సంపాదకీయం డిసెంబర్ నెల – డా .అరసి శ్రీ

ఎప్పటిలానే మరొక ఏడాది కాలగర్భంలోకి వెళ్ళిపోతోంది.

ఈ ఏడాది మాత్రం ఎన్నో జ్ఞాపకాలతో పాటు మరెన్నో జాగ్రత్తలు , హెచ్చరికలను సవాలుగా విసిరిందనే చెప్పాలి .

అంత వరకు ఉన్న రోజూవారీ జీవితాల్ని ఒక్కసారిగా ఎటువంటి అంతరాలు లేకుండా అందరి జీవితాలను తలకిందులు చేసేసింది కోవిడ్. గత సంవత్సరంలో మొదలైనా కాని ఈ ఏడాది ఫిభ్రవరి నుంచి దాని ప్రతాపాన్ని చూపించి ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎంతో ఆధునికంగా ఎదుగుతూ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సమాజంలో పెను మార్పులు తీసుకువచ్చింది కోవిడ్.
ఇటువంటి భయంకర పరిస్థితుల్లోను మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. ఈ ఏడాదిలో కూడా మహిళలపై నేరాలు , అత్యాచారాలు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా గృహహింస కూడా ఎక్కువయ్యింది .

దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) స్పష్టం చేసింది. మహిళలపై జరుగుతున్న నేరాలకు  సంబంధించిన కేసులపై ఆందోళనలు జరుగుతున్న వేళ ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన నివేదిక దేశంలో మహిళలు, బాలికలు ఏ మాత్రమూ సురక్షితంగా లేరన్న విషయాన్ని స్పష్టీకరించింది.

మొన్న నిర్భయ.. నిన్న దిశ.. ఇప్పుడు మనీషా….

దేశంలో మహిళలపై అత్యాచారాలు  సాధారణం అయిపోయాయి. ప్రపంచాన్ని కదిలించిన నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినా.. ఇప్పటికీ మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన దళిత యువతిని తీవ్రంగా కొట్టి, నాలుక కోసి, అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపేశారు.  ఇవే కాకుండా ఏలూరు లో జరిగిన. అత్యాచార సంఘటన  ఒకటి. మహిళలపై దాడులను నివారించడానికి తల్లిదండ్రులు, మేధావులు ఎన్నో చర్చలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. మహిళలపై హింస గతంకంటే మరింతగా పెరిగిపోతోంది. మహిళలకు రక్షణ కల్పించడంలో మనదేశం ప్రపంచంలో 133వ స్థానంలో ఉంది.

మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని సూచించింది.

*అభిజ్ఞా నేరం జరిగితే ఎఫ్‌ఐఆర్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

*ఈ చట్టం పోలీసులకు ఎఫ్ఐఆర్ లేదా “జీరో ఎఫ్ఐఆర్” ను నమోదు చేయటానికి వీలు కల్పిస్తుంది.

పోలీస్ స్టేషన్ యొక్క అధికార పరిధికి వెలుపల నేరం జరిగితే, ఒక అభిజ్ఞాత్మక నేరం యొక్క కమిషన్  పై  సమాచారం అందిన సందర్భంలో, కేసులను కలిగి ఉన్న ఎఫ్ఐఆర్ లేదా “జీరో ఎఫ్ఐఆర్” ను నమోదు చేయడానికి చట్టం పోలీసులను అనుమతిస్తుంది.

ఎఫ్‌ఐఆర్‌కు నోచుకోని నేరాలు , గృహహింస నేరాలూ అధికమే ,చిన్నారులపై నేరాలు.
,అదృశ్య మయ్యేవారిలో మహిళలే ఎక్కువ, దళిత, గిరిజనలపై జరుగుతున్న దాడులు  అయితే అమానుషం .

దేశంలో రోజుకు సగటున 91 రేప్ లు జరుగుతున్నాయి. సగటున ప్రతి 16 నిమిషాలకు ఎక్కడో ఒక దగ్గర ఒక అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది.

ఈ క్రమంలో మహిళలు, బాలికలపై అత్యాచారం కేసుల్లో నేరస్థులకు మరణశిక్ష లాంటి కఠిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం ప్రవేశ పెట్టి ఏడాది అయ్యింది .

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత 2019, డిసెంబరు 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ రావాలి .

చట్టం వివరాలు:

1. ఈ దిశ ప్రకారం 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు.

2. ఈ చట్టం లో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుగా లేదా ఉరిశిక్షకూ అవకాశం ఉంది.

3. సోషల్‌, మీడియాల్లో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఐపిసిలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి తప్పుకు రెండేళ్లు, రెండవ తప్పుకు నాలుగేళ్లు శిక్ష విధించనున్నారు.

4. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణ త్వరగా జరిగేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.

ఇవి దిశ చట్టంకు సంబంధించిన విషయాలు , కాని చట్టం వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా కాని ఎంత మంది మహిళలలో వీటి పై అవగాహన ఉంది అనేది ప్రశ్నార్ధకం . అలానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  జీరో ఎఫైఆర్ విషయంలోనూ ఎన్నో సందేహాలు ఉన్నాయి .

గత నెల నవంబర్ 25 ,26న జరిగిన విహంగ పదేళ్ళ ప్రయాణం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న వెబ్ నార్ లో వీక్షకులు నుంచి వచ్చిన ప్రశ్నలే ఇందుకు నిదర్శనం .

ఇక ముందు అయినా మహిళలపై జరుగుతున్న ఈ నేరాలకు అడ్డుకట్ట పడాలి అంటే ప్రతి ఇంటిలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ముఖ్యంగా ఆడ , మగ ఈ వ్యత్యాసం లో మార్పు రావాలి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు  చేస్తున్న చట్టాలు గురించి అవగాహన , వాటి పని తీరు ఎప్పటికి అప్పుడు ప్రజలకు తెలియాల్సి ఉంది . వీటిల్లో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో సగటు బాధ్యతాయుత పౌరులుగా దేశ ప్రజల మీద కూడా అంతే ఉంది .

 

— డా .అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో