సహ జీవనం – 28 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“రండి, రండి” అంటూ లోపలి ఆహ్వానించింది నందిని.

నందినిని చూస్తూనే ‘అమ్మాయి కొద్దిగా రంగు తక్కువైనా, కనుముక్కు తీరు బాగుంది’అని సంతోష పడింది శాంత. నందిని కూడా శాంతా, శ్రీనివాసరావులను చూసి ఇద్దరూ మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంది. సుధీర్ ఆటోలోంచి సూట్కేసులు తీసుకుని లోపలకు వచ్చాడు.

“రాత్రి ప్రయాణం సుఖంగానే జరిగిందాండి? రైల్లో నిద్ర పట్టిందా?” అంటూ పలకరించింది.

“బాగానే నిద్రపట్టింది” అంటూ శాంత భర్త వైపు చూసింది. శ్రీనివాస రావు ఏం మాట్లాడ లేదు, కానీ లోలోపల ‘ఈ అమ్మాయికి మర్యాద తెలుసు’ అని ఆనందించాడు.

శ్రీనివాస రావు, శాంత మొహాలు కడుక్కుని వచ్చే సరికి నందిని ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. సుధీర్ కొక కప్పు ఇచ్చి, తానొకటి తీసుకుని వాళ్ళ పక్కనే కూర్చుంది. కాఫీలు తాగడం అవగానే,

“కాసేపు మీ అబ్బాయితో మాట్లాడుతూ కూర్చోండి. నేను వంట చేసేస్తాను. మళ్ళీ మేము ఆఫీసుకు వెళ్ళాలిగా” అంటూ లేచింది.

“ఇవాళ నా వంతు, నేను చేస్తాను” అంటూ లేచాడు సుధీర్.
“నేను చేస్తాలే అమ్మా, నువ్వు కూర్చో” అంది శాంత.
“రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు. హాయిగా స్నానాలు కానిచ్చి, భోజనం చేసి రెస్టు తీసుకోండి. ఇక మీ అబ్బాయి వండితే, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెనక్కి తిరిగి వెళ్ళి పోతారు. అదీ గాక, మీ అబ్బాయికి నేనెలా వండి పెడుతున్నానో మీరు చూడొద్దా?” అంటూ నందిని నవ్వుతూ వంటింటిలోకి వెళ్ళింది.
“ఈ అమ్మాయి సుధీర్ చెప్పినదాని కంటే మాటకారి, తెలివైనది” మెల్లగా అన్నది శాంత. శ్రీనివాసరావు నవ్వాడు.
సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే, ఇద్దరూ రెండు చేతులతో పాకెట్లు పుచ్చుకుని వచ్చారు. ఏవో స్వీట్స్ లాగున్నాయి అనుకున్నది శాంత. భోజనాలు అయినాక నందిని మాములుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా వెళ్ళిపోలేదు. హాల్లోనే టి.వి.చూస్తూ కూర్చున్నది. మరో సోఫాలో శ్రీనివాస రావు, శాంత, సుధీర్ కూర్చున్నారు.
కొంత సేపు అయ్యాక, అకస్మాత్తుగా అడిగింది నందిని “ఆంటీ, ఇలా పిలుస్తున్నానని ఏమీ అనుకోవద్దు. మనకు బాంధవ్యం ఏర్పడలేదు కనుక, నేను మిమ్మల్ని ఇలాగే పిలుస్తాను.”

“నువ్వు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదమ్మా. నన్ను అమ్మా అని పిలిచినా సంతోషమే. ఎందుకంటే మాకు సుధీరొక్కడే” శాంత ఆనందంగా చెప్పింది.

“థాంక్స్, ఆంటీ. సరే, ఇక విషయానికి వస్తాను. మీరు నన్ను చూడాలని, నా గురించి తెలుసుకోవాలని వచ్చారు. కానీ, ఇంతవరకు ఆ విషయమే ఎత్త లేదు. కనుక, నేనే చెబుతాను. కొన్ని విషయాలు మీకు మీ అబ్బాయి చెప్పే వుంటారు. అమ్మా, నాన్నా, అన్నయ్య అందరూ ఉన్నా, అందరి ఆడపిల్లల లాగా జీవితం నాకు వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో సమస్యల మధ్య నేను బీ.టెక్. చేసి, మీ అబ్బాయి చేసే కంపెనీలోనే రెండు సంవత్సరాల క్రితం చేరాను. మొదట్లో నేను, మరొక అమ్మాయి ఒక ఫ్లాటు తీసుకుని, వండుకుని తింటూ వచ్చాము. తర్వాత నేను వేరే ఫ్లాటుకు వెళ్ళిపోయాను. అయితే, ఒంటరిగా వున్న ఆడపిల్లలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా రోజులు పరిశీలించి, మీ అబ్బాయితో ఈ ఒప్పందానికి వచ్చాను. బహుశా మీరు ఈ అమ్మాయి చాలా తెగించిన మనిషి అనుకుని వుంటారు.
అవును, నిజమే. జీవితం నాకు ఎప్పటికప్పుడు రిస్కులు కానుకగా ఇచ్చింది. అందువల్ల, కొన్ని సమయాల్లో తెగించి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. నా అదృష్టమేమో గానీ, ఇంతవరకూ నా నిర్ణయాలు ప్రమాదంగా పరిణమించలేదు” చెప్పడం ఆపి, శాంత వంక చూసింది నందిని.

(ఇంకా ఉంది )

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో