జ్ఞాపకం-5౩ – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

తన తండ్రి నిద్ర లేచినప్పటి నుండి “సులోచనా! స్కూల్ కి టైం అవుతుంటే ఏంచేస్తున్నావ్? సంలేఖకు తలదువ్వి జడలు వెయ్యాలని తెలియదా? రోజు చెప్పాలా నీకు? తిలక్ ఏడీ? ఏం చేస్తున్నాడు? వాడి పుస్తకాలకి అట్టలేసుకోమని చెప్పు! అడ్డ గాడిద ఎక్కడ వదిలేసినవి అక్కడే వదిలేస్తాడు. రాజారాం చూడు ఎంత నీట్ గా పెట్టుకుంటాడో. వాడ్ని చూసైనా నేర్చుకోమని చెప్పవే!” అంటూ మొదలుపెట్టి రాత్రయ్యాక పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకొని ఊరి విషయాలు కథలుగా చెప్పేవాడు.

అప్పుడప్పుడు తనను వెంట పెట్టుకొని ఆ ఊరి సర్పంచి తోట కృష్ణమూర్తి గారి ఇంటికి తీసికెళ్ళడం గొప్ప అనుభూతిగా వుండేది. ముఖ్యంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తనది చిన్నవయసే అయినా ఆ ఇంటిని క్షుణ్ణంగా గమనించేది. ఆ ఇంట్లో ఆడవాళ్ళు తీరికవేళల్లో ఏ నవలో, పత్రికనో పట్టుకుని చదువుతుండేవాళ్ళు. అదిచూసి తనుకూడా పెద్దయ్యాక అలాగే చదువుకోవాలి అని అనుకునేది. ఇప్పుడు తెలుస్తోంది తనని తన తండ్రి ఎక్కడెక్కడో తిప్పకుండా సొసైటీలో గుర్తింపు పొందిన కుటుంబాలతో, వ్యక్తులతో ఎందుకు పరిచయం చేసేవాడో! అలాంటి వాతావరణంలోనే ఎందుకు తిరగనిచ్చేవాడో! తను కూడా వాళ్లలాగే సంస్కారవంతంగా వుండాలని. ఎవరైనా తిరిగే ప్రదేశాలను బట్టే ఎదుగుతారని. చిల్లరబుద్ధులు అంటుకోవని. చిల్లర పనులు చెయ్యరని. తన తండ్రి పి.జి. చెయ్యకపోయినా మట్టి భాష తెలిసిన మహా పండితుడు. అందుకే ఆయన తన పిల్లలకి ఎలా పెరగాలో, ఏం చేయాలో, ఎందుకు చేయాలో నేర్పిస్తున్నాడు. అంతేకాదు ప్రపంచాన్ని తెచ్చి తమ దోసిట్లో పోసేందుకు ఆయన చేస్తున్న త్యాగాలనేకాదు. కలల్ని కూడా ఆ నోట్ బుక్ లో రాసుకుంది సంలేఖ. అలా రాస్తూనే నిద్రలోకి జారుకుంది.
తెల్లవారి పొలం దగ్గరికి వెళ్ళింది సంలేఖ.

ఆమె అప్పుడప్పుడు సరదాగా పొలం వెళ్ళి అక్కడ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, మట్టివాసనను పీలిస్తూ గడుపుతుంటుంది. ఇప్పుడు కూడా అదే విధంగా అనుభూతిస్తూ రాత్రి తన నోట్ బుక్ లో నాన్న గురించి రాసింది చదువుకుంది. ఇంకా కొంత రాస్తూ తాతయ్య సమాధి పక్కన వున్న కాలువ గట్టుమీద కూర్చుంది.
భరద్వాజ మాష్టారు ‘చర్చి’ దగ్గర బస్ దిగి రోడ్డుమీద నడుచుకుంటూ వస్తూ సంలేఖను చూసి ఆగాడు. ఆమె రాసుకుంటూవుంది. అభిమానంగా ఆయన సంలేఖ దగ్గరకు వెళ్లి “ఏమ్మా ఇక్కడున్నావ్? ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయని సీరియస్ గా రాసుకుంటున్నావా?” అని అడిగాడు.

“లేదు మాష్టారు! ఏదో రాస్తున్నాను. ఇది క్లాసుకి సంబంధించినది కాదు. జనరల్” అంది.

“జనరలా? ఏదీ ఇలా ఇవ్వు చూస్తాను” అంటూ క్యూరియాసిటీతో ఆ నోట్ బుక్ ని చేతిలోకి తీసుకొని చదివి ఆశ్చర్యపోయాడు.

తండ్రి గురించి ఆమె రాసిన వాక్యాలు ఆయన్ను ఎక్కడో తాకి కళ్లనీళ్లు వచ్చేలా చేశాయి.
తండ్రిపట్ల ఇంత కృతజ్ఞత వుందా సంలేఖలో? ఎంత బాగా రాసింది? అని మనసులో అనుకోకుండా వుండలేకపోయాడు.

ఏది ఏమైనా ఒక భావాన్ని భాషరూపంలో ఇంతచక్కగా బయటికి తీసుకురావడం అంత సులభం కాదు. అదే ఆయనకు ఆనందంగా వుంది.

నిజానికి ఎవరైనా తల్లిని పరిచయం చేసినంత గొప్పగా తండ్రిని చెయ్యరు. జన్మను ఇచ్చే తల్లి తప్ప జీవితాన్ని ఇచ్చే తండ్రి గుర్తురాడు. ఇంతెందుకు పసితనంలో వేలుపట్టి నడిపించిన శిక్షకుడు తండ్రే అయినా, పడినచోట లేచి నిలిచేందుకు వెన్నుతట్టి నిలబెట్టేదికూడా తండ్రే అయినా, మంచి చెడులను విడదీసి విశ్లేషించి జ్ఞానబోధ చేసే ఆదిగురువు తండ్రే అయినా, విశాలమైన ఆలోచనలు, ఆత్మస్థైర్యం తండ్రివల్లనే సంక్రమించినా, తల్లిని తలచుకున్నట్లు తండ్రిని తలచుకోరు. అంతేకాదు. మాట అవసరంలేనిచోట మౌనమే మహా కావ్యమని చెబుతూ అనువుగానిచోట అణువులా ఒదిగి వుండమనేది కూడా తండ్రే. ఓడిన చోట గెలుపును వెతుక్కోమని జీవితపు నాణ్యతను గుర్తుచేసేది కూడా తండ్రే. ఎందరో వ్యాపారవేత్తలు, సైంటిస్టులు, కవులు, కళాకారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, కూలిపనిచేసేవాళ్ళు కనీసం ఒక్కసారైనా తండ్రిని గుర్తుచేసుకోవాలి. తండ్రి నేర్పిన టైం మేనేజ్మంట్ గుర్తుచేసుకోవాలి. తండ్రుల గురించి మాట్లాడుకోవాలి. నాన్నంటే ఒక అధికారం, ఆధిపత్యం, పెత్తనం. ఓ బెత్తం, ఓ దుర్మార్గం, ఒక క్రౌర్యం, ఒక మందలింపు అని కాకుండా నాన్నంటే పిల్లలకి ఒక కంపాస్ బాక్స్. పిల్లల తప్పుల్ని చెరిపివేయాలని చూసే ఓ రబ్బరుముక్క. అని తెలుసుకోవాలి.

కానీ అమ్మను ఎప్పటికీ ప్రేమించకుండా వుండలేనట్లే నాన్నను ద్వేషించకుండా వుండలేకపోతున్న వాళ్ళే ఎక్కువగా వున్నారు. వాళ్లలో తిలక్ అన్నయ్య ఒకడు. తిలక్ లాంటి కొడుకులు ఎప్పటికైనా నాన్నని అనవసరంగా తిట్టామని, కొట్టబోయామని, తిరస్కరించామని, నాన్నని అర్థం చేసుకోలేకపోయామని, నానా బలహీనలతో మన్నించలేకపోయామని, అపరాధం చేశామని కుమిలిపోవాలి. ఆరోజు తప్పకుండా వస్తుంది. అని రాసివుంది. ప్రతి వాక్యం సున్నితమైన పదాలతో కూర్చినట్లుంది. ఆయన చదవటం పూర్తిచేసి ఆ నోట్ బుక్ ని సంలేఖ చేతికి ఇచ్చి బరువుగా నిట్టూర్చాడు.

తనేదో తండ్రి గురించి తన తృప్తికోసం రాసుకుంటే దాన్ని భరద్వాజ మాష్టారు చదవటం ఆమెకు ఏదోగా వుంది.

ఆయన ఆత్మీయంగా “నువ్వేదో నీకు తోచింది రాశావు. కానీ దీన్ని మరింత ప్రభావవంతంగా రాసి, ఇంకాస్త మార్పులు చేర్పులు చేసి కథ రూపంలోనో, దీర్ఘ కవిత రూపంలోనో ఎప్పటికైనా ఒక పత్రికకు పంపు. ఇలాంటి వాక్యాలే కావాలి ఇప్పటి కొడుకులకి. పాఠకులు కూడా బాగా ఆదరిస్తారు” అన్నాడు.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో