జనపదం -జానపదం -జంతువులకు జానపదులు చేసే వైద్య విధానం -తాటికాయల భోజన్న,

 

                                                         

ఏ ప్రాణి అనుకోని విధంగా మనిషి జీవించాలనుకుంటున్నాడు. ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆనందం, సంతోషం, బాధ ఇలాంటివన్నీ ఎక్కడినుండో తనకు సంక్రమిస్తాయని వాటికోసం ఎదురుచుస్తున్నాడు లేదా వాటి నుండి తప్పించుకోడానికి దూరం జరుగుతున్నాడు. సృష్టిలో ఏ జీవానికి జీవిస్తున్నానని తెలియదు. మనిషికి మాత్రమే చాలా విషయాలు అర్థమౌతాయి. అదే మనిషి నేటి దుస్థితికి కారణం. మనిషి జీవితం తనకు తాను సాగిపోతుంది. కానీ మనిషి దాన్ని బంధించి రకరకాల వ్యవస్థలను దానితో అనుసంధానం చేసి అవస్థలను కొని తెచ్చుకుంటాడు.

          అత్యధిక జ్ఞానం మనిషి పాలిట శాపంగా పరిగణిస్తుంది. మీకు జ్ఞానముంటే మరే శత్రువు అవసరం లేదు. లోకమంతా మీకు వ్యతిరేకంగా కత్తి దూస్తుంది. కాబట్టి మనిషి ఎంత మంచి స్థితిలో ఉన్నా అహంకారానికి పోకుండా వారి చుట్టు ఉండే వాటితో ప్రేమ భావాన్ని కలిగి ఉంటే సర్వం వారికి నచ్చినట్లే జరుగుతుంటాయి. ప్రాచీన కాలంలో ఉద్దండులు అని చెప్పుకునే వారందరు సర్వ సాధారణ జీవితం గడిపిన వారే. జంతువులు, పశువులు, పక్షులతో కలిసి ఏ తారతమ్యం లేకుండా జీవించిన వారే.

జానపదుల దృష్టిలో మనిషికి, జంతువుకి, పర్యావరణానికి పెద్దగా తేడా కనిపించదు. ప్రకృతిలో జీవించే జానపదులు జంతువులను సైతం తమ సంతానంగా భావిస్తారు. ఈ ఇతివృత్తంతో పాకాల యశోదరేడ్డి గారు ఎంకన్న అనే కథానికను రాయడం కనిపిస్తుంది. తమ దగ్గర ఉన్న జంతువులలో దేనికైనా ఆరోగ్యం చెడిపోతే నేటి విధంగా పశువైద్యశాలలు ఆనాడు లేవు కాబట్టి జానపదులే స్వయంగా కొన్ని మూలికలను సేకరించి చెట్ల మందుల ద్వారా వైద్యం చేసి పశువులను దక్కించుకునేవారు. ఈ క్రమంలో వీరికి తెలియని వ్యాధులు సోకి కొన్ని జంతువులు చనిపోతుంటాయి కూడా. మనిషికి ప్రతి జీవి సహకారం కావాలి. మనిషి ఒక్కడే ఈ భూమిపై జివించలేడు కాబట్టి ప్రతి జీవిని తమతో సమానంగా భావించేవారు.

సింధు నాగరికతలోనూ పశుపతి విగ్రహం దాని చుట్టు పశుపక్ష్యాదులు, తదనంతర కాలంలోను మనిషికి అడుగడుగున పక్షులు, డేగ, పావురం, హంస, బాతులు, పశువులు, గుర్రాలు, ఏనుగులు ఆనందాన్ని, సహాయాన్ని అందించాయి. తెలుగు సాహిత్యంలో శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో కొరవి గోపిరాజు సింహాసన ద్వాత్రింశికలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో, పాలవేకరి కదరిపతి శుక సప్తతి లాంటి కావ్యాలలో పక్షుల ప్రస్తావన కనిపిస్తుంది. జానపదుల వైద్యవిధానాన్ని పరిశీలిద్దాం..   

నాలుకపై ముల్లు : పశువుల నాలుకపై ముల్లు పెరిగినట్టు తెలుసుకొని ఉప్పు పసుపు రాస్తారు. నాలుకపై ముల్లు కారణంగా పశువులు గడ్డిని తినవు. 

విష విరుగుడు : రైతులు తమ పంటలకు అనేక రసాయనాలను నేడు వాడుతున్నారు. కొన్ని సార్లు పశువులు ఆ పంటని తిని మరణిస్తుంటాయి. ఈ క్రమంలో జానపదులు జాగరుకతతో ఉండి విషవిరుగుడుకు సబ్బునీరు, మనిషిమలం, సీతాఫలం ఆకులను రకరకాలుగా తయారుచేసి వాటికి తాగించి ఆ పశువులను రక్షించుకుంటారు.

కడుపు మందగించడం : కడుపు మందగించడం అనగా జీర్ణక్రియ సరిగా లేకుండా పశువులు ఏమి తినవు. దీనిని గమనించిన జానపదులు చింతపండును మెత్తగా అయ్యేవరకు నానబెట్టి రసంగా చేసి పట్టిస్తారు. ఇలా చేయడం వలన పశువుల మళ్ళి గడ్డిని తింటాయి.

మందు బొంగు : మందును పోయడానికి వెదురు బొంగును పాత్రగా వాడతారు.

కాళ్ళలో పురుగులు : వర్షకాలం పశువుల కాళ్ళలో పురుగులు తయారై నొప్పిని కలిగిస్తాయి. అప్పుడు ఆ పుండ్లపై గ్యాసునునే మరియు డంబర్ గోళీలు వేస్తారు.

అవయవాలు పట్టుకోవడం : పశువుల అవయవాలు పట్టుకొని అవి అవస్థలు పడుతూ ఉంటే పుట్టమన్ను, పెండకలిపి వేడి చేసి పేగుతో కలిపి పశువుల శరీరానికి మెత్తుతారు.

వెచ్చదనం : పశువులకు వెచ్చదనం కలగడానికి పందినెయ్యిని చలికాలం వాడతారు.

కట్టునిలవడానికి : పశువులకు గర్భం నిలవడానికి బురుగు చెక్క రసాన్ని వాడతారు.

తొండ కరిస్తే : పశువులను తొండకరిస్తే బండగురిజాకు వాడతారు.

కన్నుపై దెబ్బ : రాళ్ళ ఉప్పును పాసినోట నమిలి పెడతారు.   

-తాటికాయల భోజన్న,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో