నీలవేణి కథలు – సామాజిక విశ్లేషణ(సాహిత్య వ్యాసం )–అరిగెల శ్రీకాంత్

ఆధునిక సాహిత్యంలో మనకు అనేక రకాల ప్రక్రియలు కనపడుతున్నాయి . వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోదగినవి “కథా ప్రక్రియ “. ఈ కథా ప్రక్రియ వైపు ఎక్కువ మంది ప్రజలు మక్కువ చూపటానికి కారణం లేకపోలేదు . కథ తక్కువ కాలంలో చదువవచ్చు . అలాగే తెలుగులో కథా రచయితలే ఎక్కువ. నేడు సమాజంలో అతి వేగంగా ముందుకు పోతుంది . సహృదయ పాఠకుడు గంటలు గంటలు చదవడానికి కాలం సరిపడదు . అందువలన వారి దృష్టి కథపై పండింది . ఆ సందర్భంగానే అనేక సామాజికాంశాలను దృష్టిలో పెట్టుకొని రచయితలు తమ రచనలను కొనసాగించారు . దానిలో కొందరు స్త్రీ దృక్పధం , మానవ సంబంధాలు మొదలైనవి కథా వస్తువుగా స్వీకరించారు . నీలవేణి కథ కూడా అంతే . ఇది సామాన్య సగటు స్త్రీ యొక్క దృక్పధాన్ని తెలుపుతుంది .

సమాజంలో నివశించే సగటు స్త్రీ పడే వేదనను స్త్రీ యొక్క హృదయపు లోతులలో నుండీ చూపించే వైఖరియే స్త్రీ దృక్పధం . నీలవేణి కథలు నేను చదివినపుడు సామాజిక కట్టుబాట్లు అనే విషపు కోరల్లో చిక్కుకున్న స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా కోల్పోయినా జీవితం మీద ఆశను కోల్పోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టాలను ఎదురొడ్డి తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుందో అనేది ఈ కథాంశం . దీన్ని అద్భుతంగా నూతన రచనా శైలితో , సరళమైన , సహజమైన పదాలతో అందరికే సులభంగా అర్ధమయ్యే విధంగా పి .వి . సునీల్ కుమార్ గారు నీలవేణి కథా సంపుటిలో రచించారు .

నీలవేణి కథ – విశ్లేషణ :
నీలవేణి కథలో జర్నలిస్టు అయిన రమణను పరిచయం చేశారు . ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి క్రింది స్థాయి ఉద్యోగులపై చూపే చులకన మనకు ఈ కథలో కనపడుతుంది . “కొత్త వింత – పాత రోత “ అన్నట్టుగా నేటి కాలంలో కొత్త విషయాల పట్ల కొత్తదనంతో , కొత్త ఆలోచనలతో రాస్తేనే , నేటి చదువరుడు చదవడానికి మక్కువ చూపుతారన్న విషయం తెల్సిందే . అందుకనే ఉన్నతాధికారి ఆడాళ్ళ పేజిలో ఏదైనా కొత్త వార్త రాయాలని రమణకు అని అప్పగించారు . రమణ సమాచారం చెప్పమని నీలవేణిని అడగడం , నీలవేణి రాత్రి పూట రమ్మనడం జరిగింది .

నీలవేణి వయస్సు 40 అయినా , ఆమె శరీరం వయస్సును జయించింది . అలాగే ఆమె ముఖంలో దర్పం , రాజసం ఆమెను మరింత ఆకర్షణీయంగా చేశాయి . నీలవేణి అందగత్తె . మెస్ నడుపుతుంది . ఆమెను చూస్తూ లొట్టలు వేసే వారే ఎక్కువ . ఆమె మెస్ కు ఒక ప్రత్యేకత ఉంది అని చెపుతూ , భోజనం కేవలం మనుషుల్లా తినే వారికే పెడుతుంది . బకాసురుల్లా తినేవారిని రావద్దని చెప్పడంలో ఆమె ఎంత ధైర్య వంతురాలోఅర్ధం చేసుకోవచ్చు . ఇక్కడ రెండు రకాల ఆకళ్ళు కనిపిస్తాయి . అవి ఒకటి కడుపుకు చెందినది . రెండవది కంటికి చెందింది . రమణ యొక్క భార్య పుట్టింటికి వెళ్ళడం వలన నీలవేణి మెస్ కు రాక తప్పలేదు . ఆ సమయంలో రమణకు ఉన్నతాధికారి అప్పగించిన పని గుర్తుకు రావడం , నీలవేణి కథతో ఆ ఆడాళ్ళ పేజీని నింపవచ్చు అన్న ఆలోచన రావడం జరిగింది .
సామాన్య స్త్రీని సైతం మార్చే రచయిత దృక్పధం నాకు ఎంతగానో నచ్చింది రమణ . నీలవేణి మీ మెస్ కు పబ్లిసిటి వస్తుంది ఇంటర్వ్యు యివ్వమని కోరగా సున్నితంగా తిరస్కరించింది . మీ జీవితంలో ఈ తరం అమ్మాయిలను ప్రభావితం చేయగల అంశం ఏదైనా ఉందేమో చెప్పమనగా , ఆలోచించి ఒకరోజు తదుపరి సరేనన్నది . కొంచెం పోగిడితేనే పొంగిపోయే ఎ రోజుల్లో ఏ విధంగానైనా వార్తల్లో ఉండాలని తన గురించి అందరికీ తెలియాలని కోరుకునే ఈ రోజుల్లో పబ్లిసిటి వస్తుందన్నా ఒప్పుకొని ఆమె , తన జీవితంలా మరొకరి జీవితమ కాకూడదని తన జీవితంలో తాను అనుభవించిన కష్టాలు ఏ స్త్రీ పడకూడదని భావించి సరేననడంలో ఆమె ఔన్నత్యం తెలుస్తుంది .

అయితే నీలవేణి ఇంటర్వ్యుకి పిలిచింది రాత్రిపూట అనే సరికి ఆ విషయం ఆఫీసులో తెలవడం అది కాస్త బ్రేకింగ్ న్యూస్ కావడం . ఒక అమ్మాయి లేట్ ఈవినింగ్ ఇంటర్వ్యు రమణకు కలిసొస్తుందని , కాదని అక్కడున్న మగవాంతా బెట్టింగ్ లు కట్టడంలో స్త్రీ పట్ల మగవారికున్న చులకన భావం , వారి ఆలోచన దృక్పధాలు మనకు తెలుస్తాయి . ఆడవాళ్ళు చిరునవ్వుతోనే సమాధానాలు ఇస్తారని చెప్పనవసరం లేదు . అలాగే రమణకి కూడా నీలవేణి సమాధానం యిచ్చింది . ముందుగా నా గురించి కాదు సంపత్ గురించి తెల్సుకోవాలని చప్పడం మొదలు పెట్టింది . సంపత్ ను గూర్చి చెపుతూ ఒక భర్తను భార్య ఎలా సమర్దిస్తుందో అలాగే నీలవేణి కూడా తన భర్త తాగకపోతే అతనంత మంచి వాడుండడని . తాగితే అతనంత చెడ్డ వాడు లేదని చెప్పింది .

సంపత్ జీవితం నేటి కాళాశాల విద్యార్ధులకి ఒక గుణపాఠం కావాలి . సంపత్ హాయ్ స్కూలు చదివే రోజుల్లో పడవ తరగతి జిల్లా ఫస్టు . మన ఊరి నుంచి కలెక్టర్ అయ్యేవాడు వీదోక్కడే అనుకున్నారు ఊరి వారంతా . కాని కళాశాలకి వెళ్ళేటప్పటికి సంపత్ తాగుబోతుగా మారాడు . ఎందుకు ఆ విధంగా మారాడు అనేది ప్రశ్నార్ధకమే . కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వ్యసనాల బారి నుండి బయట పడలేకపోయాడు . అంటూ నీలవేణి రమణగారి ఆలోచనలకు బ్రేక్ వేస్తూ టీ అందిస్తూ తన కథను మొదలు పెట్టింది . “ మా అమ్మ పేరు సావిత్రి . నాన్న ఉన్నాడో లేడో తెలియని బాపతు “ అనడంలో నాన్నపై తనకున్న అసహనం వ్యక్తమవుతుంది . ఎందుకనగా సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే ఇంటికి రావడం , ఇంకో స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అని తెల్సి కూడా వాళ్ళమ్మ అతనికి సేవలు చేయడంలో తక్కువ చేసేది కాదు .

భర్త ఎంత చెడ్డ వాడయినా సగటు భార్యగా ఆమె సేవలందించడం వారి అసహనం , కోపానికి కారణాలుగా మారాయి . నీలవేణి వాళ్ళమ్మ ప్రవేట్ స్కూలు టీచర్ గా పని చేసేది . ఎక్కడ చూసినా కామ పిశాచాలే . అది బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా అక్కడ నుండి వేరొక చోటికి మారేది . నీలవేణి ప్రశ్నించగా దూరమైపోతుందని జీతం పెంచటం లేదని చెప్పడంలో ఆమె లోలోపల ఎంత మదనపడుతున్నా పిల్లలకు ఆ విషయం తెలియకుండా వ్యవహరించిన తీరు వర్ణనాతీతం . ఇంకో మారు పక్కింటి అన్నయ్య గారు చెయ్యి పట్టుకున్నప్పుడు ఆపుకోలేక ఏడ్చేసింది . నీలవేణి , తమ్ముడు ఇద్దరూ అన్నయ్యగారి భార్య ముందే ఆయన్ని చితకబాదారు . వెంటనే అన్నయ్య గారు ఇల్లు మారారు . కాని నీలవేణి అమ్మ భయపడింది . ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయోనని ఆందోళన చెందింది . ఇక్కడ తప్పు పురుషుడు చేసినా , సమాజం స్త్రీనే నిందిస్తుంది . ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం . సావిత్రి ఏ తప్పు చేయకపోయినా తన చుట్టూ ఉన్న సమాజం గురించి భయపడుతూనే ఉంది . యిలా జరుగుతున్న కొంత కాలానికి నాన్న రావడం జరిగింది . అయితే ఈసారి నాన్న చుట్టపుచూపుగా రాలేడున్ . శాశ్వతంగా వచ్చాడు . కారణం అయన ఎస్ .టి . ఓ ఉద్యోగం పోయింది . దాంతో నాన్నను ఉంచుకున్నావిడ ఆయన్ని వదిలేసింది .

ఇక్కడ రచయిత యిద్దరు స్త్రీ ల వ్యక్తిత్వాలను పరిచయం చేశారు . వారిలో ఒకరు మనిషికి , మనసుకు , విలువలకు , సమాజానికి విలువనిచ్చే సాధారణ సగటు స్త్రీ సావిత్రి . ఇంకొకరు కేవలం ఆర్ధిక సంబంధాలను మాత్రమే ప్రాధాన్యతనిచ్చే విలువలు లేని స్త్రీ . ఒక మగజీవి ఇంట్లో అండగా లేకపోవడం వలన ఒక స్త్రీ ఎన్ని కష్టాలు , అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుందో అన్నీ వారి జీవితంలో అనుభవాలుగా మిగిలాయని నీలవేణి చెప్పింది .

నాన్న రావడం వలన సంతోషం పోయింది . ఎంత బాధ ఉన్నప్పటికీ సంతోషంగానే ఉండే వాళ్ళం . కానీ నాన్న వచ్చాక మామూలుగా మాట్లాడే వారంతా ఫార్మల్ గా మాట్లాడటం మొదలు పెట్టాం అనటంలో నాన్న పట్ల మారి మనస్సులో ఉన్న భావాలు అవగతం అవుతాయి . అకస్మాత్తుగా మంచి తండ్రిలా మారి చిన్ననాటి స్న్హితుడు కొడుకుని యిచ్చి ఆమెకు వివాహం జరిపించాడని చెప్పింది . మొదటి రాత్రి ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్ళిన ఆమెకు గుప్పుమని మందు వాసన రావడంతో వాంతి అయింది వాడే సంపత్ . స్నేహితుడు మోసం చేశాడని , తన కూతురు జీవితం పాడయిందనే వ్యధతో నీలవేణి తండ్రి మరణించడంతో ఇక్కడ పశ్చాత్తాపంతో మారిన తండ్రి తన కూతురి జీవితం చేచేతులా నాశనం చేశానని వ్యధతో మరణించిన వైఖరిని వివరించాడు . నీలవేణి వాళ్ళమ్మ , నాన్న సంపత్ వాళ్ళమ్మ , నాన్న ఆడపడుచు తెలిసి , తెలియక కొంత మంది తన జీవితమ నాశనం చేశారని వివరించింది .

అందుకే ప్రతీ వ్యక్తి తనకంటూ వ్యక్తిత్వం , స్వేచ్చ నిర్ణయాలు తీసుకోగల ధైర్యం ఉండాలి . మన జీవితం పై మనకు కంట్రోల్ లేకపోతే యిలా ప్రతి ఒక్కరూ మన జీవితంలో ప్రయోగాలు చేస్తారు . అందుకే ఎవరి నిర్ణయాలు వారే స్వయంగా తీసుకోవాలి అని చెప్పడంలో నీల వేణి జీవితం పట్ల కలిగిన అసహనం అర్ధమవుతుంది . సౌమ్యంగా ఉన్న నీలవేణి ఈ విధంగా తర్కించే జ్ఞానం ఎక్కడ నుంచి పొందిందో అర్ధం కాలేదు . అయితే జీవితానుభవాలే ఈ తర్క జ్ఞానాన్ని అందించి ఉండాలి . తన కథను చదివిన తదుపరి అయినా ఏ స్త్రీ కూడా తన నిర్ణయాలు తానే స్వయంగా తీసుకోగలిగితే చాలు అంది .ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను పెట్టుకున్న మెస్ నన్ను ఆర్ధికంగా నిలబెట్టింది . తమ్ముడ్ చెల్లి పెళ్లిళ్లు చేసుకొని హాయిగా ఉన్నారు . మా అమ్మ హాయిగా ఉంది అంటూ నీలవేణి కథను ముగించింది .
ఈ సమాజంలో స్త్రీ ఎంతటి వివేకతా శక్తి , విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నా సామాజిక కట్టుబాట్లు దృష్ట్యా తల్లిదండ్రుల పైనే ఆ భారాన్ని మోపుతుంది . ఒక వెల రచయిత ప్రస్తావించినట్లు తల్లిదండ్రులను ఎదిరిస్తే సమాజం బరితేగించింది అంటుంది . యిక్కడ ప్రముఖ రచయిత్రి రజియా బేగం వర్ణించిన తీరు స్ఫురిస్తుంది .

“బాల్యంలో – చిన్న పిల్లవి నీకేం తెలుసు కూర్చో
యవ్వనంలో – ఉడుకు రక్తం మంచి – చెడు తెలియదు కూర్చో
వృద్దాప్యంలో – ముసలి దానివి యింకేం చేస్తాం కూర్చో …….అంటూ ప్రతీ సందర్భంలోనూ స్త్రీ తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని హరించారు.

ముగింపు :
రచయిత చెప్పిన అంశాలు బాగానే ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి . అది ఒకటి సమాజం ఎమనుకుంటుందో , సమాజంలో మనుషులు ఏమనుకుంటారో అనేవి సగటు వ్యక్తిని ఆలోచింప చేస్తాయి . ఎందుకంటె మానవుడు సంఘ జీవి , రెండవది పురుషాధిక్య సమాజం మంది . స్త్రీ పురుష సమానత్వం అంటారు కాని అది కేవలం మాటలకే పరిమితం . ఈ సమాజంలో స్వేచ్చగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం స్త్రీలకు ఎక్కడ కల్పిస్తాయి . కొంత మేరకు ఈ అవకాశం కల్పించినా పూర్తి ఆర్ధిక స్వేచ్చ లేదు . ఒక స్త్రీ తాను సంపాదించిన దంతా భర్తకే యిచ్చి అవసరాల మేరకు మరలా అడిగి తీసుకోవాల్సి ఉంటుంది . ఏది ఏమయినా సరే ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ , ఆర్ధిక స్వేచ్చ రావాలని , సమాజంలో స్వేచ్చగా తిరగగలిగే స్వేచ్చ రావాలని ఆకాంక్షిస్తున్నాను . ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని ఒక స్త్రీ తన ఆత్మస్థైర్యం ను కోల్పోకుండా ముందుకు సాగాలనే రచయిత దృక్పధాన్ని అభినందిస్తున్నాను .

ఆధార గ్రంధాలు :
తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు -సిమ్మన్న వెలమల
నీలవేణి కథ లు – సునీల్ కుమార్ పి .వి

-అరిగెల శ్రీకాంత్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో