అస్తిత్వ ఉద్యమా నేపథ్యం వన ఎవరి జీవితాన్ని , ఎవరి అనుభవాల్ని వారే చెప్పుకునే చైతన్యం కలిగింది. ఆ ప్రేరణతో స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ వాదం ప్రధానాంశాలుగా తీసుకుని రచయితలు ఈనాడు కథలు రాస్తున్నారు. మైనారిటీ వాదంలో ముస్లిం రచయితలు ముందంజలో వుండి, ముస్లిం మైనారిటీ జీవితానికి సంబందించిన సాహిత్యాన్ని ముస్లిం సంస్క ృతిని , మతాన్ని, సమస్యల్ని, అభద్రతను,హక్కుల్ని వ్యక్తీకరించడం ద్వారా ఆ సమూహానికి చెందిన జీవితాల్ని ఇతరులు అర్థం చేసుకోవడానికి వీలుగా రూపొందింది.
ప్రస్తుత చర్చ నిర్దేశం ప్రకారం ‘హక్కు సాధన దిశగా ముస్లిం మైనారిటీ కథానిక ప్రస్థానాన్ని’ విశ్లేషిస్తున్నాను.రాజ్యాంగంలోని 3వ భాగం 12 నుండి 35 ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కు ఆరు.
అవి:
1) సమానత్వపు హక్కు
2) స్వతంత్య్రపు హక్కు
3) దోపిడీని నియంత్రిచే హక్కు
4) మతస్వాతంత్రపు హక్కు
5) సంస్క ృతీ పరిరక్షణ హక్కు
6) రాజ్యాంగ పరిహారపు హక్కు
రాజ్యాంగం ఇచ్చిన ఈ ప్రాథమిక హక్కులు వున్నా తమకు సమాజంలో సరైన రక్షణ లభించక పోవడాన్ని ముస్లిం రచయితలు గుర్తించారు. హక్కుల పట్ల తోటి ముస్లింలలో అవగాహనా కలిగిచడానికి, వారిని చైతన్యవంతులను చేయ్యడానికి కలం చేపట్టారు.
1.సమానత్వపు హక్కు:
చట్టం ముందు అందరు సమానమే షాపులు , హోటళ్లు , ఆటస్థలాలు వంటి పబ్లిక్ స్థలాల్లో కుల , మత వర్గ, వర్ణ, జండర్ వివక్షత ఉండకూడదు . ముస్లిం రచయితలు తమ అస్తిత్వం కోసం చేసే పోరాటంలో తమను అందరితో సమానంగా చూడాలని , పరాయి దేశస్థులంటూ వేరు చేయవద్దనేది మొదటి అంశం . మైనారిటీలుగా చెలామణి అవుతున్న ముస్లింలకు రాజ్యాంగం సమానత్వం ఇచ్చినా సమాజంల్లో అది ఆమోదం కాలేదన్నా వాస్తవాన్ని కొందరు తమ కలం ద్వారా తెలిపారు .
ఎస్. సికిందర్ భాషా రాసిన ‘వివక్ష ‘ కథలో హిందువుతో సమానంగా ముస్లింను చూడడంలేదని స్పష్టమౌతుంది. భారత దేశంలో వున్న ముస్లింను సంఘవిద్రోహులుగా చూడడం ఇస్మాయిల్ ను కలచివేస్తుంది. హిందూపూర్ లో టెర్రరిస్టు దొరికారాని వారి వద్ద ఆర్ . డి. ఎక్స్ ఉందని పేపర్లో చదివిన ఇస్మాయిల్ వణికిపోయాడు. అదృష్టవశాత్తు ఆ టెర్రరిస్టుల్లో ముస్లింలు లేకపోవడంతో స్వేఛ్చగా గాలి పీల్చు కున్నాడు. ఈనాడు ముస్లిం పరిస్థితి ఇది. స్కైబాబ రాసిన ‘ముంతాజ్ బేగం’ కథలో 12 మంది యువకులను టెర్రరిస్టుఅలని, పాకిస్తానీ ఏజంట్లు అన్న అనుమానంతో పట్టుకున్నారు. వారిలో హిందువుల్ని వదిలి వేసి కేవలం ముస్లిం యువకుల్ని నిర్బందించడమే కాక, నిరపరాధుల్ని నిజం చెప్పమని చిత్రహింసలు పెట్టటడం ముస్లిం పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనం.
2. స్వేఛ్ఛా స్వతంత్రపు హక్కు :
సమూహాలుగా ఏర్పడడానికి, ఉద్యమించడానికి, తమ భావాల్ని వ్యక్తం చేయడానికి, నివసించడానికి , తమకిష్టమైన విద్యను , వ ృత్తుల్ని అవలంబించడానికి అందరికీ స్వాతంత్య్రం వుంది. బాబ్రీ మసీదు సంఘటన , గుజరాత్ అల్లర్లు తరువాత ముస్లింలో ఆభద్రతాభావం చోటు చేసుకుంది. అంతవరకు వున్నా హిందూ ముస్లింల మైత్రి బీటలు వారింది. ఒకరినొకరు అనుమానించుకోవడం మొదలైంది.
రహమతుల్లా రాసిన ‘కిరాలు మఖాన్ ‘ కథలో ముస్లింకు బాడుగకు లభించక పోవడాన్ని చిత్రించాడు. ‘బార్దర్ నల ’ కథలో గుజరాత్ లో ఘోర మరణకాండ చదివి యూసఫ్ భయంతో పిచ్చివాడయ్యాడు. వేంపల్లె షరీఫ్ రాసిన ‘జుమ్మా’ కథలో ముస్లిం యువకులు మసీదులో జరిగిన బాంబు పేలుళ్లతో మసీదుకు వెళ్లి నమాజ్ చేసుకోవాడానికి భయపడ్డారు.
3.దోపిడీని నిరోధించే హక్కు:
తమపై జరిగే శారీరక , మానసిక దోపిడీని నివారించడానికి ,ఆడపిల్ల అమ్మకం , వెట్టిచాకిరీని నిషేధించడానికి ఈ చట్టం రక్షణ కలిగిస్తోంది. నర్గీస్ రాసిన ‘ఆరో అల్లుడు ’ కథలో దుబాయ్ షేక్ ను పెళ్ళాడి, సుఖపడుతుందని తన కూతురిని ఇచ్చి పెళ్లిచేశాడు ఖాన్ బాబా. కానీ యాస్మిన్ దుబాయ్ లో తనను వ్యభిచారంలో దించారని, చిత్రహింసలు పెడుతున్నారని రాసిన ఉత్తరం చదివి పిచ్చివాడైపోయాడు. దుబాయ్ నుంచి కూతురిని తెచ్చుకోలేక తనను మోసంచేసినా వారిని శిక్షించలేక నలిగిపోయాడు. ఎంతోమంది ముస్లింలు ముక్కుపచ్చలారని పిల్లలను షేక్ కు అమ్మివేస్తున్నారు . వారి పేదరికం, నిరక్షరాస్యత వలన తాము మోసానికి దోపిడీకి గురౌతున్నామని , వానిని ఎదుర్కోవచ్చని తెలుసుకోలేకపోతున్నారు.
హుస్సేన్ రాసిన ‘యంత్రం’ కథ మరో కోణం నుంచి దోపిడీని ఎదుర్కునే కథ . బయటి వారి నుంచి కాక తన వారి నుండి అణిచివేతకు దోపిడీకి గురైనప్పుడు చట్టం సహాయంతో ఎదురు తిరిగిన సుల్తానా కథ .
4.మత స్వాతంత్య్రపు హక్కు:
తమ మతాచారాల్ని అవలంబించడానికి ఈ చట్టం వెసులు బాటు కలిగించింది. అక్కం పేట ఇబ్రహీం రాసిన ‘ఫతాప్‌ా’ కథలో నమాజు వేళకు (ఒంటి గంటకు) పని ముగించి వెళుతున్నారని ముస్లీమ్ మహిళను కూలి పనులకు పిలవడం ఆపేశారు . ఆ ఊరి పెద్దలు వారిని పనికి తీసుకోవాలంటే ఆజా ఒంటి గంటకు కాక 2గంటకు పెట్టుకోమని నిర్దేశించారు. ఏమతం వారికి ఆ మతం గొప్పదని, ఎవరి నియమాలు వారికి ఉంటాయన్న సంగతే మరిచారు. అప్చసర్ రాసిన ‘గోరీమా’ కథలో గోరీమా ఇంటి ఆవరణంలో తమ దేవత వెలిసిందని ముస్లింను ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని హిందువు ఆదేశించారు. మెజారిటీ వారి దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక దిక్కులేని వారయ్యారు మైనారిటీలు .
5.సంస్క ృతీపరిరక్షణ హక్కు:
తమ సంస్క ృతిని , ఆచార వ్యవహారాలను , భాషను పరిరక్షించుకునే అవకాశం ఈ చట్టం కలిగిస్తోంది. షేక్ కరీముల్లా రాసిన ‘మదరసాల ’ కథలో మదరసాల లో ముస్లింకు ఉర్దూ, అరబ్బీ నేర్పిస్తారు. ఖురాన్ కంఠతా పట్టిస్తారు . ఇస్లాం నియమాలను , నమాజ్ చేయడం నేర్పుతారు. అక్కడ చదివిన ముస్లిం యువకులు హాఫీజ్ కోర్సులో చేరుతారు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తమ మతాన్ని ఆచారాల్ని తరువాత తరాల వారికీ నేర్పుకుంటున్న ముస్లింలను దేశద్రోహులు గా , సంఘవిద్రోహులుగా ముద్ర వేసి , అక్కడ పాకిస్థానీయులు వున్నారని అపవాదులు వేసి, మదరసాలను కూల్చివేశారు. అక్కడి టీచర్లను , విద్యార్థులను శారీరకంగా హింసించారు.
షేక్ పులివీడు గఫార్ రాసిన ‘ఖబుతరా’ కథలో మూడు తరాల నుంచి అన్యోన్యంగా ఉంటున్న హిందూ ముస్లిం మైత్రికి విఘాతం కలగడాన్ని చిత్రించింది. ఆ రెండు కుటుంబాలు , తమ సంస్క ృతీ ఆచారవ్యవహారాలు కలబోసుకున్నారు. ఇరువురు రెండు మతాలను గౌరవించేవారు. ఒకే కుటుంబంగా వున్నా వారిలో బాబ్రీ మసీదు సంఘటన తరువాత విభేదాలు చోటుచేసుకోవడాన్ని చిత్రించింది ఈ కథ.
6.రాజ్యాంగ పరిహారపు హక్కు:
తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే రాజ్యాంగం ద్వారా రక్షణ పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. హుస్సేన్ రాసిన ‘యంత్రం’ కథే ఇందుకు ఉదాహరణ.
ఈ విధంగా ముస్లిం రచయితలు తమ ప్రాధమిక హక్కుకు భంగం కలగడాన్ని మౌనంగా తమ కథ ద్వారా వ్యక్తం చేశారు. తామూ భారతీయుమని, దేశద్రోహులం కామని పూర్వంలాగా హిందూ ముస్లీములు మైత్రి కొనసాగాలని కోరుతూ ఒక నాటి పరమత సహనాన్ని తెలిపే కథలు రాశారు. ముస్లిం మైనారిటీ కథల్లో అంతఃసూత్రంగా వారి దుర్భర దారిద్య్రం కనిపిస్తుంది. అట్లే మత ఛాందస భావాల్ని వదిలి వేయాలని , తమలో వర్గ భేదాల్ని రూపుమాపాలని, బురఖా, పార్థా ,తలాఖ్ వంటి దురాచారాల్ని వదిలి, వున్నత భావాలు కలిగి వుండాని తమని తాము ఉద్దేశించుకుంటూ రాసిని కథలు వున్నాయి. ఈ విధంగా ముస్లీమ్ మైనారిటీసాహిత్యం సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతోంది.
– ఆచార్య శివుని రాజేశ్వరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~