“కనుమరుగై పోతున్న లంబాడిలా ఆటలు”(సాహిత్య వ్యాసం )-Dr. మురహరి రాథోడ్


లంబాడీలు విరామ సమయాల్లో అనేక ఆటలను ఆడుకునే వారు. లంబాడీల సాహిత్యంలో లంబాడీల, ఆటలు ఒక భాగం ఆనాటి కాలంలో వ్యవసాయంతో పాటుగా అనేక వృత్తులవారు వారి వారి వృత్తులను చేసుకొనేవారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మంగలి వంటి వృత్తులు ఉండేవి. ఆకాలంలో తండాల్లో పాడిపంటలు బాగా పండేవి. అందరు తండాల్లో వారి జీవనాన్ని గడిపేవారు. తండాల్లో విరామ సమయాల్లో, సాయంత్రంపూట లేదా పండుగలకు, పబ్బాలకు అనేక ఆటలను పిల్లలు ఆడుకొనేవారు. ఈ ఆటలు కింది విధంగా ఉన్నాయి.

1. గోళీలాట(గోటిరమేరో):-

గోలీలు తెలియని లంబాడీలు ఉండడు. గోలీలను ఎక్కువగా మగ పిల్లలు ఆడుతారు. ఈ ఆటలో బద్ది ఆటలు ఎవరైతే ముందుగా బద్దీలో గోలీ వేస్తారో వారు గెలిచినట్లు చెప్తారు. రెండు గోలీలలో ఒకటి ఎదురు మరొకటి మేలు అనేవి ఉంటాయి. ఆటలో ఒకరు ఏదో ఒకదాన్ని కోరుకుంటారు. ఆ గోలీని మరో వ్యక్తీ కొడితే వాడు గెలిచినట్లు.

2. దాగుడుమూతలు:-

పిల్లలందరూ ఒక చోట నిలబడి ఒకరిని వెతికే వ్యక్తిగా ఎన్నుకొంటారు. ఆ తర్వాత వాడికి కళ్ళు కనబడకుండా చేతులు అడ్డుపెట్టి అన్నతమ్ములు మారండి అక్కా చెల్లెలు మారండి వీరివీరి గుమ్మడిపండ్లు వీరిపేరేమి అని అంటూ అందరి పేర్లు చెప్పిస్తారు. ఎవరి పేరు చెప్పకపోతే అందరు వెళ్లి దక్కుంటారు. అప్పుడు దాగుడుమూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకా భద్రం అంటూ చేతులను కాళ్ళ ముందు నుంచి తీసివేస్తారు. అప్పుడు ఆ వ్యక్తీ అందరినీ వెతుక్కుంటూ వెళ్తాడు. ఇలా దాగుడుమూతల అట సాగుతుంది.

3. అచ్చంగాయలు:

జానపద స్త్రీలకు ఇష్టమైన అట అచ్చం గాయాలు ఈ ఆటలో ఐదు రాళ్లు, ఏడు, పన్నెండు రాళ్లు ఉంటాయి. ఆడపిల్లలకు ఈ అట అంటే చాల ఆసక్తి, ఉత్సాహంగా ఈ ఆటను అడుకొంటారు.

4. పాచికలు:-

విరామ సమయంలో అలాగే పండుగలప్పుడు పాచికలను ఆడటం చూస్తూ ఉంటాం శివరాత్రి, వైకుంట ఏకాదశి వంటి పండుగలలో కూడా పాచికలను ఆడుతారు. పాచికలు (దయాలు) సాహిత్యంలో కూడా కనబడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతీరోజు తన భక్తుడైన బావాజీతో పాచికలను ఆడేవాడని పురాణాలూ చెప్తున్నాయి. అలాగే మహాభారతంలో కూడా పాచికలు అది ధర్మరాజు సర్వస్వాన్ని కోల్పోయాడని జానపదుల నమ్మకం అందుకే పాచికల ఆటను ఆడటానికి కొంత మంది ఇష్టపడరు.

5. కబ్బడ్డి:-

ఈ అట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇష్టంగా కబడ్డినీ లంబాడీలు ఆడుతారు. మగ, అడ, అనే తేడా లేకుండా ఈ ఆటను ఆడటం విశేషం. ఈ ఆటను గుక్క తిప్పుకోకుండా ఆడాలి.

6. బొంగరాలాట:-

నాటి గిరిజనులు వారి తాండలల్లో ఎక్కడ చుసిన మగ పిల్లలు బంగరాలు ఆడేవారు. నలుగురు ఐదుమంది పిల్లలు గుంపుగా చేరి ఈ ఆటను ఆడుతారు. ఒక గుండ్రటి గిర్రను గీసి దానిలో అందరూ గుంపుగా బొంగరాలను పెడ్తారు. అందులో ఒక పిల్లవాడు బొంగరాన్ని తీసుకొని దారంతో దాన్ని చుట్టి గుంపుగా పెట్టిన బంగరాలను కొడ్తాడు. ఏ బొంగరాన్ని బయటకు వస్తే ఆ బొంగరం వక్త బొంగరాన్ని చుట్టి మిగిలిన బొంగరాన్ని వేసి ఎక్కువ సేపు తిప్పితే వారు గెలిచినట్లుగా కూడా మరొక ఆటను అడుతారు.

7. సత్తాడి (మరేరో):-

దీనికి పది పెంకు బిళ్ళలు ఒక బంతి అవసరం. ఆటలో ఎంతమంది అయినా ఉంటారు. పెంకు బిళ్ళలను ఒక వ్యక్తీ బంతితో కొడ్తాడు. అలా కొట్టినప్పుడు కిందపడిన బిళ్ళలను గబగబమని వరుస క్రమంలో నిలబెట్టాలి. బంతి వచ్చే లోపల ఎత్తి పెట్టకపొతే బంతితో అతడిని కొడ్తే అతను ఆటనుంచి పక్కకు తప్పుకోవాలి. పెంకులను వరుసక్రమంలో పెట్టి సత్తడి, సత్తడి అని అరుస్తారు. ఇలా అరవడం ఈ ఆటలో ప్రత్యేకత. అందుకే ఈ ఆటకు సత్తడి అనే పేరు వచ్చింది.

8. కుంటి అట(లండి):-

ఒంటి కాలితో కుంటుకుంటూ నడుస్తూ ఈ ఆటను ఆడుతారు. ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలు అడుకొంటారు. గుంపులోని వారిని ఎవరిని అంటితే వారు ఈ ఆటలో బయటకు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకో జట్టు ఈ ఆటను ఆడుతుంది. ఎవరి జట్టును ఎక్కువ పాయింట్లు వస్తే ఆ జట్టు గెలిచినట్లుప్రకటిస్తారు.

9. కోడి కాంకర(కచ్కాగాయలాట):-

ఈ ఆటను పిల్లలు ఏడు లేదా తొమ్మిది రాళ్ళతో ఆడుతారు. అడ పిల్లలు రాళ్ళను ఎగరేసి చేతి మట్టపైన పడవేసి వాటిని మళ్ళీ అందుకుంటారు. ఆ విధంగా అందుకున్న వాటిని ప్రక్కన పెట్టుకుంటారు. ఎవరు ఎక్కువ రాళ్ళను అందుకుంటే వారు కచ్చకాయలాటను గెలిచినట్లుగా గుర్తిస్తారు.

10. హడేల్ హప్:-

“హడేల్ హప్ తిందు ఖారే తీన్ పోళీ ఉస్ కేర్ కాన్ అని బియ్యర్ కాన్ జల్ల” అని జట్టు నాయకుడు ఆప్త పడగానే ఒక చేతితో ప్రక్కన ఉన్నవారి చెవిని పట్టుకోవాలి.ఈ పాట అయిపోయేవరకు పిల్లలు ఒకరి చెవిని మరొకరు పట్టుకుంటూనే ఉంటారు. ఆ తర్వార కాన బాజు చుంచాగాడర్ బయి చుంచా అనుకుంటూ అందరూ ఉగుతారు.

11. కత్రిక్ దూర్ చందా దూర్:-

ఈ ఆటలో కూడా అడ పిల్లలందరూ వలయాకారంగా నిలబడతారు. నిలబడిన పిల్లల్లో ఒకరు నాయకురాలుగా వ్యవహరిస్తారు. ఈ నాయకురాలిని చేతుల్లో మిగత పిల్లలు మట్టిని పోసి అందులో ఒక పుల్లను గూచ్చి పాట పాడుతారు.

12. ఛరీ అళావు కాక్డి కాటు:-

ఈ ఆటలలో రైతుకూ, రాజుకూ జరిగే సంభాషణ పాట రూపంలో ఉంటుంది. ఈ పాటలో లంబాడి పిల్లవాడు ఒక స్తంభంను పట్టుకొని కూర్చుంటాడు. ఆ పిల్లవాడ్ని పట్టుకొని పిల్లలు ఒకరి వెనుక ఒకరు వరుసగా కూర్చుంటారు. ఒక పిల్లవాడు రెండు కట్టే పుల్లల్ని పట్టుకొని కత్తిని పదును పెడుతున్నట్లుగా స్తంభం చుట్టురా పిల్లల చుట్టురా తిరుగుతూ ప్రశ్నలు వేస్తుంటే మరొకరు జవాబులిస్తుంటారు.

13. తొక్కుడు బిళ్ళ:-

ఈ ఆటను ఆడపిల్లలు ఆడుతారు. రెండు వరుసలుగా నాలుగు గాని లేదా ఐదు గాని పెట్టెలను నేలపైన గీసుకొంటారు. ఇద్దరు పిల్లలు ఈ ఆటలో ఉంటారు. ఇద్దరూ కలిసి పెట్టె పెట్టెకు బిళ్ళను వేసుకొంటూ పెట్టెలను దాటుకుంటూ వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ బిళ్ళను ఎత్తుకుని బిళ్ళ వేసిన పెట్టెను దాటి పక్క పెట్టెలో అడుగుపెట్టి రావాలి. చివరగా వెనక్కు తిరిగి బిళ్ళను పెట్టెలోకి విసిరి వేస్తారు. ఏ పెట్టెలో బిళ్ళ పెడితే ఆ పెట్టె వారి సొంతం అవుతుంది. ఆ తర్వాత ఆడే వ్యక్తీ ఆ పెట్టెను తొక్కకుండా ఆట ఆడాలి. ఇలా తొక్కుడుబిళ్ళ ఆటను ఆడుతారు.

లంబాడీల ఆటలను గమనించినట్లయితే ప్రతీ ఆటను గుంపుగా అందరూ కలిసి ఆడుకోవడం వాళ్ళ ఐక్యత పెరుగుతుంది. స్నేహ సంబంధాలు ఏర్పడుతాయి. ఒకరినికరు అర్థం చేసుకొనే సమయం ఆటల వళ్ళ దొరుకుతుంది. ఆచార వ్యవహారాలకు, ఉత్సవాలకు, మనోభావాలకు లంబాడీ ఆటలదర్పణాలు. ఆటలు శరీరానికి కాక మనస్సుకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. లంబాడీ ఆటలన్నీ సాముహికమైనదే. పెద్దలు, పిల్లలు వ్యవసాయ పనులనుంచి వచ్చి తర్వార సాయం సమయంలోని వెన్నెల్లో సాధారణంగా ఆటలు ఆడుతారు. ఆటలవల్ల శరీరానికి, మానసిక వ్యాయామంతో పాటు తెలివితేటలు పెరుగుతాయి. అందుకే పిల్లా, పెద్దా, ఆటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

ఇంకా ఆటలవల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్థుతం ఈ ఆటలు పిల్లలకు తెలియవు. T.V లు ఇంటర్నెట్ లు, సెల్ ఫోన్ వంటి వాటి ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోను, పాఠశాలల్లోనూ ఈ ఆటలను పిల్లల దగ్గర ఆడించి ఈ ఆటలు కనుమరుగయి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

ఉపయుక్త గ్రంథాలు:-
1. వేదవతి, సి 1985 సామేతలు నుడి-నానుడి,
మచలీపట్నం పద్మావతి పబ్లికేషన్స్.
2. సిల్మానాయాక్, ఎ. 2011 నల్లగొండ జిల్లా బంజారా మౌఖిక కథలు, ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం, హైదరాబాద్.
3. శంకరయ్య, జనపాల. 1995 కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు, స్వీయ ప్రచురణ, హైదరాబాద్.
4. సుర్యదనంజయ్, నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం – జీవన చిత్రణ, శీతల్ పబ్లికేషన్స్, హైదరాబాద్ 2009.
5. సుందరం, ఆర్వియస్ 1983 ఆంద్ర జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
6. డాక్టర్ మురహరి రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా లంబాడి సాహిత్యం వేదాన్ష్ సాహితీ పబ్లికేషన్స్ 2019.

-Dr. మురహరి రాథోడ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో