దళిత వాదం – నాస్తికత్వం – క్రైస్తవత్వం ( Part 2 )

 

నేను చేసిన మత తులనాత్మక అధ్యయనం లో, నన్ను ఇద్దరు ఎంతగానో అబ్బురపరిచారు. వాళ్ళు – బుద్దుడు, యేసు క్రీస్తు ” – అంబేద్కర్ ( January 1, 1938)

క్రైస్తవత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని ఒక్కడినే నమ్ముతుంది. ఈ క్రైస్తవత్వం లో – రూల్స్ ఉండవు. కేవలం ప్రిన్సిపుల్స్ మాత్రమే ఉంటాయి. అంటే – ఒక మనిషి ఎలా బట్టలు ధరించాలి, ఎలా గడ్డం పెంచాలి, ఎలా అన్నం తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా లెగాలి, ఎలా స్నానం చేయాలి ఇలాంటి రూల్ బుక్కుతో నిమిత్తం లేని మతం. నిజానికి బైబిల్ లో ఒక్క ‘ రిచువల్ ‘ గాని ఒక ‘ సెరిమొని ‘ చేయమని గాని ఆంక్షలుండవు. కనీసం క్రిస్మస్ చేసుకోవాలని, ఈస్టర్ చేసుకోవాలని నియమ నిబంధనావళి లేదు. ఎటువంటి రూల్స్ తో కట్టుబడి లేదు కాబట్టి , కేవలం ‘ నీతి ‘ ‘ నియమాలు ‘ ప్రాతిపదిక గా మాత్రమే బతకమని ఉద్భోధించింది కాబట్టి క్రైస్తవత్వం ఇన్నాళ్ళు కాలానుగుణంగా మత ఛాందసవాదానికి దూరంగా బతుక గలుగుతుంది.

క్రిస్టియన్ లు అనుసరించే బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం – పాత నిబంధన గ్రంథం. రెoడో భాగం – కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం మొత్తం కఠినమైన నిబంధనలుంటాయి. Ten Commandments ఉన్నది పాత నిబంధన గ్రంథం లోనే. ప్రతి విషయన్ని పాప భూయిష్టంగా , మనుష్యులను పాపులుగా మాత్రమే చిత్రీకరిస్తూ ఉంటుంది. ఇందులో దేవుని శాపాలు, దేవుని అశీర్వాదాలు, దేవుని మహత్కార్యాలు అన్నీ ఉంటాయి. అయితే యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాక – మనుష్యుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు క్రీస్తు తన నెత్తురు చిందించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని కొత్త నిబంధన గ్రంథం చెప్తుంది. తద్వారా, ప్రతి క్షణం మనిషి పాపాల గురించి ఉండే భయం లేకుండ, కేవలం దేవుడిపై విశ్వాసముంచి కృపతో బతకడమే జీవిత విధానంగా తెలియజేస్తుంది. మనుష్యులు పాపం చేయకుండా బతకడమే జీవిత పరమావధిగా బైబిల్ బోధిస్తుంది. అందుకోసం దేవుడిపై విశ్వాసం కలిగి ఉండడమే మార్గంగా సూచిస్తుంది. బైబిల్ లో పాస్టర్లకు గాని, పోప్ లకు గాని స్పెషల్ స్టేటస్ లేదు. అయితే క్రైస్తవ విమర్శకులు ఎక్కువగా పాత నిబంధన గ్రథం లోని అక్రమ సంబంధాలు ( వాటికి దేవుడు విధించిన శిక్షల గురించి మాత్రం చెప్పరు) ఎన్నో ఉన్నట్టు, అందరూ నీతి లేమి తో బతికినట్టు చిత్రీకరిస్తారు. కొత్త నిబంధన గ్రంథం మొత్తం మనిషి మీద ప్రేమ, జీవితం పై భరోసా, పక్క వ్యక్తిపై ఒక కన్సర్న్, విశ్వాసం వలన పొందే కృప – ఇవే ప్రధానంగా ఉంటాయి. అయితే కొన్ని సెలెక్టివ్ వాక్యాలు తీసుకుని , క్రైస్తవ విమర్శకులు బైబిల్ మొత్తాన్ని తప్పుగా వక్రీకరిస్తారు.

క్రైస్తవత్వం లో మొదట కేథోలిసిజం ఉంది. ఇది ఫ్యూడల్ వ్యవస్థ క్రైస్తవత్వాన్ని తమకు అనుకూలంగా వాడుకునడం లో భాగంగా మనుగడ సాగించింది. పాప పరిహార పత్రాలు అమ్ముకోవడం, భిషప్ అక్రమాలు…ఇలా ఎన్నో తప్పుడు తడకల జీవితం బైబిల్ కు వ్యతిరేక రూపం లోనే సాగింది. ఐతే 15 వ శతాబ్దం లో మార్టిన్ లూథర్ చర్చ్ లోని దివాళాకోరుతనాన్ని బైబిల్ దృక్పథం తో ఎండగట్టాడు. పోప్ వ్యవస్థను తప్పు బట్టాడు. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ వ్యవస్థ వచ్చింది. అది కూడా ఎన్నో శాఖలుగా పని చేస్తుంది.

క్రైస్తవత్వం పై తీవ్రమైన, కాని న్యాయబద్ధమైన విమర్శలు ఉన్నాయి. ప్రపంచం లో నీగ్రో బానిసత్వాన్ని ఆచరించింది క్రైస్తవత్వం అన్నది ఒకటి. క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చి ఈ హీనమైన మార్కెట్ పరిస్థితులను తీసుకొచ్చారు. ఇది బైబిల్ ఎప్పుడూ సమర్థించిన సందర్భం లేదు. నీగ్రోలలో క్రైస్తవత్వాన్ని తీసుకున్న వాళ్ళే ఎక్కువ. అయితే ఇటువంటి దుర్మార్గ ఆచరణలు early christianity నుండీ వచ్చినవి. ప్రొటెస్టెంటిజం నెమ్మదిగా బల పడ్డం తో ఇటువంటి హేయమైన ఆచరణలు క్రమేపీ డిస్కరేజ్ కాబడ్డాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదం కూడా ఆ విధంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన మత సంస్కృతి అలా ఉండింది. అయితే ఈ రోజు అమెరికా , యూరో దేశాలు క్రైస్తవ దేశాలుగా పరిగణించడానికి వీలు లేదు. మొదటగా – అక్కడ ఏ ప్రభుత్వం క్రైస్తవత్వం తమ మతంగా ప్ర్కటించలేదు. ఇదే అదనుగా క్రైస్తవులను స్టీరియో టైప్ జరిగే ప్రయత్నం జరుగుతుంది. అదే సరి అయినది అనుకుంటే – ముస్లిములైతే బాంబులేస్తారని, హిందువులైతే మైనర్లను రేపులు చేస్తారని స్టీరియో టైప్ చేయాల్సి వస్తుంది.

క్రీస్తు జీవితం క్రిస్టియన్స్ కు ఒక మాదిరి కరమైన జీవితంగానే ఉంటుంది. క్రీస్తు పుట్టుక నుండీ చూస్తే – ఆయన మనిష్యులకు పుట్టలేదు. దేవుడు మనుష్యులకు పుట్టాక మనిషితనం కాకుండా, మనిషి పాపపు ప్రవర్తనను అంతో ఇంతో యాకెస్ప్ట్ చేసినట్టుగా అవుతుంది. అదే విధంగా అందరిలా చనిపోతే, దేవుడికి మనిషి కేరక్టర్ వచ్చినట్టు అవుతుంది. జననం , మరణం రెంటిలోనూ ఒక వైవిధ్యం కలిగిన జీవితం యేసు క్రీస్తుది . జీవితం లో పెళ్ళి చేసుకుని మానవుడి వ్యవహారం ఏదీ అనుసరించలేదు. దేవుడిగా భూమి మీదకు వచ్చి దేవుడు ఎలా బతకాలో అలాగే బతకగలిగాడు. అలాంటి అత్యున్నత నీతిని పాటించాడు. అంత స్థాయి నాయకత్వాన్ని చూపించగలిగాడు. అంత త్యాగాన్ని మాదిరిగా ఉంచగలిగాడు. తన జీవితం మొత్తం మీద ఒక్క ధనవంతుడి కాపు కాయడం గాని, ఒక్క అగ్ర వర్గ ప్రయోజనాన్ని కాని మీద వేసుకోలేదు. ఒక్క యుద్ధం చేయలేదు. ఒక్క గొడవ పడలేదు. ఒక్కరిని కొట్టింది లేదు. ఒకరిని ఎలా ప్రేమించాలో చూపుతూ జీవించగలిగాడు. ఇక్కడ క్రీస్తు నిజంగానా దేవుడా కాదా ? అని రచయిత ప్రూవ్ చేయట్లేదు. డిస్ ప్రూవ్ చేయట్లేదు. క్రైస్తవుల నమ్మిక దేవుడి గురించి ఏదైతే ఉందో అందులో ఎంత న్యాయమైనదో అని మాత్రమే ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం. దేవుడు ఉన్నాడు అని నమ్మాక , ఏ దేవుడిని ఎన్నుకోవాలి, ఎందుకు ఎన్నుకోవాలి అని అన్ని ప్రశ్నలు వేసుకుంటే – యేసు క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని మించిన వ్యక్తిత్వం ఎక్కడా కనిపించదు. అందుకే అంబేద్కర్ యేసు క్రీస్తును ఆ ప్రాతిపదికన బుద్దుడికి ధీటుగా ఉంచగలిగాడు.

అంబేద్కర్ క్రిస్టియానిటీని విమర్శించాడు . అవి ఇలా ఉన్నాయి :

(1) క్రిస్టియానిటీ దేవుడిని నమ్ముతుంది. దానివలన ప్రజల్లో వెనుకబాటు తనం కలుగుతుంది. పాపం చేయువాడీ సంస్కరణను మాత్రమే సూచిస్తుంది. కాని అమితంగా నిత్యం పాపానికి అలవాటు పడిన వాడు , సంస్కరణల ద్వారా మారడు.

(2) క్రిస్టియానిటీ రాజకీయంగా ప్రజలను మొబిలైజ్ చేయలేదు.

(3) క్రిస్టియానిటీ కూడ కుల వ్యవస్థకు అతీతంగా ఇండియాలో లేదు

(4) Early christianity తాగుబోతుతనం, అమ్మయిల విచ్చలవిడితనం తో గడిచిపోయింది కాబట్టి , ఇది ఇండియాలో హిందువులు గాని, ముస్లిముల అభిమానాన్ని గాని సంపాయించలేకపోయింది

(5) మొదటగా రోమన్ కేథలిక్ ప్రవేశించింది. తర్వాత ప్రొటెస్టింటిజం ఈ దేశం లోకి వచ్చింది. అయితే – మొదటగా ముఖ్యంగా కేథలిక్కులు బ్రాహ్మణులు, అగ్ర కులాలను కన్వర్ట్ చేయడం మీద తమ ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళను సమాధాన పరచడానికి, బొట్టు కంటిన్యూ చేయడం తో పాటు, హిందూ ఆచారాలు వేడుకలు కొనసాగించేట్టు రాజీ పడ్డారు. దీన్ని ” మలబార్ ఆచార కర్మ ” ( Malabar Rites ) గా అంబేద్కర్ వర్ణించాడు

(6) బ్రిటీష్ పరిపాలన కింద ఉన్న భారత దేశం , తాను క్రిస్టియానిటీ తీసుకుంటే ( అంబేద్కర్ కేవలం ఇస్లాం, సిక్కు, క్రిస్టియానిటీ ని మాత్రమే బుద్దిజం కాకుండా ప్రత్యామ్నాయ మతాలుగా పరిగణించి ఒక్కో ప్రత్యామ్న్యాయాన్ని పోలుస్తూ pros and cons వివరిస్తాడు ) అది భారత దేశాన్ని మరింత పీడనలోకి తీసుకువెళ్ళే ప్రమాదముందని భావిస్తాడు

అదే విధంగా అంబేద్కర్ క్రిస్టియానిటీ విషయం లో ఈ విధంగా తన అభిప్రాయాలు తెలియ జేస్తాడు :

(1) తొలి కాలపు క్రిస్టియానిటీ క్రమశిక్షణ లేకుండా ఉన్నా, మొదట్లో అగ్ర కులాల మత మార్పిడి మీద పని చేసినా క్రమేపీ క్రిస్టియానిటీ నిమ్న కులాల వెల్ఫేర్ పై కేంద్రీకరించింది. ఎంతో పెద్ద మొత్తం లో దళితులు క్రిస్టియానిటీని అంగీకరించారు.

(2) ‘ నాకు క్రిస్టియానిటీ పై అత్యంత గౌరవం. ఎందుకంటే క్రిస్టియానిటీలో నిమ్న వర్గాలే అతి పెద్ద మొత్తం లో ఉంటారు ” అని అంటాడు.

(3) క్రిస్టియన్ మిషనరీ నిమ్న వర్గాల సంక్షేమానికి సమానతరంగా ఎవరూ చేయలేని కృషిని చేసాయి ( ఇందుకోసం ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని స్కూల్స్ తదితర చారిటీ వర్క్ మీద డేటా అంతా ఒక చోట సమీకృతం చేసి చూపిస్తాడు )

(4) గాంధీ ముస్లిము మత మర్పిడిని వ్యతిరేకించలేదు గాని క్రిస్టియన్ మత మార్పిడిని వ్యతిరేకించాడు. ఎందుకంటే – ముస్లిముల జనాభా 11 శాతముంటే , క్రిస్టియన్ ల జనాభా 2 శాతం కన్న తక్కువ ఉండడం వల్ల నిర్లక్ష్యానికి గురయ్యారు. క్రిస్టియానిటీకి మత మార్పిడికి సంబంధించిన స్వేచ్చ ఉండాలి. దేవుడిని నమ్మితే స్వార్థ పూరితంగా వ్యక్తిగతంగా ఉంచుకోలేరు. క్రిస్టియానిటీ ఈ విషయం లో వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోవడాన్ని సువార్తగా ప్రకటించుకుంది.

అంబేద్కర్ క్రిస్టియానిటీ పై జరుగుతున్న సాంస్కృతిక భౌతిక దాడుల గురించి గొంతెత్తిన మొట్ట మొదటి దేశ నాయకుడు.

” ఈ దేశం లో ఉండే బూటకపు జాతీయ వాదం క్రిస్టియానిటీకి బెదిరింపుగా ఉంటుంది ” అని 1930 లలో క్రిస్టియానిటీ ఈ దేశం లో ఎదుర్కుంటున్న సమస్యను క్రిస్టల్ క్లియర్ గా సారాంశం చెప్పిన వ్యక్తి. క్రిస్టియన్ సంఖ్య ముస్లిముల సంఖ్య కన్న తక్కువ ఉండడం తో పాలక్ వర్గాల నిర్లక్ష్యానికి గురౌతున్నారు అని సంస్య మూలాన్ని కూడా వివరించిన మొదటి వ్యక్తి అంబేద్కర్. గాంధీ క్రైస్తవుల విషయం లో గొంతెత్తి అస్పృష్యులను క్రైస్తవులు మత మార్పిడి చేయొద్దు. అస్పృష్యులు అమాయకమైన గోవులు అని ఒక సవర్న అహంకార పూరితం తో అడ్డుకుంటాడు. “ అస్పృష్యులు ఆవుల్లా కనిపిస్తున్నారు గాంధీకి. ఇదో అహంకార దృక్పథం. అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడూ అంటే క్రైస్తవులు కేవలం 1.7 శాతం మాత్రమే ఉన్నారు. ముస్లిములు 11 శాతం ఉన్నారు. అందుకే క్రైస్తవుల ప్రయోజనాలు లెక్కలోకి రావు ” అని అంబేద్కర్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతాడు. ఈ వోట్ల ప్రజాస్వామ్యం లో నిజం, న్యాయం అనే విలువలకన్నా, సంఖ్యకుండే విలువ ఎక్కువ. ఆ సంఖ్యాబలం క్రైస్తవుల్లో లోపించింది. అది ముఖ్యంగా దళిత క్రైస్తవులను క్రైస్తవులుగా గుర్తింపకపోవడం వల్ల జరుగుతుంది.

“ క్రిస్టియన్ మిషనరీలు అస్పృష్యులకు ఆశ్రయంగా నిలిచాయి. ఆదరణ నిచ్చాయి. ఒక్క సారన్నా ఈ హిందువులు ‘ మీరు చేసింది చాలు. మా అస్పృష్యులకు మేము సేవ చేస్తాము. మాకు చాన్స్ ఇవ్వండి ‘ అన్న పాపాన పోయారా ? కేవలం క్రిస్టియం మిషనరీలను దూషించడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు ” అని అంబేద్కర్ హిందూ మెజారిటేఋఇయనిస్ట్ మనస్తత్వ్వాన్ని బయలు పరుస్తాడు.

క్రైస్తవత్వం కాలానుగుణంగా మారిన మారుతున్న మతం. ప్రాక్టికల్ పరిస్థితులకు అనుగుణంగా ఉండీ దైవత్వాన్ని అడ్డుపెట్టి నేరాలు ప్రోత్సాహించిన సంధర్భాలు చాలా అరుదు. ఇది ముఖ్యంగా దిగువ వర్గాల మతం గా ఉండబట్టి బ్రాహ్మణీయ ప్రభావం తో , ఒక రాజీ స్వభావం తో మూర్ఖమైన ప్రాపగండా క్రైస్తవుల పాస్టర్ల వలన జరుగుతుంది. వేదాల్లో క్రీస్తు గురించి ఉన్నట్టు, మహిమలుంటాయి కాబట్టి అందరూ తెగ ఊగిపోయి పిచ్చ్చోల్లా ఉంటారు అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇదంతా క్రైస్తవత్వం గాని బైబిల్ గాని ఏ మాత్రం సమర్థించదు.

‘ క్రైస్తవులయిపొయారు కాబట్టి దళితులు కాదు వాళ్ళు. వాళ్ళను దళితులతో పోల్చరాదు ‘ అని దళిత క్రైస్తవులపై జరుపుతున్న సైద్ధాంతిక సాంస్కృతిక దాడిని పరిశీలిద్దాం. ఇది ఒక్కో piece చూద్దాం. మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వారి దగ్గర నుండి వెతకాల్సి ఉంది

(1) దళిత క్రైస్తవుల కుల స్థాయి మారిపోయిందనుకుంటే – వీళ్ళు RSS ,BJP చేతుల్లో మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే ఎక్కువ దాడికి ఎందుకు గురౌతున్నారు ? ? క్రైస్తవేతరత్వమే సమస్య అయితే కన్వర్ట్ అయిన బుద్దిస్టులు గురి కావచ్చుగా ?

(2) మన కులం ఇది అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనుకుంటే మతం మార్చడం ద్వారానో ప్రాంతం మార్చడం ద్వారానో మార్చేసుకుంటాం కదా ? సమస్య ఏంటంటే మనమే కులమనేది బ్రాహ్మణత్వం determine చేస్తుంది. మనం పక్కకోచ్చి ‘ మేము మాదిగొల్లము కాదు , మాకు మంగలోళ్ళ కింద లేదా గోల్లోళ్ళ కింద ప్రమోషన్ వచ్చింది’ అని చెప్పుకోడానికి లేదు. ఎందుకంటే అది సర్టిఫై చేయాల్సింది మనం కాదు. మన చూస్తూ ఉన్న బ్రాహ్మణత్వం. మన సమస్య అది !! ( మనం బుద్ధిజం కింద అయిన క్రిస్టియన్ కింద అయిన convert అవ్వడం మన తరపు నుండి ఒక frustrating reaction మాత్రమే కదా ?)

(3) అస్పృశ్యత ప్రకటించడానికి ఒకప్పుడు జన్మ కారణం చెప్పారు, ఇంకోసారి health and cleanliness రీజన్ చెప్పారు , ఇంకో సారి మా అమాయకత్వం మూర్ఖత్వం కారణం చెప్పారు, మా ఆర్ధిక వెనుకబాటు తనం కారణం చెప్పారు. ఇప్పుడు మతం మారామని కారణం చెప్పి దాడికి సిద్ధమవుతున్నారు. మీకు ఇప్పటివరకు మాపై దాడి చేయడానికి ఏదో ఒక సాకు దొరికింది. ఇప్పుడు క్రైస్తవత్వం అనే సాకు దొరికింది. ఇంకా వీళ్ళ వైఖరికి కులం లేదు ఆంటారేంది ?

(4) మీ మతం నుండి రావడం వలన, క్రైస్తవుల్లో బొట్టు వచ్చింది, మెట్టెలొచ్చాయి, తాళి వచ్చింది, సమర్త ఫంక్షన్ వచ్చింది…..వీటన్నికిటి బుర్ర ఊపుతారు. కాని కులం రాలేదు అంటే మాత్రం రాయిలా ఉంటారు. what a hypocrisy ?

(5) అంబేద్కర్ క్రైస్తవత్వం పై రాసిన వ్యాసాలలో అంబేద్కర్ క్రైస్త్వత్వం లోకి కులం పాకింది అని evidence ( Malabar Rites అనే సంస్కృతి గురించి అంబేద్కర్ చెప్తూ వస్తాడు ) తో సహా రాసినది వదిలేసి, వీళ్ళు ఇక్కడ కూర్చోని మతం మారిన తర్వాత కులం మారలేదు అని తీర్పులిస్తారేంది ?

(5) వీళ్లకు క్రైస్తవత్వం మీద అంత కచ్చగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి, బ్రదర అనిల్ కుమార్, షర్మిల వాళ్ళ మీద దాడి చేయండి. ఇక్కడ దళిత క్రిస్టియన్ లు అప్పనంగా దొరుకుతున్నారు కాబట్టి దాడి మరి క్రైస్తవులలో దళిత కులస్తులే దొరుకుతారేంది వీళ్ళకు. పైగా కులం లేదంటారేంది ?

(6) మతం మారని నారయణన్ కు, రాం కోవింద్ కు దొరికే రాష్ట్రపతి పదవులు, దళిత క్రిస్టియన్స్ కు ఇచ్చి – ఈ రోజు దేశం లో క్రిస్టియానిటీకి కులం లేదు అని చెప్పండి.

పాస్టర్ సంజీవుల దారుణమైన హత్య, పాస్టర్ స్వామి పై కౄరమైన దాడి , ప్రతి సంవత్సరం ఎన్నో వందల సంఖ్యలో , ముఖ్యంగా బీ జీ పీ పరిపాలనలోకి వచ్చాక, చర్హ్చల మీద జరిగే దాడి ఇవన్నీ ఒక ఎత్తైతే , అధికార వర్గాలలో ఎక్కడొ అడపా దడపా తప్ప కనిపించని దళిత క్రైస్తవుల ప్రాతినిధ్యం, ఈ దేశం లో దళిత క్రైస్తవుల అథమ స్థితి ని తెలియ జేస్తుంది. వీళ్ళలో అధికులు పేద వాళ్ళే. వీళ్ళలో బైబిల్ మీద మక్కువతో ఉన్న అక్షరాస్యత, ఉద్యోగార్హత దాక తీసుకెల్లలేకపోతుంది.

సంఖ్యాపరంగా సుమారు పది శాతం ఉన్నా, అఫీషియల్ గణాణాంకాలు వీళ్ళకు ప్రత్యేక సాంఘిక స్థాయితో గుర్తించరు గనుక వీరు దళితులలో మరీ అణగదొక్కిన వర్గం గా ఉంటున్నారు. కారంచేడు, చుండూరు లలో చంపబడ్డవాళ్ళు దళితులు అనడం కన్నా, దళిత క్రైస్తవులు అనడమే సబబు. మార్క్సిజం , అంబేద్కరిజం చేరని సమయం లో, ఒక సాంఘిక గుంపును కూడ గట్టడం లో, చర్చ్ వ్యవస్థ అంతో ఇంతో దోహద పడకపోతే ఆ సంఘటితం సాధ్య పడదనే చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టులు కూడా అమెరికా అగ్ర రాజ్యాల బూచిని చూపి క్రైస్తవత్వాన్ని స్టీరియో టైప్ చేస్తున్నారు. అదే కమ్యూనిస్టులు సౌదీ దేశాలలో ప్రబలంగా ఉండే ముస్లిం మతాన్ని స్టీరియో టైప్ చేయడాన్ని సమర్థించరు. ఇదో పిడివాద అఙానం. దళిత క్రైస్తవులు కులమే కాక, మత పరంగా కూడ ఒక వివక్ష ఎదుర్కుంటున్నారు. సిటీలలో హిందువులకు మల్లే క్రైస్తవులకు ఇళ్ళు దొరకడం కూడా సులభతరం కాదు. దళిత క్రైస్తవుల విషయం లో అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వాళ్ళు కూడా కొంత గందరగోళానికి గురౌతూ ఉంటారు. చర్చ్ లో అంబేద్కర్ గురించి బోధించాలి అని ప్రతిపాదిస్తారు. ఇదే ప్రతిపాదన దళీత హిందువులు వెళ్ళే గుడుల విషయం లో ప్రతిపాదించరు. ఎందుకంటే ఆ గుళ్ళు ఎలాగూ దళితులవి కాదు కాబట్టి. చర్చ్లంటే దళితులకు మాత్రమే నెలవులు కాబట్టి. అంబేద్కరిజం గాని మార్క్సిజం గాని రాజకీయ తత్వ శాస్త్రాలు. వీటికి ఆధ్యాత్మికత అవసరాలకు సంబంధం లేదు. ఇది అనవసరమైన శతృధోరణిని పెంపొదిస్తుంచడమే కాక, అంబేద్కర్ వాదాన్ని పిడివాద సూత్రంగ మలుస్తుంది కూడా.

మైనారిటీలనేది అంబేద్కర్ చెప్పినట్టు వారి సాంఘిక , ఆర్థిక, రాజకీయ వెనుకబాటు తనం బట్టే నిర్ణయించాలి. కూడగట్టాలి. దళిత క్రైస్తవుల మత విశ్వాసాలు బ్రాహ్మణీయ వ్యతిరేకమైనవి. వారు జరిపే సువార్తలో దేవుడు తమకు తెల్సు కాబట్టి, పది మందికి తెలియజేయాలి అనే ఒక ఆధ్యాత్మిక నిస్వార్థత ఉంది. అదే బ్రాహ్మణ మతం – దేవుడిని కేవలం తమకు మాత్రమే స్వంతం చేసుకోవాలనే కోరుకుంటుంది. మిగతా వాళ్ళు సమీపించరాదు – అనే కోరుకుంటుంది. దళిత క్రైస్తవులను కూడగట్టడం – వారి మత విశ్వాసాలను డిబేట్ కు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మొదటగా ఈ దేశ పౌరులు అందరిలాగే. తర్వాతే వారు ఒక మతస్తులు. వారిలో ఉండే మత విశ్వాసాలపై , వారిలో ఉండే మూధనమ్మకాలపై , వారిలో ఉండే రాజకీయ అపనమ్మకాలపై ఒక సిస్టమేటిక్ గా, స్నేహ పూరిత పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఐతే అదే అదనుగా బ్రాహ్మణ శక్తులకు అనుకూలంగా వారిని నాస్తికవాదం పేరుతో గాని, హేతువాదం పేరుతో గాని, మార్క్సు వాదం పేరుతో గాని, అంబేద్కర్ వాదం పేరుతో గాని గేళి చేయడం, వారిని isolate చేయడం లాంటి చర్యలు పూర్తిగా బ్రాహ్మణీయమైనవే.

ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ బలహీన సెక్షన్ల సువార్తలపై జరుగుతున్న దాడులను గాని, పాస్టర్లపై జరుగుతున్న దాడూలను గాని, చర్చ్ లపై జరుగుతున్న దాడులను గాని మూకుమ్మడిగా వ్యతిరేకించి ఈ దేశం లో జరిగే బ్రాహ్మాణీయ వ్యతిరేక కుల నిర్మూలన పోరాటాన్ని మరింత పటిష్టం చేయాలి.

– పి.విక్టర్ విజయ్ కుమార్

( రచయితనుfacebook ID “ P V Vijay Kumar” పై గాని, ఈ మెయిల్ ఐడీ pvvkumar€yahoo.co.uk పై గాని సంప్రదించవచ్చు)

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో