జ్ఞాపకం-52 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

“నువ్వెంత తలకొట్టుకున్నా ఇప్పుడు ఒరిగేదేంలేదు. మన పిల్లలకి రెక్కలొచ్చాయి. ఎలా వున్నామన్నది ఆలోచించకుండా ఆనందంగా వున్నామనే అనుకుంటున్నారు. తెలిసో తెలియకో ఏదో కావాలన్న తపన ఎక్కువైంది వాళ్లలో. కావాలనుకున్న దానికోసం ఆరాటపడుతున్నప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవాలి. తప్పదు” అన్నాడు.

ఆయన ఏదో మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాడన్నది అర్థమవుతోంది సులోచనమ్మకు. అదేదో అర్థమయ్యేలా చెప్పమని అడగలేకపోతోంది. ఏం వినాల్సివస్తుందోనన్న భయంతో మూగబోయింది.
“చూడు సులోచనా! మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టేవి, తాత్కాలికంగా ఆనందాన్ని, ఇచ్చేవి అతి చిన్నవిషయాలే అయినా అవి మన పాలిట ఎంత విష ప్రభావాన్ని చూపుతాయో, జీవితాన్ని ఎంత విషాదంలో ముంచుతాయో నీకో చిన్న కథలాంటిది చెబుతాను. విను” అన్నాడు రాఘవరాయుడు.
ఏం చెబుతాడో వినాలన్న ఆసక్తితో ఆమె “చెప్పండి! వింటాను” అంది.

ఆయన చెప్పటం మొదలు పెట్టాడు-
“ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బండిని లాగుతూ వెళుతోందట. పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని ఆ నక్క ముందు వాలి, ఆ ఎరలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క ‘తప్పకుండా ఇస్తాను. కాని కొంత వెల అవుతుంది’ అన్నదట. దానికి ఆ గ్రద్ద ‘ఏమివ్వాలి, ఎంతివ్వాలి?’ అని అడిగిన ప్రశ్నకు ‘నీ రెండు ఈకలు ఇస్తే, నేను ఒక ఎరను ఇస్తాను’ అని నక్క సమాధానమిచ్చిందట. గ్రద్ద తన రెండు ఈకలను పీకి ఇచ్చిందట. నక్క వాటిని తీసుకొని బండిలో నుండి ఒక ఎరను తీసి ఇచ్చిందట. దాన్ని తింటూ ‘ఆహా! ఎంత రుచిగా వుంది. మళ్లీ ఇంకొకటి తిందాం!’ అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట. నక్క మళ్ళీ అలాగే చెప్పిందట.
అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలను ఇచ్చి ఎరలను కొంటూ వచ్చిందట. చివరకు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకొని నిజం తెలుసుకొనేలోగా తన ఈకలన్నీ వూడి, పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్దపైబడి చీల్చి తీసేసింది. దీన్ని బట్టి ఏం తెలిసింది? గ్రద్ద విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని, దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది. సరిగ్గా మన జీవితాల్లో కూడా మనం మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టే వాటివైపు వెళితే అలాగే వుంటుంది” అన్నాడు.

సులోచనమ్మ ఒక మామూలు శ్రోతలాగే విన్నా అందులోని ఆర్ద్రతకి కదిలిపోయింది.
వాళ్ళకి తెలియకుండా వింటున్న సంలేఖకు మాత్రం ఆ కథలో ఏం అర్థమైందో ఏమో నిశ్చలంగా పడుకొని ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మరచిపోయింది. అలా సీలింగ్ వైపే చూస్తోంది. ఆ చూపులు ఎవరికి కన్పిస్తాయి ఆ చీకట్లో…?

తండ్రి చెప్పిన ఆ కథ సంలేఖ మనసు లోతుల్లోకి వెళ్లి చాలా స్పష్టంగా ముద్రించుకుపోయింది.
ఎన్ని పుస్తకాలు చదివినా తెలియని జీవనసత్యం ఆ ఒక్క కథతో తెలిసినట్లైంది. ప్రలోభాలకి లొంగిపోతే ఏం కోల్పోతామో! వ్యక్తిత్వ వికాసం మనిషి ఎదుగుదలకు ఎంత కీలకమో అర్థమైంది. జీవితాన్ని గెలవాలంటే మనిషి తనకు తను ఎలాంటి దారి వేసుకోవాలో, ఎలాంటి బాటలో నడవాలో అప్పుడప్పుడు తన తండ్రి తనకి చెప్పిందే అయినా మళ్ళీ ఓసారి కొత్తగా చెప్పినట్లైంది.

అలాంటి తండ్రితోనా తిలక్ అన్నయ్య అంతగా గొడవ పెట్టుకునేది? నాన్నకోసం కాదు ఈ ఇంట్లో అమ్మకోసం వుంటున్నానని తండ్రిని గాయపరిచినట్లు మాట్లాడాడు. అసలు తిలక్ అన్నయ్య మనిషేనా? వాడికసలు తండ్రి విలువ తెలుసా? తెలిస్తే అలా మాట్లాడతాడా? అమ్మ అమ్మే! కానీ నాన్నకూడా నాన్నేకదా! కఠినంగా మాట్లాడినా, కోపంగా చూసినా క్రమశిక్షణ నేర్పించి మంచి జీవితాన్ని ఇచ్చేది నాన్నేకదా! ఇది తెలియని తిలక్ లాంటి వాళ్లకి నాన్నంటే ఏమిటో ఎప్పుడు తెలియాలి? ఎలా తెలియాలి?
మొన్న లైబ్రరీకి వెళ్లినప్పుడు నాన్న గురించి కొంతమంది కవులు రాసిన కొన్ని వాక్యాలను చదివి ఆశ్చర్యపోయింది. అవి కేవలం పుస్తకాలకే పరిమితం అనుకుంది. కానీ తన తండ్రిని చూస్తుంటే అవి సజీవ సత్యాలనిపిస్తున్నాయి. ఆయన నిజంగానే నిత్యం జీవితం మడిని దున్నే నాగలియోధుడు.
వెంటనే లేచి లైటు వేసింది సంలేఖ. చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రవేశించింది.

నోట్ బుక్ అందుకుని, పెన్ను పట్టుకుని ఆ వెలుతురులో ఒంటరిగా కూర్చుంది. అందరూ నిద్రపోతున్నందువల్లనో ఏమో వాతావరణం చాలా ప్రశాంతంగా వుంది. తెల్ల కాగితం పై నలుపు చేస్తూ ఆమె పెన్ను సాగిపోతూనేవుంది. తన తండ్రే కాదు ఏ తండ్రి అయినా ఎలా వుంటాడో రాసింది. చాలామంది పిల్లలు తమ తండ్రుల్ని చూడాల్సిన కోణంలో చూడటం లేదని, అలాంటి కోణం ఒకటి వుందని కూడా గుర్తించడంలేదని, అదే ఆవేదన ఆమె రాస్తున్న వాక్యాల్లో ధారగా సాగింది. నాన్న గురించి అద్భుతంగా రాసింది.

ఎంత రాసినా తండ్రి గురించి ఇంకా మిగిలివున్నట్లే అన్పిస్తోంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో