మట్టి పొరల్లోంచి …సోమేపల్లి కవిత్వం -అరసి శ్రీ

మట్టి పొరల్లోంచి కవితా సంపుటి రచయిత ఏడవ కవితా సంపుటి . రచయిత సోమేపల్లి వెంకట సుబ్బయ్య పరిచయం అక్కర్లేని పేరు . ఇంతకు మునుపే వీరు లోయలో మనిషి , తొలకరి చినుకులు , చల్ల కవ్వం , రెప్పల చప్పుడు , తదేక గీతం , పచ్చని వెన్నెల వంటి సంపుటాలు వెలువడ్డాయి .

ఈ కవితా సంపుటిలో 32 కవితలున్నాయి .నాలో నేను కవితతో మొదలైన కవితలు కాసేపు విరామంతో ముగుస్తాయి.

సగటు మనిషి మనస్తత్వం ఎలా ఉండాలో చెప్పారు రచయిత …నాలో నేను కవిత లో యిలా అంటారు ..
“దశాబ్దాల ప్రయాణం
శరీరపు వన్నె తగ్గించిందేమో కాని
మనో శ్వాస
కోత్త చిగురై పల్లవిస్తూనే ఉంది “ అంటూమన వ్యక్తిత్వం ఎలా స్థిరంగా ఉండాలో తెలియజేసారు .

వీరికి రైతుల కష్టాలు , అవస్థలు అని తెలుసు .. రైతు పరిస్థితిని చెబుతూ ..
“రైతు నిఘంటువులో
అన్నీ వున్నాయి
పేగు నింపే
గిట్టుబాటు ధర తప్ప …! “ అని రైతుల కష్టానికి తగిన ఫలితం లభించడం లేదని వెన్నెముక గోడు కవితలో రచించారు .

ఇంకా రైతులను ఎలా మోసం చేస్తున్నారో , వారి మూల ధనమే పెట్టుబడి దారుల లాభాలుగా ఎలా మరిపోతున్నాయో చెప్పాటు మాటల బేహారి కవితలో …
అన్నదాతల అవసరాలే
పెట్టుబడీ మూలధనమూ
బడా వ్యాపారులకు
బాకా వూదుతూ
అన్నదాతకీ
వాణిజ్య విహారికీ మధ్య
రాయ “భార “మౌతుంటాడు .

మత్స్య కారుల జీవన శైలి , వాళ్ళు పడే పాట్లు నిరంతరం ఒక వేటలా సాగుతుంది అంటారు రచయిత . సుడిగుండం చుట్టూ కవితలు ….
“అలలు వలను ఆదుకుంటాయా …?
వల కల పండుతుందా …?
నమ్ముకున్న జాలం
ఉప్పూ పులుసు అందించడమే కాదు
ఆగ్రహం వస్తే
ఆకల్నీ ఆవాసాలనీ ఏకం చేస్తుంది “ ఆ నీటి , నీటిలోని జల సంపదని నమ్ముకున్న మత్స్య కారుల బతుకులకి ఈ కవిత నిదర్శనం .

పూర్వం గుడిసెలో , ఇళ్ళల్లో ఉట్టి ఉండటం స్వర్వసాధారణం ..ఆ ఉట్టి ని ప్రతీకగా తీసుకుని ఐక్యమత్యానికి సూచిగా వర్ణించడం లో రచయిత సమాజంపై గల సూక్ష్మ పరిశీలన తెలుస్తుంది .

ఇప్పుడైతే అంతా యాంత్రికంగా మారిపోయింది కాని ఒకప్పుడు ఆటలు , పాటలు మనుషుల్లో మానవత్వం సజీవంగా నిలిచి ఉండేవి. పసి ప్రపంచంలో కవితలో ప్రతిబింబిస్తాయి . నేటి ఆధునీకరణ జీవనంలో అందరి మోజు డాలర్ వేటలో సాగుతుంది . “అంతా కాలం మహిమేనా
డాలర్ మహత్యం కూడా “ అంటారు రచయిత డాలర్ యవనిక కవితలో తెలియజేసారు .

ఇంకా చప్పిడి బతుకు ,గుండె తడి , మానవత్వపు పతాక వంటి మానవీయ కోణం నుంచి రాసిన కవితలు ఆలోచింపజేస్తాయి . ఫేస్ బుక్ లో అమ్మ , ఉల్టా ఉగాది వంటి కవితలో మన ఆధునిక ధోరణులను ప్రశ్నిస్తాయి .

ఒక మంచి కవిత్వం , వాస్తవిక దృశ్యాల అక్షర మాలిక ఈ మట్టి పొరల్లోంచి కవిత్వ సంపుటి ….ఆలోచింప జేసే కవిత్వం అనడంలో అతిశయోక్తి లేదు .

ప్రతుల కోసం :
క్రిసేంట్ పబ్లికేషన్స్ ,
వేమూరివారి వీధి , సూర్యారావు పేట ,
విజయవాడ .

–అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో