తీర్పు (కవిత) -సుధా మురళి

రేపటిని గతానికి ఇచ్చేద్దాం వస్తావా
అడిగింది నా మనసు
అది ఎలా సాధ్యం
కొన్ని కలల్ని కనాలికదా
నా డోలాయమానం
కనాలంటే పురిటినొప్పులు పడాలి కదా
మనసు ప్రశ్న
ఎక్కువ బాధగా ఉంటాయా
నా సందేహం
జీవాన్ని చీలుస్తాయి
నరాల్ని మెలేస్తాయి
మనసు జవాబు
కష్టం
ఓర్చుకునేంత శక్తి నా దగ్గర లేదు
నా నిస్సంసిద్ధత

అందుకే రా
రేపటిని గతాన కలిపేద్దాం
జ్వలించడం రానప్పుడు
చలించడం ఎందుకు
ఈదడం చేతకానప్పుడు
దిగడం ఎందుకు
సర్దుకోవడం నేర్వనపుడు
సంగమించడం ఎందుకు
తేల్చుకోవడం కష్టం అయినప్పుడు
ముందడుగు వేయడం ఎందుకు
నీలా మాత్రమే మిగలాలి అనుకున్నప్పుడు
మరో ప్రయత్నం ఎందుకు
ఇన్ని ఎందుకుల మూలాల్ని వేతకలేనప్పుడు
మరిన్ని తిమిరాల వేటలు ఎందుకు

వచ్చేయ్
రేపటిని గతానికి రాసిచ్చేద్దాం
మనసు ఖరాఖండీ తీర్పు….

-సుధామురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

3 Responses to తీర్పు (కవిత) -సుధా మురళి

  1. buchi reddy gangula says:

    bhaagundhi madam

  2. Vinay kumar says:

    చాలా బాగుంది మేడం

  3. ramani says:

    సుధా గారు మీ తీర్పు…కవిత బాగుంది