జ్ఞాపకం-29 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

ఒక్క క్షణం బాధగా చూసి కళ్లు మూసుకున్నాడు రాజారాం. అతనికి హైదరాబాద్‌ హాస్పిటల్లో ఆపరేషన్‌ జరిగాక ఏం జరిగిందో గుర్తొస్తోంది. రాత్రీ, పగలు నొప్పుతో పక్క కుదిరేది కాదు. రాత్రంతా తనకి ఐదుసార్లు పాన్‌ పట్టాల్సి వచ్చేది. మోషన్‌ వచ్చినట్లే అన్పించి వచ్చేది కాదు. ఇటు తిరిగి పడుకుంటే అటు తిరిగి పడుకోవాని, అటు తిరిగి పడుకుంటే ఇటు తిరిగి పడుకోవాని అన్పించేది. శరీరంలో గ్రిప్‌ లేక తనంతటి తను తిరగలేక పోయేవాడు. వార్డ్‌ బాయ్‌ని పిలిస్తే విసుక్కునేవాడు. వినీలను పిలిస్తే నిద్ర నటిస్తూ పలికేది కాదు. తిలక్‌ని పిలిస్తే ‘‘వదినా లే ! అన్నయ్య పిలుస్తున్నాడు’’ అనేవాడు…

‘‘ హాస్పిటల్లో కూడా నన్ను నిద్ర పోనియ్యవా?’’ అంటూ తిలక్‌ మీద గయ్యిమంటూ లేచేది. అందరూ వింటే బావుండదని తిలక్‌నే వచ్చి తన పనులు చేసేవాడు. హాస్పిటల్‌ నుండి ఇంటికొచ్చాక కూడా తిలక్‌నే చెయ్యమంటోంది. తిలక్‌ ఈ మధ్యన బాగా విసుక్కుంటున్నాడు.

నిన్న ఉదయం ‘‘తిలక్‌ ! కొంచెం మీ అన్నయ్యను లేపి పాలు తాగించి వెళ్లు !’’ అని వినీల అంటే తిలక్‌ కోపంగా చూసి ‘‘ఆయన పనులు నేనెందుకు చెయ్యాలి ? నువ్వే చేసుకో ! లేదంటే ఆయన సొమ్ము తిని ఐ.పి. పెట్టి వెళ్లారే వాళ్లను పిలువు. నాకేమైనా ఆయన సంపాదనలోంచి ఓ రూపాయన్న తీసి ఇచ్చావా ? ఇంకో అన్నయ్య అయితే ‘తమ్ముడూ! ఈ రోజుల్లో బైక్‌ లేకుంటే షేంరా ! మంచి డ్రెస్‌ లేకుంటే నామోషిరా ! మంచి తిండి ఇప్పుడు కాకుంటే ఎప్పుడు తింటావ్‌ ?’ అని ఎంతంటే అంత డబ్బులిచ్చి ప్రేమగా చూసేవాడు. అలాంటిదేం ఈ అన్నయ్య చెయ్యలేదు.’’ అంటూ దూరంగా వెళ్లి నిలబడ్డాడు.

వినీల ఉరిమి చూసి ‘‘కంచాలు , కంచాలు ఇంట్లో మెక్కుతూ కూడా అన్నన్ని మాటలంటావా ? నిన్ను మేం భరించగా లేంది. మీ అన్నయ్యను లేపి పాలు తాపితే తప్పా ? ’’ అంటూ గొడవ పెట్టుకుంది. ఆ గొడవ పెరిగి నిన్న అనగా బయటకి వెళ్లిన తిలక్‌ ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడి కెళ్లాడో ఏమో ! వినీల మాటలతో గాయపరచటం వల్లనే ఇంట్లోంచి వెళ్లిపోయాడు తండ్రితో చెప్పి తిలక్‌. ఎటు వెళ్లాడో వెతకమనాలి అనుకున్నాడు రాజారాం. ఎప్పుడు చూసినా ‘‘మా ఆయన ఇక నడవలేడేమో కదా !’’ అని నలుగురికి చెప్పుకొని ఏడవటం తప్ప నడవలేని తనను దయతో, బాధ్యతతో చూసుకోదు వినీల. తనకి మాత్రం వినీల తనను అర్థం చేసుకుని, అక్కున చేర్చుకోవాలని, తనకి అన్నం తినిపించడం, బట్టలు వేయటం, మంచం మీద నుండి పైకి లేపడం లాంటి పనులన్నీ వినీలనే చెయ్యాని వుంటుంది. కానీ వినీల చెయ్యదు’. ఇక ఎప్పటికీ మీరింతేనా ? నా జీవితం ఏంటండీ ఇలా తగబడిపోయింది ?’ అని ఏడవడం మాత్రం చేస్తుంది.

తను మాత్రం ఏం చేయగలడు ? అంతా క్షణాల్లో జరిగిపోయినట్లు తన బ్రతుకే ట్రాక్టర్‌లో ఉన్న షామియా క్రింద, కుర్చీ క్రింద పడి నలిగిపోయింది. నడవలేకపోతున్నాడు. ఇతరుతో పనులు చేయించుకోవాంటే ప్రాణం చచ్చిపోయినట్లు అన్పిస్తుంది. ఆ రోజు చచ్చి పోయివున్నా బావుండేది. ఎందుకీ ఆధారపడి బ్రతికే బ్రతుకు ? ఎవరిని ఉద్దరించడానికి ?

…. ఎవరిదో చేయి సుతి మెత్తగా గుండెపై నిమురుతుంటే కళ్లు మూసుకొని వున్న రాజారాంకి ఆ చేయి వినీలదే అన్పించి ‘ఇది కలా! నిజమా !’ అన్నట్లు ఉక్కిరి బిక్కిరయ్యాడు..

కళ్లు తెరిచాడు. వినీల కన్పించలేదు. ఆమె ఎప్పుడో వెళ్లిపోయింది. తన గుండెపై చేయివేసి నిమురుతున్నది తన తల్లి సులోచనమ్మ.

‘‘అమ్మా !’’ అంటూ తల్లి చేయి పట్టుకొని చూశాడు.

కోడులు కొడుకును కసురుకుని వెళ్లిపోయినప్పుడే ఆమె వచ్చి కూర్చుంది.

ఆమెకు తెలుసు తన చేతి స్పర్శ రాజారాం బాధను పూర్తిగా తగ్గించలేదని. ఎందుకంటే వినీల దృష్టిలో రాజారాం ఖాళీ విస్తరి. ఏ భార్యకైనా అన్నీ వున్న విస్తరి ముందు కూర్చుని తృప్తిగా తినాని వుంటుంది. అలాంటప్పుడు ఏమీ లేకుండా వుండీ లేనట్లు అన్పించే రాజారాంతో ఏం వుంటుంది ? ఎవరైనా సహజమైన వాటిని సహజంగానే ఒప్పుకోవాలి. కానీ నిస్సహాయ స్థితిలో వున్న రాజారాంను మరీ ఇంత నీరుగారి పోయేలా చెయ్యటం వినీలకి పద్ధతి కాదు.

రాజారాం తల్లి మనసును అర్థం చేసుకున్నవాడిలా ‘‘అమ్మా !’’ అని పిలిచాడు. ఆర్తిగా చూశాడు. ఆమె గుండె ఆర్థ్రమైంది.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

One Response to జ్ఞాపకం-29 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో