ఇక ఇంతేనేమో… (కవిత )-నవీన్ హోతా

 

 

 

 

నాకేం తెలుసు
అక్షరాలు పుట్టిందే
నిన్ను వర్ణించడానికని
పదాలుగా పెరిగిందే
నీ దారిలో నవ్వడానికని
భావాలుగా విరిసిందే
నిన్ను అల్లుకుపోవడానికని
కావ్యాలుగా మారిందే
నిన్ను నింపుకోవడానికని

ఇప్పుడిలా తెలుసుకున్నాక
నీకై ఓ పదమో
ఓ పద్యమో
ఓ కవనమో
ఓ కమ్మని గీతమో
రాద్దామనుకున్నా

గతి తప్పిన నా గమనాన్ని
నీకు అంకితమిద్దామనుకున్నా
శృతి లేని నా స్వరాన్ని
నీ పేరు పలుకుతూ సప్త స్వరాల
సరిగమలుగా మారుద్దామనుకున్నా
వివర్ణపు నా జీవితాన్ని
నీ వసంత శోభలో పండించుకుని
అక్షయవర్ణాల అలంకారమవ్వాలనుకున్నా…

ఎలా వచ్చావో
అలానే వెళ్ళిపోయావు
నా కన్నులను ఆ దిశకు అప్పచెప్పి
మళ్లీ ఇంత మౌనాన్ని ముసుగేసుకున్నా
దిక్కులనంతా వెలిగించిన గుండె దీపాలను
మళ్లీ ఎదలోకి పంపించి
నిశిని వస్త్రంగా చుట్టుకున్నా…!!

-నవీన్ హోతా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో