సహ జీవనం – 29 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

శాంత ఆమె చెప్పేది వింటున్నట్లు తల ఊపింది.
“అసలు పెళ్లి చేసుకోవడం కన్నా, సహజీవనం మంచిదని నువ్వు ఎలా అనుకున్నావు? ఎంతమంది పెళ్లి చేసుకుని హాయిగా బతకడం లేదు?”అడిగాడు శ్రీనివాసరావు.
“నేను పెళ్ళి గురించీ, దాని లోపాల గురించీ చర్చించ దలచ లేదు అంకుల్. కానీ, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెబుతాను. పెళ్లి అనేది ఒక లాటరీ. ఈ లాటరీలో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న చాల మంది ఆడ పిల్లలు తమ జీవితాన్నే నష్ట పోతున్నారు. మగ వాళ్లకు మాత్రం భార్య రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సహజీవనంలో నా జీవితాన్ని నేను నిర్దేశించుకునే వీలు వుంది. నాకు ఇష్టం వున్న వ్యక్తితో నేను జీవితం గడప వచ్చు. పెద్దలు కుదిర్చే పెళ్ళిలో, నా జీవితం నాచేతుల్లో ఉండదు. అసలు సుఖంగా బతుకగలనన్న నమ్మకమే లేదు. కట్నాల కోసమో, మరో అక్రమ సంబంధం మూలంగానో, ఆడపిల్లలను చంపేస్తున్న రోజులివి. అంత కాకపోయినా, అనేక విషయాలలో- పిల్లలు కనడం దగ్గర నుంచీ, చివరికి పుట్టింటికి వెళ్ళడం వరకు, అత్తింటి వారి అనుమతి ఉండాల్సిందే! కేవలం ఆడపిల్లగా పుట్టినందువల్ల అడుగడుగునా ఇంత నియంత్రణ ఉండాలా?” అతను ఏమంటాడో అన్నట్లు శ్రీనివాస రావునే చూస్తూ చెప్పింది.
“పెద్ద వాళ్ళు మన మంచి కోసమే ఆలోచిస్తారు. అన్ని వివరాలు కనుక్కుని గానీ, పెళ్లి చెయ్యరు. అయినా అన్ని పెళ్ళిళ్ళూ లాటరీ కావడం లేదు గదా? అత్తా మామలు అందరు ఒకేలా వుండరు కదా?” ప్రశ్నించింది శాంత.
“నిజమే, నేను కాదనను. మీ కాలంలో, ముఖ్యంగా మన మధ్య తరగతి కుటుంబాల్లో, నూటికి తొంభై శాతం పెళ్ళిళ్ళు సక్సెస్ అయినాయి. ఇప్పుడు పరిస్థితి తిరగ బడింది. నూటికి ఎనభై శాతం ఫెయిల్ అవుతున్నాయి. పైపై మెరుగులు చూసి, అసలు మనిషిని అర్ధం చేసు కోకుండా పెళ్ళి చేసుకోవడం వల్లే, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయని నా ఉద్దేశం.”
శ్రీనివాసరావు ఏదో అనబోయి ఆగాడు.
నందిని అది గమనించి “అది సరే, ఇలా పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు అని అడగాలని అనుకుంటున్నారు గదా?” నవ్వుతూ ప్రశ్నించింది.
శ్రీనివాస రావు తల ఊపాడు. మనసులోనే ఆమె తెలివితేటలకు మెచ్చుకున్నాడు.
“నా చదువుకు చేసిన అప్పు తీరే దాకా ఇలాగే గడపాలని నిర్ణయించుకున్నాను.”
“నీ నిర్ణయంలో మార్పు ఉంటుందని మేము ఆశించ వచ్చా?” వెంటనే అడిగింది శాంత నవ్వుతూ.
“నాకు కొంత సమయం కావాలి, అంకుల్. ఈ సహజీవనం అనే దానికి మీ తరం వాళ్ళు వ్యతిరేకులని నాకు తెలుసు. అంతేకాదు, కులమతాలు పట్టిపులు కూడా మీ తరంలో ఎక్కువే. కానీ, మీరిద్దరూ చాలా ఆశ్చర్యంగా ఆ విషయమే ఎత్తడం లేదు. ఎంతో మాములుగా మాట్లాడు తున్నారు. ఇది నాకు ఆనందంగా వుంది. అయితే నా లక్షణాలు అన్నీ కాకపోయినా, కొన్ని అన్నా మీకు నచ్చాలి గదా? అలాగే, మీరూ నాకు నచ్చాలి. అప్పుడే మన మధ్య బంధం గట్టిపడుతుంది” శ్రీనివాస రావు వైపు తిరిగి చెప్పింది.
“చూడమ్మా, నీ నిర్ణయం ఎలాంటిదైనా మేము ఏమీ అనుకోము. ఒక సారి మా ఇంటికిరా. నీకు వీలైనన్ని రోజులు మా ఇంట్లో వుండు. మాకూ వీడొక్కడే. ఒక వేళ కోడలివి కాకపోతే, కూతురనుకుంటాము. కూతురైనా, కోడలైనా మాకు ఒక్కతివే అవుతావు. ఒక్కటి మాత్రం నీకు చెప్పదలిచాను. ఇలాంటి రిస్కులు తీసుకోవడం మంచిది కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఊహించని ప్రమాదం ఎదురవవచ్చు” చెప్పాడు శ్రీనివాస రావు.

(ఇంకా ఉంది )

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో