క్షమాశీలత (కథ )- ఆదూరి.హైమావతి

పర్తివారిపల్లెలో అనంతమూ,ఆనందమూ అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ రైతులే. ఆనందు ఎప్పుడూ నిజాయితీగా తన రాబడిని అమ్ముకుంటూ పొదుపుగా సంసారానికి సంపాదన వాడుకుంటూ కాస్తంత సొమ్ము వెనకేశాడు. కొడుకు చదువూ, కూతురి పెళ్ళీ ఉండటాన ఏనాడూ ఏ వృధా ఖర్చూ చేసే వాడు కాదు. పొదుపుచేసిన సొమ్మును పొరుగూర్లో ఉన్న బ్యాక్ లో దాచు కున్నాడు.

అనతం మాత్రం అమితంగా స్థాయికి మించి ఖర్చుచేస్తూ పొలంమీది రాబడినంతా విచ్చలవిడిగా పిల్లల గుడ్డలకూ, భార్య సొమ్ములకూ, సరదాలకూ ఖర్చుచేసి సంవ త్సరాంతానికి ఆనందం వద్దకు అప్పులకు వచ్చేవాడు. ఎక్కువగా ఆనందే అనేక మార్లు ఆదుకునేవాడు. “ఆనందూ ! నీవు లేకపోతే నేనేమై పోయేవాడినో కదా ! నీ ఋణం తీర్చుకోలేనిది.” అంటూ మాట్లాడే వాడు. “అనంతూ కాస్తంత పొదుపు పాటించవయ్యా ! బిడ్డల కోసం చేయాల్సిన ఖర్చులు ముందున్నాయి ” అని చెప్పేవాడు ఆనందు. వీరిద్ద రికీ ఎలాస్నేహం కుదిరిందాని ఊళ్ళోవారు ఆశ్చర్యపడేవారు. ఒకరు పొదుపరీ, ఒకరు వృధావ్యయం చేసేవాడూ కనుక.

ఇద్దరి పిల్లలూ పెరిగి పెద్దవాళ్ళుకాసాగారు. మంచి సంబంధం కుదరడంతో ఆనందు కూతురి పెళ్ళిఖాయం చేశాడు. పెళ్ళి ఖర్చుల నిమిత్తం పొరుగూరి బ్యాంక్ లో దాచుకున్న సొమ్ము తెచ్చుకోను వెళ్ళి, అంతా ఒక సంచీలో కాక రెండు సంచీల్లో సగం సగం సొమ్ము దాచి, తిరుగు ప్రయాణమయ్యాడు. సొమ్మును పంచె లోపల నడుముకు కట్టుకున్నాడు.ఊరి పొలిమేరల్లోకి వచ్చాక పొలం గట్లమీద నడుస్తూ అల్పాచమా నానికి వెళ్లవలసి వచ్చి , పంచె వదులు చేసుకుని , పనికా నిచ్చి బయల్దేరాడు.

ఇంటికొచ్చి చూసుకుంటే ఒకేసంచీ ఉంది. రెండో సంచీ ఎక్కడో జారిపోయి ఉంటుందని భావించి ఉరుకులూ పరుగుల మీద వెతుక్కుంటూ బయల్దేరాడు. చమటతో తడిచి భయంతోవణుకుతూనే వెతుక్కుంటూ వెళుతుండగా, దార్లో అనంతం కనిపించి,”ఎక్కడికి ఆనందూ ! చెమట క్రక్కుతూ బయల్దేరావ్?” అని పలకరించాడు. “అనంతూ ! ఆడబిడ్ద పెళ్ళికోసం నోరు కట్టుకుని పొరుగూరి బ్యాంక్లో దాచిన సొమ్ము తీసు కుని, తెచ్చుకుంటూ ఉండగా ఊరిపొలిమేరల్లో డబ్బున్న ఒక సంచీ ఎక్కడో పడి పోయిందయ్యా! దాని కోసం వెతుకుతు న్నా ను.” అనిచెప్పాడు వెతుకుతూ నడుస్తూనే. “అయ్యో పాపం! నేనూ వెతికి పెడతాను.ఎలాఉంటుందాసంచీ?”అన్నాడు అనంతు.

“గులాబీరంగు సంచీ మూతి తెల్ల దారంతో కట్టిఉంది”అన్నాడు ఆనందు . ఆ మాటలు విన్న అనంతు తన బొడ్లో ఉన్న వస్తువును ఒకమారు చేత్తో తాకి చూసుకున్నాడు.

ఎంతవెతికినా ఎక్కడా డబ్బు సంచీ కనిపించక బాధపడుతున్న ఆనందు తో “పోయిన వస్తువు ఎలా కనిపిస్తుంది ఆనందూ! పదపోదాం ,ఎక్కడో అప్పు చేద్దువుగాని,తర్వాత తీర్చుకోవచ్చు.ముందు శుభ కార్యం గట్టెక్కనీ”అంటూ వెనక్కు తీసుకువచ్చిఆనందును ఇంట్లో దింపిపోయాడు.

మూడు నాలుగు రోజులు బాధపడ్డాక ఆనందు అప్పుకోసం ఎవరిని అడగాలా అనుకుంటుండగా అనంతు వచ్చి ” మా బావమరిది ఇక్కడ పొలంకొనాలను కుంటూ కొంత డబ్బు నావద్ద ఇచ్చి వెళ్ళాడు. ముందు నీపని గడవనీ నాకు ఎన్నిమార్లు సాయంచేశావు ? ఇంద ఉంచు ,”అంటూ కొంతడబ్బున్న సంచీ ఆనందు చేతిలో పెట్టాడు. ఆనందు అనంతును ఆలింగనం చేసుకుని ఆసొమ్ము ఇంట్లోదాచమని భార్య కిచ్చాడు. ఆమరునాడు ఆనందు పెళ్ళి ఖర్చులకోసం అనంతు ఇచ్చిన సంచీ తెరిచి చూడగా తాను బ్యాంకు నుంచీ తీసుకున్నసొమ్ము ను కట్టలు కట్టి ఇచ్చిన దారం అదే లాగా ఉండటంతో , బ్యాంకు అధికారులు సొమ్ము ఇచ్చినపుడు నోట్లనెంబర్లు ఒక కాయితం మీద రాసిమ్మని కోరి రాయించు కు తెచ్చుకున్న విషయం గుర్తొచ్చి, ఆకాయితం తెచ్చి రెండూ ట్యాలీచేసి చూశా డు, నిజం తెలిసింది. అనంతుకే ఆసంచీ దొరికింది, దాన్ని దాచి ఆసొమ్మే తనకు బావమరిది సొమ్మని ఇచ్చాడు. ఇంత మిత్ర ద్రోహితోనా తాను ఇంతకాలం స్నేహం చేసింది అని బాధపడ్దాడు ఆనందు.

ఆనందు కొడుకు అనంతు వద్ద కెళ్ళి” మామా! మీ బావమరిది ఎక్కడుంటాడో చెప్తావా? అతడికే మానాన్న పోగొట్టుకున్న డబ్బు సంచీ దొరికింది.అతడ్ని పోలీసులకు పట్టివ్వాలి,ఆనోట్లమీది నెంబర్లే బ్యాంక్ అధికారులు డబ్బిస్తూ మానాయనగారికి ఒక కాయితం మీద వ్రాసి ఇచ్చారు”అంటూ అడిగేసరికి , అనంతు ఆనందు కొడుకు చేతులు పట్టుకుని, “బాబ్బాబు మన్నించు, దీన్ని బయట పెట్టకు, బుధ్ధిగడ్డితిని మిత్ర ద్రోహం తలపెట్టాను. ఇవిచేతులుకావు , దొరగ్గానే ఇవ్వాలనిపించినా నా దుర్వ్యయం నా బుధ్ధిని పెడమార్గం పట్టించింది.” అంటూ కళ్ళనీరు పెట్టుకున్నాడు. “మామా మా నాన్నగారు చెప్తూనే ఉన్నారు. పొదుపరి తనం నేర్చుకోమని ,దుబారా మనిషి చేత ఏ చెడ్దపనైనా చేయిస్తుంది.” అంటూ వెళ్ళాడు.

తనస్నేహితుని క్షమాశీలతకు అనంతు ఆశ్చర్యపడ్దాడు.

పొదుపరితనం మంచితనానికి మదుపు.

– ఆదూరి.హైమావతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో