మాటలంటే……. మాటలా ?

ఆయుధం కన్నా పదునైనది
అగ్ని గోళం మంత మెరుపైనది
హిమం కన్నా చల్లనిది
సుమం కన్నా పరిమళమైనది— మాట 
నిశబ్దపు మేడల గోడల్ని
శబ్దం అనే అస్త్రం తో పడగోట్టేడి — మాట
నిండు మనస్సును నిలువునా కాల్చేది
పండంటి బతుకుని చితిలా పేల్చేది—మాట 
అంతరాల దొంతరల్ని మార్చేది
వింత మలుపు జనంలో కూర్చెది— మాట
నిరాశ నిస్పృహల నీడలో
ఆశల మేడలు నిర్మించేది ఒక — మాట
ప్రభువుల జాతకాలను భాష్యం చెప్పేది
రాజ్యాలలో రబసను పుట్టించేది — మాట
ఒక క్షణం లో ఆనందపు అంచుల్ని తాకించే
మరో క్షణం లో అగాదపు గోతుల లోతుల్ని చూపేది — మాట 
సత్యాన్ని క్షణం లో హత్య చేసి
అసత్యానికి జండా లూపెది— మాట
వత్సరాల  వలపు వసంతాలను
క్షణాల్లో నిశీధిగా మార్చేది — మాట
వెలిగే జీవితాల మద్య తిమిరాన్ని
తియ్యని స్నేహం వెనుక సమరాన్ని పుట్టించేది — మాట
నిర్మల తటాకంలో రాయి ముక్కలా
పాల గిన్నెలో విషపు చుక్కలా ఒక — మాట
కన్నీటి వెల్లువకు కట్టవేసేది
పన్నిటి జల్లులు కురిపించేది — మాట
కాల వాహినీ తీరం దూరమైనా దరిచేర్చి
గుండెలోతుల్లో ఈతలు వేసేది — మాట
మాటను తూచి మాట్లాడితే ఫలం
ఇష్టమొచ్చినట్టు వాడితే కలకలం
బతుకు పుస్తకంలో అనుభవాలే అక్షరాలు
సమయోచిత భాషణలో ‘మాట’ లే అస్త్రాలు

డా. ఊటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

                                                            

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , , , , , Permalink

One Response to మాటలంటే……. మాటలా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో