విప్లవ ‘పాణి’యం – ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌,

విఖ్యాత విప్లవ కవి వరవరరావు మీద వచ్చిన తొలి విమర్శ గ్రంథం ‘‘వ్యక్తిత్వమే కవిత్వం’’. విప్లవ రచయిత, విమర్శకుడు పినాకపాణి వరవరరావు కవిత్వ విశ్లేషణకు మొదటిసారి పాదు తీసాడు. వర్తమాన తరాlలకు, భావితరాలకు వి.వి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాటు వేశాడు. తన పుస్తకానికి చక్కని ప్రణాళిక వేసుకొని ‘‘ఇవీ శిల్ప రీతులు ’’ అనే పేరుతో పది అధ్యాయాలుగా వి.వి కవిత్వాన్ని వింగడిరిచుకున్నాడు. ఈ పద్ధతి సామాన్య పాఠకుల్ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. అంతే వి.వి కవిత్వం మీద మరింత గౌరవం పెరిగి ఆయన విప్లవ కవితా భావజాలం  మీద ఆసక్తి పుడుతుంది. కొత్త తరం కవులకు కొంత చైతన్యం రగిలించి తాము విప్లవ కవిత రాయగలమనే కొండంత విశ్వాసం కలుగుతుంది. వి.వి కవితా మూల్యాంకనాన్ని పాణి ఎంతో సున్నితంగానూ, సునిశితంగానూ, సూక్ష్మంగానూ చూశాడనిపిస్తుంది. వి.వి రాజకీయ దృక్పథాన్ని, కవితా దృక్పథాన్ని అంచనా వేయగలగడంలో పాణి చాలా వరకు కృతత్యుడయ్యాడరనే చెప్పుకోవాలి. వి.వి చాలా విలువైన కవి. నిజానికి ప్రతి విప్లవ కవి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కవిత్వం రాస్తాడు. విప్లవ కవిత్వం విలాసం కాదు. కేవలం  శబ్ద సౌందర్యం కాదు. నూటికి నూరుపాళ్లు నిబద్ధుడై ఉంటే తప్ప తన వ్యక్తిత్వాన్ని కవిత్వంగా మలుచుకోలేడు. పాణి ఈ పుస్తకంలో వి.వి వ్యక్తిత్వ కవిత్వాన్ని సమర్థవంతంగా విశ్లేషిస్తూ ఈ క్రింది కవిత లక్షణాను సారవంతంగా క్రోడీకరించాడు.

వి.వి శిల్ప రీతులు  ` కవితా లక్షణాలు :
1. సాధారణంగా కవికి ఉండే అమూర్త అస్పష్ట మార్మిక వైఖరులు  ఆయనలో కనిపించవు.
2. రాజకీయ వ్యక్తిత్వం లోంచి నిత్యం వ్యక్తమవుతుంటాడు.
3. వి.వి కవిత్వం ఆయన వ్యక్తిత్వానికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది.
4. కవిగా వి.వి నిలుచున్న  చోటు సామాజిక ఆచరణ వల్ల  ఆయన కవిత్వానికి ఒక ప్రత్యేక స్వభావం సంక్రమించింది.
5. ప్రభావాలు , ఊహాశక్తి, దృక్పథం అనే మూడింటి కలయిక లోంచి వి.వి కవిత్వాన్ని ప్రత్యేకంగా విశ్లేషించవచ్చు.
6. ఆధునిక తెలుగు  వచన కవుల్లో శ్రీశ్రీ తర్వాత అంత విస్తృత గుర్తింపు వి.వికి ఉంది.
7. వి.వికి విప్లవోద్యమంతో పేగు బంధం ఉంది. అదొక ఆర్గానిక్‌ రిలేషన్‌.
8. వి.వి నుంచి ఆయన కవిత్వాన్ని వేరు చేసి చూడలేకపోవడానికి మూలం  విప్లవోద్యమం నుంచి ఆయన్ను వేరు చేయలేకపోవడంలో ఉంది.
9. కవిగా వి.వి గురించి మాట్లాడడంలోనే రాజకీయవేత్తగా వి.వి గురించి తెలిసి ఉండాలి. అంతకంటే క్షుణ్ణంగా ఆయన అంతర్భాగమైన విప్లవోద్యమ గతిక్రమాలు  తెలిసుండాలి.
10. తన అనుభవంలో భాగం అవుతున్న వాస్తవికతనంతా ఆయన తన కవిత్వంలో స్థల , కాల బద్దం చేశాడు.
11. నిలుచున్న  చోటు నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా నిర్మాణం అవుతున్న చరిత్రలో నుంచి ఏది కవితా వస్తువు కాగలదో, అక్కడికి కాల్పనిక ప్రయాణం చేయగలడు.
12. ఆయన విస్తృతికి మూలం ‘‘చలి నెగల్లు ’ ‘జీవనాడి’’లోన ఉన్నప్పటికీ విప్లవ కవి వరవరరావు అనే
సృజనకారుడు రూపొందించిన క్రమం ‘‘ఊరేగింపు’’ సంపుటిలో కనిపిస్తుంది.
13. వి.వి రాసే కవిత ఒక ఉద్వేగానుభవం నుంచి ఎలా అర్థం చేసుకోవాలో ఎరుక కలిగిస్తుంది.
14. వి.వి చరిత్ర గురించే కాకా కవిత్వం గురించి సమపాళ్లలో తెలిసిన సృజనకారుడు.
15. సామ్రాజ్యవాద అమానవీయ సంస్కృతి , విధ్వంసంపై విమర్శ వి.వి కవిత్వంలో ఒక అంతర్భాగం   వలె సాగుతూ ఉంటుంది.
16. వర్గ పోరాటల  చరిత్రను కవిత్వంలో నమోదు చేసే క్రమంలో విప్లవం అంటే ఏమిటో వి.వి మొదట బలంగా ప్రతిపాదించాడు.
17. మార్క్సిస్టుగా వి.వికి సమాజంలోని వైరుధ్యాల  పట్ల, వాటి స్వభావం, పనితీరు పట్ల ఎక్కువ పట్టింపు
ఉంటుంది.
18. వి.వి ఆదివాసి నైసర్గికతను కూడా స్వీకరించారు. వి.వి ఎంతగా ప్రయానిస్తారంటే ఒక్కో నాడు ఆదివాసీ గొంతుకు వినిపిస్తుంది. ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు రాశారా అనిపిస్తుంది.
19. కవిత్వంలో విప్లవ కర్తవ్యం గురించి వి.వికి ఉన్న స్పష్టత యాబై ఏళ్ళుగా ఎక్స్‌టెన్షన్‌కు కారణం. ఆయన విప్లవ కవిత్వంలోనే కాదు మొత్తంగా తెలుగు  కవిత్వంలోకి అనేక విసృత దశను తీసుకొచ్చారు.
20. వి.వి తన రాజకీయ ఆచరణకు కవిత్వ రచన సమానతను సజీవం చేసుకొనే అనేక ప్రక్రియను ఎన్నుకుంటారు.
21. వి.వి కవిత్వంలో కంఠస్వరం చాలా ప్రధానం.
22. నిజానికి వి.వి తన సొంత అనుభవం, అనుభూతి ఇతివృత్తంగా చాలా కవితలు  రాశాడు. ఆయన కేవలం  ఒక అనుభూతిని క చేసే నైపుణ్యంగా  మానవుడే కాదు, వైయుక్తిక అనుభవాలుగా కనిపిస్తున్న దానికి సామాజిక అర్థాన్ని గుర్తించగ చింతనాపరుడు.

ఈ విధంగా పాణి వి.వి విప్లవ కవిత్వాన్ని విభిన్న రీతుల్లో విశ్లేషించాడు.

ఆచార్య  ఎండ్లూరి సుధాకర్‌,
కేంద్రీయ విశ్వవిద్యాయం,
హైదరాబాద్‌.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో