తెలుగపరిమళం దీర్ఘకావ్యం-భాష ఔన్నత్యం– కట్టూరి వెంకటేశ్వర రావు

ISSN 2278-478

“వసంత యౌవనా వృక్షా: పురుషా ధన యౌవనా:
సౌభాగ్యయౌవనా నార్యో యువనో విధ్యాయా బుదా:”
వృక్షములకు వసంత ఋతువు యవ్వనము.పురుషులకు ధనము యవ్వనము.స్త్రీలకు సౌభాగ్యమే యవ్వనము.పండితులకు విద్యయే యౌవనము. అని ‘నీతి శాస్త్రము’ నందు శ్రీమాన్ ఉత్పల వేంకట రంగాచార్యులు వివరించినట్లుగా, వృక్షాలకు వసంత ఋతువు,పురుషులకు ధనం,స్త్రీలకు సౌభాగ్యం యవ్వనం అంటూ పండితులకు “విద్యయే” యవ్వనం.ఈ వాక్యం వూటుకూరి వారికి తగినట్లుగా సరిపోతుంది.ఎందుకంటే తెలుగు జాతి చరిత్రను,తెలుగు వారి జీవితాన్ని,తెలుగు భాష గొప్పతనాన్ని లయబద్దంగా సాగుతూ.కొండలు,గుట్టలు దాటుకుంటూ,తాను పారినంత మేర సస్యశ్యామలం చేస్తూ సాగిపోతున్న’ నది’తో పోలుస్తూ,తెలుగు భాషా చరిత్రను ‘దీర్ఘకవిత’గా రచించి తెలుగు జాతి సుగంధాలను విరజిమ్మారు వూటుకూరి వరప్రసాద్.
సాహిత్య చరిత్రే కదా అని ఓర కంటితోనో,అరకంటనో క్రీగంటనో చూడనవసరం లేదు.సంక్షిప్తంగా తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవాలనుకునే వారికిది కరదీపిక.అదే “తెలుగు పరిమళం”దీర్ఘకావ్యం. సాహితీ జిజ్ఞాసవులకు ఇది కవన కథాకలువ పందిరి.చారిత్రక అంగాలను కవుల రచనలను కవితాసువాసనాలతో,విరజిమ్మేలా చేసిన రచన ఇది.తెలుగు భాషా ప్రపంచానికి అందిచిన,సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కావ్యం నిండా వర్ణించారు.
తెలుగు భాష పుట్టుక,దాని వ్యాప్తిని వర్ణిస్తూ ఒకనదిలా ప్రారంభమైందని”తెలుగు పరిమళం” కావ్యంలో చెప్పారు.
“యేళ్ళు బీళ్లు-ఊళ్ళు మైళ్ళు దాటుకుంటూ
ప్రకృతి సౌందర్యకతని మీటుకుంటూ”
అంటూ తెలుగు వారి ప్రయాణం ఏవిధంగా సాగిందో వివరించారు.
తొలిదశలో ఆంధ్రజాతి మాట్లాడుకొనే భాష,ఆంధ్రభాషగా వ్యవహరించబడినా,తర్వాత కాలంలో దక్షిణదేశ భాషగా మారి తెలుగుగా ప్రసిద్ధమైన స్థితిని వర్ణిస్తూ, ఆంధ్రభాషగా పిలవబడిందని గుర్తు చేశారు.
శాతవాహనులు మొదలుకొని చాళుక్యుల పాలనాకాలం వరకు,భాష తొలిదశలో జనవ్యవహారంలో ఉన్న రాజమహేంద్రవరంలో లిఖిత భాషగా మారడంతో,ఔన్నత్యాన్ని సంతరించకుందంటూ ఇలా వివరించారు.
“చాళుక్య భూపాలుడు రాజరాజు ఎలుబడిలో
సారస్వత కళాపరిమళాలు విరజిమ్ముతున్న తరుణంలో
ఒకనాటి ప్రభాత అరుణిమలో నన్నయను
“తెనుగున రచియింపు “అనే అభ్యర్థన
ఎదలో పరవశమై ప్రవహించి
“శ్రీవాణి గిరిజా…..”అంటూ
ఆదికవితగా అక్షరాకృతి దాల్చిందని, కవి వర్ణించడంలో తెలుగుభాష ఉన్నతిని సరిగ్గా గుర్తించినట్లయిoది.నన్నెచోడుడు తెలుగుభాషకు చేసిన కృషిని అంచనా వేస్తూ
“కవిరాజ శిఖామణి నన్నెచోడుడు
సారస్వత గగనంలో నిండు చంద్రుడు
చిత్ర విచిత్ర ప్రయోగాలతో
భాషను పరిపుష్టిగా చేసి
భావనలను అక్షరాలను పొదిగి
కవితా సీమలో ప్రవేశపెట్టి
‘జానుతెనుగు’భాషణకు బాణీలు కట్టి
కొత్తపుంతలు తొక్కిన మార్గాన్వేషి”అని అభివర్ణించారు కవి.శైవమత వ్యాప్తికి భాషను ఒక సాధనంగా వాడుకున్నా,ప్రజల దగ్గరకు తెలుగుభాష చేరువయ్యేలా, చేసిన ఘనత నన్నెచోడుడు,పాల్కురికి సోమానాథుడు, పండితరాధ్యులకే దక్కుతుంది. వీరినే శివకవిత్రయం, శివకవియుగం అని అంటారు.
ఈ దీర్ఘకావ్యంలో కొండని అద్దంలో చూపినట్లుగా,మధురంగా వర్ణించారు వూటుకూరి.ఈ ‘తెలుగు పరిమళం’కావ్యం చదువుతుంటే అనేక సాహిత్య చరిత్రల్ని,పాఠకులు చదువుతున్న అనుభూతికి లోనవుతారు.కవి తనదైన వర్ణన చేయడం ఈ కావ్యంలో కనిపించే విశిష్టత. ఈ కావ్యంలో ఎక్కడా లయతప్పకుండా సాగిపోయింది. ఈ కావ్యం చదువుతుంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా,తెలంగాణలో ఉన్నా,పొరుగురాష్ట్రాల్లో కానీ,పొరుగు దేశాల్లో గాని,ప్రపంచలో ఎక్కడున్నా మనందరిదీ తెలుగుభాషేనని గర్వానికి గురవుతుంటాం.
జనంలో పల్లె పదాలుగా,శాసనాల్లో చెల్లాచెదురైన పదాలుగా,పాటల్లో,కీర్తనల్లో, జానపద గేయాల్లో,అనేక యేళ్ళ పాటు మౌఖికంగా కాపాడుకున్న తెలుగుభాష,సంస్కృత భారతానువాదంతో లిఖిత సంప్రదాయాన్ని సంతరించుకుంది.
అదేవిధంగా ‘ఆంధ్రుల చరిత్రలో మహిళకు’అగ్రసమారాధన అంటూ ఆంధ్రదేశ చరిత్రలో, మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఉందోవివరించారు.ఎందరోకవయిత్రులురచనలుగావించారు.శ్రీకృష్ణ దేవరాయల కాలంలో,తెలుగుభాష ఏవిధంగా అభివృద్ది చెందిందో వివరిస్తూ కవి ఈవిధంగా రాశారు.
“దేశభాషలందు తెలుగు లెస్స”గా శోభిస్తూ
సారస్వత సౌజన్య స్రవంతిగా కదులుతూ
కృష్ణదేవరాయుని కీర్తి చంద్రికై వెలుగుతూ
అష్టదిగ్గజ కవుల ఇష్ట రచనల జోరు
గళ గళంలో నిగళమై పలికింది నా తెలుగు..
అని వివరించారు వూటుకూరి.అలాగే నాయకరాజులకాలంలో,పోషించబడిన కవయిత్రుల గురించి,వారి రచనల గురించి సవివరంగా వర్ణించారు కవి.
“తెలుగు కవితాసిరులకివి ఆనవాళ్లు
సారస్వత సీమలలో పూలచాళ్లు”….
అంటూ నాయకరాజులకాలం,రఘునాథనాయకుని యక్షగానాలు,మొల్లరామాయణం,మధురవాణి,మన్నారుదాసవిలాసం, ‘రంగాజమ్మ’యక్షగానం ఉషాపరిణయం, తరిగొండ వెంగమాంబ రచించిన కావ్య ఖండికలు మొదలైన రచనలు తెలుగుభాషను పరిపుష్టిగావించాయని తెలియజేసారు వరప్రసాద్ గారు.
అదేవిధంగా వలసవాదులైన బ్రిటీషు వారి పాలనలో తెలుగుభాష “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్”గా పిలువబడుతూ,కొలవబడిందని వివరించారు.తెలుగుభాషకు విదేశీయులు, చేసిన సేవను విపులంగా వివరించారు రచయిత.
“తెలుగుభాషామృతాన్ని దోసిళ్లతో తాగి
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ఫ్రైజింగ్ చేశారు
ముత్యాల కోవలాంటి అక్షరాలకు ముగ్దు లయ్యారు.
అని చెప్తూ తెలుగుభాషను ముత్యాల కోవాల్లాంటి అక్షరాలంటూ,పాలకోవ మధురమైన రుచిని కలిగి మన జిహ్వను ఏవిధంగా తరింప చేస్తుందో,తెలుగు అక్షరాలు ఆ విధంగా ఉంటాయని కవి చక్కటి పోలిక చేశారు.తాళపత్రా లలో నిక్షిప్తమై ఉన్న మన తెలుగు భాషను,పుస్తకరూపంలో తీసుకురావడానికి రెవరెండ్.బెంజమిన్ షుల్జి,విలియంకేరి మరియు తెలుగు నేల చరిత్రకు అక్షరాల వెలుగునిచ్చిన కాలిన్ మెఖంజీ,చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వంటి విదేశీయులుతెలుగుభాషకు ఏవిధంగా సేవ చేసి,మన భాషను మనసుకు పుస్తకరూపంలో, అందించి వారు చరితార్థులయ్యారని వివరించారు వూటుకూరి.
“తెలుగువారికి సమ్మతంగా
సాహిత్యాన్ని ప్రచురించిన
సారస్వత ప్రియుడు
ప్రచురణామయుడు
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్”
తెలుగువారెవరూ చేయలేని గొప్ప పనిని విదేశీయుడైన సి.పి బ్రౌన్ మన జీవద్భాషకు చేసిన సాహిత్య సేవను కొనియాడారు కవి.వేమన శతకాన్ని,రచనల్ని మనకందించారు బ్రౌన్.
అదేవిధంగా “జనని సంస్కృతంబు యెల్లభాషలకు” అని మన ప్రాచీనులు చెబుతుంటే,తెలుగు భాషకు మూలం సంస్కృతం కాదని,ద్రావిడ భాషా జన్యమని రుజువు చేసి,భాషా సంబంధాల రూపురేఖల్ని,భాషా విషయాలకు శాస్త్రీయత జోడించి వివరించి,తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినదని నిరూపించారు. ఎ. డి కాంబెల్ అని ఈ కావ్యంలో తెలిపారు వూటుకూరి.
ఈవిధంగా వూటుకూరి తమ దీర్ఘకావ్యం “తెలుగు పరిమళం”లోతెలుగు జాతి గొప్పతనాన్ని,తెలుగుభాష ఔన్నత్యాన్ని విపులంగా వివరించారు.అంటూ ఈయన్ను గురించి ఆచార్య. డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు ముందు మాటలో ప్రస్తావిస్తూ…. “మాటలకారి వూటుకూరి. ‘తెలుగు పరిమళం’అనే ఈదీర్ఘకావ్యాన్ని తెలుగు సాహిత్య చరిత్రలోoచి చదవాలి,లేదా కవుల చరిత్ర నుంచి అవలోకించాలి”.అంటూ వూటుకూరి వరప్రసాద్ గురించి వివరించారు.
“తేనె లొలుకు భాష
నా తెలుగు భాష అంటూ
తెలుగుజాతి గొప్పతనాన్ని
తెలుగువారి ఔన్నత్యాన్ని
తెలుగుజాతి స్థితిగతులను
తెలుగువారి ప్రయాణాన్ని
తెలుగు భాష తీయదనాన్ని
తెలుగు సాహితీ లోకంలో
ఒక విన్నూత్న ప్రయోగంతో
తెలుగు భాషా సాహిత్య
సుగంధాలను వెదజల్లుతూ
తెలుగు భాషోపాధ్యాయుడుగా
తెలుగు తల్లికి సేవ చేస్తూ
“దేశ భాషలందు తెలుగు లెస్స”
అని ఇదీ నా తెలుగుభాష
గొప్పతనం తీయదనం
అంటూ తెలుగు సాహితీ
చరిత్రలో ‘తెలుగు పరిమళం’
సువాసనలు విరజిమ్మేలా
మాతృభాషామ తల్లికి
సేవ చేస్తున్నారు…మా
మాటలకారి “వూటుకూరి”
ఈయన నిజంగా వరప్రసాదుడే…
వరప్రసాద్ గారు కొయ్యలగూడెం మండలంలోని, బోడిగూడెం గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషాపండితులుగా పనిచేస్తున్నారు.ఈయన కవి,రచయిత.మెట్టప్రాంత రచయితల సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.అంతే గాకుండా ఎనిమిదవ తరగతి,తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ‘నరలోక ప్రార్ధన’అనే అంశం మీద పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టాను అందుకున్నారు.మరియు “దళిత కవిత్వం లో హిందూ బౌద్ధ క్రైస్తవమత ప్రతీకలు”అని అంశం మీద చేసిన పరిశోధనకు గాను ఈయనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి “బంగారు పతకం”అందుకున్నారు.శ్రీ కాట్రగడ్డ సాహిత్యఅవార్డు (2018)అందుకున్నారు.వీరు రాసిన కొన్ని రచనలు ముద్రణకు రావాలసిఉంది.
ఈకావ్యంలో వరప్రసాద్ గారు వాడిన పదాలు,వర్ణనా శైలి,ప్రతీకలు దేనికవే ప్రత్యేకతను సంతరించుకుని,కావ్యానికి కొత్త అందాలను తెచ్చి పెట్టాయి.ఈయన రాసిన కవితలు,వ్యాసాలు పరిశీలిస్తే, దళిత బౌద్ధ భావజాలం ప్రతి వాక్యంలోను కనిపిస్తూవుంటుంది.వీరి కలం నుండి ఇంకా ఎన్నో గొప్ప కావ్యాలు జాలువారాలని కోరుకుందాం.

– కట్టూరి వెంకటేశ్వర రావు

పరిశోధక విద్యార్థి

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో