స్వప్న భాష్యాలు -2  ఇన్నోసెంటిస్మ్ ( Innocentism )(పుస్తక సమీక్ష )-స్వప్న పేరి

పుస్తకం పేరు: ఇన్నోసెంటిస్మ్ ( Innocentism )
రచయిత్రి: సుహాసిని మాల్డే-
అనువాద రచయిత్రి: డాక్టర్ ప్రియదర్శిని నితిన్ గోఖలే

కధ గురించి:
ఈ కధ మొదట మరాఠీలో సుహాసిని మాల్డేగారు రాసిన అనువాద రచన, ఇది ఆషియానా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసే వరకు ఆమె సొంత ప్రయాణం. దీనిని ప్రియదర్శినిగారు అనువదించారు.

రచయిత్రి గురించి:
సుహాసిని మాల్డే-
విద్యాపరంగా మరియు వృత్తిపరంగా విజయవంతమైన మహిళ.కానీ, మొదట్లో తాను అనుకున్న కార్యాన్నివిధి వెక్కిరించింది. నిరాశ ఆమెను ముంచెత్తింది. ఏర్పాటు చేద్దామనుకున్న ఇన్స్టిట్యూట్ కి అవసరమయ్యే నిధులు దొరకక, తల్లి కాలేని తాను, ఎందరో పిల్లలకి తల్లి అవుదామనుకున్న ఆలోచన ఎక్కడ నీరు కారిపోతుందో అన్న బాధతో ‘ డెప్రెషన్ ‘ లోకి వెళ్ళిన ఆమె, కోలుకుని, మరింత దీక్షతో – ‘ autism ‘ తో పోరాడుతున్న ఎందరో పిల్లల కోసం ఆఖరికి institute ఆరంభించారు. ఇటువంటి ఆలోచన రావడానికి కారణం అయిన పరిస్థితులు, ఆ తరువాత తన పోరాటం అంతా కలిపి ఈ పుస్తకంలో వివరించారు

అనువాద రచయిత్రి గురించి:
డాక్టర్ ప్రియదర్శిని నితిన్ గోఖలే –
ముంబైలోని బాంద్రాలో 25 సంవత్సరాలుగా జనరల్ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సామాన్య వైద్యం తో పాటుగా, మెంటల్ హెల్త్ & డీ-అడిక్షన్ పైన కూడా ఆమె దృష్టి చూపిస్తారు. సీనియర్ సిటిజన్లు మరియు ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో పీడియాట్రిక్స్ నుండి జెరియాట్రిక్స్ వరకు చికిత్స చేస్తుంది. ఆటిజం పైన పెద్దగా అవగాహన లేకపోయినా, సుహాసినిగారి ఆలోచనని అందరికి తెలియచేయాలని మరాఠీ బాషలో రాసిన పుస్తకాన్నిఇంగ్లీష్ లోకి అనువదించారు.

పుస్తకంలో:
ఆ పుస్తకంలో రచయిత్రి సుహాసిని, తన భర్త రవి & స్నేహితుల గురించి చాలా బాగా వివరించారు. తన ఆలోచనని సరిగ్గా అర్ధం చేసుకుని, ఆమెకి ప్రతి విషయం లో సహాయం చేస్తూ ఈ రోజు వరకు తనతో తన కుటుంబం లాగా కలిసిపోయిన స్నేహితుల గురించి చాలా బాగా రాశారు.

ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలి అన్న ప్రతిపాదనని తన భర్త రవి ఎంత ఆదరించారో పుస్తకంలో చాలా చోట్ల ఆమె చెప్పారు. అలాగే, స్కూల్ కోసం కావల్సిన లాండ్ కి సంబంధించి, తన స్నేహితులు చేసిన ఇమీడియట్ సహాయం గురించి బాగా రాశారు. రచయిత్రి తన అనుభవాలన్నింటినీ ఎంతో నీట్ & క్లియర్ గా వివరించారు.

ఏదారి తోచని సమయంలో తోడుగా ఉన్న స్నేహితులు ఉండడం చాలా లక్కీ. అందరికీ ఉండాలి కదా. సుహాసినిగారి స్నేహితులు, వాళ్ళు చేసిన సాయం గురించి చదువుతునప్పుడు అరే! అందరికీ ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండు అనుకోగానే నా బెస్ట్ ఫ్రెండ్స్ మాధురి, సాయినాథ్ గుర్తొచ్చారు. హమయ్య! మనకి ఉన్నారులే అనుకుంటూ మిగిలిన కధని చదివాను.

ఈ కధ నాకు ఎందుకు నచ్చింది?
కొన్ని పుస్తకాల్లో కథ బావుంటే, కొన్నింట్లో కధనం బావుంటుంది. కానీ, ఈ ఈ పుస్తకంలో కధ, కధనం, నాణ్యమైన కంటెంట్, సమాచారం & అద్భుతంగా వివరించిన నిజజీవిత సంఘటనలతో పాటు ఉత్తేజింపచేసే జీవిత ప్రయాణం ఉంది.

కధలో నాకు నచ్చిన మిగితా విషయాలు:
1. రచయిత్రి తన జీవిత అనుభవాలను ఆమె పాఠకులతో నిజాయితీగా పంచుకోవడం నచ్చింది.
2. ఉపయోగకరమైన సమాచారంతో పాటు పాఠకుల కోసం అనేక మానసిక రుగ్మతల గురించి తెలియని వాస్తవాలు & విషయాలు పుస్తకంలో ఉండడం. నచ్చింది.
3. .మనసుకి కష్టం కలిగించే ఎన్నో అనుభవాలను ఎదురైనప్పుడు, ఎలా ధైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలో చెప్పడం నచ్చింది.
4. క్లోజ్డ్ సొసైటీలో, ముఖ్యంగా స్త్రీ ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలు పొందికగా వివరించడం నచ్చింది.
5. ఒక కలను సాధించటానికి సంకల్ప శక్తి.నీ సుహాసినిగారు ఎంత బాగా రాశారో, అంటే చక్కగా ప్రియదర్శినిహరు అనువదించారు. .వీళ్ళ ఇద్దరి శైలి నచ్చింది.

-స్వప్న పేరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో