నా కళ్లతో అమెరికా -70 (కాన్ కూన్ -మెక్సికో యాత్ర- భాగం-1)- డా.కె.గీత

dr .కె .గీత

ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా!  ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో  ఉన్న కానుకూన్ వెళ్లి రావాలని అనుకున్నాం. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న  కాలిఫోర్నియా నుంచి  మెక్సికో తూర్పు తీరానికి  ప్రయాణం అంటే విమానాల్లో దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం. అంతే కాదు, కాలమానంలో  మూడు గంటలు ముందుకి వెళ్తాం. 

ఈ ప్రయాణం దాదాపు రెండు మూడు సార్లు అనుకునీ వాయిదా వేసాం. ఇక మొన్న నవంబరులో థాంక్స్ గివింగ్ సెలవులకి పదిరోజుల ముందు ఉద్యోగాలతో బాగా అలిసిపోతున్న మాకు ఆటవిడుపుగా ఈ ప్రయాణానికి వెళ్లొద్దామని తలపు కలిగింది. అనుకున్నదే తడవుగా ముందులాగే కాస్ట్ కో వెకేషన్ పాకేజీ బుక్ చేసుకున్నాం. సముద్ర తీర ప్రాంతమైన  కాన్ కూన్ కి ఆగస్టు నుంచి నవంబరు వరకు వర్షాలు పడే కాలం కాబట్టి అన్ సీజన్ వల్ల ప్రయాణం కాస్త చవకలో అవుతుందనేది మరొక కారణం. 

కాస్ట్ కో పాకేజీ టూరు బుక్ చేసుకునే ముందు విడిగా ఫ్లయిట్లు, హోటళ్ల ఖరీదులు వేరే సైట్లలో చూసి ఇదే అన్నిటికన్నా ఉత్తమమైనదని ఖరారు చేసుకున్నాం.మా పాకేజీ విడిగా  ఫ్లయిట్లు, హోటళ్ల కీ అయ్యే ఖరీదుతో ఇంచుమించు సమానమే అయినా  కొన్ని అదనపు ఆకర్షణలు ఉన్నాయి. అవేవిటంటేడైరక్టు  ఫ్లయిట్లు ఉంటాయి. మల్టిపుల్ ఫ్లయిట్లు ఉన్నా,  ప్లయిట్ల మధ్య మారే సమయం తక్కువగా ఉండి సమయం వృథా కాదు. (కానీ ఇలా తక్కువ సమయం ఉండడం వల్ల వచ్చిన చిక్కేవిటో తరువాత ఫ్లయిట్ మారినప్పుడు చెప్తాను!) మనకు నచ్చిన రేటులో హోటలు పాకేజీ దొరుకుతుంది. 

ఇక  అన్నిటినీ మించి ఇది “ఆల్ ఇంక్లూజివ్”  పాకేజీ. ఇది గొప్ప అదనపు ఆకర్షణ. ఆల్ ఇంక్లూజివ్ అంటే  మూడు పూటలా భోజనం, రిసార్టు వసతులు ఇత్యాదులన్నీ ఇందులోనే భాగాలన్నమాట. దేనికీ విడిగా డబ్బులు కట్టనవసరం లేదు. పిల్లలతో ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ప్రతీ పూటా భోజనానికి వెతుక్కోకుండా ఇలా బుక్ చేసుకోవడం చాలా మంచి ఆలోచన. 

కాస్ట్ కో లో ఇతర పాకేజీల కంటే ఎక్కువైనా,  మేం “పాలెస్ హోటల్స్ పాకేజీ “తీసుకున్నాం. పాలెస్ హోటల్స్ బీచ్ పాలెస్, సన్ పాలెస్, మూన్ పాలెస్ అని మూడున్నాయి. అందులో “బీచ్ పాలెస్”  సముద్రతీరంలో  ఉండడం వల్ల పిల్లలతో సర్దాగా ఉంటుందని అది ఎంపిక చేసుకున్నాం. కానీ తీరా వెళ్లేక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా దూరమే.  అదొక్కటే కాస్త ఇబ్బంది అనిపించింది.దూరాలను బట్టి చూస్తే సన్ పాలెస్ బెస్ట్.

ఇక మూన్ పాలెస్ కేవలం కపుల్స్ కి మాత్రమే కాబట్టి పిల్లలతో ఉన్న మాకు అవకాశం లేదు. సరే, టూరు బుక్ చేసుకోవడం పూర్తయింది. ప్రయాణంతో కలిపి మొత్తం ఏడు రోజులు. కాన్ కూన్ లో వారమంతా ఉంటాం. కానీ అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలిగా. ఆన్ లైనులో కానుకూన్ కి సంబధించిన అనేక వీడియోలు చూసేం.కాన్ కూన్ లో అభద్రత ఎక్కువగా ఉంటుందని , హోటల్స్ అన్నీ ఉన్న “హోటల్ జోన్” దాటి బయట తిరగడం క్షేమం కాదనీ తెల్సుకుని ఆలోచనలో పడ్డాం.కానీ నాన్ రిఫండబుల్ టిక్కెట్లు కొనుక్కున్నాం కాబట్టి వెళ్ళి చూసొద్దామనే నిర్ణయించుకున్నాం.

ఇక దేశం దాటి వెళ్లడానికి వీసా నిబంధనల గురించి ఆన్ లైనులో చదివాం. అమెరికా వీసా ఉన్న వారు ఎవరైనా వెళ్ళి రావొచ్చని సారాంశం.దాని ప్రకారం ధైర్యంగా దేశం దాటి వెళ్తున్నా, మళ్లీ వచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకైనా మంచిదని తత్సంబధిత డాక్యుమెంట్లు  అన్నీ పెట్టుకున్నాం. అదీగాక ఇంతకు ముందు మెక్సికో క్రూయిజ్ నుంచి తిరిగి వచ్చేటపుడు రెండు గంటలు వేచి ఉండాల్సి రావడం, ఆ కాస్సేపట్లో పడ్డ టెన్షనుకి సంబంధించిన చేదు అనుభవం మాకు బాగా గుర్తుంది. 

పిల్లలకు వారమంతా సెలవులు ఉన్నాయి కానీ మాకు లేవు. అయినా “స్వేచ్ఛగా ఎగరాలనుకున్న విహంగాలకు సెలవులు తక్కువా” అనుకుని  మేమిద్దరం ఆఫీసులకు సెలవు పెట్టేసేం.  ఇక ఎప్పటిలానే పెట్టేబేడా సర్దాల్సిన బాధ్యత నాది, మోసే బాధ్యత మిగతా అందరిదీ.ఇప్పుడు  వరు టెంత్ కి వచ్చి పెద్దా పేరక్క అయింది కాబట్టి తన సర్దుళ్ళు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎటొచ్చీ సిరితోనే మా కాలమంతా పొద్దుపోయేది. తనవన్నీ అక్క లాగే స్వయంగా సర్దుకుంటానని తనూ పేచీ పెట్టింది. సరేనని వదిలేస్తే బట్టలన్నీ పక్కన పడేసి నచ్చిన బొమ్మలు సూట్ కేసు నిండా సర్దేసింది. తీసేస్తే ఏడుపు. మొత్తానికి సిరి నిద్రపోయే వరకు ఆగి అప్పుడు సర్దవలసి వచ్చింది.

ఇక దారంతా తన సూట్కేసు తనే పట్టుకుంటానని పేచీ. సరే, నాలుగు చక్రాల మీద దొర్లించడమే కదా అని వదిలేస్తే, ఇక తల కిందికి వంచి పెట్టె ఎవరికీ తగిలేదీ చూసుకోకుండా రయ్యిన దూసుకెళ్లిపోతుంది. మేమెవరైనా పట్టుకుంటామంటే ఏడుపు. మాకు కాస్సేపు నవ్వు, కాస్సేపు కోపమూ వస్తుండేవి. కోపం వస్తే "మమ్మీ! డాడీ! మీరు కాస్త దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదలండి, లేదా పది అంకెలు లెక్కపెట్టండి కోపం పోతుంది!" అని చెప్తుంది. ఇక కోపం ఎక్కడిది? ఇక మెక్సికో మరో దేశమైనా, అమెరికాకు దగ్గర్లో ఉంటుంది కాబట్టి ఫయిట్లు లోకల్ ఫయిట్లే. ఇంటర్నేషల్ ఫయిట్లలా  పెద్ద సూట్ కేసులు ఫ్రీగా పట్టుకెళ్లనివ్వరు కాబట్టి ఒక్కొక్కళ్ళం చిన్న కేబిన్ బ్యాగేజి, ఒక్కో లాప్ టాప్ బాగ్ తగిలించుకున్నాం.సిరి ఇంట్లో ఉన్నంత సేపు వీపుకి బొమ్మల బ్యాగు తగిలించుకుని తిరిగి బయలుదేరే ముందు ఇంట్లో వదిలేసింది. దార్లో బాగు కోసం ఏం పేచీ పెడ్తుందో అని భయపడ్డాం.  కానీ ఐ -పాడ్ ఉండడం వల్ల బ్యాగు సంగతి మర్చిపోయింది. 

ఇక కాన్ కూన్ అసలు నవంబరులో ఎందుకు వెళ్లాలనుకున్నామంటే యూఎస్ ఏ లో ఇది చలి కాలం. కాబట్టి సెలవుల్లో చక్కగా వెచ్చగా ఉండే ఊరికి వెళ్తే బావుంటుందన్న ఆలోచన ఒక కారణం. ఇక రెండోది అక్కడికి దగ్గర్లోనే ఆధునిక ప్రపంచ వింతలు ఎనిమిదిట్లో ఒకటైన చిచెన్ ఇట్జా ఉంది. అది చూసి రావడం అసలు కారణం. ఇక పిల్లలకి హవాయి వెళ్లొచ్చినప్పటి నుంచీ వెచ్చని సముద్రం లో ఆడుకోవడం బాగా ఇష్టంగా మారింది.  కాన్ కూన్ వైట్ సేండ్ బీచ్ లకు ప్రసిద్ధి. ఇంకేవిటి? తగినన్ని కారణాలున్నాయి అక్కడికి వెళ్లడానికి.అక్కడికి వెళ్లాక తెలిసింది ఇంకా చాలా విశేషాలు చూడడానికి ఉన్నాయని.

ఈ ప్రయాణం దాదాపు రెండు మూడు సార్లు అనుకునీ వాయిదా వేసాం. ఇక మొన్న నవంబరులో థాంక్స్ గివింగ్ సెలవులకి పదిరోజుల ముందు ఉద్యోగాలతో బాగా అలిసిపోతున్న మాకు ఆటవిడుపుగా ఈ ప్రయాణానికి వెళ్లొద్దామని తలపు కలిగింది. అనుకున్నదే తడవుగా ముందులాగే కాస్ట్ కో వెకేషన్ పాకేజీ బుక్ చేసుకున్నాం. సముద్ర తీర ప్రాంతమైన  కాన్ కూన్ కి ఆగస్టు నుంచి నవంబరు వరకు వర్షాలు పడే కాలం కాబట్టి అన్ సీజన్ వల్ల ప్రయాణం కాస్త చవకలో అవుతుందనేది మరొక కారణం. కాస్ట్ కో పాకేజీ టూరు బుక్ చేసుకునే ముందు విడిగా ఫ్లయిట్లు, హోటళ్ల ఖరీదులు వేరే సైట్లలో చూసి ఇదే అన్నిటికన్నా ఉత్తమమైనదని ఖరారు చేసుకున్నాం.మా పాకేజీ విడిగా  ఫ్లయిట్లు, హోటళ్ల కీ అయ్యే ఖరీదుతో ఇంచుమించు సమానమే అయినా  కొన్ని అదనపు ఆకర్షణలు ఉన్నాయి. అవేవిటంటేడైరక్టు  ఫ్లయిట్లు ఉంటాయి. మల్టిపుల్ ఫ్లయిట్లు ఉన్నా,  ప్లయిట్ల మధ్య మారే సమయం తక్కువగా ఉండి సమయం వృథా కాదు. (కానీ ఇలా తక్కువ సమయం ఉండడం వల్ల వచ్చిన చిక్కేవిటో తరువాత ఫ్లయిట్ మారినప్పుడు చెప్తాను!) మనకు నచ్చిన రేటులో హోటలు పాకేజీ దొరుకుతుంది. ఇక  అన్నిటినీ మించి ఇది “ఆల్ ఇంక్లూజివ్”  పాకేజీ. ఇది గొప్ప అదనపు ఆకర్షణ. ఆల్ ఇంక్లూజివ్ అంటే  మూడు పూటలా భోజనం, రిసార్టు వసతులు ఇత్యాదులన్నీ ఇందులోనే భాగాలన్నమాట. దేనికీ విడిగా డబ్బులు కట్టనవసరం లేదు.

పిల్లలతో ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ప్రతీ పూటా భోజనానికి వెతుక్కోకుండా ఇలా బుక్ చేసుకోవడం చాలా మంచి ఆలోచన. కాస్ట్ కో లో ఇతర పాకేజీల కంటే ఎక్కువైనా,  మేం “పాలెస్ హోటల్స్ పాకేజీ “తీసుకున్నాం. పాలెస్ హోటల్స్ బీచ్ పాలెస్, సన్ పాలెస్, మూన్ పాలెస్ అని మూడున్నాయి. అందులో “బీచ్ పాలెస్”  సముద్రతీరంలో  ఉండడం వల్ల పిల్లలతో సర్దాగా ఉంటుందని అది ఎంపిక చేసుకున్నాం. కానీ తీరా వెళ్లేక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా దూరమే.  అదొక్కటే కాస్త ఇబ్బంది అనిపించింది.దూరాలను బట్టి చూస్తే సన్ పాలెస్ బెస్ట్. ఇక మూన్ పాలెస్ కేవలం కపుల్స్ కి మాత్రమే కాబట్టి పిల్లలతో ఉన్న మాకు అవకాశం లేదు. సరే, టూరు బుక్ చేసుకోవడం పూర్తయింది.

ప్రయాణంతో కలిపి మొత్తం ఏడు రోజులు. కాన్ కూన్ లో వారమంతా ఉంటాం. కానీ అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాలిగా. ఆన్ లైనులో కానుకూన్ కి సంబధించిన అనేక వీడియోలు చూసేం.కాన్ కూన్ లో అభద్రత ఎక్కువగా ఉంటుందని , హోటల్స్ అన్నీ ఉన్న “హోటల్ జోన్” దాటి బయట తిరగడం క్షేమం కాదనీ తెల్సుకుని ఆలోచనలో పడ్డాం.కానీ నాన్ రిఫండబుల్ టిక్కెట్లు కొనుక్కున్నాం కాబట్టి వెళ్ళి చూసొద్దామనే నిర్ణయించుకున్నాం.ఇక దేశం దాటి వెళ్లడానికి వీసా నిబంధనల గురించి ఆన్ లైనులో చదివాం. అమెరికా వీసా ఉన్న వారు ఎవరైనా వెళ్ళి రావొచ్చని సారాంశం.దాని ప్రకారం ధైర్యంగా దేశం దాటి వెళ్తున్నా, మళ్లీ వచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఎందుకైనా మంచిదని తత్సంబధిత డాక్యుమెంట్లు  అన్నీ పెట్టుకున్నాం. అదీగాక ఇంతకు ముందు మెక్సికో క్రూయిజ్ నుంచి తిరిగి వచ్చేటపుడు రెండు గంటలు వేచి ఉండాల్సి రావడం, ఆ కాస్సేపట్లో పడ్డ టెన్షనుకి సంబంధించిన చేదు అనుభవం మాకు బాగా గుర్తుంది. పిల్లలకు వారమంతా సెలవులు ఉన్నాయి కానీ మాకు లేవు. అయినా “స్వేచ్ఛగా ఎగరాలనుకున్న విహంగాలకు సెలవులు తక్కువా” అనుకుని  మేమిద్దరం ఆఫీసులకు సెలవు పెట్టేసేం.  ఇక ఎప్పటిలానే పెట్టేబేడా సర్దాల్సిన బాధ్యత నాది, మోసే బాధ్యత మిగతా అందరిదీ.ఇప్పుడు  వరు టెంత్ కి వచ్చి పెద్దా పేరక్క అయింది కాబట్టి తన సర్దుళ్ళు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 

ఇక ఎటొచ్చీ సిరితోనే మా కాలమంతా పొద్దుపోయేది. తనవన్నీ అక్క లాగే స్వయంగా సర్దుకుంటానని తనూ పేచీ పెట్టింది. సరేనని వదిలేస్తే బట్టలన్నీ పక్కన పడేసి నచ్చిన బొమ్మలు సూట్ కేసు నిండా సర్దేసింది. తీసేస్తే ఏడుపు. మొత్తానికి సిరి నిద్రపోయే వరకు ఆగి అప్పుడు సర్దవలసి వచ్చింది. ఇక దారంతా తన సూట్కేసు తనే పట్టుకుంటానని పేచీ. సరే, నాలుగు చక్రాల మీద దొర్లించడమే కదా అని వదిలేస్తే, ఇక తల కిందికి వంచి పెట్టె ఎవరికీ తగిలేదీ చూసుకోకుండా రయ్యిన దూసుకెళ్లిపోతుంది. మేమెవరైనా పట్టుకుంటామంటే ఏడుపు. మాకు కాస్సేపు నవ్వు, కాస్సేపు కోపమూ వస్తుండేవి. కోపం వస్తే “మమ్మీ! డాడీ! మీరు కాస్త దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదలండి, లేదా పది అంకెలు లెక్కపెట్టండి కోపం పోతుంది!” అని చెప్తుంది. ఇక కోపం ఎక్కడిది? ఇక మెక్సికో మరో దేశమైనా, అమెరికాకు దగ్గర్లో ఉంటుంది కాబట్టి ఫయిట్లు లోకల్ ఫయిట్లే. ఇంటర్నేషల్ ఫయిట్లలా  పెద్ద సూట్ కేసులు ఫ్రీగా పట్టుకెళ్లనివ్వరు కాబట్టి ఒక్కొక్కళ్ళం చిన్న కేబిన్ బ్యాగేజి, ఒక్కో లాప్ టాప్ బాగ్ తగిలించుకున్నాం.సిరి ఇంట్లో ఉన్నంత సేపు వీపుకి బొమ్మల బ్యాగు తగిలించుకుని తిరిగి బయలుదేరే ముందు ఇంట్లో వదిలేసింది. దార్లో బాగు కోసం ఏం పేచీ పెడ్తుందో అని భయపడ్డాం.  కానీ ఐ -పాడ్ ఉండడం వల్ల బ్యాగు సంగతి మర్చిపోయింది. ఇక కాన్ కూన్ అసలు నవంబరులో ఎందుకు వెళ్లాలనుకున్నామంటే యూఎస్ ఏ లో ఇది చలి కాలం. కాబట్టి సెలవుల్లో చక్కగా వెచ్చగా ఉండే ఊరికి వెళ్తే బావుంటుందన్న ఆలోచన ఒక కారణం. ఇక రెండోది అక్కడికి దగ్గర్లోనే ఆధునిక ప్రపంచ వింతలు ఎనిమిదిట్లో ఒకటైన చిచెన్ ఇట్జా ఉంది. అది చూసి రావడం అసలు కారణం. ఇక పిల్లలకి హవాయి వెళ్లొచ్చినప్పటి నుంచీ వెచ్చని సముద్రం లో ఆడుకోవడం బాగా ఇష్టంగా మారింది.  కాన్ కూన్ వైట్ సేండ్ బీచ్ లకు ప్రసిద్ధి. ఇంకేవిటి? తగినన్ని కారణాలున్నాయి అక్కడికి వెళ్లడానికి.అక్కడికి వెళ్లాక తెలిసింది ఇంకా చాలా విశేషాలు చూడడానికి ఉన్నాయని.

(ఇంకా ఉంది)

 –కె.గీత

నా కళ్ళతో అమెరికా, యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో