ధర్మపురి మండల జానపద కథల దర్శిని (పుస్తక సమీక్ష )- అరసిశ్రి

భావితరాల వారికి మార్గదర్శకం చేసేవి ,  వారికి విజ్ఞానాన్ని అందించేవి పరిశోధనలే . పరిశోధనల పలితంగా వెలుగు చూసి సమాచారం ఎంతో అమూల్య మైనవి . అవే మన తర్వాత తరాల వారికి మనం అనిదించే అసలైన సంపద . ఈ కోణం లో ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల మీద ఎంతో పరిశోధన జరగవలసి ఉంది . ప్రస్తుత కాలంలో విశ్వవిద్యాలయాల స్థాయి లో పరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ప్రజల దృష్టిలో కూడా మరింత మారుపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

విశ్వవిద్యాలయాలు స్థాయిలో జరుగుతున్న పరిశోధనలు కొంత వరకు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఒక అవకాశం గా భావించ వచ్చు . ఆ కోణంలో జానపద సాహిత్యం మీద మన పూర్వీకులు ఎన్నో వ్యయ ప్రయాసలతో పరిశోధనలకు మార్గాలు వేసారు . వాటిని అనుసరించి ఇప్పటి తరం మరింత ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది . ఈ క్రమంలో జానపద కథలు మీద వచ్చిన పరిశోధన అంశం ధర్మపురి మండల జానపద కథలు . ఈ పరిశోధన అంశం పూర్తి కావడం తర్వాత పుస్తక రూపం లోకి రావడం జరిగింది . ధర్మపురి మనల జానపద కథలు అనే అంశంతో పరిశోధన పూర్తి చేసారు తాటికాయల భోజన్న . ఆ తర్వాత పి .హెచ్ డి అంశం కూడా జానపద సాహిత్యంలోనే తీసుకుని పరిశోధన చేయడం జరిగింది .

చిన్నతనంలో కథల మీద ఆసక్తి ఎక్కువుగా ఉంటుంది . మన అమ్మమ్మలు , నానమ్మలు , తాతయ్యలు వద్ద కథలు విన్న అనుభం అందరికి ఉంటుంది . పూర్వం నుంచి ఒక తరం నుండి మరొక తరానికి వాక్ రూపంలో అందుతున్న సంపద జానపద కథలు అని చెప్పాలి . ఇవి తరతరాల వారసత్వ గని . తెలుగు నాడులో జానపద కథలు కోకోల్లులు . అందులోను తెలంగాణ ప్రాంతంలో అడుగడున జానపద సాహిత్యం కనిపిస్తుంది . తెలంగాణలోని ధర్మపురి ప్రాంతంలోని జానపద కథలు గురించి , అక్కడికి జానపద విశేషాలు గురించి ఈ పుస్తకం మనకు సవివరంగా అందిస్తుంది .

పరిశోధన గ్రంధంగా రావడం వలన ఈ పోస్తకంలో ధర్మపురి మండలం పరిచయం , జానపద సాహిత్య పరిచయం ,ధర్మపురి మండలంలోని జానపద కథలు సామాజిక విశేల్షణ , జానపద కథ సామాజిక ప్రయోజనం అనే అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి . ధర్మపురి మండల పరిచయంలో ఆ  ధర్మపురి మండలంలోని స్థల పురాణాలు ,పండగలు  , సాహిత్య సంస్కృతి అంశాలను వివరించారు . అలానే ధర్మపురి గ్రామానికి ఆ పేరు రావడానికి గల చారిత్రక ఆధారాలను పేర్కొన్నారు .  తర్వాత అంశం గా జానపద సాహిత్యాన్ని పరిచయం చేసారు . జానపద సాహిత్యం ముఖ్య లక్షణం మౌఖిక ప్రసారం . మన పురాణాలు , ఇతి హాసాలులోని కథలలో జానపద మూలాలు అనేకం కనిపిస్తాయి . జానపద కథ రకాలను ఉదాహరించారు .

మరొక అంశంగా తీసుకున్న ధర్మపురి మండలం జానపద కథలు సామాజిక విశ్లేషణ లో జానపద కథలలో ఉన్న సామాజిక అంశాలను , వాటి వెనుక దాగిన్న ప్రయోజనాలు , విశేషాలను వివరించే ప్రయత్నం చేసారు రచయిత . దీనిలో భాగం గా సవతుల కథ , వదినే కథ ,మైరావణుని హతం వంటి కథలు విశ్లేషించారు . 

అదే విధంగా జానపద కథ ఎక్కడా లిఖితం కాకపోవడం వలన రచయిత వాటిని జానపద కళాకారుల నుంచి సేకరించడం జరిగింది . వాటిలో భాగంగా సవతుల కథను జంగిటి లక్ష్మి గారి వద్దను , వదినే కథను  ఈర్ల గంగవ్వ ద్వారా, మంగలి కథ ను పలిగిరి ఇందయ్య వద్ద  విని సేకరించడం జరిగింది . ఆ విషయాన్నే వీరు పుస్తకంలో పొందుపరిచారు .  తాను సేకరించి కథలను ఇతిహాస కథలతో పోల్చి వివరించడం జరిగింది . 

చివరగా జానపద కథ ప్రయోజనాన్ని వివరించే ప్రయత్నం చేసారు . జానపద కథలలో మార్గదర్శకత్వం , సందేశం , సామాజిక పరిస్థితులు యివే కాకుండా శారీరక సమస్యలు వాటికి పరిష్కారాలు వంటి వాటిని తెలియజేసారు . 

ఈ పుస్తకంలో ధర్మపురి మండల జానపద కథలు వివరిస్తూ , జానపద నమ్మకాలు , వాటి ఆచార్య వ్యవహారాలూ అన్నిటిని క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేసారు రచయిత . ఒక్క మాటలో చెప్పాలి అంటే ధర్మపురి మండలం లోని జానపద కథల్లోని సామాజిక  అంశాలు , చారిత్రిక అంశాలు , మానవీయ అంశాలు ,సంప్రదాయాలు , అద్భుత అంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది . అదే విధంగా తర్వాత జానపద సాహిత్యంలో పరిశోధన చేయాలి అనుకునే వారికి ఒక మంచి మార్గ దర్శకంగాను , జానపద సాహిత్యాన్ని ఎలా చూడాలి అనే కోణంలో అంచనా వేయడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది . ధర్మపురి మండల జానపద కథలు తెలుసుకోవాలని అనుకునే వారు  ఈ పుస్తకం  చదివితే ఒక అవగాహనకి రావడానికి ఎంతగానో తోడ్పడుతుంది .

-అరసిశ్రీ

ప్రతులు కోసం :

తాటికాయల భోజన్న .ఏం .ఫిల్ (పి హిచ్ .డి )

ధర్మపురి ,

cell :9704383592

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో