సహ జీవనం – 28 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

నాన్నా, “మీరెలా చెబితే అలా” అనే అమ్మలాంటి భార్యలు కారు, నేటి తరం యువతులు! మారిన కాలంతో బాటే, మీ జెనరేషన్ కూ మా జెనరేషన్ కు మధ్య వుండే గ్యాప్ లో కూడా స్పష్టత వచ్చింది . ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్ళ ప్రాముఖ్యతలు ఏవో వాళ్ళు నిర్ణయించు కుంటున్నారు. ఒక వేళ ఈఅమ్మాయి కాకపొయినా, మీరు కుదిర్చే మరొక పరిచయం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అమ్మకు, ఆ అమ్మాయికి పడకపోతే, అప్పుడు రోజూ నరకమే చవి చూడాలి. పెద్ద వయసులో మిమ్మల్ని సరిగా చూసుకోగలనా అనే అనుమానం నన్ను రోజూ వేదిస్తునే ఉంటోంది. భార్యను అదుపులో పెట్టకోలేరా అనేది నాన్న గారి లాంటి వాళ్ళ ప్రశ్న. కాలం మారింది. మనమూ మారాలి. ఈ స్పీడు యుగంలో ఉద్యోగ బాధ్యతలు మగవాళ్ళతో సమానంగా నెరవేరుస్తూ, తమ కోసం కూడా తాము వండుకుని తినలేని పరిస్థితుల్లో అమ్మాయి లున్నారు. చాలా మంది కోడళ్ళు అత్తమామలను చూడాలను కోవడం లేదు. తమ తల్లిదండ్రులను తెచ్చుకుంటున్నారు. తల్లీతండ్రీ మాత్రమే నచ్చుతున్నారు కూడా. చేదుగా వున్నా,ఇది వాస్తవం. ఇది నా కుటుంబం, నా వాళ్ళు అని అత్తమామలతో కలిసి పోయే కోడళ్ళు అరుదుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదేమో అనిపిస్తోంది.

నందిని మనిషి మంచిదే. ఇక కులం గురించి అంటారా, మనిషి మంచిది అయితే ఏ కులంఅయితే ఏమిటీ? ఒకే కులం అయినా మనిషి మంచిది కాక,ఒకళ్ళకొకళ్ళకు పడకపోతే, కులం ఉపయోగం ఏమిటీ? నా ఆలోచన ఏమిటంటే, కొన్నాళ్ళు ఇలాగే మేము కలిసి ఉంటే, ఆ అమ్మాయి నా గురించి ఒక అవగాహనకు వస్తుంది. తను మా పెళ్ళికి ఒప్పుకోవచ్చు. ఒప్పుకుంటుంది కూడా. ఎందుకంటే మీ పెంపకంలో నేను తప్పులు చెయ్యను. మా పెళ్లి అయిన తర్వాత, మనం కుటుంబ సంబంధాన్ని దృడం చెయ్యడానికే ప్రయత్నిద్దాం. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. ఆ ప్రేమ నా భార్యగా వచ్చే అమ్మాయి మీద కూడా ఉంటుందని నాకు తెలుసు. అందువల్ల మనకు సమస్యలు రావనే ఆశిద్దాం. ఒక వేళ ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోకపోతే, కలిసి ఇలాగే గడుపుతాం. కుదరదనుకున్నప్పుడు విడిపోవడమే. తప్పదు, ఇంతకంటే మరొక మార్గం లేదు. నేను ఈ కోణంలో ఆలోచించాను. మీరు దీన్ని ఎంత వరకూ ఆమోదిస్తారో నాకు తెలియదు. నా మనసులో మాట చెబితే, మీరు అర్ధం చేసుకుంటారని ఇలా రాస్తున్నాను.

ఈ సారి నందిని ఉన్నప్పుడు రండి. మీకు కూడా ఆ అమ్మాయితో పరిచయం అవుతుంది. అది ముందు ముందు అవసరం కూడా. ఇక ఉంటా మరి! మళ్ళీ పొద్దున్నే లేచి, ఆఫీసుకు వెళ్ళాలి.

మీ సుధీర్”

ఉత్తరం సాంతం చదివి భార్య చేతికిచ్చాడు శ్రీనివాసరావు.

“ఏమిటండీ, ఇంత పెద్ద ఉత్తరం రాశాడూ? మీరు చదివి చెప్ప రాదూ” అంటూనే శాంత ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదివింది.

“ఏమిటండీ, వాడిలా రాశాడు? వాడు రాసిందంతా నిజమేనంటారా?”చదవడం పూర్తి చేసిచేసి అమాయకంగా అడిగింది.

“నిజమే శాంతా, చాలా వరకు అవి కాదనలేని నిజాలు. సరే, చూద్దాం వాడి అదృష్టమెలా వుందో. వాడు ఒక సారి రామ్మన్నాడుగా. శుక్రవారం సెలవు పెట్టి,వస్తామని ఫోను చేస్తాను.”

“ఏమిటో, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, అసలు మనతో మాట్లాడుతుందో,లేదో? మనం రావడం ఇష్టం లేనట్లు మొహం ముడుచుకు కూర్చుంటే, నాకు చాలా ఇబ్బందిగా వుంటుంది. మనం వెళ్ళాలంటారా?”

“ఇక ముందు మనం వెళ్ళాలా, వద్దా అన్నది ఇప్పుడు వెడితేనే తెలుస్తుంది. ఆ ఆమ్మాయిని చూడకుండానే, ఏదో అనుకోవడం ఎందుకు? వెళ్లి రెండు రోజులు వుండి, ఆ అమ్మాయి ప్రవర్తన గమనిద్దాం. నచ్చక పోతే, అప్పుడే ఏం చెయ్యాలో ఆలోచించ వచ్చు.”

“ఏమో బాబూ, మీ ఇష్టం” అంది శాంత.

(ఇంకా ఉంది )

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో