నిశ్శబ్ధం(కథ )-శివలీల కె

వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆమె, తనేంటో సులువుగానే మార్చిపోయింది. భార్యగా రొటీన్ బాధ్యతలను నెత్తినేసుకుంది.

కొత్త మార్పులని ప్రేమించింది. అదనపు బరువుని అలవోకగా మోసింది.
అతనే సర్వస్వం. అతని గెలుపు ఆమెదే. తన ప్రతిరూపంలో అతణ్నే చూసుకుంది తృప్తిగా.

అతను, అంచెలంచెలుగా పైకెదిగాడు. నీవే కారణం అన్నాడు.
విజయానికి చేరువయ్యాడు. గెలుపు తనసొత్తన్నాడు.

ఇప్పుడు,
అందలంకోసం పైపైకెక్కుతూ ఆకాశంలో అతను.
అగాథంలో కూరుకుపోతూ అతని కాళ్లదగ్గర ఆమె.
ఎందుకో కిందకు చూశాడు ఆమె చూపెప్పుడూ పైకే.

చూపులు కలిశాయి.
అతని కళ్లలో ఛీత్కారం. గతాన్నిమరిచాడతను.
ఆమె కళ్లలో విస్మయం. నిజాన్ని నమ్మలేకపోతోంది.
ఇప్పుడు వారిద్దరిదీ నిశ్శబ్ద సాంగత్యం. వారి నడుమ అంతులేని అగాథం.

ఆడీ కార్లో ఓ పక్కగా ఒదిగి కూర్చుని, విండోలోంచి బయటికి చూస్తోంది నీరజ. ఏదో గుర్తొచ్చినట్టుగా భర్తవైపు చూసింది. ఫోన్ లో తలదూర్చి విజయ్.

వారి మధ్యదూరం రెండుబారలే. మనసుల మధ్య ఏ ధ్వనీ చేరుకోనంత శూన్యం. పలకరించాలనిపించలేదు. ముఖం తిప్పుకుంది. ఏదో వెలితి. కళ్లముందే తన ప్రపంచం తలక్రిందులైపోయింది. ఏం చేయలేని నిస్సహాయత. మనసంతా పచ్చిపుండులా ఉంది. మందువేసేదెవరు. ఎవరో వస్తారని ఎందుకు ఎదురు చూడాలి. ఈ ఊబిలోంచి బయటికి రాగలదా. వచ్చినా మరో ప్రపంచాన్ని అల్లుకునే శక్తి తనకిప్పుడు ఉందా.

 

“కర్రీ ఎలా ఉంది” ఆ స్వరంలోని మాధుర్యం సంగీత సాధన లేకపోయినా చెక్కుచెదరలేదు.

“……” మౌనమే సమాధానం.

అతడి కుడిచేతిలో స్పూన్. ఎడం చేతిలో ఫోన్. స్క్రీన్ పై చకచకా కదులుతున్న మెరికల్లాంటి కళ్లు. అచ్చం పెద్దసైజు బాదాంగింజల్లా. కళ్లార్పడం మర్చిపోయింది. చూస్తుండిపోయింది. ఇంకా ఇష్టపడుతోందా ఇతణ్ని. కర్రీ వంకతోనైనా మాటలు కలపాలని ఆరాటపడుతోందా? కనీసం మాట్లాడడే. కళ్ళెత్తి చూడనూ లేదే. చిన్నబోయింది.
అలలు తన పాదాలను ముద్దాడకుండానే వెనుతిరిగితే కలిగే నిరాశ.

మళ్లీ అడగితేనో. చిన్నతనం కదూ. తన ఉనికికే ప్రశ్నార్థకం. అసలు తనకో ఉనికి ఉంటే కదా. ఎగ్జిస్టెన్స్ క్రైసిస్లో కొట్టుమిట్టాడింది నీరజ. కుంచించుకుపోయింది. లోలోపలే.
ఆత్మన్యూనత. మస్థిష్కాన్ని ఆక్రమిస్తోంది. స్లో పాయిజన్లా.

ఎగ్జాట్లీ! అదే కావాలతనికి. అలాంటి స్థితిలోనే ఆమెను లాక్ చేయాలి. క్రీగంట చూశాడామెను. చివరిముద్ద నోట్లో పెట్టుకుంటూ. గమనించింది. ఆమె కళ్లనిండా నీళ్లు. గుండెను పిండేసేంత బాధ గుప్పుగుప్పుమంటూ బయటికొచ్చేస్తుంది. రానివ్వకూడదు. గొంతులోనే సమాధి చేయాలి. సాధ్యమేనా. డైనింగ్ టేబిల్ అంచుపై చూపునిలిపింది. సాధ్యపడలేదు. ఇంత బాధ. ఎందుకు భరిస్తోంది ఇంకా. బిడ్డకోసమా?

పెళ్లైనప్పటినుంచీ ఇదే తంతు. నెవరెండింగ్ ఎమోషనల్ అత్యాచార్. డిన్నర్ ముగించాడు. అలాగే నుంచుంది. దీర్ఘంగా, శబ్ధం చేస్తూ శ్వాసపీల్చుతూ లేచాడు. అంతకన్నా సుదీర్ఘంగా శబ్ధం చేస్తూ పెదాలను సున్నాలా చుట్టి నిట్టూర్చాడు. అదో సరదా. తప్పించుకోలేదని తెలిసిన తర్వాత ఎలుక ముందు తీన్మార్ ఆడుతూ పిల్లి అనుభవించే రాక్షసానందం. నీరజ వంక చూస్తూ బర్రుమని డైనింగ్ టేబిల్ కుర్చీని జరిపాడు. కళ్లు కలిపింది. అయిష్టంగానే. హేళన, విసుగు, ఏహ్యం కలగలిపినట్టుగా ఉందతని చూపు. మరింత కుంగుబాటు ఆమెలో. హ్యాండ్ టవల్ చేతిలో తీసుకుని ఆమెకు దగ్గరగా వచ్చాడు.ఏం చేస్తాడు. నాప్కిన్ తో గొంతునులిమేస్తాడా. పోనీ, రోజూ చచ్చేబాధ తప్పుతుంది. ఆ క్షణంలో బిడ్డను కూడా మర్చిపోయింది. అలాగే నిలబడింది. ఆమె కళ్లలో ఇప్పుడు ఏదో తెలియని మొండితనం. తెగింపు.

“నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకున్నావా ఎప్పుడైనా… ” గట్టిగా నవ్వుతూ, హ్యాండ్ టవల్ డైనింగ్ టేబిల్ మీద విసురుగా పడేశాడు. ఆ ధాటికి వాటర్ బాటిల్ కిందపడింది. ధారలా నీళ్లు కారుతున్నాయి. నీళ్ల మధ్య చిక్కుకున్న కంచం వైపు చూస్తూ ఉండిపోయింది నీరజ అశక్తురాలిలా.

ఏం కోరుకుంది చిన్నప్పటినుంచీ. తనకంటూ ఒక ఉనికి. తనని మనిషిలా చూసే మరో మనిషి. పారలల్గా ఇంకో థియరీ. పెళ్లి తర్వాత భర్తే ముఖ్యం. అతను చెప్పేదే శాసనం. పేరెంట్స్ బ్రయిన్వాష్ చేస్తూనే ఉన్నారు. భర్త ఏమన్నా భరించాలి. ఎదురుచెప్పకూడదు. పర్సనల్ ట్రయినింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్. వాళ్లని ప్రశ్నించలేకపోయింది. మెల్లగా ఆ గుణాన్నేకోల్పోయింది. పెళ్లైంది. అల్లుకున్న ప్రపంచాన్నితనంతట తానుగా ట్రాష్ చేసింది. ట్రయినింగ్ ఎఫెక్ట్ అది. పర్సనల్ స్పేస్ని ఫ్రీగా అప్పగించేసింది. కొంచెం ఎట్రాక్షన్, మరికొంచెం ప్రేమ. రిజల్ట్. తన ఎగ్జిస్టెన్సే ఎవోపరేట్ అయింది. టోటల్లీ.

రోజులు ఏ శబ్ధమూ లేకుండా గడుస్తున్నాయి. ఓ సాయంత్రం, బిడ్డకి అన్నం వడ్డిస్తోంది.

“అమ్మా, నీకేమొచ్చు?”

“నేను బిజినెస్ ఎనలిస్టును రా.” తెలియని ఉత్సాహం. తన గొంతు చాలా కొత్తగా వినిపించింది.
అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడతను. వాళ్ల సంభాషణ విన్నాడు. కట్ చేసి పడేయ్యాలి ఇప్పుడే. కసిగా అనుకున్నాడు.

“బేటా, డోన్టాక్ టు డమ్బ్ పీపుల్. యూ సిల్లీ… కమాన్, వీడియోగేమ్ ఆడదాం పైకొచ్చేయ్.” మెట్లెక్కుతూ క్యాజువల్గా అంటూనే తెలివిగా కొడుకును ట్రైనప్ చేస్తున్నాడు. బిడ్డముందు తనని తీసిపారేసినట్టుగా మాట్లాడడం భరించలేకపోయింది. కడిగేయాలనిపించింది. బదులుండదు. ఏలా ఎదుర్కోవాలి. నిస్సహాయత తెరలుతెరలుగా. మళ్లీ నిశ్శబ్ధం. విషంలా పరుచుకుంటోందా గదిలో. నీరజ హావభావానే గమనిస్తూ నెమ్మదిగా మెట్లక్కుతున్నాడతను. షూ శబ్ధం తప్ప ఇంకేం వినబడలేదు. ఎప్పటిలా తనే విజయం సాధించాననుకున్నాడు.

“కమాన్ డాడ్. మామ్ ఈజ్ నాట్ డంబ్. షి నోస్ మెనీ ధింగ్స్. హెంవర్కులో హెల్ప్ చేస్తుంది. నాకు వోకల్ కాంపిటిషన్ లో ఫస్ట్ రావడానికి మమ్మీనే రీజన్.

నిస్సంకోచంగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చాయా మాటలు.పదేళ్ల తనకొడుకు తనకు తెలియకుండానే తన భార్యకు దగ్గరవుతున్నాడు. ఆగిపోయాడు. అవాక్కయ్యాడు. వెంటనే సర్థుకున్నాడు. కొడుకు దృష్టిలో తేలికపడకూడదు. మొగ్గలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. చిరునవ్వుతో కొడుకునే చూస్తూ, మెట్లన్నీ దిగాడు. కిందకొచ్చాడు.

“యస్ మై సన్. షి నోస్ మెనీ థింగ్స్. ఆఫ్టరాల్ హు ఈజ్ షి. మై వైఫ్. ది గ్రైట్ విజయ్స్ వైఫ్. డాడీ ఎవరినైనా ఇంటెలిజెంట్ చేసేస్తాడు రా బేటా. చూశావా మీ డమ్బ్ మామ్ కూడా నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలా మారిపోయిందో. ఓ సారీ… డిడై సే డమ్బ్ ఎగైన్…” అన్నాడు చివరి మాటల్ని వత్తి పలుకుతూ. పిల్లాడివైపు చూసి కన్నుగీటాడు.

“ఓ… నువ్వు పాడతావుకదూ. పెళ్లికి ముందు ఏదో టైటిల్ కూడా గెలిచావ్. పిల్లలకు నేర్పుతున్నావటగా కొత్తగా. డ్రైవర్ అన్నాడులే. స్పేస్ తీసుకుని పెద్దగా ప్లాన్ చేయొచ్చుగా. అవన్నీ చేయాలంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలికదా. నీ కంత సీన్లేదులే.” నీరజకు మాత్రమే అర్థమయ్యేట్టుగా పెదవి చివర్లు వంపుతిప్పుతూ వెటకారంగా అన్నాడు.

మళ్లీ నిశ్శబ్ధం. నిశిధీలా కమ్మేసింది. ఒక ఆలోచన. మెరుపులా మెరిసింది, నీరజ కళ్లలో వింతవెలుగు. ఫోనందుకుంది.

“నాకో కమర్షియల్ స్పేస్ కావాలి. హండ్రెడ్ సిట్టింగ్…” బ్రోకర్ కి రిక్వైర్మెంట్ చెబుతోంది తను.

పదునైన ఆ మాటలు నిశ్శబ్ధాన్ని కసకసా కోస్తున్నాయి.

స్థానువులా నిలబడిపోయాడు విజయ్. ఊహించని మలుపది. దీనికింత కాన్ఫిడెన్సా. అతని కళ్లలో విస్మయం కోపంలా మారుతోంది. బాదం గింజల్లాంటి కళ్లు చింతనిప్పులు కురుస్తున్నాయి. ఫోన్ కట్ చేసింది.

“ఆర్ యూ సీరియస్…” వ్యంగ్యంగా అన్నాడతను.

“……”

అతనికి చాలా ఇష్టమైన నిశ్శబ్ధం. చిరపరిచితమైన నిశ్శబ్ధం. ఇప్పుడామెనుంచి. భరించలేకపోయాడు. ఏదో అనబోయాడు. చూపు తిప్పేసింది. ఆ చూపులో వేయికోట్ల దీపాలకు సరిపడా కాంతి. స్పష్టంగా గమనించాడు. ఊపిరాగినంతపనైంది. ఆమె ముందుకు నడిచింది. ఓ మహాయఙ్ఙాన్ని తలపెట్టబోయే మునిలా చాలా స్థిరంగా ఉందామె నడక. ఇప్పుడు ఆమె నిర్మించబోయేది మరోప్రపంచం. తను చిన్నప్పటినుంచీ కలలు కన్న సామ్రాజ్యం.

-శివలీల .కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో