కౌమార బాలికల ఆరోగ్యం

7. పరిశుభ్రత

మంచి పోషకాహారం, పరిశుభ్రత, విశ్రాంతి, స్త్రీల ప్రత్యేక అవసరాలకు తగిన సదుపాయాలు వుంటే అనేక ఆరోగ్య సమస్యల్ని

నిరోధించవచ్చు.

వ్యాధిని నిరోధించడం స్త్రీ యొక్క, ఆమె కుటుబం యొక్క, ఆమె నివసించే కమ్యూనిటీ యొక్క ఆరోగ్యాన్ని, బలాన్ని

పెంపొందిస్తుంది. తరువాత జీవితం మెరుగ్గానూ, సులభంగానూ నడుస్తుంది.ఆరోగ్య సమస్యల్ని నిరోధించడం తరువాత

చికిత్స చేయడంకంటే ఎంతో శ్రేయస్కరం.

పరిశుభ్రత – వివిధ స్థాయిలు :

1. వ్యక్తిగత పరిశుభ్రత 2. ఇంటి పరిశుభ్రత 3. కమ్యూనిటీ పారిశుద్ధ్యం

4. పరిశుభ్రమైన నీరు 5. ఆహార రక్షణ

అంటు వ్యాధులు – వ్యాప్తి చెందే మార్గాలు

   ఇన్ఫెక్షన్‌ వున్న వ్యక్తిని ముట్టుకోవడం ద్వారా – గజ్జి, తామర మొ||

  గాలిద్వారా-  దగ్గు, తుమ్ము, కఫం – క్షయ, పొంగు, ఆటలమ్మ, జలుబు,             న్యూమోనియా, డిఫ్తీరియా మొ||

  కలుషిత ఆహారాన్ని తినడం ద్వారా – కలరా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు,  పోలియో,         విరేచనాలు, మొ||  కీటకాలు

కుట్టడం ద్వారా, జంతువులు కరవడం ద్వారా -మలేరియా, ఫైలేరియా,         టేప్‌ వర్మ్‌, రేబీస్‌ మొ||

వ్యక్తిగత పరిశుభ్రత :

1. ప్రతిరోజూ సబ్బు, శుభ్రమైన నీటితో స్నానం చెయ్యాలి. చంకలు, గజ్జలు, జననాంగాలను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి.

2. తినడానికి లేక వంట చెయ్యడానికి ముందు, ఏదైనా పదార్థాల్ని ముట్టుకునే ముందు చేతుల్ని శుభ్రంగా సబ్బుతో,

నీటితో కడుక్కోవాలి. 3. మూత్రం లేక మలవిసర్జన చేసాక చేతుల్ని సబ్బు, శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. బిడ్డ లేక జబ్బు

పడిన వ్యక్తి సంరక్షణకు ముందు, తరువాత చేతుల్ని కడుక్కోవాలి. 4. రోజుకు రెండుసార్లు పళ్ళను తోముకోవాలి. ఉదయం

లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు పళ్ళు తోముకోవడం తప్పనిసరి. ఏదైనా తిన్నాక నోటిని నీటితో పుక్కిలించాలి.

శుభ్రత పాటించకపోతే పిప్పిపళ్ళు వస్తాయి. చిగుళ్ళు వాస్తాయి. 5. గోళ్ళను పొట్టిగా కత్తిరించుకోవాలి. 6. ఇతరులు వాడే

బ్రష్‌లు, దువ్వెనలు, తువాళ్ళు, రుమాళ్ళు, దుస్తులను వాడకూడదు. 7. మూత్రం లేక  మలవిసర్జన తరువాత శుభ్రం

చేసుకునేటప్పుడు వెనుక నుండి ముందుకు కడుక్కుంటే మలంలోని రోగక్రిములు యోని లోనూ, మూత్రద్వారంలోనూ

చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుచేత ఎప్పుడూ కూడా ముందు నుండి వెనుకకు కడుక్కోవాలి. దీనివలన మూత్ర, జననాంగ

ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. 8. లైంగిక కలయిక తరువాత వెంటనే మూత్ర విసర్జన చేస్తే మూత్ర సంబంధమైన

ఇన్ఫెక్షన్స్‌ని నివారించవచ్చు. 9. రోజూ లోపలి దుస్తులను మార్చాలి. నూలువి వాడాలి.10. బాహ్య జననాంగాల దగ్గర

చర్మం సున్నితంగా ఉంటుంది. వాక్సింగ్‌, బ్లీచింగ్‌, హెయిర్‌ రిమూవర్స్‌ని అక్కడి వెంట్రుకల్ని తొలగించడానికి వాడకూడదు.

ఇంటి పరిశుభ్రత :

1. వంట పాత్రల్ని, తినే పళ్ళాల్ని లేక గ్లాసుల్ని శుభ్రమైన వాషింగ్‌ పౌడర్‌తోనూ, శుభ్రమైన నీటితోనూ కడిగాక వాడాలి.

వాటిని ఎండలో పెట్టడం మంచిది. 2. ఇంట్లో గదులన్నిటిని రోజూ శుభ్రం చేయాలి. నేల మీద పాచిని ఊడ్చి గోడల్ని,

వస్తువుల క్రింద శుభ్రంగా కడగాలి. 3. నేలలోనూ, గోడల్లోనూ వున్న కంతల్ని, నెరల్ని పూడ్చితే బొద్దింకలు, తేళ్ళు

మొదలైనవి దాక్కోకుండా వుంటాయి. 4.అప్పుడప్పుడూ పరుపుల్ని, మంచాల్ని ఎండలో వేస్తే నల్లులు, ఇతర కీటకాలు

చచ్చిపోతాయి.  5. ఎక్కడపడితే అక్కడ నేల మీద ఉమ్మకూడదు. తుమ్మినా, దగ్గినా, నోటిమీద  చేతిని లేదా రుమాలును

కప్పుకోవాలి. 6. అంటువ్యాధులు వున్న వారిని విడిగా వుంచాలి.

ఎ ప్రతి ఇంటా మరుగుదొడ్డి సౌకర్యం ఉండడం ఆరోగ్యానికి ఎంతో అవసరం ఎ

కమ్యూనిటీ పారిశుద్ధ్యం:

1. ప్రజలు సులభంగా నీటిని తెచ్చుకునేందుకు వీలుగా నీటివనరు కమ్యూనిటీకి దగ్గరగా ఉండాలి. 2. నీటి వనరు దగ్గరకు

జంతువుల్ని వెళ్ళనివ్వకూడదు. అవసరమైతే చుట్టూ కంచెకట్టాలి. 3. నీటి వనరు దగ్గర స్నానం చేయకూడదు. బట్టలు

ఉతక కూడదు. వంటపాత్రల్ని, తినే పాత్రల్ని కడగకూడదు. నీటి వనరు దగ్గర మలవిసర్జన చెయ్యకూడదు.

4. తుక్కును ఎక్కడపడితే అక్కడ పారేయకూడదు. తుక్కును నేలలో పాతిపెట్టి ఎరువుగా మారేలా చెయ్యాలి లేక

తగలబెట్టాలి. తుక్కును పాతిపెడితే జంతువులు, కీటకాలు దరిచేరకుండా చూడాలి. 5. బట్టల్ని, పాత్రల్ని శుభ్రపరిచే

ప్రదేశంలో, బురద గుంటల్లో, టైరుల్లో, మూతలేని పాత్రల్లో నీరు నిలువ ఉండనివ్వకూడదు. దోమల ద్వారా మలేరియా,

డెంగు వ్యాప్తి చెందుతాయి. 6. కమ్యూనిటీ లెట్రిన్లను కట్టుకోవడానికి ప్రయత్నించాలి.

7. వీధుల్ని శుభ్రంగా ఉంచి, అవసరమైన చోట బ్లీచింగ్‌ పౌడర్‌ లాంటివి చల్లాలి.

నీటి పరిశుభ్రత :

1. త్రాగు నీటిని సాధ్యమైనంత పరిశుభ్రమైన నీటి వనరు నుండి తెచ్చుకోవాలి. 2 . ఒకవేళ నీరు

మడ్డిగా వుంటే కాసేపు కదపకుండా వుంచితే మడ్డి క్రిందకు చేరి తేటనీరు పైకి

చేరుతుంది.తేటనీటిని వేరే పాత్రలోకి తీసుకుని

వడకట్టాలి.  3.ఎండ చాలా హానికరమైన క్రిముల్ని చంపుతుంది. తేటగా వున్న గాజు లేక ప్లాస్టిక్‌ పాత్రలలో నీటిని నింపి

ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో వుంచాలి. 5-10

నిమిషాల సేపు నీటిని మరగపెడితే చాలా క్రిములు చనిపోతాయి. 4. నీటిని నిలవ వుంచే పాత్రల్ని దుమ్ముకు,

జంతువులకు, పిల్లలకు దూరంగా వుంచాలి. 5. కుండలలో లేక బిందెలలో నిలవవుంచిన త్రాగు నీటిని కాడగరిటెతో

తీసుకుని గ్లాసులో పోసుకుని త్రాగాలి. 6. త్రాగు నీటిని చేతుల్ని ముంచి తియ్యకూడదు.

ఆహార రక్షణ :

1. కాయగూరల్ని వండటానికి తరిగే ముందు శుభ్రంగా నీటితో కడగాలి. 2. ఆహారాన్ని తయారు

చెయ్యడానికి, వడ్డించడానికి ముందు చేతుల్ని సబ్బుతోనూ, నీటితోనూ కడుక్కోవాలి. 3. తినే పదార్థాలపై దుమ్ము, ధూళీ

పడకుండా, కీటకాలు వాలకుండా మూతపెట్టివుంచాలి. 4. ఉడకబెట్టకుండా తినే పండ్లు, కాయగూరల్ని శుభ్రంగా కడిగి లేక

తొక్క ఒలిచి తినాలి.ఆహారాన్ని తాజాగా వున్నప్పుడే తినాలి. 5. ఆహారానికి దగ్గర్లో  తుమ్మటం, దగ్గడం, తమలపాకులు

నమలి ఉమ్మడం చెయ్యకూడదు. 6. జంతువుల్ని వంటగదిలోకి రానివ్వగూడదు. 7. పాడయిన ఆహారాన్ని తినగూడదు.

చెడు వాసన, చెడురుచి లేక రుచిలోమార్పు, రంగుమార్పు, ఉపరితలంమీద బుడగలు, పాచి పేరుకోవడం ఆహారం

పాడయినట్లు తెలిపే సూచికలు. 8. ఆహారాన్ని వండిన 2 గంటలలోపు తినకపోతే దానిని మళ్ళీబాగా వేడి చేసి తినాలి.

ద్రవాలు బాగా బుడగలు వచ్చేలా మరగాలి. ఘన పదార్థాలు ఆవిరి రావాలి.

8. కౌమారబాలలు – కొన్ని సమస్యలు

 లైంగిక అవయవాల నిర్మాణం, విధుల గురించి తెలియకపోతే అది అనారోగ్యానికి కారణమవుతుంది. చాలామంది

కౌమారబాలలు తమ లైంగిక అవయవాల్ని ‘డర్టీ’ అవయవాలుగా భావించి వాటిని చూచుకోవడానికి కూడా విముఖంగా

వుంటారు. లైంగిక అంశాలు చుట్టూవున్న అసంఖ్యాకమైన అపోహల్ని బాల్యంలోనే స్నేహితులనుండో, అశాస్త్రీయ

కధనాలనుండో తెలుసుకోవడం వలన పెద్దయాక తిరిగి సవరించుకోలేని హానికి గురవుతారు.

కౌమార బాలలకు లైంగిక అంశాలపట్ల చాలా ఎక్కువ కుతూహలం వుంటుంది. కాని పరిజ్ఞానం వుండదు, సాహసం

వుంటుంది, కాని నష్టానికి గురయే ప్రమాదం వెన్నంటే వుంటుంది. చాలామంది కౌమారబాలలు పీర్‌ప్రెషర్‌ లేక

స్నేహబృందపు ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యాలు లేకపోవడం వల్ల, లైంగికత చుట్టూ వున్న అపోహల వల్ల ప్రమాదకర

ప్రవర్తనల్ని అలవరచుకుంటారు.

లైంగిక అవయవాల నిర్మాణం, విధులు, లైంగిక వ్యాధుల గురించి సరైన పరిజ్ఞానం లేకపోవడం, సెక్స్‌ గురించి

కుతూహలం, పీర్‌ ప్రెషర్‌, సరైన నైపుణ్యాలు లేకపోవడం లైంగిక వ్యాధులు, హెచ్‌ఐవి, కోరని గర్భాలకు దారితీస్తాయి.

అపాయకర గర్భస్రావాలవల్ల సంతానం కలగని స్థితికి దారితీయవచ్చు. చాలా అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి

వుంటాయి.

ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, సురక్షితమైన, సంతోషప్రదమైన, ఆత్మన్యూనతలేని లైంగిక జీవితాన్ని గడపడానికి

అవసరమైన విషయాలన్నిటిని కౌమారబాలలు తెలుసుకోవాలి.

1. సంచలనాన్ని కోరే ప్రవర్తన, థ్రిల్‌, గ్రేట్‌ఫన్‌ –

కౌమారథలో హార్మోన్‌ సంబంధిత శారీరక మార్పులే కాక ప్రేమ, అసూయ, కోపం, భయం, మొదలైన భావోద్వేగాలు కూడా

అతి బలంగా వుంటాయి. కౌమారబాలలు నిరంతరం ప్రయోగాలు చెయ్యాలనుకుంటారు, తమాషాల్ని

అనుభవించాలనుకుంటారు. థ్రిల్‌ కలగడం, గ్రేట్‌ ఫన్‌ వుండడం చాలా ముఖ్యం అని వారు భావిస్తారు. కొద్ది సమయం పాటు

థ్రిల్‌ని కలిగించే పనుల్ని పదేపదే చెయ్యడం కొంతమంది కౌమారబాలలకు అలవాటవుతుంది.

సిగరెట్లుతాగడం, మద్యం, మత్తుమందుల సేవనం, రేష్‌గా డ్రైవ్‌చెయ్యడం, ఏక్సిడెంట్స్‌ చెయ్యడం, వివాహానికి ముందు

ఎవరితో పడితే వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, జూదమాడడం మొ||వి సంచలనాన్ని కోరే ప్రవర్తనలు. ఈ

ప్రవర్తనలు కౌమారబాలల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి హానికరం.

ఆధునికకాలంలో మరికొన్ని ప్రవర్తనలు, తినడానికి, కట్టుకోవడానికి పరిమితి లేకుండా, విచ్చలవిడిగా కొనడం, విపరీతంగా

డబ్బు ఖర్చుపెట్టడం, లాటరీలు, హింసాత్మక చర్యలకు పూనుకోవడం, కుటుంబసభ్యులు సన్మార్గంలో పెట్టడానికి

ప్రయత్నిస్తే ఇంట్లోనుండి పారిపోవడం లేక ఆత్మహత్యా ప్రయత్నాలు చెయ్యడం మొ||వి కూడా హానికరమైన ప్రవర్తనలలోకి

చేరతాయి.

ఈ పనులవల్ల తమ విలువ, ఆత్మగౌరవం పెరగవనే గుర్తింపుతో వాటిని నివారించ డానికి, మంచి హాబీలను

అలవరచుకోవడానికి, సమాజసేవలో పాలుపంచుకోవడానికి ప్రయత్నించాలి.

2. సర్దుబాటు సమస్యలు

కౌమారథలో తల్లిదండ్రులతో, స్నేహితులతో మనఃస్పర్ధలు, క్షణికోద్రేకాలు, కోపంతో అరవడాలు, పోట్లాటకు దిగడాలు,

సంఘర్షణల్ని పరిష్కరించుకోక పోవడం మొదలైన సర్దుబాటు సమస్యలు వుంటాయి. సెక్స్‌గురించి సరైన సమాచారం

తెలియక పోవడం వల్లకూడా సర్దుబాటు సమస్యలు తలెత్తుతాయి. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విషయంలో తమ కోరికలకు,

అమలులో వున్న నిషేధాలకు మధ్య సంఘర్షణ కూడా సర్దుబాటు సమస్యలకు కారణం.

తమ సంపదను ప్రదర్శించడం, పొగతాగడం, మద్యపానం, నిర్లక్ష్యంగా వాహనాల్ని నడపడం, అర్ధరాత్రి పార్టీలు, కొన్ని

సమాజాల్లో ఆడ, మగ స్వేచ్ఛగా కలిసి తిరగడం, స్నేహబృందపు ఒత్తిడిలు కూడా కొన్ని సంఘర్షణలకు

కారణమవుతున్నాయి. ఇలాంటి సంక్షోభాలు వచ్చినపుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు తగిన

ఆసరానివ్వడం ద్వారా మానసిక ఆరోగ్యసమస్యల్ని నివారించవచ్చు.

 

– డా. ఆలూరి విజయ లక్ష్మి

 

(  వచ్చే సంచికలో …  బాలలపై లైంగిక వేదింపులు)

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో