భరిస్తూ ఇలా(కవిత )–పుష్యమీ సాగర్

భరించడం మాకు కొత్తేమి కాదు
పుట్టినప్పటినుంచి వివక్షత ని మోస్తూ మోస్తూ
భుజాలు కుంగిపోయేలా

అడుగడుగునా ఆంక్షల నడుమ
ఊపిరిపీల్చుకోనివ్వని బానిసత్వం కొత్తేమి కాదు

చిన్నప్పుడు నాన్న
పెళ్ళైయ్యాక భర్త
ముసిలితనం లో కొడుకు

పేర్లు మారాయి కానీ ఆధిపత్యం ఇంకా అలానే
మా బతుకులపై నృత్యం చేస్తున్నాయి

ఊర్లను ఏలాం కానీ
ఇంటిని మాత్రం ఇప్పటికి “వారి” చేతుల్లోనే

ఆకాశం లో సగం అయ్యమేమో గాని
మహిళా గా పరిపూర్ణం కాలేదు

ఇప్పటికి భరిస్తూనే ఉన్నాం
భరించడం అలవాటు అయ్యింది
కట్టే కాలేదాకా తప్పని బానిసత్వం !

-పుష్యమీ సాగర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.