కర్నూలు జిల్లా జాతర్లలో ప్రదర్శన కళలు (సాహిత్య వ్యాసం )- ఏం .నాగమ్మ

ISSN-2278-478

జనపదం అంటే పల్లెటూరని, జనపదంలో నివసించే వారు జానపదులనీ, వారు పాడుకొనే పాటలు  గాని, ఆటలు  గాని, నృత్యం గాని జానపద కళారూపాలు  అని అంటారు.

నిర్వచనాలు :

1. ‘‘ మానవ కల్యాణానికి కారణభూతమైంది కళ ’’ ` లియోటాల్‌స్టాయ్‌
2. ‘‘మనస్సు రంజింపజేయడమే కళ ’’ Art is for Arts sake అనడం అందుకే ‘‘ జీవితాన్ని దర్శింపచేసేదే కళ ’’ ` అరవిందు
3. ‘‘ Art is activity arising even in the animal kingdom and surprising from sexual desire and the prosperity to pay and be accompanied by a pleasurable excitement of nervous system”- Gran Allon..
4. “ Art is external mainfestation by means of lines, edours, movements, sounds or words of emotion felt by man” – veron
5. “ Arts is the production of some permanent object or passing action which is fitted not only to supply an enjoyment to the producet, but to convey a pleasurable imprssion to a number of spectarors or listeners” – leo toistoy (జానపద విజ్ఞానాధ్యయనం,జి.ఎ.స్‌ మెహన్‌, ప.298)

5.1 జానపద కళలు  – ఆవిర్భావం:

ప్రకృతికి సంబంధించిన ఎండ, వాన, గాలి, చలి, కొండు, గుట్టు పశుపక్ష్యాదులు మొదలైన వాటి చేత కలిగిన భయభ్రాంతులు  వలన  ఆది మానవుడు తనకు తెలియని ఏదో ఒక అతీతశక్తి తనను ఆదరిస్తుందని తలచాడు. ఆ అతీతశక్తినే దేవుడుగా సృష్టించుకొని ఆరాధించడం మొదలు  పెట్టాడు. సూర్యుని వేడి మనుష్యులను వెంటాడేది. వాటి నుండి రక్షణ పొందడానికి సూర్యునికి సూర్యనమస్కారాలు  చేయడం, ఎండకు మగ్గిన వారికి వర్షం రావడం ద్వారా వారు జల దేవతకు  మొక్కడం ఇలా ఎవరికి వారు వారి ఇష్ట దైవాలైన సూర్యుని, జల దేవతలను ఆరాధించేవారు. ఇంకా కొంతమంది ప్రకృతి దేవతలను ఆరాధించడం ఇలా సంతోషాన్ని పట్టలేక ఎవరి నోటికి వచ్చిన పదాలను వారు సమకూర్చుకోనేవారు. గొంతెత్తి పాడేవారు. ఆనందంతో అవయవాలు  చలించాయి. ఆడ,మగ అనే తేడాలు  లేకుండా ఆనందంతో వారి నోట పాటనారంభించారు. ఇలా అటవిక జాతి నుంచి జానపద కళకు పునాది వేయడం జరిగింది. . ఆ ఆరాధనా సమయంలో భక్తితో పాటలు  పాడుకున్నాడు. ఆనంద పరవశ్యంతో ఒళ్ళు తెలియక గంతులు  వేశాడు. భగవదనుగ్రహం కోసం ఎన్నో ఆరాధన క్రమాల్ని అనుసరించాడు. ఆ ఆరాధనే ఒక కళగా, వృత్తిగా స్వీకరించాడు. ఈ కళ మన సంస్కృతిలో భాగంగా స్థిరపడిరది.

5.2 కర్నూలు  జిల్లాలోని జానపద ప్రదర్శన కళలు :

జానపద ప్రదర్శన కళలు  తరతరాలుగా మానవ సంస్కృతిలో ఒక భాగంగా ఉన్నాయి. అవి అన్ని ప్రాంతాలోనూ కనిపిస్తాయి. జిల్లాలో ప్రదర్శన కళలు  చాలా ఉన్నాయి.1. గంగిరెద్దులాట 2. పులివేషం 3. హరిదాసు 4. బుడబుక్కలవారు 5. పాము వాళ్ళు 6. గొరవయ్య నృత్యం 7. కోలాటం 8. హరికథ 9. ఎలుగుబంటి వేషం 10. కోతులాట 11 గొబ్బిళ్ళు. అక్కడక్కడ కొన్ని కులాల  పేరుతో చేసే కళలు  కర్నూలు  జిల్లాలో కన్పిస్తాయి. గొరవయ్యలు (కురువ), బుర్రకథ, డప్పులు , (బుడగ జంగాు)వారు వాయించడం ఇలా కులానికి సంబంధించిన కళున్నాయి. కొన్ని కళలు  ధార్మిక కార్యకలాపాల్లో భాగమై ఉండటం వ్ల కొన్ని కళలు  సజీవంగానే ఉన్నాయి. కొంతమంది కడుపు నింపుకోవడానికి ఈ కళలను వంశపారంపర్యంగా చేస్తున్నారు. చాలీచాని బ్రతుకు బ్రతుకుతున్నారు. ఈ జానపద ప్రదర్శన కళలు  కొన్ని పండుగల్లోను, జాతర్లలోను కన్పిస్తాయి. కాని నేడు సినిమాలు , టీవి ప్రభావం వలన  కొన్ని కళలు  గతించిపోగా మరి కొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు  జిల్లాలో ప్రత్యేకంగా గొరవయ్య నృత్యం, నందికోలు  సేవ మాత్రం కేవం కర్నూలు  జిల్లా వరుకు పరిమితమైనవిగా చెప్పుకొవచ్చు.

గొరవనృత్యం :
‘ గొరవ ’ శబ్దానికి వివిధ నిఘంటువులో శైవ భిక్షువులు , మైలార దేవుని కొలుచువాడు శివభక్తుడు, భిక్షగాడు అనే అర్థాల్ని సూచించాయి.’’జానపద నృత్య కళాకారుల్లో విచిత్రమైన వేషధారణతో కనిపిస్తూ, ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు గొవయ్యలు . మల్లయ్యస్వామి భక్తులుగా  పిలవబడే వాళ్ళే గొరవయ్యలు . వీళ్ళనే గొరమ, గురమ, గురవయ్యలు , గొరవయ్యలు , గురుప్ప స్వాములు , మల్లయ్యస్వామలు   వివిధ నామాలతో పిలుస్తారు. దక్షిణ కర్ణాటకలో గొరవయ్యల్ని ‘‘ గొరవ, వగ్గయ్య, గొగ్గయ్య, గడబడయ్య అనే పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో పార్వతయ గొరమ, మైలార గొరమ అనీ, మైసూరు జిల్లాలో  మల్లికార్జునుని ఆరాధించే వాళ్ళను పార్వతీయ గొరవనీ, ధార్వాడ జిల్లాలో మైలారు గొరవని, మహారాష్ట్రలోని మల్లాది భక్తులైన గొరవయ్యను ‘‘ వ్యాఘ్యలు ’’ అని పిలుస్తారు.’’రామాచార్యులు .డా.బి, జానపద విజ్ఞాన వ్యాసావళిలో తెల్పారు. వీరు ఢమరుకం వాయిస్తూ, పిల్లన గ్రోవిని ఊదుతూ ఇల్లిల్లూ  తిరుగుతూ భిక్షాటన చేస్తూ భిక్ష వేయగానే సాంబణివా ! మైలారలింగ ఏళ్ళుకో ’’ అంటూ దీవించే గొరవయ్యలు  కర్నూలు  జిల్లాలో అధికంగా కనిపిస్తారు.

రచయిత అభిప్రాయాలు :
తెలుగు సాహిత్యంలో పాల్కురికి  సోమనాధుడు, నన్నెచోడుడు, శ్రీనాథుడు మొదలై కవులు  గొరవ శబ్దాన్ని ప్రస్తావించారు.

పాల్కురికి సోమనాథుడు:
‘‘ గొరమమ్మెత్త పత్తిరి బూజసేయ/ మరులెత్తివచ్చితో యురుతరాటవి ’’ అని బసవపురాణం లోనూ
నన్నెచోడుడు : ‘‘ గొరవ గుచుగాకాతని గొరితనము/ సేసెదటగౌరి నీవెంత చేట్లపురువో ’’ అని కుమారసంభవం లోనూ

శ్రీనాథుడు :
‘‘ గొరగమై మైలారు గొనియాడు నొక వేళ/ నొసలిపై బండారు పసుపు దాల్చి – కాశీఖండం
‘‘ వీరు మైలారదేవ వీరభటు/ గొండ్లి యాడిరచుచున్నారు గొరగపడుచు నాడుచున్నది ` అని శ్రీనాథుడు క్రీడాభిరామంలోనూ ప్రస్తావించటం, గొరవయ్య ప్రాచీనతను చాటుతూ ఉంది.
గొరవ శబ్దం పై వివిధ రచయిత అభిప్రాయం :

‘‘ గొరగ గొరవ ‘‘ గురువు ’’ శబ్ద సంబంధం కన్న ‘‘ గొర్గ ’’ శబ్దాన్ని గూర్చి వివరించలేదు. బహుశా గొర్గ శబ్దం గొరగ, గొరవగా మారి ఉంటుందని భావించవచ్చు ’’ – జి.ఆర్‌. వర్మ

‘‘ గురువు అనే సంస్కృత శబ్దం నుండి గొరవ శబ్దం నిష్పన్నమై ఉండవచ్చును ’’ డా॥ జి. పరమశివయ్య

‘‘ గురు ( గురువు ) శబ్దమే గొరవ శబ్దానికి మూలమై ఉండవచ్చును ’’ ` డా॥ శ్రీనివాసరిత్తి.

‘‘ గురు అనే సంస్కృత శబ్ద బహువచన రూపం గురువ అవుతుందని అదే తద్భవంగా మారి గురువ, గొరవ అయింది ’’ ` ఎం.చి. కణవి . వీటిని పరిశీలించగా ‘‘ గురువు ’’ శబ్దం నుంచి ‘‘ గొరవ ’’ శబ్దం వచ్చిందని చెప్పవచ్చు.

సాధారణంగా ఆలూరు, ఆస్పరి మండలాలో గొరవయ్యలు  ఎక్కువగా వుంటారు. ఇక్కడ గొరవయ్యంతా కురువజాతికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కురవకులంలో ఇంటికి పెద్ద కొడుకు అయినవాడు గొరవయ్య కావాలనే ఆచారం నేటికీ కనిపిస్తుంది. కర్నూలు  జిల్లాలోని గొరవయ్య ప్రధాన క్షేత్రమైన ‘‘గట్టు మల్లయ్య  కొండ ’’ పరిసర గ్రామాల్లో హరిజన, బోయ కులాల్లో గొరవయ్యలు  కన్పిస్తారు. కాబట్టి మైలారలిగని భక్తులైన గొరవయ్యకు జాతి కట్టడి లేదని, మల్లయ్య  దేవుని పేరు మీద ఎవరైన గొరవయ్య కావచ్చునని. అయితే ఏయే కులం  గొరవయ్యలు  ఆయా కులాల  వాళ్ళకే గురువుగా ఉంటారు. భక్తుల  ఇండ్లకు వెళ్ళి పూజా కార్యక్రమాల్లోనూ, గృహప్రవేశాలోనూ, పెళ్ళిళ్ళలోనూ, నామకరంలో ఇలా ప్రతి ఒక కార్యక్రమాలో గొరవయ్యలు  ప్రధానమైన పాత్ర వహిస్తారు.

వృత్తి:
గొరవయ్యలు  భక్తుల  కోరికపై వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ( ధార్మిక ) పూజా కార్యక్రమాలో పాల్గొని ఒగ్గ సేవను జరిపించి వాళ్ళిచ్చే దక్షణల్ని తీసుకొని దీవెనలు  పలికిపోతుంటారు. పూజా కార్యాలు  లేని సమయంలో ఒక్కొక్కరుగా గాని, గుంపు గుంపుగా గాని భిక్షాటనకు పోతుంటారు. కాల క్రమంలో కొందరు గొఱ్ఱెను పెంచుకొంటుండగా, కొందరు ఉన్ని తీసి కంబళ్ళు నేయడంలాంటి వృత్తిని అవలంభిస్తుంటే కొందరు, మరికొందరు కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు చిన్న చిన్న వ్యాపారాలు  చేసుకొంటు బతుకుతున్నారు.

గొరవ దీక్ష :
గొరవయ్య తయారు చేసే విధానాన్ని ‘‘ గొరవ దీక్ష ’’ అంటారు. కర్ణాటకలో గొరవ దీక్షను ‘‘ గొరవ పెట్టి ’’ అని పిలుస్తారు. గొరవ దీక్షను శుభకార్యంలా జరిపిస్తారు. గ్రామ పెద్దలు , బంధువు మధ్యలో గొరవ దీక్షను ఇప్పిస్తారు. ఈ దీక్షను పది నుండి పన్నెండేండ్ల మధ్య వయసులో ఉన్న మగ పిల్లకు  ఇస్తుంటారు. గొరవయ్యను తయారు చేయాలనుకున్నాక ఇంటి పెద్ద కొత్త బట్టలో బండారు ( పసుపు ), రూపాయి కట్టి గణాచారికిచ్చి స్వామి ! మా ఇంట్లో గొరవయ్యను తయారు చేస్తున్నాం. మీరు వచ్చి గొరవయ్యను తయారు చేయాలి అని పిలవాలి. ముహుర్తం నిర్ణయించిన రోజుకు గొరవయ్యలు , గణాచారి (గురువు) వస్తారు. ఇంటిని శుభ్రం చేసుకుని  కల్లాపు చల్లి ముగ్గు, పందిరి వేస్తారు. ఇంట్లో విశాలమైన ప్రదేశంలో గణాచారి కంబడిని చతురస్రాకారంగా మడిచివేస్తారు. కంబడిపై త్లెని  పిండితో ముగ్గు వేస్తారు. రకరకా తినుబండారాు ఉంచుతారు. ఆకు, వక్కు, కొబ్బరి కంబడిపౖౖె ఉంచుతారు. గొరవయ్యు దోణిని ఉంచగా దానిలో పాు, పెరుగు, నెయ్యి చక్కెర, అరటి పండ్లు వేస్తారు. గణాచారి పూజ అయిపోగానే వేషధారణలో ఉన్న గొరవయ్యు బండారును తీసుకొని ‘‘ సింహాసనం ’ అని పివబడే కంబడిపై చల్లుతూ  ఖడ్గాలు ( మంత్రాలు ) చెబుతారు. ఖడ్గాలు  చెప్పే సమయంలో ఒక విధమైన వీరావేషం కనిపిస్తుంది. తర్వాత సింహాసనం చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. పాటలు  పాడుతారు. ఆ సమయంలో గొరవయ్యకు పూనకం రాగా నిమ్మకాయను కోసి అతని నోట్లలో పెడుతారు. అలా పెట్టిన ఐదు నిమిషాలో వారిని శాంతింప చేస్తారు గణచారి. పిమ్మట గణాచారి గురవయ్య చేత 3,6,9 నెల కుక్క పిల్ల  ఎలా మెరుగుతాయో అలా మొరిగింప చేస్తారు. గణాచారి ఇంటి పెద్ద ఆజ్ఞను తీసుకొని గొరవయ్యలు  అందరు ‘‘ భౌ భౌ ’’ అని అరుస్తూ, కుక్కల్లాగా కొట్లాడుతూ దోణిలోని పాలను తాగుతారు. తిను బండారాలను తింటారు. ఇలా ఒగ్గు సేవ అయిన తర్వాత గణాచారి తాను తయారు చేసుకొని తెచ్చిన ‘‘ గవ్వ పట్టి ’’ ని గొరవయ్య కాబోయే వ్యక్తి మెడలో కడతారు. గవ్వ పట్టీని మెడలో వేశాక గణాచారి గొరవయ్య చెవిలో

‘‘ ఆచారం అనాచారం చెయ్యకూడదు
కుల వృత్తికి ద్రోహం చెయ్యరాదు
ఇతరులను మోసం చేయకూడదు
అబద్ధం చెప్పకూడదు ’’ అని మంత్రోపదేశం చేస్తాడు. తర్వాత  కంబడి నిలు వంగీని, ఎలుగుబంటి చర్మపు టోపిని ధరింపచేస్తాడు. ఢమరుకం, పిల్లన  గ్రోవి ఇస్తాడు. తరువాత అందరి అనుమతి పొందిన గొరవయ్య పాలను ప్రసాదంలాగా స్వీకరిస్తాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు అతనిని గొరవయ్య స్వామి, మల్లయ్యస్వామి అని పిలుస్తారు. ఆచారం ప్రకారం కొన్ని ఇండ్లకు వెళ్ళి భిక్షాటన చేస్తాడు. అప్పటినుండి గొరవయ్య జీవనవిధానం మారుతుంది. మిగతా గొరవయ్యలతో పాటు కలిసి గొరవయ్య పాటలు , ఆటలు  నేర్చుకుంటారు.

వేషధారణ:
నృత్యకళాకారులైన గొరవయ్య వేషధారణ ఇతర కళాకారుల  కంటే భిన్నంగా ఉంటుంది. పిల్పెలలకేగాక పెద్దలకు కూడా  చూడగానే క్షణకాలం  ఒళ్ళు జలరించిపోతుంది. కర్నూలు  జిల్లాలోని గొరవయ్యలు  తలపై ఎలుగుబంటి చర్మంతో చేసిన టోపీని ధరిస్తారు. ఎలుగుబంటి చర్మంతో కంబళి (అంగిని) తయారు చేసుకొని ధరిస్తారు. మెడలో గవ్వల పట్టీని వేసుకొంటాడు.కంబళితో పాటు నిలువు అంగీని, దానిపై పులి చర్మం లాంటి కోటును వేసుకుంటారు. నడుముకు కాయలు బెట్టి ఉంటుంది. బండారు సంచి ఒకవైపు మరోవైపున పానపాత్ర (దొణి)ను నడుముకు తగిలించుకుంటారు. ఎడమ చేతిలో త్రిశూలంను. కుడిచేతిలో ఢమరుకం, పట్టుకుంటారు. మెడలో డోలు , కాళ్ళకు గజ్జలు  కట్టుకుంటారు. గణాచారి తెల్లని  దోవతి, అంగీ తల పై తెల్లని  రుమాలును కట్టుకొంటారు.

దైవం:
కర్నూలు  జిల్లాలోని గొరవయ్య ప్రధాన క్షేత్రం అయిన గట్టు మల్లయ్య  కొండ ‘‘ దేవరగట్టు మ్లయ్య ’’ పైని దేవుడు (దసరా ) విజయదశమికి మల్లయ్య జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. విష్ణువు కూర్మావతారంలోను, శివుడు మల్లేశ్వరుడిగాను అవతరించాడని చెబుతారు. అంటే ఈ విధంగా చూస్తే శివకేశవులు  ఏకత్వముగా వుంటారు. గొరవయ్యలు  ధరించిన పిల్లన  గ్రోవి శ్రీకృష్ణుని వాయిద్యమని, ఢమరుకం శివుని వాయిద్యమని అందువల్లన  ఈ గొరవయ్యలు  హరిహరినాథ తత్త్వాన్ని ప్రచారం చేసే వాళ్ళని చెప్పుకొంటారు.

నృత్యం:
మెడలో దండను ధరించి నల్ల  కమ్మిడి (కంబళి ) శరీరమంతా కప్పుకొని ( కుట్టించుకొని), కుడిచేతిలో ఢమరుకాన్ని, ఎడమచేతిలో పిల్లన  గ్రోవి పట్టుకొని, కాళ్ళకు గజ్జలు  కట్టుకొని నృత్యం చేస్తారు. తలకు ఎలుగుబంటి చర్మంతో తయారు చేసిన టోపిని ధరించి, నుదుటబండారు పెట్టి, నడుముకు జింకచర్మంతో చేసిన బండారు సంచి వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కొంటూ, ఇంటిలోని పిల్లలకు , పెద్దలకు బండారు బొట్టు పెడ్తూ, ఢమరుకాన్ని వాయిస్తూ, పిల్లన  గ్రోవిని ఊదుతూ ఇలా పాడుతారు.(రంగప్ప(గొరవయ్య),వయసు 65,ఆలూరు)

‘‘ శివ మల్లేశ్వరా
బండారుదయ్యా
కాపాడప్ప
పిల్లలను  పెద్దలను దీవించు
గాటెద్దు కలిగి
కోటి సంపదలు  కలిగి
కనక పాత్ర కలిగి
మల్లేసునట్లు మగబిడ్డ కలిగి
మల్లికార్జున నీపాద పద్మాలకు
నమస్తే ’’

గొరవయ్యంతా దసరా పండుగనాడు దేవరగట్టులోని మల్లేశ్వరస్వామి సన్నిధిలో వివిధ రీతులో పాటు పాడుతూ నృత్యం చేస్తారు. అంతే కాదు జాతర సమయంలో వారి శరీరం నుంచి కొంత రక్తాన్ని తీసి ‘‘ ధారపోసి ’’ దేవునికి నైవేద్యం ఇస్తారు. చివరిగా కుక్కలాగా అరుస్తూ, కొట్టుకుంటూ తర్వాత నాలుకతో పాలు  తాగుతారు. పాటలు  పాడే సమయంలో ఢమరుకాన్ని ఒక వైపు మాత్రమే నాలుగు వేళ్ళతో వాయిస్తారు. ఇళ్ళ దగ్గరకొచ్చి అడుక్కొనే సమయంలోను, నృత్యం చేసే సమయంలోను ఢమరుకాన్ని వాయిస్తారు. పిల్లన  గ్రోవిని లయాత్మకంగా ఊదుతారు.

సరిసంఖ్యలో వుండి నృత్యం చేసే సమయంలో వరుసగా అందరూ నిలబడి ఢమరుకాన్ని ఒక్కసారిగా ‘‘ బుడబుడ్డ బుడ్‌ ’’ అనే రీతిలో వాయిస్తుండగా అందరూ మొదటిగా గుండ్రాకారంగా తిరిగి వరుసలో నిబడుతారు. తర్వాత ఒక్కొక్క వరుసలో వారు ఎదురెదురుగా పోటీగా అడుగు వేస్తూ కూర్చొని లేవడం, కూర్చొని తిరగడం , ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వరుసలోని వారు ఇంకో వరుసలోనికి మారటం జరుగుతుంది. అలా మారిన తర్వాత ఇంకో జత అలాగే చేస్తూ మారుతారు. ఇలా ఎంతమంది ఉంటే అందరూ ఒకటవ వరుసలోని వారంతా రెండవ వరుసలోనికి, రెండవ వరుసలోని వారంతా ఒకటవ వరుసలోనికి మారుతారు. ఇంత చేస్తున్నా ఢమరుకం, పిల్లన  గ్రోవి వాయిస్తూనే ఉంటారు. తర్వాత అందరూ గుండ్రాకారంగా తిరుగుతూ ఒక్కొక్క కాలిని నేలపై కొడుతూ మార్చుకుంటూ ఉంటారు. .
అలా చేస్తుండగా ఢమరుకాన్ని కొద్ది మార్పు చేస్తూ పాడేపాట మల్లేశ్వరుని వేట వర్ణనకు సంబంధించినది వేటలో పరుగెత్తడం సహజం. అలాగే పాటలోనూ. వాయిద్యం వాయించే సమయంలోనూ అందరూ ఒకే రీతిలోనే శబ్దం వినిపిస్తుంది.

‘‘ యాట వెళ్ళెను చూడరే మల్లయ్యస్వామి
యాట వెళ్ళెను చూడరే బండారు దేవుని
యాట వెళ్ళెను చూడరే, స్వామి యాటకెళ్లిన చూడు కాడు కాపురమందు
సాటిలేని గట్టు సామి మల్లేసుడు ॥ యాట ॥
చూడరమ్మ వందనిండ్లు చూడరమ్మ
వురటీలు  జమిటీలు  చూడుగ మెగాయె
గగనుడి ముట్టంగా కదిలేరానే పరుగ
కడను కర్నూలు  వరకు, గుత్తి దుర్గం నుంచి ఏ వంకచూచినా
వెలేదు నీ పరుగు ’’ ॥యాట॥
సామిమేలు  బండరి నాదమేటి వసంతూరు
భార్య బండేశ్వయి బంగారు గొలుసు
పైరేన ఒగ్గు పెద్ద గంగుళమ్మ
సేరి తుప్పెదమాలి చెలియలిద్దరుగూడి
కారు గొల్యాలు  ఎక్కి ఘనమైన పురమేలి ॥యాట ॥
సామా మెరుపు చందన కాయమెరుపు చందన కాయ
మెడనిండా  మున్ను గంగినపాలు
ముడిసి పుట్టిన బోసి కున్ను ద్రాగిన గురునే జంగామ
కున్నే జిముకను చూసి కాంత విభూతి పూసి
తనలోని బల్కిన శివనేకంటూడు ॥యాట ॥
జై సాంబశివమూర్తి మల్లార బహు పరాత్మయ్య

నందికోలు  సేవ:
‘‘ కొ అంటే కర్ర. నంది బొమ్మల  చివరన ఉండే రెండు కర్రలు ( వెదురుబొంగు) మధ్య పిడి వుంటుంది. భక్తులు  ఒక నంది కొని భూజాన ఎత్తుకొని పార్వతి పరమేశ్వరును స్తుతిస్తూ ‘‘అశ్శరభ, శరభ’’ అంటూ ఖడ్గాలను చదువుతు తదనుగుణంగా అడుగు వేస్తూ భావావేశంతో భక్తి పారవశ్యంతో ఊగిపోతుంటారు. దవడకు, నాలుకకు సూది గుచ్చుకుంటారు. ఈ కళారూపాన్ని శివరాత్రి పండుగ సందర్భంగా శైవులు  పెళ్లిళ్ల సంప్రదాయానికి చెందిన తొగట వీరక్షత్రియలు , పద్మ సాలేవాళ్లు ప్రదర్శిస్తుంటారు.’’ ఎమ్మిగనూరు, బింగిదొడ్డి, కొడుమూరు, పొలుకులు , గూడూరు, నందవరం, మ్దెర్తి, కూలూరు , గోనేగండ్ల ప్రాంతాల్లో జాతర్లలో ఈ ప్రదర్శన కళ కన్పిస్తుంది.

-ఏం .నాగమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to కర్నూలు జిల్లా జాతర్లలో ప్రదర్శన కళలు (సాహిత్య వ్యాసం )- ఏం .నాగమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో