గోవిందరాజు మాధురిగారి తో మాలా కుమార్ ముఖాముఖి

గోవిందరాజు మాధురీ గారు రచయిత్రిగా 2014 నాకు పరిచయమయ్యారు. ఆవిడ రాసిన రెండు పుస్తకాలు మన “విహంగ” పాఠకులకు నేను పరిచయం చేసాను. ఈ రోజు నేను మాధురీగారిని మన “విహంగ” పాఠకులకు “ముఖాముఖి”లో పరిచయం చేస్తున్నాను. సున్నిత హాస్యం ఇష్టపడే మన రచయిత్రితో నా ఇంటర్వూ మొదలెట్టనా మరి…..మీ కోసం….

ప్ర. నమస్తే. ఎలా వున్నారు.
జ. నమస్తేనండీ. బాగున్నానండీ. కొత్త రచయిత్రిగా నన్ను “విహంగ” పాఠకులకు పరిచయం చేయటం నాఅదృష్టమండీ. పాఠకులకూ నమస్తేనండీ. “విహంగ” పాఠకులకు మీరు నా రెండు పుస్తకాలు సమీక్ష చేసి పరిచయం చేసారు . అలా 2015, 2016లో విహాంగ పాఠకులకు పుస్తక సమీక్ష ద్వారా దగ్గరయ్యాను.
ప్ర అవునండీ బాగా గుర్తుపెట్టుకున్నారు. మీ రెండు పుస్తకాల గురించి మాట్లాడుకునే ముందు మీ చదువు,ఉద్యోగం మీ ఊరు అన్నీ మా కోసం చెప్పండి.
జ. మాది గుంటూరు. చదువంతా గుంటూరే. డిగ్రీ B.A. (Litt) గుంటూరు A.C.Collegeలో చదివాను. ఉద్యోగం చెన్నైపోర్టు లో ఆఫీసర్ గా మూడు దశాబ్దాల అనుభవం. హెచ్.ఆర్.డి లో చేసాను. ఆ తర్వాత P.G. సైకాలజీచేసాను. కంప్యూటర్స్ డిప్లమా చేసాను. Dip in T&D (Indian Society for Training  and Development (ISTD, New Delhi)). Personnel Management చేసాను. 2013లో స్వచ్చందంగా పదవీవిరమణ చేసాక గుంటూరులో సెటిల్ అయ్యాం.
ప్ర. మంచి అనుభవమే మీకు చెన్నైపోర్టులో. చదువులు కూడా హెచ్.ఆర్.డి. కి పనికొచ్చేవే చదివేసారు.
చెన్నైలో పుస్తక పఠనంకి టైం…మరి రాయటం వైపు మక్కువ ఎప్పుడు కల్గిందండీ..
జ. నా చిన్నప్పడు నుంచి మా ఇంట్లో మంచి లైబ్రరీ ఉండేది. మా నాన్నగారు కీ.శే గోవిందరాజు దత్తాత్రేయ శర్మగారు, అడ్వకేటు. ఆయన లైబ్రరీ లోసంస్కృతం, హింధీ, ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు వుండేవి. పిల్లలకి కావలసిన పుస్తకాలు కొనేవారు. పిల్లలచేత చదివించేవారు. అమ్మ వరలక్ష్మి, సాహిత్యంపట్ల అభిమానం ఎక్కువ. కాబట్టి పుస్తకాలు చదవటం వుండేది. నాన్నగారు సాంస్కృతిక కార్యక్రమాలల్లో పాలుపంచుకునేవారు.
చెనైలో మా ఆఫీసు లైబ్రరీ అన్నీ డిపార్టుమెంట్స్ కి ఉపయోగపడే పుస్తకాలు, మానేజమెంటు
పుస్తకాలతో పాటు తెలుగు పుస్తకాలు వుండేవి.
ప్ర, మీరు రాసిన మొదటి పుస్తకం “మధురిమలు” గురించి…..
జ. బాల్యం ఎప్పుడు తలుచుకున్నా బాగుంటుంది. మనసుకు ఆనందంగా అనిపిస్తుంది. అందుకే అవి
“మధురిమలు”. అలా ఆ పుస్తకం రాసాను. నా అదృష్టంమండీ..! చాలామంది పెద్దవాళ్లు వాళ్ల బాల్యంలోకి తొంగి చూసి ఆనందపడ్డాం అని చెప్పినప్పడు చాలా హాయిగా అనిపించింది. నా మొదటి ప్రయత్నం ఫలించినందుకు.
చెన్నైలో మా స్నేహితురాలు పద్మ వాళ్ల మామయ్యగారు పెద్దవారు. ఆయన చాలా సార్లు చదివారని చెప్పటం నన్ను కలుద్దామనుకోవటం నాకు మరపురాని సంఘటన. అలాగే చిత్తూరు నుంచి ఒక పెద్దావిడ తన చిన్ననాటి అనుబంధాలు గుర్తుతెచ్చుకున్నాని చెప్పారు.
అన్నాచెల్లెళ్ల బంధం బాగుందన్నారు. అమాయంకంగా చక్కగా అందరితో హాయిగా చిన్నతనం గడిపిన రోజులు గుర్తుకొచ్చాయిని చాలా మంది ప్రశంసించినప్పుడు చాలా చాలా సంతృప్తి పొందాను.
పెద్దవాళ్లు అలా నన్ను చక్కగా వెన్నుతట్టి ప్రోత్సహించారు . వాళ్లందరికీ నా కృతజ్ఞతలు.
ప్ర మధురిమలు కధలు చదవగానే మీకు మొదటి కాంఫ్లిమెంట్స్ (ఇంట్లోవాళ్లు, దగ్గర స్నేహితులు కాకుండా)ఎవరిచ్చారు..? పుస్తక సమీక్షల గురించి కూడా చెప్పండి.
జ. ఈ రోజు నేను తలచుకున్నా కూడా ఎంతో ఆనందంగా వుంటుంది. మేడమ్ ముంజులూరి కృష్ణకుమారిగారు,
రచయిత్రి, విజయవాడ స్టేషన్ డైరక్టర్ గా ఉన్నారు అప్పుడు. ఫోనులో నాతో “మధురిమలు” గురించి
మాట్లాడారు. బాగున్నాయి అని చెప్పారు. కొత్త రచయిత్రి అయిన నాకు “ఆకాశవాణి”లో కధ చదవటానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. “ఆకాశవాణి” లో నా మొదటి కధ రికార్డింగ్ అవటం, మరువలేని సంఘటనండీ. ఈ రోజు “విహంగ” ద్వారా మేడమ్ ముంజులూరి కృష్ణకుమారికి కృతజ్ఞతలు
చెప్పుకుంటున్నాను. ఆవిడ ప్రోత్సహించిన తీరు నాకు ఇంతాఅంతా కాదండీ… చాలా ధైర్యం వచ్చింది. అంతే,చాలా హుషారుగా ముందుకు పోదాం అనుకున్నాను.
పుస్తక సమీక్షల గురించి అయితే మధురిమలు ఆంధ్రజ్యోతి “నవ్య” మ్యాగజైన్ లో రావటం చాలా ఆనందం వేసింది.
“రచన” మ్యాగజేన్లో “వసుంధర” గారు పుస్తక సమీక్ష చేసారు. నాలో చాలా విశ్వాసం పెంచారు.
“విహాంగ” లో పుస్తక సమీక్ష మీరు రాసారు. మీరు మంచిగా ఆ పుస్తకాన్ని ప్రశంసించారు.
ప్ర. అవును మాధురీగారూ… నాకు ముళ్లపూడి “బుడుగు” పుస్తకంలాగా అనిపించింది.
మీ రెండవ పుస్తకం “పాణీగ్రహణం పదిరోజుల్లో “ మీ మొదటి పుస్తకం బాల్యం నుంచి పూర్తి భిన్నంగా అత్తాకోడళ్ల కధలు రాసారు, వాటి గురించి…..?
జ . ఈ పుస్తకంకి సమీక్ష “ఈనాడు” ఆదివారం అనుబంధంలో వచ్చిందండీ. ఈ పుస్తకానికీ “విహాంగ” లో పుస్తక సమీక్ష మీరు రాసారు. సరదాగా గడిచే అత్తాకోడళ్ల కధలు.
మాలాగారూ…. ఈ పుస్తకం నుండి కూడా కొన్ని కధలు “ఆకాశవాణి” విజయవాడ కేంద్రం నుంచి
ప్రసారమయ్యాయండీ. .
ఈ పుస్తకం మొత్తం కధలు అత్తాకోడళ్లదవటం నాకు “భానుమతిగారి అత్తగారి కధలు” తర్వాత మీవే  చదివాననుకున్నాను.
జ; మీ కాంప్లిమెంట్ కి చాలా ధ్యాంక్స్ . మా స్నేహితుల కోడళ్ళు కూడా “పాణీగ్రహణం పదిరోజుల్లో“ పుస్తకం నచ్చిందన్నారు. ఇంకొంచెం ఆనందం ఎక్కువైంది.

ప్ర. మీ నాన్నగారి లైబ్రరీ లో ఎటువంటి పుస్తకాలు వుండేవి. మీరు ఎటువంటివి చదివేవారు….
జ. నాన్నగారికి సాహిత్యం, సంగీతం, కళల మీద చాలా మక్కువండీ. లైబ్రరీలో సాహిత్యంతో పాటు అన్నిరకాల సంగీతం, కళల మీద రాసిన పుస్తకాలు వుండేవి. అమ్మ ఎండాకాలం సెలవుల్లో మాకు భగవధ్గీత నేర్పుతూ, కొన్ని శ్లోకాలు రాయించేవారు. నాన్నగారు లైబ్ర రీలో హింధీ, ఇంగ్లీషు, సంస్రృతం పుస్తకాలు వుండేవి. భాగవతం, రామాయణ గ్రంధాలు వుండేవి. అమ్మ భగవద్గీత చక్కగా దేవుడి మందిరంలో పెట్టుకొని చదివేవారు. మాకు చిన్నప్పుడు రామాయణం, భారతం కదలు చెప్పేవారు అమ్మ.
“భారతి” , “సుజాత” , “ఆంధ్రపత్రికతో లతో పాటు పిల్లలకి కావలసిన చందమామ, బాలమిత్ర, ఇంగ్లీషులో కామిక్స్ మాకు తెప్పేంచేవారు. ఇలస్ట్రేడ్ వీక్లీ, భవాన్ జోనరల్ తెప్పించేవారు.ఇవి కాకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా వుండేవి. అలాగే ప్రేమ్ చంద్ రచనలు. ఇప్పటకీ చాలామటుకు పుస్తకాలు భధ్రంగా వున్నాయి.
నాన్నగారికి సముద్రాల రాఘవాచారి గారు , ఆమంచర్ల గోపాలరావుగారు, ఈలపాట రఘరామయ్యగారు, అడవిబాపిరాజు గారు, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు, మహావాది వెంకటప్పయ్యగారు, పెద్దింటి సూర్యనారయణ దీక్షతులగారు సన్నిహితులు. వీరందరూ ఇంటికి వచ్చేవారు. కాకుమాను పుష్పావత్తమ్మగారు వచ్చేవారు.
కొత్తపల్లి సుబ్బరామయ్యగారు, స్వాతంత్ర్యయోధులు. వారికి మదరాసులో సంస్కృతి ప్రచురణలు వుండేది. చింతా ధీక్షతులగారి లక్కపిడతలు, పిల్లల పాటల పుస్తకాలు, మద్రాసు నుండి తెచ్చియిచ్చినప్పుడు ఆ కవరు మీద బొమ్మలు చూడటానికి చాలా ఆకర్షనీయంగా వుండేవి ఆ పిల్లల పుస్తకాలు. చదివేవాళ్లం. ముళ్లపూడిగారి బుడుగు చాలా ఇష్టం. చందమామలో మాచిరాజు కామేశ్వర్రావు గారి కధలు, పరోపకారి పాపన్న కధలు, వసుంధరగారివి చాలా నచ్చేవి. పిల్లలందరం కూర్చోని హాయిగా పెద్దగా చదువుకునేవాళ్లం.
ఇకపోతే అమ్మ దీపావళి పండుగకు వచ్చే ప్రత్యేక సంచికలు యువ, జ్యోతి చదివేవారు. మేం పెద్దయ్యాక కూడా కావలసిన ఇంగ్లీషుతో పాటు తెలుగు నవలలు కొనేవాళ్లం. యద్దనపూడి, కోడూరి, పోల్కంపల్లి, ఆనందరామం, రంగనాయకమ్మ , పాలగుమ్మి పద్మరాజు, కొమ్మూరి వేణుగోపాల్, పసుపులేటి మల్లికార్జునరావు యండమూరి, మల్లాది గార్లవి పుస్తకాలు ఇంట్లో లైబ్రరీలో వుండేవి. హాయిగా చదివేవాళ్లం.
ప్ర. మరి ఇప్పడు ఏమి పుస్తకాలు చదువుతున్నారు….
జ. విజయవాడ, గుంటూరు బుక్ ఫెస్టివల్స్ లో అన్నీ పుస్తకాలు దొరుకుతాయి. మహమ్మద్ ఖధీర్ బాబు, పెద్దింటి అశోక్ కుమార్, సామాన్యకిరణ్ ఫౌండేషన్ ”ప్రాతినిధ్య“ పుస్తకాలు చదువుతాను. నాకు హాస్యరచనలు ఎక్కువ ఇష్టం. హాస్యరచనలు చదువుతాను. శ్రీరమణ గారి రచనలు చాలా ఇష్టం. జోక్స్ బుక్స్ , ఎమ్బీయస్ ప్రసాద్ గారి హాస్యం రాంపండులీలల , సోమరాజు సుశీల , పొత్తూరు విజయలక్ష్మగార్లవి చదువుతాను.

తల్లిదండ్రులకు సాహిత్యం మీద ఇష్టం ఉండటం, ఇంట్లో పుస్తకాలు చదివే వాతావరణంలో పెరగటం మూలకంగా ఈ రెండు కధల పుస్తకాలు రాయగల్గినాను అనిపిస్తుంది.
అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
మాలా…

చాలా సంతోషం మాధురీగారూ…. మీరు ఇలా రెండు పుస్తకాలు గురించి చెప్పారు. “విహంగ” “ముఖాముఖి” లో మీ కధల గురించి, మీ నాన్నగారి లైబ్రరీ గురించి వింటే చాలా బాగుంది. నేను భారతి గురించి విన్నాను కాని సుజాత పుస్తకం పేరు ఎప్పుడూ వినలేదు. చాలా మంచి విషయాలు తెలియజేసారు. మాతో ఇవన్ని షేర్ చేసుకున్నందుకు ధ్యాంక్స్.
జ. నేను మీకు, “విహంగ”కు ధన్యవాధాలు తెలపాలి. నా మొదటి పుస్తకం “మధురిమలు” తర్వాత రెండవ పుస్తకం “పాణీగ్రహణం పదిరోజుల్లో” రాయటానికి నన్ను ప్రోత్సహించిన సాహితీమిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వుంటాను మరీ…..

తల్లితండ్రులల్లో ఒకరికిరి సాహిత్యాభిలాష ఉండటము, వారి ద్వారా పిల్లలకు సాహిత్యాభిరుచికలగటం చాలా కుటుంబాలల్లో జరిగేదే. కాని శ్రీమతి మాధురిగారి , నాన్నగారు శ్రీ.గోవిందరాజు దత్తాత్రేయ శర్మగారు, అమ్మగారు శ్రీమతి గోవిందరాజు వరలక్ష్మిగారు ఇద్దరూ సాహిత్యం మీద మక్కువ గలవారవటం చాలా అరుదుగా జరుగుతుంది .ఆ సాహిత్యవనం లో పూసిన పువ్వు మాధురి గారు చక్కని హాస్య కథలు వ్రాసి నాలాంటి హాస్యకథా ప్రియులకు , హాస్యకథా రచయతలు ఎక్కువగా లేని లోటును తీరుస్తున్నారు.

మాధురిగారు మీరు ఇంకా ఇంకా హాస్యరచనలు చేసి పాఠకుల మీద నవ్వుల జల్లులు కురిపించాలని కోరుకుంటూ, మీ సమయమును మాకు వెచ్చించినందుకు ధన్యవాదములండి,

పుస్తక సమీక్షలు, ముఖాముఖిPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో