కనపడని ఆదర్శం(కవిత )-కోసూరి జయసుధ

నన్ను చుట్టేస్తున్న ప్రతిసారీ అనిపిస్తుంది..
నువ్వో అనురాగపు తీవెవని.. !!

ఆదర్శ దాంపత్యానికి అందమైన చిరునామాలా..
నువ్వూ నేను.. !!

నా పేరు పలకడమే నీ పెదవి చేసుకున్న అదృష్టమంటే..
ఆర్తిగా నీ పాదాలు చుట్టేసాను.. !!

అంత అనురాగమూ, కొన్నాళ్ళకి ఆవిరైపోతే..
అలవాటయిన ఆత్మీయతను నీలో రోజూ వెతుకుతూ గడిపేస్తున్నా..!!
ఎందుకంటే..
మనం ఇప్పటికే సమాజంలో “ఆదర్శ దంపతులు” ట్యాగ్ ని మోస్తున్నాం కాబట్టి. !

మన గుమ్మానికి వేలాడదీసిన ఆ అక్షరాలను రోజూ దిద్దుతూ నేను.. !!

నీ అనుమానం నానీడను కూడా వెంటాడుతుంటే..
ప్రేమనే ముసుగులో దాన్ని కప్పెట్టి నవ్వేసాను.. !!
ఎందుకంటే..
మనం ఆదర్శ దంపతులo.. !!

లోకానికి తెలియని ఎన్నో ముఖాల్ని నీలో చూస్తూ..
అన్నింటినీ భరిస్తూ..
తుడుచుకున్న కన్నీటి కొంగును నడుమున దోపేసాను.. !!
ఎందుకంటే మనది “ఆదర్శ దాంపత్యం “.. !!

ఈ కనపడని ఆదర్శాన్ని మన దాంపత్యవనం లో

కన్నీళ్లతో ఎన్నేళ్లని పెంచను.?

                                                                             — కోసూరి జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

3 Responses to కనపడని ఆదర్శం(కవిత )-కోసూరి జయసుధ

  1. మనోహర్ says:

    బాగా చెప్పారు…జయసుధ గారు

  2. నరేంద్ర says:

    మనసులో కుమిలే వేదన నీ చక్కగా వివరించారు

  3. జాహ్నవి says:

    మీరు చెప్పింది అక్షర సత్యం జయసుధ గారు..మంచి కవిత