ఫ్రెంచ్ సృజన శిల్పి కొమిల్లీ క్లాడెల్(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

శిల్పం లో సృజన తో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ మహిళ కొమిల్లీ క్లాడెల్.ఉత్తరఫ్రాన్స్ లో ఫెరె యెన్ టార్డినస్ ఐస్నే లో 8-12-1864 రైతుకుటుంబం లో జన్మించింది .తండ్రి లూయీ ప్రాస్పర్ క్లాడెల్ తనఖా వ్యాపారి .తల్లి కేధలిక్ కుటుంబానికి చెందిన సేర్వాక్స్ . క్లాడెల్ చిన్నతనం లోనే తండ్రి కుటుంబాన్ని విలినోవ్ కు మార్చాడు .తమ్ముడు పాల్ పుట్టాక కుటుంబం  బార్ లే డక్ కు 1870లో మారింది .తర్వాత మరో రెండు చోట్లకూ మారినా వేసవికాలం విల్లినోవ్ సర్ ఫేర్ లోనే గడిపేవారు .ఇక్కడి ప్రకృతి అందాలు అందర్నీ ఆకర్షించేవి .1881 తల్లీ తమ్ముడు లతో కొమిల్లీ పారిస్ లోని మోంటా పర్మాసెస్ చేరింది .

  యవ్వనం  నుంచి క్లాడెల్ కు రాయి ,మట్టి పై అభిమానం ఎక్కువ .యువతులకు ప్రవేశమున్న అకడేమిక్ కొలరాస్సీ లో చేరి  ఆల్ఫ్రెడ్ బ్రోచేర్ అనే ప్రసిద్ధ శిల్పి దగ్గర విద్య నేర్చి, 1892లో ఒక వర్క్ షాప్ అద్దెకు తీసుకొని ,ఒక ఇంగ్లిష్ అమ్మాయి లిస్సీ లిప్ కాంబ్  తో కలిసి  పని చేసింది  .ఆల్ఫ్రెడ్ బ్రోచేర్ ఆమె మెంటార్ అయ్యాడు .అతని బస్ట్ శిల్పం చేసి గురుభక్తి ప్రకటించింది .వీళ్ళకు మూడేళ్ళు బోధించాక ఆయన ఫ్లారెన్స్ కు  వెళ్ళిపోతూ ప్రముఖ శిల్పి ఆగస్టీ రోడిన్ కు బాధ్యత అప్పగించాడు . తర్వాత రోడిన్ పై ఆరాధన భావం పెరిగి దగ్గరైంది .

  1884లో రోడిన్ వర్క్ షాప్ లో పని చేసింది .అతని మోడల్ గా కూడా ఉన్నది .అతనికి ప్రేరణ శక్తి అయింది .అయితే రోడిన్ తనభార్యను వదిలిపెట్టలేక పోవటం తో అతనితో  కలసి ఉండలేదు.ఈమె ధోరణి తల్లికి నచ్చక పోవటం తో కుటుంబం నుంచి బయటకు వచ్చింది .1892లో అబార్షన్ అయ్యాక ,రోజూ రోడిన్ ను చూస్తున్నా దగ్గరకాలేకపోయింది .క్లాడెల్ కళలో గొప్పతనం ఉన్నా, మహిళ కనుక ఆమె భావాలకు తగిన పోషకులు కనపడలేదు .తల్లీ సోదరుడూ కూడా పట్టించుకోలేదామెను.బిచ్చగత్తె బట్టలతో వీధుల్లో తిరిగేది ఆలనాపాలనా లేక .

రోడిన్ ప్రభావం వలన కాక తన అద్భుత సృజనవలన  క్లాడెల్ వెలుగులోకి వచ్చింది .నవలారచయిత కళా విశ్లేషకుడు ఆక్టేవ్ మిర్బూ ఆమెను  ‘’ప్రకృతిపై తిరుగుబాటు చేసిన మహిళా మేధావి ‘’గా గుర్తించి ప్రకటించాడు .మొదట్లో ఆమె చేసిన శిల్పాలు రోడిన్ మోడల్ లో ఉన్నా అందులో ఆమె సృజన ,ఊహ ప్రస్పుటంగా కనిపించేవి .ఆమెకు బాగా పేరు తెచ్చిన శిల్పం ‘’బ్రాంజ్ వాల్ట్జ్ ‘’లో ఇది ఇంకాబాగా గోచరమైంది .ఆ శతాబ్దిలో ఉన్న ఏకైక మహిళా శిల్పి’’ బెర్తి మారిసాట్ ‘’కున్న మేధ క్లాడెల్ నుదురుపై కనిపిస్తు౦దన్నాడు లూయీ వాక్సేల్లెస్ అనే క్రిటిక్ .ఆకాలపు పురుష శిల్పులకన్నా విభిన్నమైన శైలిలో ఈమె శిల్పాలు౦డేవి .తన శిల్పాలకంటే క్లాడెల్ శిల్పాలు మహా కళాత్మకం గా ఉండటం వలన ,ఆమె ఎప్పటికైనా తనకు పోటీ అవుతుందని రోడిన్ ఆమెకు బ్రేకప్ చెప్పివుంటాడని మరో మగ శిల్పి మొర్హాడ్ చెప్పాడు. అది నిజమే అన్నారు కరన్ఫా మొదలైనవారు .

  క్లాడెల్ చెక్కిన’’ ఒనిక్స్ ‘’,మరోచిన్న  కంచు శిల్పం లా వేగ్(కెరటాలు ) ఆకాలపు రోడిన్ శైలికి పూర్తిగా భిన్నంగా ఉండి ట్రెండ్ సెట్టింగా ఉన్నాయి .క్లాడెల్ చేసిన ‘’మెచూర్ ఏజ్’’శిల్పాన్ని మొదటి సారి 1899లో చూసిన రోడిన్ అవాక్కై  కోపం కూడా చూపింఛి అప్పటినుంచి క్లాడెల్ ను ప్రోత్సహించటం మానేయటమేకాక ఫండింగ్ కూడా  ఆమెకు ఆపెయ్యమని   లలితకళల మంత్రి వర్గం పై ఒత్తిడి తెచ్చాడు . .సూర్యునికి అరచేయి అడ్డుపెడితే ప్రకాశం ఆగిపోతుందా ? 1900లో ఆమె చేసిన ‘’మేచూర్ ఏజ్’’శిల్పం అన్యార్ధ రచనగా(ఎలిగరి)గ మానవువి ఎదుగుదలను మూడు దశలలో చిత్రీకరిస్తూ పరిపక్వత ముసలి మహిళచేతుల ద్వారా అంటే ముసలితనం ,చావు  ద్వారా పొందుతాడు అనే భావం ఉంటుంది .అందులో ఉండే యువతి యవ్వనానికి ప్రతీకగా అతన్ని రక్షించేట్లు గా ఉంటుంది .అలాగే 1893లో చేసిన ‘’క్లోతో’’కాని ,1905లో చేసిన ‘’ఫార్చూన్ ‘’కాని జీవితంపై రెండు భావాలు ఉన్నాయి .మొదటిదానిలో నిరాశ లో అస్తిత్వం ,రెండవదానిలో ఉత్ధాన,పతనాలు,సామరస్యం ఉన్నాయని కరన్ఫా విశ్లేషించాడు .ఆమె చేసిన ‘’ఇ౦ప్లోరల్’’శిల్పం ఆమెజీవితమే కాకమానవుని మార్పును  ,జీవిత లక్ష్యాన్నితెలియజేసేది .

  1902లో నిర్మించిన పెద్ద బ్రాంజ్ శిల్పం   ‘’పెర్సేయస్ అండ్ గార్గాన్ ‘’ ను ప్రదర్శనకు పెట్టి ప్రశంసలు పొందింది .క్లాడెల్ శిల్పీకరించిన ‘’శకుంతల ‘’శిల్పం ఆమెజీవితమంతా చేసిన కృషి ,పడిన తపన సాధించిన అమోఘ విజయం ,రోడిన్ చేసిన పీడన దోపిడీ (ఎక్స్ప్లాయి టేషన్ ),స్త్రీ మనోభావానికి వ్యతిరేకత ,ఆమె స్వేచ్చపై ఒత్తిడి ,,దానిపై ఆమె చేసిన తిరుగుబాటు

సమాజం ఆమెనుంచి ఆశించిన కళ కు ప్రతిరూపమే అంటాడు ఎంజేలో కరన్ఫా.అందుకే ఆ శిల్పం ఆమె ఆంతరంగిక పరిశోధనగా భావిస్తారు .మిగిలిన చిత్రకారులు రోడిన్ విచిత్ర ప్రవృత్తిని ఎండగట్టారు .ఆమె కళ సమకాలీన కన్జర్వేటివ్ అభిరుచికి ,  పూర్తిగా విభిన్నమై శైలి అయి కళాచరిత్రనే మార్చేసింది అన్నారు పొల్లాక్ లాంటి కళా పండితులు  .రోడిన్ తో పరిచయం కాకముందే క్లాడెల్ ఉక్కు హృదయంతో స్థిర చిత్తంతో ,మహా మేధావిగా ఉ౦దేదని ఆధునిక చరిత్రకారులన్నారు .ఆమె ప్రతిభకు ఈర్ష చెందినవారిలో రోడిన్ కంటే ఆమె సోదరుడు పాల్  పాత్ర ఎక్కువ .ఆమె జీవితాన్ని నాశనం చేసిందీ ఇతడే .ఆమెను మానసిక క్షోభకు గురి చేసి ఒంటరిదాన్ని చేసి మెంటల్ హాస్పిటల్ లో ఉంచటానికి కారకుడూ ఆ దుస్టుడే.చిన్న చెల్లెలు లూయీ కూడా అక్క ఆస్తికాజేయాలని ప్రయత్నించి,అక్కపతనాన్ని చూసి గంతులేసిన సాడిస్ట్ .

   1905తర్వాత క్లాడెల్ మానసిక పరిస్థితి దెబ్బతిన్నది .తాను  సృష్టించిన శిల్పాలన్నీ ధ్వంసం చేసింది .మనుషులకు దూరంగా చాఆకాలం ఉండిపోయింది  .పారనోయా వ్యాధితో బాధపడి చివరికి స్చిజో ఫెర్నియా పాలబడింది .రోడిన్ తనభావాలను కాపీకొట్టి బాగుపడుతు తనను చంపే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది .1906 సోదరుడు పెళ్లి చేసుకొని చైనా వెళ్ళిపోయాక ఒంటరిగా వర్క్ షాప్ లోనే గడిపింది .మొదటినుంచి ఆమె భావాలను సమర్ధించిన తండ్రి ఆర్ధిక సాయం  చేస్తున్నాడు .1913లో ఆయన చనిపోయిన వార్తకూడా ఆమెకు తెలియనివ్వలేదు .ఎనిమిది రోజులతర్వాత సోదరుడు పాల్ ప్రోద్బలం తో ఆమెను సైకియాట్రిక్ హాస్పిటల్ లో చేర్చారు .1914మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఫ్రాన్స్ పై దాడి చేస్తుందని, ఆమెను మిగిలిన మానసిక వ్యాధిబాదితులను మాంట్ డేవర్జెస్ శ  రణాలయానికి తరలించారు .అప్పుడప్పుడు ఆమె ఊహా జనిత ప్రేలాపనలతో మాట్లాడేది .చివరికి 19-10-1943న 79వ ఏట సృజన శిల్పి కొమేల్లీ క్లాడెల్ మరణించింది .మాంట్ ఫెవాట్ సెమిటరి లో లో ఆమె అంత్యక్రియలు జరిపారు .

   క్లాడెల్ పేరుమీద 2017మార్చి లో ఫ్రెంచ్ నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేసి ,మిగిలిన 90 ఆమె శిల్పాలు భద్రపరచారు .ఆమె ఫామిలీ హోమ్ ను  నేషనల్ మాన్యుమెంట్ గా గుర్తించారు  .ఆమె జీవితంపై పుస్తకాలు,  డాక్యుమెంటరీలు వచ్చాయి .గేల్ లి కార్నేక్ ఆమె పై ఒక నాటకం రాసి ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాడు .క్లాడెల్ పై    చాలామంది పరిశోధకులు పరిశోధన చేసి కొత్త వెలుగులు నింపారు .అపురూప మహిళా సృజనశిల్పి కొమేల్లీ క్లాడెల్ జీవితం పురుషాహంకారానికి బలై విషాదాంతంగా ముగియటం విషాదకరం .

  -గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో