విషాదభారతి అభిమాన పుత్రుడు ‘‘గోసంగి’’(సాహిత్య వ్యాసం )- డా. ఎ. ఈశ్వరమ్మ,

ISSN – 2278 -478

ఆచార్య ఎండూరి సుధాకర్‌ దళితచేతన గల  కవి. రచయిత. ఈయన నిజామాబాద్‌ జిల్లా పాము బస్తీలో 1959 జనవరి 1వ తేదీ జన్మించారు. వీరి తల్లిదండ్రులు  శాంతాబాయి, దేవయ్యలు. వీరి విద్యాభ్యాసం వీథి బడి నుండి విశ్వావిద్యాయం వరకు సాగింది. ‘‘జాషువా సాహిత్యం ` దృక్పథం – పరిణామం’’ అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పొట్టి శ్రీరాములు  తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ డిగ్రీ పొందారు.

సుధాకర్‌ గారు మొదట తెలుగు  పండిట్‌గా వెస్లీబాయ్స్‌ హైస్కూల్‌, సికింద్రాబాద్‌లో పనిచేశారు. 1990 నుండి చాలా కాలం  పొట్టి శ్రీరాములు  తెలుగు  విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, రాజమండ్రి ప్రాంగణంలో ప్రొఫెసర్‌గా, పీఠాధిపతిగా చాలా కాలం  పనిచేశారు.

వర్తమానం (కవితా సంపుటి), కొత్త గబ్బిలం  (దీర్ఘకావ్యం), మల్లె గొడుగు (మాదిగ ఆత్మకథలు ) వీరి రచనలో ప్రసిద్ధమైనవి. ‘నా పుస్తకమే నా ఆయుధం’ అనే పేరుతో మరాఠీ దళిత ఆత్మకథను తెలుగులోకి అనువదించారు. ‘నల్ల  ద్రాక్షపందిరి ` డార్కి’ అనే ఉభయభాషా (తెలుగు- ఇంగ్లీషు) కవితలను రచించారు. వర్గీకరణీయం (దళిత దీర్ఘకావ్యం) 2004లో ప్రచురించారు.  ‘కవిరత్న’, ‘నవయుగ కవితా చక్రవర్తి’, ‘యంగ్‌ నేషనల్‌ పోయెట్‌’ అనే బిరుదు పొందారు.

గోసంగి ఎండ్లూరి రచించిన దళిత దీర్ఘకావ్యం. కృష్ణరాయవారి 500వ పట్టాభిషేక మహోత్సవాలు  సందర్భంగా రాశారు. గోసంగి అనేది ఒక దళిత కులం . వీరు సంచారజీవులు . నిరక్షరాస్యులు . పశువుల  మాంసమును అమ్మి జీవించేవారు. గోసంగి అనే మాట ‘ఘోష్‌’ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. ఘోష్‌ అంటే మాంసము అని అర్ధం. ఈ పదం క్రమంగా గోసిక, కోసికోళ్ళు అయి గోసంగి అయిందని పలువురి అభిప్రాయం.

ఆంధ్రరాష్ట్రంలో సుమారు 60 దళిత కులాలున్నాయి. వానిలో ఒకటి గోసంగి. వీరు మాదిగ కులానికి ఉపకులంగా  చెప్పుకుంటారు. శ్రీకృష్ణరాయులు  తన ‘ఆముక్త మాల్యద ’ ప్రబంధం ఆరవ ఆశ్వాసంలో ‘గోసంగి’ కులాన్ని మొదట గుర్తించారు. ‘మహాత్మా’ అని తొలిసారి ఒక దళితుణ్ణి సంబోధించారు. కృష్ణరాయులు  తన విజయయాత్రలో భాగంగా తెంగాణాలో విస్తృతంగా పర్యటించారు. ఇక్కడే రాయల వారు ‘గోసంగి’ని చూసి ఉంటారు లేదా ఆ కులం  పేరు విని వుంటారు. ఆ గోసంగి కులాన్నే ఆముక్తమాల్యదలో ప్రవేశపెట్టారు.

ఆముక్త  మాల్యద కు  వ్యాఖ్యానం వ్రాసిన వేదం వేంకటరాయ శాస్త్రిగారు ‘గోసంగి’ కథని ‘మాలదాసరి కథ’ అని పేర్కొన్నారు. మూలం  ‘మాల ’ శబ్దం ఎక్కడా రాలేదు. రాయల వారు ప్రయోగించనూలేదు. అందుకే ఎండ్లూరి ` గోసంగి పదానికి వేదం వారు ఇచ్చిన అర్థంతో ఏకీభవించలేదు. ప్రత్యేక అస్తిత్వం ఉన్న కులాన్ని వ్యాఖ్యాత మాల , మాదిగ భేదం పాటింపనవసరం లేని కులంగా అర్థం చేసుకోమనడం సమంజసం కాదని ఎండ్లూరి భావిస్తున్నారు. దళితాత్మ గౌరవ ప్రకటన చేస్తున్నారు.

ప్రతి మనిషికీ తనదైన స్వభావం ఒకటి ఉంటుంది. ఆ స్వభావం ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుంది. బాల్యంలో  పిల్లలపై  తల్లిదండ్రుల  ప్రభావం ఉంటుంది. ఎదిగే కొద్దీ తన చుట్టూ వున్న సామాజిక వాతావరణం నుండి కొన్ని క్షణాలు  వస్తాయి. పెద్దయ్యేకొద్దీ గురువునుండి తెలుసుకున్న విషయాలతో, తన ప్రయత్నంతో వ్యక్తి కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకుంటాడు. దీన్నే వ్యక్తిత్వం అంటాం. వ్యక్తులు  ఎప్పటికప్పుడు తమ వ్యక్తిత్వాన్ని మెరుగు పరచుకుంటూ, తమను తాము విమర్శించుకుంటూ, తమలోకితాము తొంగిచూస్తూ, తమలో తాము సంభాషించుకుంటూ అనేక పార్శ్వాలుగా విస్తరిస్తారు. ప్రేమ, కరుణ, సత్యం, అహింస, ధర్మం, శాంతం, సేవ, త్యాగం మొదలైన లక్షణాతో తనను తాను ఉన్నతీకరించుకున్న మహోన్నత వ్యక్తిగా గోసంగి ద్వారా ఎండ్లూరి దర్శనమిచ్చారు.

గోసంగిలో వ్యక్తమైన ఆవేదన, ఆక్రోశం తన స్వీయానుభవంలోనిది కాదు. 16వ శతాబ్దానికి చెందిన ప్రబంధం ఆముక్త మాల్యదలోని దాసరి లేదా  గోసంగి పాత్రలో తాను సహానుభూతి చెందుతున్నాడు. ఆ పాత్రతో తాదాత్మ్యం పొందుతున్నారు. తనకూ మాల దాసరికి బేధమేమీ లేదని గ్రహించారు. ఆ పాత్రయందు తనను ఆరోపించుకుని ఆ పాత్రకు స్వరధారణం  చేశారు.

గతంతో జరిపే వర్తమాన సంభాషణ ఇది. ఇది ఒక దీర్ఘ కవిత. అందరూ భావిస్తున్నట్లుగా తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగం లేదా ప్రబంధయుగం స్వర్ణయుగమేమీకాదు. అది కూడా వర్ణయుగమేనని గోసంగి ద్వారా కవి ప్రకటిస్తున్నారు. వర్ణరహిత విశ్వమానవ సమానత్వకాంక్ష ఈయనలో ఎంత బలీయంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ‘దుస్సహబాధ, దుర్భరవేదన, భరించలేని, భరించకూడని, అది ఇది అని వచియింపగలేని ఏదో వ్యధగా వచ్చిన వాగ్రూప వేదన’ ఈ దీర్ఘ కవిత.

‘‘ఒక విషాద శతాబ్దంలో జీవించిన వాణ్ణి
ఒక అంధకార యుగంలో
అస్పృశ్యతను అనుభవించిన వాణ్ణి
పేర్కొడానికి మీలేని కులంలో పుట్టిన వాణ్ణి
ముట్టుకోవడానికి ఇష్టపడని మురికి జలాన్ని
ఐదువంద సంవత్సరాలుగా హైందవలోక అవమానితుణ్ణి
అనుమానితుణ్ణి, అభిమానవంతుణ్ణి’’

ఇది 16వ శతాబ్దం నాటి పరిస్థితి. మనిషిని మనిషిగా చూడని స్థితి. దీనికి కర్మ సిద్ధాంతం ముసుగు తొడిగి ఆమోదింపజేసిన విపరీతధోరణి కన్పిస్తుంది.

‘‘నేనూ మాణిక్యాన్నే కాని మసిగుడ్డలో దాచబడ్డాను
నేనూ సాటి మనిషినే కానీ అంటరాని గడ్డలో పుట్టాను.
నేను గోసంగిని, నేను మాతంగిని, నేను మాదిగని
నేను మాని, నేను గొడారిని నన్నే పేరుతో పిలిస్తేనేం
నా దేహానికి దేవాలయానికి మధ్యన అంటు అడ్డుగోడున్నంతకాలం ’’
నా దేహానికి దేవాలయానికి మధ్య అంటరానితనమనే అడ్డుగోడున్నాయి. నేటికీ ఆలయ ప్రవేశ విషయంలో వివక్ష కలచివేసే విషయం.

నేను 16వ శతాబ్దపు పీడకలని. నన్ను పలకరించకండి. నేను దళిత వాడకు చెందిన శిలను. ఒక చేదు జ్ఞాపకాన్ని. చాతుర్వర్ణ వ్యవస్థనే కొండనాగు విరజిమ్మిన విషపు మరకను ` ఈ మాటలు  హృదయాన్ని పిండేస్తాయి.

“నేను కాల సర్పం కాటేసిన రోహితుణ్ణి, అన్నీ కోల్పోయిన బాధితుణ్ణి
నాకు తోలు  చొక్కాలేకాని పట్టువస్త్రాలేవి?
చినిగిన కొంగులే కానీ చక్కని కోకలేవి?
నూలు  బట్టలేవి? నార్కావి పంచలేవి?…… అని రాయల వారిని కేంద్రంగా చేసుకొని సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. తనకు సముచిత గుర్తింపు గౌరవం లేకపోవడం వల్ల  సమాజం ఏం కోల్పోయిందో చెబుతున్నాడు.

నా ప్రతిభంతా వాయువులో మిళితమయ్యింది
నా పనితనమంతా దగ్ధమై దళితమయ్యింది
నా గాన సౌందర్యమంతా పంచభూతాలో కలిసిపోయింది
నా ప్రాణ మంగళ కైశికారాగ రస రజింతమంతా
అడవి కాచిన వెన్నెలై దుఃఖాశ్రుజ్యోత్స్నగా మారిపోయింది
ఆహో! ఆంధ్రభోజా నాకు ఒక్క అవకాశం యిచ్చి ఉంటే
ఆకాశం కిందికి దింపి ఉండేవాణ్ణి
నీ భువన విజయాన్ని గగన విజయం చేసి ఉండేవాణ్ణి …. అంటూ విజయనగర సామ్రాజ్యలక్ష్మి గొప్ప గోసంగిని కోల్పోయిందని, ఐదువందల  సంవత్సరాలుగా చరిత్ర కోటబురుజు మీద ‘గుడ్లగూబ రూపం’లో ఘోషిస్తుందని నిష్టూరంగా వేదన వ్యక్తం చేసాడు. తమ అంతరంగాలు  అంతఃపురాలకూ, అగ్రహారాలకు అర్ధంకావంటూ తమ సౌందర్యం శాస్త్రం ఎందుకు కాలేకపోయిందో సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.

‘‘వెన్నెల కన్నునీరు నింపుకుని
నా వాడ విూద నావాళ్ళ మీద
దీనంగా కురుస్తున్నట్టున్నది అప్పుడప్పుడు’’ ` అనడం ద్వారా వివక్ష మనిషికే కాని ప్రకృతికి లేదని భావిస్తున్నాడు. సరస్వతి తనమీద సవతి ప్రేమ చూపలేదని ఒకింత సర్దిచెప్పుకుంటాడు. ఏ నంబీ తనను తంబీ! అని పిలవలేదని బాధపడతాడు. చివరికి రాయవారిని ఉద్దేశించి. 

‘‘జోహార్‌! మూరు రాయర గండ నీ వైపే చూస్తున్నది
నీవు జయించలేకపోయిన అంటరాని కొండ
చరిత్రలో మచ్చగానే ఉండిపోయింది’’ ` అంటూ జాగరూకుణ్ణి చేస్తాడు.
తన ఐదువందల  గాయాలు  అంటరాని చరిత్ర గురించి ఆలోచింపచేస్తూ వండిన అన్నమూ ఉండదు. చచ్చిన పీనుగూ ఉండదు. ఉన్నదంతా మంచి చెడ్డలే. ఉత్త మట్టిగడ్డలే! ఏదీ శాశ్వతం కాదు అంటూ ఒక వైరాగ్య ధోరణిని వ్యక్తం చేస్తాడు. మానవతను తట్టిలేపి సాహిత్యానికి వుండవసిన సామాజిక ప్రయోజనాన్ని ఎండ్లూరి సమాజానికి ‘గోసంగి’ కవితరూపంలో అందించారు.

– డా. ఎ. ఈశ్వరమ్మ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​Permalink

One Response to విషాదభారతి అభిమాన పుత్రుడు ‘‘గోసంగి’’(సాహిత్య వ్యాసం )- డా. ఎ. ఈశ్వరమ్మ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో