జ్ఞాపకం- 56 – అంగులూరి అంజనీదేవి

“బయట అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా వున్నారో నువ్వు చూస్తే ఇలా మాట్లాడవు” అని తను ఉడుక్కుంటూ లోపలికి వెళ్తుంటే తన వెంటే లోపలకి వస్తూ “ఫాస్ట్ గా వుండటం ఆనందం అనుకుంటున్నావా? అదేదో హాస్టల్ లో వుండే కొందరమ్మాయిలు కళ్లకి అద్దుకుని కడుపుకి తినవలసిన అన్నాన్ని ఇష్టం వచ్చినట్లు డస్టుబిన్ లో పడేసి ఆనందిస్తుంటారట. నువ్వుకూడా అలాగే చేస్తావా? చెయ్యిమరి. వాళ్ళు చేస్తున్నారుగా. ఎవరేది చేస్తే అది చెయ్యటమేగా నీ పని. నీకంటూ ఓ వ్యక్తిత్వం ఎక్కడ ఏడ్చి చచ్చింది? ఫాస్ట్ గా వుంటే చాలు. నీకు తెలుసోలేదో ఆ ఫాస్ట్ ని పెళ్లయ్యాక తిరగదోడతారట. తినే అన్నాన్ని అహంకారంతో డస్టుబిన్ లో పడేసినంత సులభం కాదు గతాన్ని దాచటం. గుర్తుంచుకో” అంటుంది.

పది నిమిషాల ఆలస్యానికే తన తల్లి అలా అంటుంటే గంటలు గంటలు ఆలస్యంగా ఇంటికొచ్చే సంలేఖను వీళ్లేందుకు ప్రశ్నించరు? అదే ప్రశ్న వేసింది అందరివైపు చూసి వినీల.
రాఘవరాయుడు, సులోచనమ్మ శిలల్లా నిలబడి చూస్తున్నారు.
తిలక్ కోపాన్ని అణచుకుంటున్నాడు.
సంలేఖ ఆలోచిస్తోంది.

“నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్ ?” అన్నాడు వినీల వైపు చూసి రాజారాం.

“అంటే! నేను చదువుకుంటున్నప్పుడు మా అమ్మ తప్పుగా ఆలోచించే నాకు జాగ్రత్తలు చెప్పిందంటారా? పెద్దవాళ్లు పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని అనుక్షణం భయపడుతూ వుంటారు. ఇలా మీలాగా ఎవరూ వుండరు” అంది.

రాజారాం అసహనంగా చూస్తూ ఏదో అనేలోపలే సంలేఖ అక్కడికి వచ్చి “వదినా! నువ్వు నాపట్ల పడుతున్న భయానికి థ్యాంక్స్. నాకంటూ ప్రమాదాలు వస్తే ఏ బస్ కిందనో, లారీ కిందనో పడితేనే వస్తాయి. లేకుంటే రావు. ఎందుకంటే నాకు హస్విత తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు. తన వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. నిత్యం పుస్తకాలే నా నేస్తాలు. అవి మనుషులు కాదు కాబట్టి నోటితో ఎలాబడితే అలా మాట్లాడి మనసుల్ని గాయపరచవు. సరేనా!” అంది.

రాఘవరాయుడికి, సులోచనమ్మకి కూతురు మాటలు తృప్తిగా అన్పించినా కోడలి మాటల్నికూడా తీసెయ్యలేక పోతున్నారు. తిలక్ కి అక్కడో క్షణం కూడా వుండాలనిపించక నిరసనగా చూస్తూ విసురుగా బయటకెళ్ళిపోయాడు.

వినీల సంలేఖ మీద ఎప్పటినుండో వున్న కోపాన్ని మనసులోకి తెచ్చుకుంటూ “బ్రతికేది మనుషుల మధ్యన కాబట్టి మాట్లాడే అవకాశాన్ని మనం ఇస్తేనే మాటలొస్తాయి. లేకుంటే ఎలా వస్తాయ్? నేనేదో తప్పుగా మాట్లాడినట్లు నన్ను మీరంతా శత్రువును చూసినట్లు చూస్తున్నారు. నేనే కాదు, అందరు ఏమంటున్నారో కూడా చూసుకోవాలి” అంది.

కోడలి మాటలు నిజమే అన్పించాయి. ఆడపిల్ల గురించి ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ముఖ్యంగా పల్లె ప్రజలు ఇంకా ఎక్కువగా వూహిస్తారు. అందుకే కోడల్ని ఏమీ అనదలచుకోలేదు.

సంలేఖ మాత్రం “చూడు వదినా! నేను అందరి చేత ఏమీ అనిపించుకోకుండా వుండాలంటే లైబ్రరీని, నా స్నేహితురాలు హస్వితను వదులుకోవాలి” అంది.

“ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొకటి వదులుకోవడంలో తప్పు లేదు. ఇదికూడా చెప్పాలా?” అంది వినీల.

“అయినా ప్రతి ఒక్కరు నన్నేమనుకుంటున్నారో చూసుకోవడమేనా పనా? దేన్ని వదులుకోవాలో, దేన్ని వుంచుకోవాలో నాకు బాగా తెలుసు” అంది సంలేఖ.

“మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. తిన్నగా ఇంటికి రావాలి. చెప్పరేంటండీ మీరు? మీరుకూడా” అంటూ అంతవరకు భర్తవైపు చూస్తున్నదల్లా సడన్ గా అత్తమామలవైపు తిరిగింది.
వాళ్లేం మాట్లాడలేదు.

“నువ్వు చెప్పినట్లు చేస్తే నేను ప్రపంచాన్ని తెలుసుకోలేను వదినా! కాలేజి, ఇల్లే తెలుస్తాయి” అంది సంలేఖ అసహనంగా.

“తెలుసుకుని ఏం చేస్తావ్? ఎంత తెలుసుకున్నా నువ్వు కూడా మాలాగే పెళ్లిచేసుకుని కాపురం చెయ్యాల్సిందేగా! కాపురం చెయ్యటానికి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలా? ఇవన్నీ కాలేజీ నుండి నేరుగా ఇంటికి రాకుండా వుండటానికి సాకులు. ఇంట్లో వాళ్లకి కూడా బయట నువ్వేదో విజ్ఞానాన్ని సంపాయించుకుంటున్నావని భ్రమ కల్గించటం” అంది.

రాఘవరాయుడు మాట్లాడలేదు. తండ్రి మౌనాన్ని చూసి ఎంత ధైర్యంగా వుందామన్నా వుండలేకపోయింది సంలేఖ.అవమానంగా అన్పించింది. జాగ్రత్తలు చెప్పడం వేరు, ఇలా ఎత్తిచూపినట్లుగా మాట్లాడడం వేరు. నేను మరీ అంత చిన్నపిల్లను కాదు. మాట్లాడేముందు ఎదుటివాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ మాట్లాడాలి. అది వదినలో లేదు.

అందుకే వినీల వైపు తిరిగి “వదినా! నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వంటే నాకు గౌరవం వుంది. దాన్ని నిలుపుకోవాలి అంటే ఇంకెప్పుడూ ఈ టాపిక్ ని తీసుకురాకు. నా ప్రవర్తన వల్ల ఏ ప్రమాదం వచ్చినా అది నాకే వస్తుంది” అంది.

వినీల ఒక్కక్షణం ఊపిరాడనట్లు చూసి “ఇలా మాట్లాడేవాళ్ళే చివరికి యాసిడ్లు ముఖం మీద పోయించుకునేది” అంటూ విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది.

వెళ్తున్న భార్యవైపు కోపంగా చూసి “మీ వదినకి మాట్లాడటం రాదు. నువ్వేం బాధపడకు సంలేఖా!” అంటూ సంలేఖ దగ్గరకి వెళ్లి నచ్చచెప్పాడు రాజారాం.

తలపట్టుకుని కూర్చున్నారు రాఘవరాయుడు, సులోచనమ్మ.
వాళ్లకి కూతురంటే ప్రాణం. యాసిడ్ పేరు వినగానే లోలోన వణికిపోతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్యన తనకూతురు చదవగలదా అని దిగులు పడుతున్నారు.

ఆ రాత్రికి సంలేఖ తండ్రితో “నాన్నా! జీవితంలో రాటుదేలాలన్నా, మహోన్నతంగా ఎదగాలన్నా మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్లాలని నువ్వే చెప్పావు. ఆటంకాలకి, అవరోధాలకి భయపడకూడదన్నావ్. మరి మేడ ఎక్కాలంటే అడ్డుగా వుండే మెట్లను కూడా ఎక్కాలిగా. నున్నటి రాయిమీద ఎంతసేపు నూరినా కత్తికి పదును వస్తుందా? చెప్పునాన్నా?” అంది.

”ఏంచెప్పను తల్లీ! నీ గురించి నాకు చాలా భయంగా వుంది. అయోమయంగా వుంది” అన్నాడు. అంతకన్నా ఏం మాట్లాడలేదు.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో