భారతీయ నవలలలో ద్రౌపది(సాహిత్య వ్యాసం ) – గాయిత్రి దేవి పల్మాల్

ISSN – 2278  – 478

  ఇరవైయవ శతాబ్దంలో ప్రధానంగా ఏడవ / ఎనిమిదవ దశాబ్దాలనటి నుండి పురాణ కథ, పాత్రల ఆధారంగా భారతీయ రచయితలు కానీ రచయిత్రుల ద్వారా అనేక నవలలు వెలువడ్డాయి మరియు వెలువడుతున్నాయి కూడా. అయితే భారతీయ నవలలో మహాభారతంలోని మహనాయిక ద్రౌపది పాత్రను పరిశీలిస్తే, ఈప్పటి వరకు భారత దేశంలో విభిన్న భాషా, సంస్కృతి మరియు ప్రాంతల అనుగుణంగా ఈ పాత్రను కేంద్రంగా తీసుకొని ‘యాజ్ఞసేని’, ‘ద్రౌపది’, ‘పాంచాలి’, ‘కృష్ణా’ ఇలా అనేక పేర్లతో సుపరిచితమయిన ప్రత్యేక నవలలు రచించాబడ్డాయి. ద్రౌపది పాత్ర యెుక్క మిథ్ (పురాణం) ఆధారంగా పాత్రలు నూతన రూపుదాల్చాయి.

     నిజానికి ఈ నవలన్నిటిలో స్వీకరింపబడ్డ విషయమేటంటే, ద్రౌపది కేంద్రిక భారతీయ నవల అన్నిటికి వ్యాసప్రోక్త మూలభారతమే ఆధరా వస్తువు. అయితే ఈ సందర్భంలో ఒక్క ప్రశ్న, భిన్న భిన్న భాషా, సంస్కృతి, ప్రాంతంతో పాటు రచయితల ఆలోచన విధానం ద్వారా సమస్తా నవలలు సమానత్వం వహించగలదా ? మనం దినికి సమధానంగా – కాదు అనే చేప్పవచ్చు. కారణం వాస్తవికంగా ఆధునికోత్తర వాదం (Post-Modernism) కాలంలో మిథ్ యెుక్క పునః ముల్యాయనం, స్త్రీవాదం దృష్టి , మనో విశ్లేషణా ఇత్యాది ప్రముఖ విషయాన్నీ ఆధారంగా చేసుకొని నవలా పరిధి విస్తృతమైయింది వాస్తవమే కావచ్చు. కాని భాషా-భాషా, సంస్కృతి-సంస్కృతి, ప్రాంతం-ప్రాంతం ఇంకా ఆంగిక, ఆత్మిక భావలతో ఈ నవలా సాహిత్యం నూతన అభిముఖం దాల్చయి. రచయితల ద్వారా తమ కొత్త ఆలోచనతో స్వాతంత్ర్యని ప్రతిపాదించాయి. అందుకే ద్రౌపదిని ప్రధానంగా వ్యక్తపరుస్తు రచించిన నవలలలో రచయిత వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రించారు. ముఖ్యంగా పౌరాణిక ద్రౌపది పాత్రను ఆదర్శం, ఉత్తమ వ్యక్తిత్వం ప్రతిబింబ ప్రేరణతో అధునిక సమాజంలో మహిళకు ప్రతీకగా చేసి, ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తద్వారా మన పౌరాణిక పాత్రలను ఈనాటి సమాజానికి చేరువ చేసే ప్రయత్నం చేయగలిగారు.

            ఈ సృజనాత్మక ప్రక్రియలో మనకు తెలిసిన మహాభారత గాధే అయినా ఇవి ముఖ్యంగా ద్రౌపది దృక్పథం నుంచి చెప్పబడిన కథ. ద్రౌపది మనోభావాల కథ. ఇంకా చెప్పలంటే ఆమెకెదురైన విపరీత పరిస్థితులకు ఆమె స్పందనల కథ. పురాణంలో అలౌకిక శక్తిసంపన్న దేవి అయినా ద్రౌపది ఈ రచనలో సర్వసాధారణ స్త్రీ స్వభావం గల ప్రేమ, ప్రణయ, అభిమాన, ఈర్ష, క్రోధం, అహంకారం, పగ వగైరా మానవీయ భావజాలం పుణికి పుచ్చుకొని ఉద్భవించింది. ఇలా భారతీయ నవలలలో ద్రౌపది పాత్రను సజీవంగా అందించాలన్నా తపనతో రచయితలు మరియు రచయిత్రుల ద్వారా ఆమె సార్వజనికమైన మహిమాన్వితగా ప్రస్పుటితం అయింది. కావచ్చు స్త్రీ స్వతహాగా సుకుమారం కానీ అవసరం వస్తే స్త్రీని మించిన కాఠిన్యం మరొకరికి లేదు అనే స్త్రీవాదం, స్త్రీ యెుక్క అస్తిత్వం ఆయా నవలలలో ప్రతిఫలించాయి.

          కర్మ, భక్తి, సతీత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయాల్లో నూతనత్వాన్ని పరిచయం చేయడమే కాక ద్రౌపది పాత్రలో ఉన్న మహనీయ వ్యక్తిత్వం, భారతీయ నవలల సంస్కృతి సాంప్రదాయ పరంగా ఒక్కోక్క విశిష్టతని ప్రదర్శించాయి. కానీ ద్రౌపది పాత్ర చిత్రణ సమయంలో, రచయిత రచయిత్రి వివిధ అంశంలో వ్యాసప్రోక్త మూలభారతంలోని కథాంశాని సమానంగా ఉపయోగించారు. అక్కడక్కడ ద్రౌపది మానసిక భావంలో స్వయంగా కల్పించుకున్న సందర్భాల ద్వారా వారి వారి స్వతంత్ర ; రచన శైలిలో రూపొందింది. తద్వారా భారతీయ నవలలలో ద్రౌపది యెుక్క స్వభావం సూక్ష్మతిసూక్ష్మంగా విభిన్నతని ప్రతిపాదించడంలో సఫలం అయింది.

   ఇప్పటివరకు ద్రౌపది పాత్రనుగుణంగా సృష్టించబడిన భారతీయ నవలలన్నింటిని పరిశీలన చేయగా :

ఒరియా భాషాలో – ప్రతిభా రాయ్ గారి ‘యాజ్ఞసేని’ (1985), సురేంద్రనాథ్ శత్పథీ గారి ‘కృష్ణా’ (2004), శుకదేబ సాహు గారి ‘ద్రౌపది’ (2006), కులమణి జెన గారి ‘గాంధారి కుంతీ ద్రౌపది’ (2008), ప్రఫుళ్ళ కుమార్ త్రిపాఠీ గారి ‘పాంచాలి’ (2013), రబ్ నాయక గారి ‘కృష్ణార ఆత్మళిపి’. 

బెంగాలీ భాషాలో – నృసింహ ప్రసాద్ భాదుడి గారి ‘కృష్ణా, కుంతీ ఎబం కైంతేయ’ (1998).

హిందీ భాషాలో – బచ్చన్ సింగ్ గారి ‘పాంచాలి’ (2001), మనుశర్మ (శ్రీ హనుమనా ప్రసాద్ శర్మ) గారి ‘ద్రౌపదికి ఆత్మకథ’ (2011), సుశీల్ కుమార్ గారి ‘పాంచాలి’ (2011), రాజేశ్వర్ బశిష్ఠ గారి ‘యాజ్ఞసేని’ (2018), సచి మిశ్రా గారి ‘పాంచాలి’ (2019).

తెలుగు భాషాలో – ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ గారి ‘ద్రౌపది’ (2009), కస్తూరి మురళీకృష్ణు గరి ‘సౌశీల్య ద్రౌపది’ (2010,నవలిక), డా. ఎం. వి. రమణా రెడ్డి గారి ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’, బ్రహ్మశ్రీ త్రోవగుంటవేంకట సుబ్రహ్మణ్య గారి ‘యాజ్ఞసేని’. 

అస్సామీ భాషాలో – పరిణితి శర్మ గారి ‘ద్రౌపది’ (2016).

గుజరాతీ భాషాలో – కాజల్ ఒఝా బైద్య గారి ‘ద్రౌపది’ (2011).

నేపాలీ భాషాలో – రాజేంద్ర థోపా గారి ‘ద్రౌపది’ (2013).

ఇంగ్లీష్ భాషాలో – చిత్రా బెనర్జీ దిబాకరుణీ గారి ‘The Palace of Illusions’ (2008), సరస్వతి నాగపాల్ గారి ‘Draupadi : The Fire-Born Princess’ (2012), ఠాకుర్ సింహ గారి ‘Draupadi the Abandoned Queen’ (2014), త్రిష దాస్ గారి ‘MS Draupadi Kuru After the Pandavas’ (2016), ఇషితా సేన్ గారి ‘Draupadi : A Saga of Love, Life and Destiny’ (2016), సౌరభ ఖానా గారి ‘I am Draupadi me through my own eyes’ (2018), సాఇ స్వరూప లాయర్ గారి ‘Draupadi the tale of an Empress’ (2019).

మరాఠీ భాషాలో – డ. పద్మంకర విష్ణు బర్తక గారి ‘తేజస్వినీ ద్రౌపది’ (2006,ధార్మిక పుస్తకం).

           

ఉదాహరణకు   యాజ్ఞసేని –                                   

  ఒరియా రచయిత్రి ప్రతిభా రాయ్ గారి సుపరిచితమైన నవల ‘యాజ్ఞసేని’. ఇది ముఖ్యంగా ఆత్మ కథనం, ఫస్ట్ నరీసన్ శైలి ( ప్రథమ వర్ణన శైలి ), లేఖ శైలిలో రచించబడ్డ నవల. శ్రీకృష్ణుడుని ఉద్దేశించి యాజ్ఞసేని లేఖ రూపంలో వ్రాసిన స్వీయ జీవిత గాధ పునఃపఠనామే ఈ నవలలోని కథాంశం. యాజ్ఞసేనినీ ప్రతిభా రాయ్ గారు మానవీయ భావజాలం పుణికి పుచ్చుకొనే స్త్రీ మనస్తత్వంతో, ఆమె మనసులో రహస్యంగా దాగి ఉన్న భావం యొక్క చిత్రపఠాన్ని మన కళ్ళ ముందు వాస్తవికంగా నిలబెట్టారు. నిరంతర మనసులోని కలహాలు మరియు సమకాలీన సమాజంలోని స్త్రీలాగా యాజ్ఞసేని ఈ పుటల మీదికి నడిచి వచ్చిందేమోనని అనిపిస్తుంది. ప్రేమ, ప్రణయ, రాగద్వేషాలు, ఈర్ష, స్వాభిమాన,అభిమాన, అహంకర,గర్వం, క్షమాగుణం, విదుషీమణి,సఖి, మాతృ హృదయ మూర్తి ఇత్యాది మానవతా సంపన్నురాలుగా ప్రతిబింబిస్తుంది . ప్రతీకార కాంక్ష ఉన్నప్పటికీ దుశ్శాసనుడి రక్తం ఆమె హృదయాన్ని కుదిపేస్తుంది , అందుకే కుల , మత , వర్ణ సంబంధం లేకుండా సమస్త శత్రువు రక్తం యాజ్ఞసేనికి సరిసమానంగా కనబడుతుంది . దేశభక్తి , విశ్వ మానవ శక్తి కొరకు విశ్వ కళ్యాణ భావం , మానవ వదంల సామిశ్రణ రూపంతో ఎంతో ఉన్నత స్థానాన్ని అధిగమించిన కథానాయకే ఈ నవలలోని యాజ్ఞసేని.

కృష్ణా,కుంతీ ఎబం కైంతేయ –                                 

    బెంగాలీ రచయిత నృసింహ ప్రసాద్ భదుడి గారి ఈ నవల ఒక వైవిధ్య స్వతంత్రమైన రచన అని చెప్పవచ్చు . కారణం ప్రధానంగా మహాభారతంలోని కృష్ణా , కుంతీ , గాంధారి ఇలా మూడు పాత్రల చుట్టూ పరివేషించిన కథనమే ఈ నవల . ఈ మూడు పాత్రల ద్వారా కేంద్రీకృతమైన విశ్లేషణాత్మక , థర్డ్ నరీసన్ శైలి ( తృతీయ వర్ణన శైలి ) లో రచించబడిన ఈ నవల భారతీయ నవలాలోకంలో నూతన సృజనాత్మక రచన . నవల యొక్క ప్రారంభ దశనుంచే కృష్ణా పంచపతుల పత్నిగా గర్వంతో ఉట్టిపడుతుంది . అలాగే కృష్ణాను సీత , సావిత్రి వంటి ఆదర్శ భవం , నిస్తేజమైన , నిస్సహాయమైన , అణిగిమణగి ఉన్న పాత్ర కాదు అని రచయిత వర్ణించేరు . సహజంగా స్త్రీకు ఉన్న గుణం ఆమెలో లేదు , తన అడుగులకు మడుగు లొత్తేందుకు సిద్ధంగా వున్న పంచ పతులను తన ఉగ్ర స్వభావంతో ప్రభావితం చేస్తున్నట్లు ఇందులో వర్ణన వుంది . అయితే ఈర్ష , అభిమాన , రాగద్వేషాములతో సహా కేవలం పౌరుషం , వీరత్వాన్నే తను సమర్థిస్తుంది . మొత్తంగా క్షత్రియ ధర్మానుసారంగా కృష్ణా కోరుకొంటుంది ఒక్క జీవితం బదులుగా ఇంకో జీవితం . అయినప్పటికీ ఆమె జీవితం ఒక అంతులేని పీడా , క్షోభ , చింతించడంలోనే ఉండిపోయింది .

ద్రౌపదికి ఆత్మకథ –                      

    హిందీ రచయిత మనుశర్మ గారి ఈ నవల ఆత్మకథ శైలిలో రచించబడినది. ఇందులో కధంశాం చివరి నుంచి ప్రారంభం అవుతుంది. నవల ప్రథమ అవస్థనుండె ద్రౌపది మానసిక అపరిపక్వత మరియు బాల్యపు చాపల్యన్ని మనం అనుభవించగలం. ద్రౌపది తన పేరులోనున్న వైరాగ్య భవన ఇంకా వివాహం తర్వాత తల్లిదండ్రులను విడిచి హస్తినాపురం వెళ్ళటం ప్రసంగం ద్వారా తెలుసుకోవచ్చు . ఇహ ఆమె ఈర్ష , అహంకారం , విధి లిఖితం , దుఃఖం , ప్రతీకార కాంక్ష , హింసాత్మక ఆనందం వగైరా విషయాలో సహజ సంపూర్ణమైన మహిళా గుణాలతో ప్రతిబింబిస్తుంది. అంతేకాక వైవాహిక జీవితపు స్త్రీ , తన సాధారణ క్రియ ప్రతిక్రియలన్నిటినీ రచయిత అతి సూక్ష్మతిసూక్ష్మంగా ప్రదర్శించడం కనబడుతుంది . అయితే ఏ ప్రతీకార ఆకాంక్ష వలన ఆమె ఉద్భవించిందో చివర వరకు ఆ ప్రతీకార వాంఛ ద్వారానే పరిసమాప్తి చెందుతుంది. సంసారం భావాం యొక్క స్త్రీ సుఖదుఃఖాలతో ద్రౌపది పాత్ర సంపూర్ణ మానవ రూపంతో పరిచితం అవుతుంది . ఇది ‘ ద్రౌపదీకి ఆత్మకథ ‘ లో ద్రౌపది ఆత్మకథలోని నూతన కోణం.

కృష్ణ –                                                                 

   ఇంకోసారి ఒరియా రచయిత సురేంద్రనాథ్ శత్పథీ గారి ద్వారా వెలువడిన నవలే ‘ కృష్ణ ‘ . ఆత్మకథన శైలిలో చెప్పబడ్డ ఈ నవల ప్రారంభం అవుతుంది ప్రాణం వున్న కృష్ణా ముఖం నుండి కాదు , శరీరం లేని కృష్ణా ఆత్మ నుండి . గడిచిన దీర్ఘ ఐదువేల సంవత్సరం నాటి ఆమె పేరులో కళంకం వచ్చాయి , అది అస్పష్టహీన మూలం . అయితే ఇందులో గతం వర్తమాన యొక్క సంబంధ సూత్రాన్ని సూచిస్తు , హస్తినాపురంలోని ధ్వంసస్థూపం పైన ఈనాటి డిల్లీ మహా నగరం నిర్మించబడ్డ విషయం మరియు ఆయా ఉద్యానవనంలో అర్ధరాత్రి అవగానే ఏడ్చి తిరుగుతున్న అతృప్తా ఆత్మ ఇలా రచయితలోని స్వాతంత్ర దృష్టికోణం ప్రతిఫలిస్తుంది . అయితే తన జీవిత దశలో అనుభవించిన దుర్దశలన్నిటి కొరకు కాదు ఈ ఏడుపు , తను మరణించిన సుదీర్ఘ సంవత్సరాల తరువాత కూడా ఆమె సంస్పర్శలో వచ్చిన ఎన్నో కథలే ఇందుకు కారణం . కానీ తన ఈ చెడ్డపేరుకి సృష్టికర్త వ్యాసదేవుడుని ఆమె నిందించడం లేదు . ఆమె నిందిస్తుంది నికృష్టమైన కొంతమంది రచయితలు మరియు కవులను. ఇక్కడ కృష్ణా తన పుట్టుక సంబంధంలో కొత్త విషయాన్ని చెబుతుంది , ఆమె ద్రుపద రాణి గర్భం నుండి అవిర్భావం అయింది. ఇది రచయిత కాల్పనిక భావం అయినప్పటికీ కృష్ణా మానవీయ మహిళలాగా జన్మించిన తరువాత శైశవం , శైశవంలో వివిధ ఆటపాటలతో సహజంగా కనిపిస్తుంది . కర్ణుని ప్రతి ఆకర్షణ , దుశ్శాసనుడి రక్తం కోసం కేశాలను విడిచి పెట్టడము , అశ్వత్థామను వధించ లేదని దుఃఖించడం , యుద్ధం యొక్క ప్రధాన కారణం వాంటి విషయాలన్నిటిని కృష్ణా ప్రతివదిస్తుంది . విశ్వ మాతృత్వ భావంతో ఉదారంగా , త్యాగశీలగా కనపడటమే కాక తన శరీరం పంచభూతాలను సృష్టిలో విభిన్నంగా కలిసిపోవాలని కోరుకొంటుంది. ఇక్కడే నవల కథాగమనము చెందుతుంది సమాప్తి . జీవితంలోని సమస్త ఆశాంతి , ఆసంతృప్తి , అగాధ దుఃఖం నుండి ఆమె శాంతి రూపక అమృతధారను అన్వేషించి శాంతిగా మరణిస్తుంది .

గాంధారి కుంతీ ద్రౌపది –                               

   పురాణ దేవి గాంధారి , కుంతీ మరియు ద్రౌపది పాత్రనుగుణంగా ఒరియా భాషలో సృష్టి అయిన నవలే రచయిత కులమణి జెన గారి ‘ గాంధారి కుంతీ ద్రౌపది ‘ . ఇది గాంధారి , కుంతీ , ద్రౌపది పాత్రను ప్రధానంగా చూపుతూ వ్రాయబడిన నవల . ద్రోణాచార్యుడి వధ కొరకు అర్జునుని వివాహమాడటం , క్షత్రియులందరిలో భయం సృష్టించి ప్రపంచంలో పాపభారంనీ తగ్గించడమే ఈ నవలలో ద్రౌపది యొక్క జననం అని రచయిత స్పష్టత ఇచ్చారు . ఆమె పరిస్థితిని స్థిరచిత్తతో అర్ధం చేసుకొనే నేర్పు , ఈర్ష విహీన , శాస్త్రజ్ఞురాలి , అభిమాన , న్యాయవాదిని , నిర్భయంగాల స్త్రీ . సత్తీ స్త్రీ శాపం నిష్ఫలం కాదు అదే కురువంశీయులకు అభిశాపం అని రచయిత ద్రౌపది ద్వారా నిరుపించారు . తన పతుల దుర్భరవస్థకు స్వయానా భగవంతుడుని కూడా విమర్శించడంలో వెనుకడుగు వెయ్యలేదు ద్రౌపది . చివరికి తన జీవిత అంతిమ ముహూర్తంలో యోగభ్రష్ట అయి పతనం చెందింది . ఆమెను ఈ నవలో మృత్యువు తరువాత స్వర్గలోకంలో లక్ష్మీ స్వరూప కాంతిమయిగా అవతరించినట్లు , తేజస్విని , క్షత్రియతేజ ప్రేరణధాత్రి , స్పష్టవాదిని , కర్తవ్యనిష్ఠ , భక్తిమతి ఇత్యాది సర్వగుణ సంపన్నురాలి స్త్రీ పాత్రగా చూపడంలో రచయిత యొక్క దృష్టి ప్రశంసనీయం .

ద్రౌపది –                                                                 

    తెలుగు రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి నవలలో ద్రౌపది ఒక అసాధారణమైన సౌందర్యరాశి . ఆమె సాధారణ మానవ స్వభావగల మహిళ. అంతేకాక పగతో రగిలిపోయే ప్రతిహింసరాలుగా శత్రువుల రక్తపాతంతో సంతృప్తి అనుభవిస్తుంది . కానీ సమస్య వచ్చినప్పుడల్లా విధి వైపరీత్యం అని మనసుని సమాధాన పరుచుకుంటుంది . కర్తవ్య పాలనలో సునిశితంగా ఆలోచించగలిగే స్త్రీ అయినప్పటికీ ఆమె సమస్త జీవితంలో అనేక అవమానాలను , తప్పిదాలన్నిటికి కేవలం యుధిష్ఠిరుడే కారణం అని ఈ నవలలో నిందిస్తునట్లు కనబడుతుంది. అయితే మృత్యువుకు చేరువవుతున్న చివరి దశలో కూడా ఒకలాంటి సందిగ్ధ, ప్రశ్నల నడుమ ప్రాణవాయువుని శ్రీకృష్ణుని వేణుగానంలో విడిచి పెడుతుంది. ఇక్కడ రచయిత స్త్రీవదం , స్త్రీ స్వాతంత్ర్యం , అస్తిత్వం , సమానత్వం వంటి విభిన్న అంశాలపై ప్రాధాన్యత ఇస్తూ ద్రౌపది పాత్రను చాలా సున్నితమైన భావంతో వర్ణించేరు . ఆమెను శృంగారానురక్తగా చిత్రించటం , తన భర్తలతో భోగించటంపై ఉన్న మక్కువను ఈ నవలలో చెప్పబడింది . ఇది రచయిత యొక్క కల్పన కాదు , ఆదిపర్వములోని పంచేంద్రోపాఖ్యానమే ఇందుకు కారణం. ఇహ సహజంగానే పరస్పర అనురాగరక్తులూ, యవ్వనవంతులూ ఐన భార్యాభర్తల సర్వసాధారణ శృంగార దృశ్యాలుగా స్వీకరింప బడతాయి . ఆమె మహోన్నత వ్యక్తిత్వం , ఆత్మవిశ్వాసం , సౌశీల్యాన్ని , కుమారైగా , సోదరిగా , భార్యగా , తల్లిగా , శ్రీ కృష్ణుని సఖిగా , మహారాజ్ఞిగా , రాజనీతిజ్ఞురాలుగా , విదుషీమణిగా , ఉత్తమ ఇల్లాలుగా , గృహిణిగా ఇలా వివిధ రూపాలలో వ్యక్తిత్వ గరిమను వివరించడంలో రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ఈ నవలా రచనోద్దేశం సఫలీకృతం అని చెప్పవచ్చు. ఒక్కొక్క పాత్రల భవంలో ద్రౌపది చాలా సూక్ష్మంగా ఒదిగిపోయినట్లు స్పష్టంగా కనబడుతుంది. ద్రౌపది పాత్రను కేంద్రీకరించి విశ్లేషణాత్మకంగా 50 అధ్యాయాలుగా వెలువడిన ఈ నవల మిశ్రిత ( Hybrids ) కలగలిపిన వర్ణనా శైలిలో వ్రాయబడినది.

పాంచాలి –                                            

  ఆత్మకథన శైలిలో వేలుబడ్డ ‘పాంచాలి’ ఒరియా నవల సాహిత్యంలో రచయిత ప్రఫుళ్ళ కుమార్ త్రిపాఠి గారి రచన . ద్రౌపది పాత్రలోని మహోన్నతనను ఉపస్థాపించడమే ఈ నవల మూల ఉద్దేశ్యం అని రచయిత చెబుతారు . ఇంద్రుడి పత్ని సాచి అంశంగా పాంచాలిని వర్ణిస్తారు రచయిత . ఇక్కడ పాంచాలి పరిస్థితి ప్రభావంవల్ల పాండవులను స్వీకరించిన కూడా వివాహ ఉత్సవంలో ఆమె స్వతంత్ర ఆలోచనలతో కనబడుతుంది, బహు పురుషులకు అంగ దానంన్ని తను ఎలా గ్రహింపగలదు అని భావిస్తుంది . పాంచాలి ఎంత పరిపక్వ చెందిన స్త్రీ అయినప్పటికీ సమస్య ఎదురైనప్పుడు విధి నిర్ణయమని శ్రీకృష్ణుడిని స్మరించేది . ప్రాతీ దీన పరిస్థితిని కూడా ఏ మహత్ ఉద్దేశ్యసాధనకు బీజమో అని వివేకంతో ఆలోచిస్తుంది ప్రఫుళ్ళ కుమార్ త్రిపాఠి గారి పాంచాలి . అంతిమ యాత్రలో పాంచాలి దేహం నిస్తేజంగా పడివున్నప్పటికీ ఆమె ఆలోచన శక్తి ద్వారా తెలుసుకొంటుంది – కచ్చితంగా కర్మ యోక్క ఫలితాన్ని అనుభవించుతాం , ఇందులో ఎటువంటి మార్పు లేదు . పాంచాలిని సాధారణ స్థాయి నుండి ఒక్క మహనీయ వ్యక్తిత్వంగా పరిచయం చేయడంలో రచయిత ప్రయత్నం సఫలీకృతం అని చెప్పవచ్చు.

కృష్ణార ఆత్మళిపి –                                                  

   ఒరియా రచయిత రబి నాయిక గారి ‘కృష్ణార ఆత్మళిపి’ ద్రౌపది పాత్ర చుట్టూ కేంద్రీకృతమైన భిన్న ఒక్క ఆత్మకథ శైలిలో రచించబడ్డ నవల . కృష్ణా పాత్ర ఇందులో అపరిపక్వంగా కనబడుతుంది , తన స్వయంవరంలో ఎవరు ఉత్తీర్ణులు కారు అన్న విషయం ఆమెలో ఆనందాన్ని కలిగించింది . కారణం ఎల్లప్పుడు తను తన తండ్రి వద్దే ఉండి పోతుంది అని . కానీ ప్రతి పరిస్థితిని విధి లిఖితమనే అనుకొంటుంది . కురుసభలో శ్రీకృష్ణుని అనుపస్థితి వల్ల అభిమాన పడుతుంది. అయితే ఇందులో కృష్ణా స్వయంగా తనే అంగీకరిస్తుంది , కేవలం తన వల్లే ఈ మహాభారత యుద్ధం సంభవించింది. ఎందుకంటే కౌరవుల వినాశమే కృష్ణా ఏకైక లక్ష్యం మరియు స్వప్నం. తన ఈర్ష వల్ల వేరే ఎవరితో సన్నిహితంగా ఉండలేక పోయేది. ముఖ్యంగా కృష్ణా స్వాభిమానం గల స్త్రీ , ఆమె దృష్టిలో అవమానిత జీవితం కన్నా గౌరవమైన మరణమే శ్రేష్ఠం . ఇహ ఆమె ఆదర్శం , న్యాయల కన్నా తీవ్ర ప్రతీకార కాంక్ష కలిగిన స్త్రీ , అందుచేతనే దుశ్శాసన , దుర్యోధనల వధ , శత్రువుల రక్తపాతంవల్ల కృష్ణా అనుభవించ గలుగుతుంది ఒక్క పైశాచిక ఉల్లాసం . ప్రతికార కాంక్షతో జన్మించిన కృష్ణా , ఆ ప్రతికార కాంక్ష అనంత భావనలోనే వుండగా నవల శేషామవుతుంది . కృష్ణా ఈ నవలలో మరిణించ లేదు , కారణం ఆమె కేవలం క్షోభ , దుఃఖానుభవంతోనే వుండిపోయిందని రచయిత యోక్క ఉద్దేశ్యం.

సంపూర్ణంగా ఈ భారతీయ నవలనీటిలో ఒక పురుష రచయిత కానీ స్త్రీ రచయిత్రి కానీ వారివారి నూతన దృష్టికోణంతో ద్రౌపది పాత్ర ద్వారా మహిళ మానసిక విషయాన్ని ప్రతిపాదించడంలో తమవంతు న్యాయాన్ని చేకూర్చరు. సమస్తా విభిన్నతలోను ద్రౌపదిలో అర్జునుని ప్రేమ, శ్రీకృష్ణుని భక్తితో ఆత్మ సమర్పణ, న్యాయవాది దృష్టితో సూక్ష్మ బుద్ధి యెక్క మధుర సమన్వాయ, ఆసామాన్య తేజస్విని, గరిమమైల సత్తిత్వా సంపన్న వ్యక్తిత్వం, సమస్త సద్గుణాలు అధికారిని అయినాను చివరి వరకు అనంత దుఃఖ, క్షోభతో అశేషా సంబేదనాతాను పఠాకాప్రాణులలో సృష్టించ గలిగింది. విభిన్న భాష, సంస్కృతి, ప్రాంతాలను ఛేదించుకొని భారతీయ నవలలలో ద్రౌపది సమకాలీన సమాజంలోని స్త్రీగా వాస్తవికంగా దృశ్యం కావడంలో సమానత్వాన్ని పొందడమేకాక, భారతీయ నవల  సాహిత్యంలో ఓ నూతనత్వన్ని పరిచయం చేయగలిగింది.

ఆధార  గ్రంథాలు 

తెలుగు : 1. లక్ష్మీప్రసాద్, యార్లగడ్డ, 2015. ద్రౌపది. హైదరాబాదు:ఎమెస్కో బుక్స్.

హిందీ :

  1. चौधरी, इन्द्रनाथ, 2006. तुलनात्मक साहित्य-भारतीय परिप्रेक्ष्य. नई दिल्ली:बाणी प्रकाशन.

  2. शुक्ल, हनुमानप्रसाद, 2015. तुलनात्मक साहित्य : सैद्धांतिक परिप्रेक्ष्य. नई दिल्ली:राजकमल प्रकाशन.

ఆంగ్లం :

  1. Apter, Emily, 2006. The Translation Zone : A New Comparative Literature. America:Princeton University Press.

  2. Dominguez, Cesar, Saussy Haur, Villanueva Dario, 2015. Introduction Comparative Literature : New Trades and Applications. London and Newyork:Routledge Taylor & Francis group.

ఒరియా :

  1. బెహెరా, అక్షయ, 2016. కథా కథా కవిత కవిత. ఒశో టైమ్స్.

  2. మహాపాత్ర, శ్రీరఘునాథ, 2006. ద్రౌపదింక ఆత్మకథ (అనువాదం). కటక్: ష్టడెణ్టస్ ష్టోర.

  3. రాయ్, ప్రతిభా, 2015. యాజ్ఞసేని.కటక్:ఆద్య ప్రకాశనీ.

  4. శత్పథీ, సురేంద్రనాథ్, 2004. కృష్ణా. కటక్:బిద్యాపురీ.

    5.త్రీపాఠీ, ప్రఫుళ్ళ కుమార్, 2013. పాంచాలి. భువనేశ్వర్:పశ్చిమా పబ్లికేషన్స్.

— గాయిత్రి దేవి పల్మాల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో