కళల హారతి ఉమాభారతి -2

కళల హారతి ఉమాభారతి మొదటి భాగాన్ని ఇక్కడ చూడండి.

అన్నీ మంచి సంఘటనలే వరుసగా జరుగుతూ వుంటే మంచిది కాదని

ఎందుకు అనుకుంటున్నారు?

రావలసిన గుర్తింపు,  ఫారెన్ టూర్లు, ఫిల్మ్స్, ఇలా త్వర త్వరగా జరిగిపోతే ఇక మిగిలేది టీచింగ్ కదా. పెర్ఫార్మింగ్ 

ఆక్టివిటి (activity), ఆ ఉత్సాహం తక్కువయ్యే అవకాశం  ఉంటుందేమోనని. టీచింగ్ మొదలుపెట్టాలని లేదు.  ఐ 

యామ్ బెటర్ ఎట్ పెర్ఫార్మింగ్.  టీచింగ్ సత్తా నాలో ఉందో లేదో,  తెలియదు కూడా.  ఫిలిం కెరియర్ (career) ఒక

ఆప్షన్ (option) గా ఆలోచన లేదు. అందుకని అలా అన్నాను.

ఇంతకీ మళ్ళీ మీ కూచిపూడి నృత్య శిక్షణ ఎలా ఎప్పుడు మొదలైంది? ఎలా కొనసాగింది?

వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చేసాము.  హైదరాబాద్ వచ్చి ఆరు నెల్లయ్యాక, ఓ రోజు, స్కూల్ నుండి వస్తుంటే

దారిలో  వేదాంతం జగన్నాధ శర్మగారు కనిపించారు.   ఆయన్ని కలిసి నమస్కరించి మా ఇంటికి తీసుకొని వెళ్లాను. 

అదే నా నృత్య శిక్షణకి మళ్లీ నాంది పలికిన సుదినం అనవచ్చు.  

నాకున్న ఆసక్తి, అనుభవం, సత్యం మాస్టారి దగ్గర నా శిక్షణ పరిగణ లోకి తీసుకొని జగన్నాధ శర్మ గారు నాకెంతో  

శ్రద్ధతో శిక్షణ నివ్వ సాగారు.  

కొన్నాళ్ళు నాట్యం అభ్యసించ లేకపోయినా, ఇంతటి గొప్ప సాంప్రదాయమున్న  గొప్ప గురువుల వద్ద శిష్యరికం చేసే 

అవకాశం కలగడం నా అదృష్టం అనే చెప్పొచ్చు. 

ఆ తరువాత మూడు సంవత్సరాలు అహర్నిశలూ నృత్యశిక్షణ  తప్ప మరో ధ్యాస లేదు నాకు.  రేపనేది లేనట్టు, 

నాజన్మ తరించినట్టు,  అనుభూతి కలిగేది డాన్సు చేసినంత సేపు.  శిక్షణ కాలంలోనే లోనే ఎన్నో పేరున్న సాంస్కృతిక 

సదస్సులకి, సంఘాలకి ప్రదర్శనలిచ్చేదాన్ని.   మంచి  భవిష్యతున్న నర్తకిగా గుర్తింపు వచ్చింది కూడా.   

 ఈ మధ్య కాలంలో  ఏవైనా డాన్సు పోటీల్లో పాల్గొన్నారా?  అఖిల భారత కూచిపూడి డాన్సు

పోటిలో ఎప్పుడు పాల్గొని గెలిచారు?  

హైదరాబాద్ లయన్స్ క్లబ్ వారి రాష్ట్ర స్థాయి శాస్త్రీయ నృత్య పోటీల్లోనూ,  జానపద నృత్య పోటీల్లోనూ మొదటి  స్థానంలో 

నిలిచాను.  వార్తా పత్రికల్లో నా పేరు,  పిక్చర్, డాన్సు గురించి చూసుకోడం పరిపాటయింది.  ఆనందంగా ఉండేది కూడా.

ఛాయా చిత్రాలను ఇక్కడ చూడండి.

నా పద్నాల్గవ ఏట All India Dance competitions గెలవడం మరో మైలురాయి.  గెలిచి 1972 లో ప్రతిష్టాత్మక

అక్కినేని రోలింగ్ ట్రాఫి, బంగారు పతకం అందుకొన్నాను.   అఖిల భారత కూచిపూడి డాన్సు పోటిలో గెలుస్తూనే నాకు

నా ‘రంగప్రవేశం’ ఆలోచన మొదలయ్యింది. టెన్త్ గ్రేడ్ సెలవల్లో  కూచిపూడిరంగప్రవేశం చేయాలని పట్టుదలగా 

ఉన్నాను, అమ్మనాన్న వాళ్ళని అడగడం మొదలెట్టాను. వాళ్ళకది ముఖ్యం అనిపించలేదు.  పైగా చాలా ఖర్చు  

ఉంటుందని కూడా వారి ఆలోచన. 

 నేను  మాత్రం ఏకాగ్రతతో రోజుకి నాలుగు గంటలు ప్రాక్టీసు చేయడం, మాస్టారి గారిని ఒత్తిడి చేసి మరిన్ని మెళుకువలు 

నేర్వడము చేసేదాన్ని. 

ఉమ గారూ ! ఆ వయసుకే మీరు రంగ ప్రవేశం గురించి సొంతగా అలోచించి శిక్షణ పొందటం చూస్తుంటే మీ ఆసక్తికి 

విస్మయంగా ఉంది.మీ ఇంట్లో అరంగేట్రం చెయ్యటానికి ఒప్పుకున్నారా లేదా?తెలుసుకోవాలని నాకు కూడా ఆత్రుతగా 

ఉంది.

 అవును హేమా! చేశాను . అదొక అరుదైన అవకాశం …

మీరంత తన్మయత్వంతో  చెప్తుంటే అదొక మధురమైన సన్నివేశం అని అర్ధమవుతూనే ఉంది . రంగప్రవేశం ఎలా

జరిగింది?

  SICA (సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్) అనే పేరున్న సంస్థ నా ‘కూచిపూడి రంగప్రవేశం’  స్పాన్సర్

చేయడానికి అంగీకరించారు.  అప్పట్లో  కూచిపూడి కి భరతనాట్యం అంటే ఉన్న గౌరవ, ఆదరణలు లేవు.  కూచిపూడి

అంటే భరతనాట్యం వారికి  ఆసక్తి ఉండేది కాదు.  SICA తమిళియన్ సంస్థ.  ఏనాడు వారు కూచిపూడి కార్యక్రమం

చేసింది లేదు. అయినా  చాల గౌరవ ప్రదంగా నా కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.  అది కేవలం నా

అదృష్టం, మా నాన్నగారి కృషి ఫలితం.  అసలు ‘రంగప్రవేశం’  ఇంట  జరిగే శుభ కార్యం లాంటిది. 

ఎవరో స్పాన్సర్  చేయడమంటూ ఉండదు.

ప్రదర్శన అయ్యాక ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది.  ప్రముఖ పత్రికల

రీవ్యుస్ (reviews) అనూహ్యంగా ప్రశంసించాయి.  వారి రీవ్యూస్ నాకు ఎక్కడి లేని ఉత్సాహాన్ని, కాన్ఫిడెన్స్

(confidence) నీ ఇచ్చాయి.

UMA BHARATHI EXCLUSIVE STILLS FOR VIHANGA READERS

 

[wpg]

ఈ సంఘటనల వల్ల మీ నాట్యాభ్యాసం మీద కానీ ,జీవితం మీద కానీ ఏమైనా అనూహ్యమైన  మార్పులు చోటు

చేసుకున్నాయా?

రంగప్రవేశం వల్ల మీకు అప్పటివరకు లేని గుర్తింపు ఏమన్నా వచ్చిందా?

అన్ని మూలల నుండి ప్రశంసలు, పొగడ్తలు, మరిన్ని గ్రాండ్, ప్రతిష్టాత్మక నృత్య కార్యక్రమాలు  ప్రదర్శించటానికి 

ఆహ్వానాలు, రేడియో, ప్రముఖ ఆంగ్ల, తెలుగు పత్రికల వాళ్ళ ఇంటర్వ్యూలు…  ఎందరో మహా మహా కళాకారుల్ని, నటీ

నటుల్ని నా ప్రోగ్రామ్స్ లోనే కలిసాను. 

అవార్డు ఫంక్షన్స్ కి తప్పనిసరిగా నా డాన్సు ఉండేది.  State లెవెల్ ప్రోగ్రామ్స్ అన్నిటా నా కార్యక్రమమే ఉండేది. 

నెలలో ఒక వారం కూడా సమయం ఉండేది కాదు.  వరద భాధితుల సహాయార్ధం, లైబ్రరీలు, ఐకాంప్ ల కోసం ఎన్నో

ప్రోగ్రామ్స్ ఇచ్చాను. రాష్ట్రమంతటా టూర్ చేసాము.  ప్రతీ చోట సన్మానాలు, ప్రశంసలే. 

రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ కూడా ఓ సన్మానాల వెల్లువ,  డాన్సు కార్యక్రమం కంటే సన్మాన సభలే ఎక్కువనిపించేది.

‘రంగప్రవేశం’ అవుతూనే నాకు  నృత్య రంగంలో  ఓ ప్రత్యేక స్థానం ఏర్పడిందనే అంటాను.   నాకు ఫాలోయింగ్ కూడా. 

అభిమానులు.  నా ప్రోగ్రాములు ఎక్కడ జరిగినా తప్పనిసరిగా వచ్చేవాళ్ళు.  నన్ను కలుసుకోను వీలు లేక మా

స్కూల్ కి, కాలేజికి లెటర్స్ వ్రాసేవాళ్ళు.  మా ప్రిన్సిపాల్ మా నాన్నకి ఇచ్చేవారు. 

అన్ని ప్రోగ్రాములకి సమయాన్ని ఎలా కేటాయించే వారు? కూచిపూడి కాక మరే నృత్య రీతుల్లో

శిక్షణ పొందారు? 

మా అమ్మ సమయమంతా నా డాన్సుకి, నాకు కేటాయించేది ఎల్లప్పుడూ ఒక కాస్ట్యూమ్  డిజైనర్ , ఒక మేకప్ మేన్

కూడా ఉండేవారు.  అంతే కాదు,  ప్రొఫెషనల్ గా నిలదొక్కుకొని మేటి నర్తకి నవ్వాలని, నాకు భరతనాట్యం లోనూ శిక్షణ 

మొదలు పెట్టించారు.  ప్రసిద్ద  భరత నాట్య గురువులు, 

ఫకీర్ స్వామి  పిళ్ళై గారు, అప్పట్లో మద్రాస్ నుంచి వారానికి రెండు మార్లు వచ్చి హైదరాబాద్ లో శిక్షణ నిచ్చేవారు.  

ఆయన వద్ద నేర్చుకొన్నాను.   ఆ గురువు గారి దగ్గర శిక్షణ కుడా నా కెరియర్ (career) కి చాల దోహదం చేసింది.  

నా ప్రతిభ పెంపొందేలా అమ్మ నిరంతరం కృషి చేసింది.  ఏ ప్రోగ్రాంకి ఏ డాన్స్ చేయాలో నుంచి ఏ రంగు కాస్టూమ్ 

వేయాలో వరకు,  కొత్త పాటలు, కొత్త  కొరియోగ్రఫీ (choreography) వరకు అన్నీ ఆవిడ అజమాయిషీనే.  నాన్న  

ఆధికారికంగా  (official)  గా ఉన్నత స్థితిలో ఉండడం కూడా నా పురోగతికి ఎంతో సహాయపడ్డాయి.  

ఇండియన్ ఆర్మీ  ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో  నా నృత్యమే ప్రధానంగా ఉండేది.

  మీ గురువుల గురించి వివరాలు చెప్పండి ?      

నా గురువులు –‘పద్మ భూషణ్’ వెంపటి చిన్న సత్యం గారు – విశ్వ విఖ్యాతి గాంచిన గురువులు.  నా మొదటి గురువు

గారు.  1976 లో మద్రాస్ కళామహల్లో నా నృత్య ప్రదర్శనకి విచ్చేసి “నీవింతటి దానవౌతావని నాకు ఎప్పుడో తెలుసు”

అంటూ ఆశీర్వదించారు.   తరువాత 1998 లో డల్లాస్, యు.ఎస్.ఏ (U.S.A) లో జరిగిన తానా TANA కాన్ఫెరెన్స్ లో

ప్రారంభ సమావేశానికి  మా అమ్మాయితో  చేయించిన ‘అయిగిరినందిని’ డాన్సు చూసి, వివరాలు కనుక్కొని  నా కోసం 

కబురంపారు.  నేను, మా అమ్మాయి శిల్ప వెళ్లి కలిసాము.  ఆయన ప్రశంసించి “అప్పుడే అనుకొన్నాను ఆ డాన్సు, 

పోలికలు చూసి, చాల సంతోషం”,  అని ఆశీర్వదించారు.  నేను మరువలేని విషయాలు ఇవి.

 స్వర్గీయులు ‘కళాప్రపూర్ణ’ వేదాంతం జగన్నాధ శర్మ గారు,  ఎన్నో సినిమాలకి డాన్సు డైరెక్షన్ చేసి,  ఆయనా విశ్వ

విఖ్యాతి గాంచిన గురువులే. 

ఆయన ‘నట్టువాంగం’ కి ఎంతో పేరు.  నాకు ఆయన ‘నట్టువనార్’ గా ఇండియా లోని ప్రోగ్రాంసే కాక నా విదేశీ 

పర్యటనలన్నిటా ఆయన చేతుల మీదగానే జరిగాయి.  వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రి గారి కుమారుడిగానే కాక, 

సత్యభామగా, ఉషాపరిణయం లోని ఉష గా ఆయనకి చిన్నతనంలో చాల పేరు.  దాదాపు 12 ఏళ్ళ పాటు నాకూ మా

కుటుంబానికి కూడా ఓ గురువుగానే కాక ఓ శ్రేయోభిలాషిగా  చాలా దగ్గరయ్యారు, మా మాస్టారు.  

నేను యు.ఎస్.ఏ వచ్చేసాక కూడా ఆయన అనారోగ్యం తో బాధ పడుతూ ఉండగా నాకు చేతనైన సాయం చేసేదాన్ని.   

జగన్నాధ శర్మ గారు  వంశ పారంపర్యంగా వస్తున్న కూచిపూడి కళకి వారసుడు.  ఆయన తండ్రి వేదాంతం లక్ష్మీ 

నారాయణ శాస్త్రి గారంటే, ఆ నాట్య కళకి జీవం పోసి, ఆ కళ స్థాయిని పెంచిన మహనీయుల్లో మొదటి వారు.   

‘నాట్యశాస్త్రము’ లో  వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రిగారిని ఎంతో గణనీయంగా ప్రశంసించి కూచిపూడి నృత్య కళ 

నిర్మాణంలో ఓ మూల స్థంబమంటి వారని ప్రస్తావించారు.  ఆయన వద్ద శిష్యరికం చేసిన వారే, ఆయన తమ్ముని 

కుమారుడైన  వెంపటి చిన్న సత్యం గారు, జగన్నాధ శర్మ గారు, పసుమర్తి కృష్ణ మూర్తి గారు కాక మరెందరో గొప్ప

పేరున్న గురువులు…

నా భరతనాట్య గురువులు — ముందుగా ‘పద్మశ్రీ’ ఫకీర్ స్వామి పిళ్ళై,  ఆయన శిష్యులంతా హెమాహెమీలు.  నాకు

మంచి శిక్షణ నిచ్చారు భరతనాట్యంలో.

‘కళైమామణి’ శ్రీ త్యగరాయ రాధాకృష్ణన్ కూడా నా పెర్ఫార్మెన్స్ కి ఎన్నో సాంప్రదాయ భరత నాట్య నృత్యాలు నేర్పి,

నాకోసం కొన్ని పాటలు తెలుగులో రాయించి మరీ చేయించేవారు.  ఆయన కళాక్షేత్ర సాంప్రదాయానికి చెందిన వారు. 

ఇప్పటికీ ఆయన కూర్చిన ‘ఆండాళ్ స్వప్నం’  నా కెంతో ఇష్టమైన నృత్యం.  ఆయనకీ నేనంటే చాల అభిమానం,

నమ్మకం కుడా.  ఐదేళ్ళు నాకు ఆయన గురువుగా ఉన్నారు.  తరువాత కేరళ వెళ్ళిపోయారు.

అలా నేను కేవలం కూచిపూడి కాక, భరత నాట్యం కూడా అంతే  ధీటుగా చేయగలనని నిరూపించింది అమ్మ.   నృత్య

విమర్శకులు రాసే   సమీక్షలు(reviews) అమ్మకి ముఖ్యం. ప్రతి ప్రోగ్రాం, ప్రతి ఐటెం రీవ్యూ చదివి ఫాలో అయ్యేది

అమ్మ.

 సుడిగుండాలు సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయా?

 ‘చిల్లర దేవుళ్ళు’  సినిమా ఆవకాశం — 10th క్లాసు సెలువల్లో,  St. ఫ్రాన్సిస్ లో జూనియర్ కాలేజ్ (ఇంటర్మీడియట్)

లో చదువు ప్రారంభంలో – డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద చాలా కాలం పని చేసిన శ్రీ టి. మాధవరావు గారు తన

స్వీయ దర్శకత్వంలో ‘చిల్లర దేవుళ్ళ’ సినిమాకి నన్ను హీరోయిన్ పాత్ర కి ఎంపిక చేసారు.  శ్రీ దాశరధి రంగాచారి గారి

నవలకి అది సినిమా రూపం.  ఆ నవలకి, దాశరధి గారికి, ఆ సినిమాకి కూడా సాహిత్య నాటక అకాడెమీ అవార్డ్ లు

వచ్చాయి.  తెలంగాణా దొర కూతురి పాత్ర.  సావిత్రి మా అమ్మ పాత్ర. కాంచన, ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య పాత్ర

ధారులు. ఓ కళాత్మక, చిత్రం అది.  అంతటి పేరున్న నటుల్ని దగ్గరగా రెండు నెలలు చూడగలిగాను.  చాల మంచి

వారు,  వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.  ముఖ్యంగా కాంచన గారు,  మంచి మనిషి, విపరీత మైన దేవుని

భక్తి.  ఎంతో క్రమశిక్షణ ఉన్న మనిషి.  మా అంతట మేము ఏనాడు సినిమా అవకాశం కోసం వెతక లేదు. అసలు ఆ 

ధ్యాస నాకు గాని మా కుటుంబానికి గాని లేదు. 

‘నాట్యభారతి’ బిరుదు, స్వర్ణ కంకణ స్వీకరణ ఏ సంవత్సరంలో జరిగింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ సన్మానానికి?

‘నాట్యభారతి’ బిరుదు, స్వర్ణ కంకణం స్వీకరణ 1973 లో —- ముప్పై  సాంస్కృతిక  సంఘాలు, ఎందరో కళాభిమానులు, 

కళాకారులు కలిసి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారికి గజారోహణ సన్మానం, నాకూ ‘నాట్యభారతి’ బిరుదు,

స్వర్ణకంకణ బహుకరణ, సన్మానం, నృత్య ప్రదర్శన ఎంతో ఘనంగా జరిపించారు.    పదహారేళ్ళు ఉండవచ్చు నాకు.  

మరుపు రాని ముఖ్యమైన ఘట్టం నా జీవితంలో.ఇంకా ఎన్నో ఘననీయమైన ప్రదర్శనలు,  ఊహించలేని అభిమానం, 

సాంప్రదాయ నృత్య కళాకారిణికి కూడా ఇంత ఫాలోయింగ్ (following), ఇంత అభిమానం ఉంటుందని నేనెన్నడూ

ఊహించనైనా లేదు. నేనెక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేవారు వుండేవారు.  రచయితలు కుడా వారు రచించిన  కథానికల్లో 

నా పేరు, డాన్సు ని సంభోదించేవారు కూడా …నా ఆనందానికి అవధులు లేవనుకోండి .

ఇన్ని ఆక్టివిటీస్ మధ్య మీ చదువు ఎలా కొనసాగించారు ?

నేను ఇంక డే స్కాలర్ గా కంటిన్యూ చేయలేక పోయాను.  డాక్టర్ అవ్వాలని సైన్స్ చేస్తున్న నేను ఆర్ట్స్ సబ్జెక్

తీసుకోవాల్సి వచ్చింది.  మా ప్రిన్సిపాల్ గారు, సిస్టర్ ఆనా (Anna ) నాకు ప్రేత్యక ట్యూటరింగ్,   ప్రత్యేక సదుపాయాలు

చేసి పరీక్షలు రాయించేవారు.  ‘You put our school on world map’  అనే వారు ఆవిడ.  నన్ను ఓ   ప్రత్యేకమైన

స్టూడెంట్ గా స్కూల్ కి వచ్చిన ఫారెన్  డెలిగేట్స్ కి పరిచయం చేసేవారు. 

నా 17 ఏళ్ళ లోపు  జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఇవి (activities) .

మీ అభిమాన నర్తకీ, నర్తకులు ఎవరు?

 నాకు దగ్గరగా తెలిసిన నర్తకి నటి చంద్రకళ (సత్యం గారి స్టూడెంట్). అయితే ఆవిడ మాకు సీనియర్. ఆవిడ డాన్సు

అంటే ఇష్టం, ఆవిడంటే అభిమానం మాత్రమే.  పద్మ సుబ్రహ్మణ్యం (భరతనాట్యం), యామిని కృష్ణమూర్తి (కూచిపూడి)

నాకు ఇన్స్పిరేషన్ (inspiration).  కథక్ మాస్ట్రో  గోపికృష్ణ సూపర్బ్ (superb performer). 

 మీకు కవిత్వం ,రచనలు చేసే ఆసక్తి ఎలా కలిగింది?

డాక్టర్. సి. నారాయణరెడ్డి గారంటే నాకు  అభిమానం .నా డాన్సు ప్రోగ్రాముల వల్ల కలిసి, నా కూచిపూడి ‘రంగప్రవేశం’

నాటి నుండి నేటి వరకు కూడా నాకు, మా కుటుంబానికి సన్నిహితులైన వారు, నేనెంతో గౌరవించే డాక్టర్ సి.

నారాయణ రెడ్డి గారు.  సాహిత్య ప్రపంచాన ప్రముఖులు,  అయన కవిత్వమన్నా పాటలన్నా చెవి కోసుకొనేదాన్ని. 

నాకు జరిగిన సన్మానాలు ఎన్నో ఆయన చేతుల మీదుగానే, పూల గుచ్చాలు అందుకోడమో, శాలువ తీసుకోడమో, 

ప్రశంసా పత్రాన్నందుకోడమో జరిగేది ఆయన నన్ను తనదైన శైలిలో  మెచ్చుకొని, ఆశీర్వదించిన  ప్రోగ్రాములు 

లెక్కలేనన్ని.  నేను వ్రాసి మా అమ్మాయి చేత చేయించిన ‘కన్య’ డాన్సుప్రో గ్రాంకి వచ్చి,  ఆ కథని అయన ప్రశంసించిన

వైనం నాకు ఎంతో గుర్తు. నేను నిర్మించి, దర్శకత్వం వహించిన మా టెలి ఫిల్మ్  ‘ఆలయ నాదాలు’ కి ఆయన రాసిన ‘ఈ

జగమే నాట్యమయం’ అనే ఓ పాట ఆ ఫిలింకే  హైలైట్.  

ఆయన స్పూర్తి తో, కాస్తన్నా కవిత్వం రాయాలని నా చిన్ననాటి నుండి ఉన్న కోరిక నాకు.   *

(ఇంకావుంది)

– ముఖాముఖి: హేమలత పుట్ల 

 ‘నాట్య భారతి’ని ప్రశంసించిన పత్రికల నుండి…

Deccan Chronicle.. (Rangapravesam by Uma Bharathi -1972)

The 14 year old danseuse is Uma Bharathi, who, if she continues dancing and dedicates herself to popularizing the sadly neglected school of Kuchipudi may reach enviable heights…

Uma has the enthusiasm and discipline for perfecting her style. But most of all she has the confidence and for a teenager to virtually compel the attention of audience for over two hours she has remarkable poise and establishes rapport easily…

It was pleasantly surprising to see Uma Bharathi  depicting the coquettish, shy and versatile role of Satyabhama to almost near brilliance….the sincerity with which she assayed the range of emotions which one would naturally assume comes with maturity is visibly noticeable….(part of DC review by CK)

 

Johannesburg TV Pulse  1978 – Mr. Sydow ‘Guns of Navorone’ cameraman

‘The dancer’s eyes tell a million things to a million people’…

Uma’s eyes are the most expressive I have seen and captured through my camera lens…Mr. Sydow, the ‘Guns of Navorone’ unit cameraman said after a 9 hr shooting stint of the most popular Kuchipudi dances Tarangam and Gollakalapam among others.  Uma’s Expressions are a force to reckon with…Now dreamy, now tender, now desolate, now seductive she brings to her dancing -kuchipudi, a compelling beauty of emotion….       

                                                            *********************************

 

 

ముఖాముఖి, , , , , , , , , , , , , Permalink

2 Responses to కళల హారతి ఉమాభారతి -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో