్టం)కాడికి పోయి పెండకళ్ళు తీసి, ఎడ్లకు మేతెయ్యి, పద.” అన్నడు పటేలు.పాపం పాలేరు సగం నిద్రలోనే లేసి నిద్రకళ్ళు నలుచుకుంటూగొడ్లకొట్టం (గొడ్లదొడ్డి) కాడికి పోతడు. కానీ

ఆ పటేలు మాత్రం పాలేరు ఇంటిముందు కొట్టంలో నుల్కమంచంమీద కూసోని,
పక్కజేబులనుండి ఒక మోద్గాకు తీసి, దాని మధ్యలనుండి తొలచి, ఈనె(నారా) తీసి, దాన్ని రింగులా చుట్టి, ఆ నారారింగును చిటికనేలుకు తొడిగి, ఆ ఆకును మలిచి చుట్టా చేసి, ఆ చుట్టబుర్రలో పొగాకు
తుంపలు దూర్చి దాన్ని తగినంత మెలేసి చిటికన వేలకున్న ఆ నారరింగును చుట్టకు తొడిగిండు. ఇప్పుడు చుట్టా నోట్లో పెట్టుకొని, పక్క జేబులోనుండి అగ్గిపెట్టె తీసి చుట్టా అంటు పెట్టుకున్నడు. చుట్టా తాగుతూ అక్కడ నుండి బాయికాడికి బయలుదేరుతడు. ఇదీ ఆ పటేల్దీ రోజువారి ప్రాత:కాలపు ప్రక్రియ.

                                                                           2

ఐతే, ఆ పటేలుకు పెళ్ళై పదిసంవత్సరాలైంది. పెళ్ళైన నాటి నుండి అడపా-దడపా తప్పా పటేలమ్మను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే పటేలుకు పరాయి ఆడవాళ్ళ మీదే మోజెక్కువ.
పెళ్ళై పదిసంవత్సరాలైన,

సంతానం లేకపోవడంతో లోలోన బాదపడుతూ ఇరుగు-పొరుగువాళ్ళా సూటీ-పోటి మాటలకు దినదినం గండంగా మారి..మరింత ద:ఖం అనుభవీస్తూ.. ఐనా సరే ఆ పటేల్ను కట్టుకున్న పాపానికి కాలం ఎల్లదిస్తుంది ఆమె. ఐతే, సంతానం కొరకు దవాఖనకు పోయి చూపించుకుందామని, అనేక మార్లు మొరబెట్టుకోంగా, ఒకే ఒక్కసారి అది కూడా అయిష్టంగానే అంగీకరించడంతో ఇద్దరు కలిసి దవాఖనకు పోయి మెడికల్ టెస్టులు చేయించుకున్నరు. ఆ టెస్టులో బయట పడ్డా విషాయాలేంటంటే ‘పటేలమ్మ దగ్గర ఏలోపం లేకపోగా పటేలు దగ్గర్నే లోపం ఉందని, అది ‘కౌంటుశాతం’ చాలా తక్కువగా ఉందని, అది తగ్గాలంటే క్రమంతప్పకుండా ఆరునెలలపాటు మందులు వాడాలని చెప్పి మందులు రాసిండు డాక్టర్.

ఐతే,ఆ మందులుకూడా తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు పటేలు. పటేలమ్మే బలవంతంగా ఆ మందులు కొని ఇంటికి తెచ్చింది. తెచ్చిన మందులు వేసుకోమంటే వేసుకోనకపోగా, పైగా ” ‘ఆడది అంటే గాడిద తో సమానం’ నువ్వు నన్ను మందులేసుకోమంటావా!? ఆ మందులేసుకోవాలో లేదో అది నీ కంటే, ఆ డాక్టర్ కంటే నాకే ఎక్కువ తెలుసు నోర్మూస్కోని, నీ పనిచూస్కో లేకపోతే నీ పుట్టింటికి, వచ్చిన దారెంటే వెళ్ళిపో” అని హెచ్చరించిండు పటేలు. ఐతే, చేసేదేమిలేకా తన పనితాను చేసుకుంటూ, కష్టంగానో, నిష్టూరంగానో కాలమెల్లదీస్తుందీ పటేలమ్మ.

                                                                       3

ఐతే,ఆ పాలేరు ఈ పటేలుకు నమ్మిన బంట్టు, అంతే కాదు బలస్తుడు, అందగాడు.
ఆకర్శణీయమైన ఆ కళ్ళు, మూతిమీద నూనుగు మిసాలు, బాహుబలి బుజాలు,మోచేతికి పైన వడితిరిగిన కండలు, విశాలమైన ఛాతి, ఛాతిమీద నల్లని వెంట్రుకలు, కడుపుపైన కదులుతున్న పలకలు,సింహంలాంటి ఆ నడుము,తనువుకు తగ్గా తొడలు, గట్టి పిక్కలు మొత్తంగా ఒక ఆజానుభావుడు లేదా బాహుబలి లాంటి, ధృడమైన శరీరం గలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వోంగోలు గిత్తలా ఉన్నడు.

ఐతే,ఆ ఇంటి పనులన్ని ఈ పాలేరే బాద్యతగా, పదిసంవత్సరాలనుండి చేస్తూన్నడు. మరీ ముఖ్యంగా పొలంకానుండి అలసిపోయి ఇంటికొస్తే పటేలమ్మకు కాళ్ళు పిసికే సేవకుడిగా మారుతడు. అది కాస్త అలవాటుగా మారి రోజు రాత్రికి కాళ్ళు పిసకనిదే ఇంటికి పోనిచ్చేది కాదు పటేలమ్మ. రాత్రి కొద్దిగ లేటైనసరే అన్ని పనులు చూసుకోని ఇంటికి పొయేవాడు.

అన్నీటికంటే ముఖ్యంగా ఆమె పాలేరునే ప్రాణంగా ప్రేమించి, తన ప్రియుడిగా భావించి, జీవితాన్ని కొనసాగిస్తున్నది. కాని ఆ విషయం పాలేరుకు తెలియదు.

                                                                 4

ఐతే, ఆ పాలేరుకు పెళ్ళి సంబంధం కుదిరిన కొన్నిరోజులకే పెళ్ళైంది.

అతని పెళ్ళానికి పదహారేళ్ళు దాటి పదిహేడేంళ్ళు నడుస్తున్నయి. చాల అందగత్తె, పచ్చి పసుపు కొమ్ము నిగనిగలాడినట్లు, పసుపు భంగారంలా ఉంది.

పెళ్ళైన తెల్లారి నుండే ప్రతిరోజు ఆ పటేలు గొడ్లదొడ్డి(గొడ్లకొట్టం) కాడికి తన భర్తకు సద్ది కట్టుకోని పోతుంది. తన భర్తతో పాటు ఆమె కూడా రోజు కూలిపని చేసి, సాయంకాలం కూలోళ్ళతో పాటుగా ఇంటికి పోతుంది.

                                                                       5
ఐతే, ఆ పటేలుకళ్ళు పరాయి ఆడోళ్ళమీదే. ఆ పట్టెకు ఇప్పుడు తన పాలేరు పెళ్ళమే అందరికంటే అందగత్తే కావడంతో, ఇప్పుడు ఆమెను పడేసే పనిలో పడ్డాడాయన.

ఆ కారణంచేతనే ఈ మధ్యల తను తండానుండి తిరిగి వచ్చే వరకు కొట్టంవద్దనే ఉండమని పాలేరును ఆదెశించి, రాత్రయ్యేంతవరకు తండాలో పాలేరు ఇంట్టివద్దనే ఉండీ.. మెల్లగ బయలుదేరి, ఊళ్ళోకి (ఇంటికి) పోయేదారిలోనే గొడ్లకొట్టం వుండడంతో, పోతు పోతు కొట్టంవద్ద వున్న పాలేరుని పలకరించి, ఇగ ఇంటికి పొమ్మని చెప్పి, పటేలుకూడా ఇంటికి పోతుండు.

ఐతే, ఈ మధ్యల ఇంత ఆలస్యంగా వస్తున్నవు ఎందుకని పాలేరు పెళ్ళం పాలేరుని ప్రశ్నించగా, “ఇప్పటి నుండి తను వచ్చేదాకా గొడ్లకొట్టం వద్దే ఉండమంటున్నడు, దానికి నే నేంచెయ్యల్నే”, అని పాలేరు తన పెళ్ళానికి సమాధానం చెప్పిండు. “ఆఁ.. ఆయనేమో తండా పట్టుకొని అర్దరాత్రిదాక తిరుగుతడు నింన్నేమో కొట్టంకావలి ఉండుమంటాడా!? బాగనేవుంది సక్కదనం” అని మూతివిరుచుకుంటూ అన్నది పాలేరు పెళ్ళం.

ఐతే, ఈ మధ్యల పటేలు చాలరాత్రైనంకా ఇంటికి వస్తూండడంతో, పటేలమ్మ కూడా ఆలస్యానికి గల కారణం అడగాలని అనుకుంటున్నది కాని “గాలికి పోయే కంప్పను తెచ్చి గల్వంట్ల పెట్టుకున్నట్టు’ ఐతదని భావించి, ఆయన గారు ఎప్పుడొచ్చిన ఒరిగేదేముంది!?” అని తనలో తను అనుకున్నది. గాని రోజులు గడిసిపోతున్నయి, ఆనోట,ఈనోట నెమ్మదిగా ‘నిజం’ పటేలమ్మ చెవ్వులో పడింది, ఇప్పటికైన అడుగుదామంటే, ఉత్తపున్యానికి తిట్లుతినడం తప్పా అక్కడ అయ్యేదేముండదని తనలో తాను మదనపడుతుంది. “పోయి పోయి ఆ అమాయకురాలి జీవితాన్ని నాశనంచేస్తున్నడే, పాపం అదీ నోట్లో నాల్కలేనిది, ముందే భయస్తురాలు, పారాణి ఆరని పిల్లా, పెళ్ళై ఆరునెల్లు కూడా కాలేదు, ఈ విషయం అందరికి తెలిస్తే పరువు పోతుంది, దాని జీవితంలో మట్టి పోసినట్లైతుంది, అంతే కాదు పాలేరు పని మానేసే ప్రమాదముంది, వాడు పని మానేస్తే! ఈ ఇంటి పనులన్ని ఎవరు చెయ్యాలే!? నే నేమైపోవాలే!?, ఈ సమస్యకు పరిస్కారం ఏంటీ?, ఏం చెయ్యాలే!? ” అని ఆలోచనలో పడ్డది పటేలమ్మ. ఐనా సరే చివరిసారి అడిగి చూస్తా, అనుకోని ధైర్యంచేసి, “ఏందైయ్య!? ఇంటికొచ్చేసరికి 11గ.లు. అయ్యింది, రోజు గీ అర్దరాత్రిదాక ఎక్కడుంటున్నవు? ఎటుపోతున్నవు? రోజు రోజుకు నీ ఇష్టమోచ్చినట్టే చేస్తున్నావు తప్పా, ఇల్లు, సంసారం, ఇంట్ల ఒ అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నా భార్య ఉన్నదన్నా విషయమైన గుర్తుకున్నదా లేదా..!?” అని అన్నది ఆవేషంగ్గా పటేలమ్మ. కాని పటేలు, పాలేరు పెళ్ళం దగ్గరా ఫుల్లుగ గుడంబా తాగి నిషామీద ఇంటికి రావడంతో, పాపం పటేలమ్మ అడిగినా విషయాలు ఏమి అర్థంకాలేదు, ఒక్క మాట మాత్రం వినబడిందీ అతనికి, అదే “రోజు రోజు ఇంత రాత్రయ్యేంతవరకు ఇంటికి వస్తలేవు,

ఎటుపోతున్నవు?

ఎక్కడుంటున్నవు?, అని”. దానికి సామాధానంగా

“అవునే నేను ‘మగాన్ని’ ఎక్కడికైన పోతా, నా ఇష్టమోచ్చిన చోట ఉంటా, అడగడానికి నూవ్వెవ్వతివే

‘లంజ్జే’, నువ్వూ ఆడదానివి, ‘ఆడదంటే గాడిది తో సమానం’, సప్పుడు చెయ్యకుండా ఇంట్లోపడివుండాలే, మొగుడు ఇంటికి రాగానే మంచ్చి మంచ్చి వంటలు చేసి, వడ్డీంచేందు ఎదురు చూస్తూండాలే గాని ఇంతరాత్రైయ్యేదాకా ఎక్కడికి పోతున్నవు?   ఎక్కడున్నవు?

ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడగ్గూడదు అర్థమైందా? నోర్మూస్కోని అన్నం పెట్టూ ఆకలైతుంది” అని అన్నడు పటేలు పురుష అహాంకారంతో.

“అన్నితప్పిన అన్నంపెట్టుడు మాత్రం తప్పుతుందా!?.. గా కడుపే మెడకు కట్టుకున్నవు!, ఇంటికోస్తే అన్నంద్యాస తప్పా మరోటిలేదు నీబొర్రే పెరుగుతుంది గాని నా కడుపులో కనీసం ఒక్క నలుసైన పడుతలేదు ” అని తనలో తాను అనుకుంటూ,

అన్నం గిన్నే, కూరగిన్నే, తినేపళ్ళెం డైనింగ్ టేబుల్ పైన పెట్టి తినగల్గినంత పెట్టుకొమ్మని చెప్పి పక్కకు జరిగింది ఆమె. పటేలు అన్నంగంట్టె పట్టుకోని అన్నం తన పళ్ళెంలో వేసుకుంట్టుండగా సగం టేబుల్ పైన సగం పళ్ళెంలో పడ్డది, కూరగంట్టెతో రెండు గంట్టెలు వేసుకోని, నల్లిబొక్కను వెతికి వేసుకోబోతుంటే గంట్టెనుండి జారి డైనింగ్ టేబుల్ పైన పడ్డది, దాన్ని చేత్తో తీసి పళ్ళెంలో వేసుకోని, సగం అన్నం తిన్నంకా ఆ నల్లిబొక్కను తిందామని చేతిలోకి తీసుకోని దాని పైనవున్న మంసం పళ్ళతో పీకుదామని అనుకున్నడు.

కాని, ఎత్తుపళ్ళు ఉండటంతో ఆ బొక్క పైనవున్న మాంసాన్ని కళ్ళతో పీకడం కొద్దిగ కష్టంగానే మారింది, చాలా సార్లు ప్రయత్నం చెయ్యంగా కొద్దిగంత వచ్చింది, తర్వాత ఆ బొక్కలోని మూలిగను జుర్రే ప్రయత్నంలో మూలిగ బయటికి రాకాపోగా నోరంతా అంటింది. ఆ మూలిగను బయటికి తీయడానికి ఆ నల్లిబొక్కను పళ్ళెంలో ఎంత కొట్టీన చివరికి మూలిగ బయటికి ఎల్లకపోవడంతో యాష్టకొచ్చి, చేతులను ఆనంగా- ఈనంగా కడుక్కోని, పోయి మంచ్చంపై ఒరిగి, అట్లనే గుర్రుకొట్టడం మొదలు పెట్టిండు పటేలు.
ఆదృశ్యాన్ని చూసి నా తలరాత ఇంతేనేమో..అనుకోని ఆమె కూడ మంచంవాల్చుకోని, దానిమీద దుప్పటేసుకోని వొరిగి ఆలోచిస్తూ అట్లనే నిద్ర పోయింది. తెల్లారి పొద్దుగాల్నే లేసి అన్ని పనులు చేసుకోని, అన్నంతిని, పటేలుకు సద్ది కట్టుకోని, బాయికాడికి బయలుదేరింది పటేలమ్మ. పోతుంటే దారిలో కుంట్టకాడి సావడి దగ్గర, శాఖిరేవు పక్కన ఒక ‘గాడ్దుల’ జంట అన్యోన్యంగా ఉండటం చూసి ” ఆ కుక్కలకొడుకు నన్ను ప్రతిసారి ‘ఆడదంటే గాడిద’ అంటాడు, నిజంగా ఆ దేవుడు నన్ను ‘గాడిద’ గా నన్నా పుట్టిస్తే ఎంత బాగుండునో! కనీసం నాకుతోడుగా ఒక మగ ‘గాడిదైన’ ఉండేది”. అని తనలో తాను అనుకుంటూ బాయి కాడికి పోయింది.

పొద్దాకా పనిచేసుకోని, పొద్దుగుంజ్జాఁవ్ల పొయిల కట్టెలు కొట్టమని పాలేరుతో చెప్పింది పటేలమ్మ. ఆవెంటనే పెద్దగొడ్డలితో పొయిల కట్టెలు పలగచీరుతుంటే పక్కన్నే ఉండి చూస్తూ ” నేను నిజంగా పిచ్చిదాన్నేమో!?, చాకులాంటి ‘మగాన్ని’ చేతులో పెట్టుకోని ఆ కుక్కలకొడుకుతో అనరాని మాటలు అనిపించుకుంటుంన్నా, వానికి లేని పరువు- మర్యాదలు, కులపట్టింపులు, నేను మాత్రమే పాటించడం ఎంతవరకు సరైనది?. వాడేమో తండాకు పోయి పాలేరు పెళ్ళంతో కులుకుతడు, నేనేమో ఇంటి పరువు-మర్యాదా కాపాడే యంత్రాన్నా!?, నేను కూడా వానిలాగే మనిషిని, నాకు కూడా మనుసున్నది, పెళ్ళై ఇప్పటికి పదిసంవత్సరాలైంది, ఎదురు చూసి చసి ఓపిక నసించింది, ఇగ ఈ రోజునుంచే ఒక కొత్త జీవితం మోదలు పెడతా” అని అనుకున్నది పటేలమ్మ.

ఎప్పుడు లేనిది పొయిల కట్టెలు పలగచీరుతున్న పాలేరును “మస్తు పలగచీరుతున్నవురో!, ఒక్కటే దెబ్బకు కట్టె పక్కున పలుగుతుంది కదరా! నీ దగ్గర బలం బాగా ఉందిరోయ్..!” అని పొగిడీ, కట్టెలమోపు ఎత్తుకోని ఇంటికి రమ్మని చెప్పి, కాస్తపొద్దుండంగానే నెత్తిన ఖాలి గంప్ప ఎత్తుకోని ఇంటికి ఎల్లిపోయింది పటేలమ్మ.

కొట్టంకాడా అన్ని పనులు చేసుకోని, పొద్దుగూకినంకా కట్టెలమోపు ఎత్తుకోని ఇంటికి పోయి, బర్రెపాలు పిండీ, ఇంట్లో ఇచ్చి రెండు బిందేలు మంచినీళ్ళు ఎత్తుకొచ్చి, రెండు గోల్యాల్లో నిండా నీళ్ళు చేదిపోసేవరకు, రాత్రైంది.

తర్వాత గీ మంచం పడకగదిలో పెట్టమని, పరుపు పట్టుకొని వచ్చి, మంచం మీద చాపి దానిమీద పడుకోని, మెత్త పట్టుకోరమ్మని సైగచేసింది పటేలమ్మ.

మెత్త పట్టుకొచ్చి తలకిందపెట్టి, “ఇగ నేను ఇంటికి పోవాల్నా?” అని అడిగిండు పాలేరు.

“పోదువు గాని ఉండూ, ఏంతోందరొచ్చేరో!? పెళ్ళైనప్పటినుండి నీ మనసంతా ఇంటివైపే గుంజుతున్నట్టు ఉంది గదరో!? పెళ్ళై ఆరునెల్లైన ఇంకా మోజు తీరలేదారా!? ఇగో ఇటురా, కూసో, అక్కడకాదు మంచం మీద కూసో” అని చెప్పి వంటగదిలోకి పోయి, ఐదుసఖినాలు, ఐదుమడుగుపూలు, రెండు సారాప్యాకెట్లు తెచ్చిఇచ్చి, ఇవితాగి,ఆ అప్పలు తిన్నంకా పోదువులే అని అన్నది పటేలమ్మ.

ఆ అప్పలు,సారాప్యాకేట్లను సంతోషంగా తీసుకోని, ఒక్క సారాప్యాకెట్ తాగి, ఐదుఅప్పలు తిని, మగిలినవి తువ్వాల కొసకు కట్టుకోని “ఇగ నేను పోవాల్నా”అని అడిగిండు పాలేరు. “పోదువు గనీ ఇయ్యాల పానమంత్తా బాగ అలిసినట్టున్నదిరా, కాళ్ళూ లాగుతున్నయి, కాస్త కాళ్ళు పిసికినంకా పోదువులే, మీ పటేలింకా రాకనేపాయే” అన్నది పటేలమ్మ.

రోజటిలాగనే కాళ్ళు పిసకడం మొదలు పెట్టిండు పాలేరు. ఐతే ఈరోజు ఒల్లంత ‘మసాజ్’ చెయ్యమని బోర్లపడుకోని నడుముపై ‘ఝండూబాం’ రాయమని చేతికి ఇచ్చింది. ఐతే నడుంపైన రాయడానికి భయపడుతూ ” పటేలు చూస్తే ఏమనడా?” అని అన్నడు పాలేరు. పటేలు చూస్తే ఏమంటడ్రా? ‘మసాజ్’ చెయ్యమని నేనే అంటిని, నేను ఉన్నంకా నీకేంభయంరా!?, ఈ భూమి మీదా రెండే రెండు జాతులు, అవి ఒక్కటి ‘మగ’ జాతి రెండోది ‘ఆడ’ జాతి, కడమయి అన్నీకూడా మనం సృష్టంచుకున్నయే, మనం అందరం మనుసులమే, ఇందలో భయపడవలసిన పనిలేదని ధైర్యంచెప్పుతూ ఆ రెండో సారప్యాకెట్ కూడా తాగమని చేతికిచ్చింది పటేలమ్మ”

నేను చెప్పినట్టు చెయ్యమని, ఆ ‘ఝండూబాం’ చేతికిచ్చి,బోర్లపడుకోని నడుముమీద రాయమన్నది. పాలేరు ఆ ‘ఝండూబాం’ సీస మూత తీసి, ‘ఝండూబాం’ నడుము మీద రాస్తూండగా నడుము కిందా, వీపుమీదా, మెడలమీదా… రాయమన్నది.

పాలేరు కూడా బిడియం, భయంవిడిచి, ధైర్యంచేసి, పటేలమ్మ చెప్పిన ప్రతిచోట రాస్తూపోతున్నడు.. అదే క్రమంలో అనుకోకుండా వాళ్ళిద్దరి మనుసులు ఒక్కటై స్వర్గాన్నధిరోహించిండ్రు. తర్వాత ఇంకో సారప్యాకేట్ చేతిలో పెట్టి ఇగ ఇంటికి పో, ఏం భయంలేదు, నేను ఉన్నంకా నీ కేంభయంలేదు” అని ధైర్యంగా ఇంటికి పంప్పింది పటేలమ్మ.

తర్వాత ఇంటినుండి బయలుదేరి గొడ్లకొట్టం కాడికి వచ్చి పటేలు కోసం ఎదురుచూస్తూండగా, ఇంతలోనే పటేలు తండానుండి తిరిగి వస్తూ, కేకేసి ఇగ నువ్వూ ఇంటికి పొమ్మని చెప్పి, తనుకూడా ఇంటికి ఎల్లిపోయిండు.

ఇగ పాలేరు గొడ్లకొట్టం కానుండి తండాకు పోయేసరికి రోజు అయినట్టే చాలా ఆలస్యమైంది. ఇగా ఆ ఆలస్యానికి కారణం అడగదల్చుకోలేదు ఆయన పెళ్ళం.

రోజటిలాగానే మర్నాడు కూడా తండంత తిరిగి చివరికి వచ్చి పాలేరు ఇంట్టిముందు కొట్టంలో చుట్టా అంటుబెట్టుకోని కూర్చున్నడు పటేలు. అద్దసేరు సారా, ఒక గ్లాసు, కొద్దిగిన్ని గుడాలు తెమ్మని పాలేరు పెళ్ళంతో చెప్పగా, అట్లనే ఆమె తెచ్చిపెట్టగా, నిదానంగా ఆ గుడంబా తాగుతూ ఈ గుడాలు బుక్కేసరికే సమయం పదకొండైంది. అప్పటికే ఇరుగు-పొరుగు వాళ్ళు అంద్దరు పడుకున్నరు, ఇంకో పావుసేరు సారా తెమ్మనగా సారాతెచ్చి చేతికిస్తూంటే అదే చేతిని అట్లనే పట్టుకొని దగ్గరికి లాక్కోని మాట్లాడవద్దని సైగచేసి తాగిన మత్తులో ఆమెకు ఇష్ఠం లేకున్న బలవంతంగా వశపర్చుకున్నడు పటేలు.

అతని చేతులు ఆమె శరీరంపై వేసినప్పుడు ఆమెపై తేళ్ళు, జెర్లు పారినట్టుగా అనిపించినా, ఏమిచెయ్యలేని పరిస్థిథిలో ఉంది పాలేరు పెళ్ళం.

చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిసినయి. ఆ పాలేరు మరియు ఈ పటేలమ్మల ప్రేమ ఫలితంగా పటేలమ్మ ఒ పండంటి కొడుకును కన్నది. పటేలుకు చాలా సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందని సంతోషంతోపాటుగా, ఒక్కింత బాద కూడా ఉన్నది, ఎందుకంటే డాక్టర్ చెప్పిందాని ప్రకారం అతనకి సంతానం కలిగేయేగ్యత లేదు కాని సంతానం కలిగింది, దాన్ని అతడు కాదనలేకా, అవుననలేకా సతమతమవుతూ, చివరికి ఒక నిర్ణయానికి వచ్చిండు, అదీ

“ఎక్కడ కడితే ఏంది!? మనదొడ్లో(కొట్టంలో)ఈనింది లెక్కా” అని అనుకోని సంతానం కలిగిన సంతోషంలో సంబురాలు అంబరాన్ని అంటే విదంగా చేసిండు.

ఇంకో సంవత్సరం తర్వాత పాలేరు పెళ్ళం కూడా బంగారంలాంటి కొడుకును కన్నది. ఐతే, పటేలు కొడుకు, పాలేరు కొడుకు ఇద్దరు ఒకేలా అచ్చుగుద్దినట్టు అన్నాదంమ్ములా ఉన్నరు. ఐదు సంవత్సరాల తర్వాత బడిలో చేర్పించడంతో, బడిలోని పిల్లలు, పంతూళ్ళు , అందరు వాళ్ళను ‘కవలపిల్లలు’ అనుకుంటుంన్నరు.

ఆ విదంగా ‘ఆడది’ అంటే ‘గాడిద’ కాదు, ‘ఆడది’ అంటే ఆదిశక్తి అనీ, ‘ఆడది’ తలుచుకుంటే ఏమైనా చెయ్యగలదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.

– డా.బోంద్యాలు బానోత్(భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో