స్వప్న భాష్యాలు -1 (పుస్తక సమీక్ష )-స్వప్న పేరి

స్వప్న పేరి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. జీతం లేకపోయినా బతకడం సాధ్యమేమో గానీ పుస్తక పఠనం లేకుండా ఉండలేరు స్వప్న. ఇంగ్లీష్, తెలుగు భాషలలో దాదాపు పదిహేను వందల పుస్తకాలు ఇప్పటి వరకూ చదివారు. ఆమె ఏ పుస్తకం చదివినా నిర్ధిష్టమైన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం తన నైజం. తాను చదివిన పుస్తకాల గురించి, వాటితో తన అనుబంధం గురించి విహంగ పాఠకుల కోసం ‘ స్వప్న భాష్యాలు’ అనే శీర్షికన పంచుకోబోతున్నారు.

పుస్తకం : Femonomic: Women Invite Crime
రచయిత్రి : Lovey Chaudhary

‘ఫెమోనోమిక్: ఉమెన్ ఇన్వైట్ క్రైమ్’ అనే ఈ ఇంగ్లీష్ కవితాసంపుటి స్త్రీలపై జరిగే అన్యాయాలని సులువుగా, చాలా తేలికగా తీసుకునే ఆడవాళ్ళకి, చుట్టూ ఉన్న సామాజానికి ఒక గుణపాఠం. Femonomics అనే పదాన్ని రీటా వోల్ఫ్సన్, ఆర్ధిక సామాజిక కార్యకర్త రూపొందించి లైసెన్స్ కూడా పొందారు.

Femonomics అంటే ‘gender of money’. అంటే డబ్బుకి కూడా ఒక జెండర్ ఉంటుందని అంటారామే. మార్కెట్ లో దొరికే ఎన్నో స్త్రీల వస్తువులు ఇతర వస్తువుల కంటే ధర ఎక్కువని, స్త్రీల వేతనాలు జీతాలు ప్రతి చోటా పురుషునికంటే తక్కువని చర్చిస్తూ ఈ పదాన్ని సృష్టించారు రీటా.

పుస్తక శీర్షికే గుండెలపై గాయాన్ని రేపెట్టుగా ఉన్నది. కాదా మరి? ప్రతిక్షణం స్త్రీ ఎదురుకుంటున్న సమస్యలని సునాయాసంగా వినేసి ఏ స్పందనా లేకుండా తప్పించుకునే మొద్దు బారిన మహిళా సమాజం కూడా లేకపోలేదు. వాళ్ళ కోసమే ఈ పుస్తకం.

ఈ పుస్తకంలో రచయిత్రి లోవీ చౌదరి కవితారూపంలో సగటు స్త్రీ మనసుని పాఠకులకి వివరించారు.
ఈ పుస్తకం నాకు ఎందుకు నచ్చిందంటే

ఈ కవితా సంపుటి విభిన్న భావోద్వేగాలు, సంఘటనలు, నిషేధాలు, పరిస్థితులను పూలదండలోని ఒక్కొక పూవులా పరిగణించి రాయబడినవి.

కవిత్వం, సౌందర్యం, ఆసక్తి, పరిశీలన, జ్ఞానం, భావోద్వేగ సమతుల్యతలపై ఆధారపడిన కవిత్వాన్ని రాయడం చాలా కష్టం. కానీ రచయిత్రి లోవీ చౌదరి దానిలో రాణించారు. రచయత్రి అనుభవాలతో పాటు నిజజీవిత సంఘటనలు, ప్రపంచ విషయాల నుండి ఇందులోని కవితలు ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తాయి. ప్రతి కవితలో మానవ సంబంధాలు, చుట్టూ ఉన్నసమాజం పెట్టే పరిణితులు, చెప్పుకోలేని ఇబ్బందులు, అనేకానేక భావాలు, స్త్రీకి మాత్రమే అనుభవమయ్యే అన్యాయాల ఇతరత్రా అంశాలతో ముడిపడి, స్త్రీ ఎదుర్కొంటున్న విచిత్రమైన సందర్భాల గురించి మాట్లాడారు.

ఈ పుస్తకంలో కొన్ని కవితలు జీవితంలో సానుకూల స్థానాన్ని సృష్టించడానికి మహిళలను ప్రేరేపిస్తాయి, ప్రోత్సహించేలాగున్నాయి. తన కవితలని రచయిత్రి ఒక బలమైన కాంక్షతో, ప్రణాళికతో కూడిన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఎంచుకున్న మాధ్యమంగా పరిగణించవచ్చు.

ప్రపంచంలోని ప్రస్తుత దృష్టాంతంలో, మహిళలపై హింస మరియు పెరుగుతున్న నేరాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో మహిళలపై జరిగిన రాక్షసత్వ హింస దాని తీవ్రతను సూచిస్తుంది. చాలా సార్లు బాధిత మహిళ తల్లిదండ్రులు లేదా బంధువులు సమాజానికి భయపడి, ఆ స్త్రీకి జరిగిన అన్యాయానికి ముసుగు వేస్తారు. ఇటువంటి దారుణాలు చదువులేని ప్రజలలో మాత్రమే జరుగుతాయనేది ఒక అపోహ. ఇది మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజలలో కూడా ఎక్కువగా ఉంది. జీవన ప్రమాణాలలో మార్పులు, జీవనశైలి, ఆర్థిక వృద్ధిలో అసమతుల్యత, సామాజిక జీవితంలో మార్పులు మహిళల పట్ల దుర్మార్గపు దృక్పథానికి దోహదం చేసి వారిపై జరిగే నేరాలకు కారణాలవుతున్నాయి.

ఈ కవితాసంపుటిలో, To Love, Tumble, I don’t know what to name it, Who am I, The tragedy of self-love & Prostitution కవితలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇటువంటి అంశాలను ఎంచుకున్న రచయిత్రి లోవీకి నా అభినందనలు.

ఆ విధంగా రచయిత్రి ప్రస్తుత సమాజంలో స్త్రీలపై సాగుతున్న సమస్యలను, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన ప్రతి కవితకు ‘మ్యూజ్‌గా’ \ కవితా వస్తువులాగా తీసుకుని, తన పాఠకులకు అత్యంత ప్రభావవంతమైన రీతిలో అందించారు. మేధస్సుతో రాసిన అనేక కవితలు ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరి మనస్సాక్షిని తట్టిలేపుతుంది.

నాకు నచ్చిన అంశాలు:
1. చాలా భావోద్వేగాలు, ఆలోచనలు, సంఘటనలను కవితావస్తువుగా తీసుకోవడం.
2. వాస్తవికత, ఊహకు అందంగా ముడిపడి ఉన్న కవితలు.
3. జీవితంలో వివిధ సంఘటనలు, అందులోనుంచి పుట్టిన కవితలు.
4. ఆలోచనలను రేకెత్తించే కవితలు.
5. నేటి ప్రపంచపు వాస్తవికతను సమర్థవంతంగా వివరించబడిన కవితలు.
6. స్త్రీ పట్ల నేటి సమాజంలోని మనస్తత్వం చాలా వాస్తవికంగా వివరించబడిన కవితలు.
7. సరళమైన, అర్ధవంతమైన ఇంగ్లీష్ వాడుక భాషలో రాసిన కవితలు

ఆఖరి మాట:
అందరూ తప్పక చదవవలసిన కవితా సంపుటి.

-స్వప్న పేరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో