సహ జీవనం – 27 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“అమ్మా, నాన్నా, మీరు వచ్చి వెళ్ళిన దగ్గరనుంచి నాకు మనసు మనసులో లేదు. బహుశా నేను ఇలాంటి పని చేసినందుకు మీరు బాధ పడుతూ ఉండొచ్చు. ఆ రోజు మిమ్మల్ని చూడగానే, విషయం ఎలా చెప్పాలాని కాస్త కంగారు పడ్డాను. మీకు సరైన సమాధానం ఇవ్వలేక పోయాను. అందుకే ఈ ఉత్తరం. అమ్మా, నాన్న గారికి కోపం వచ్చి ఉత్తరమంతా చదవరేమో, కనీసం నువ్వైనా పూర్తిగా చదువు!

అమ్మా, పెళ్ళి అనేది ఒక లాటరీ. ఒకప్పుడు ఈ లాటరీ ప్రైజు మొగపిల్లలకు దక్కేది. ఆ రోజుల్లో మగపిల్లవాడి తల్లిదండ్రులు తాము పైనుంచి దిగి వచ్చినట్లు ప్రవర్తించే వారు. ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి సుఖంగా ఉండడమే గొప్ప బహుమతి అనుకునే వారు. ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రుల వంతు వచ్చింది. ఈ రోజుల్లో యువతులు,వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ ఇష్టాయిష్టాలకి తగిన సంబంధం అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటున్నారు. అలాంటి వాడు దొరికేదాకా వేచి ఉంటున్నారు కూడా. సంపాదించే కూతుళ్ళపై కొంతమంది తల్లిదండ్రులు ఆధార పడడం కూడా మన సమాజంలో చూస్తున్నాం. కొన్ని చోట్ల కొడుకుల కన్నా, కూతుళ్ళే తల్లిదండ్రులను ప్రేమగా చూడడం దీనికి కారణం కావచ్చు. మగ పిల్లలైతే వంశం నిలబడుతుందని, ఆడపిల్ల అయితే ఒక మంచి సంబంధం చూసి, కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపాలని, అందువల్ల ఆడ పిల్ల అంటే ఖర్చు అనే ఒక దుర్మార్గపు ఆలోచనను సమాజంలో ఇంత కాలం మనమే ప్రోత్సాహించాము.

ఇప్పటికీ, ఆడపిల్లలు పుడితే చంపేయడమో, దిక్కు లేకుండా వదిలేయడమో మన సమాజంలో కొన్ని ప్రాంతాలలో జరుగుతూనే వున్నాయి. అందుకే మన దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అత్తారింట్లో పడే కష్టాలు, వరకట్నం చావులు, తరచుగా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు –ఇవన్నీఅతి అయిపోయి, సున్నితమైన వాళ్ళ మనసులపై దెబ్బ కొట్టాయి. ఈ ఆగడాలు పూర్వం కూడా వుండి ఉండొచ్చు. అయితే, ఇప్పుడు జనం మేల్కొన్నారు. ఇదివరకటిలా ఏదో జరింగిందని కృంగిపోవడం లేదు. కోర్టు కెక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇంత అవగాహన పెరిగినా, జరిగే అకృత్యాలు ఏ మాత్రం తగ్గలేదు. అందువల్లనేమో, నేటి ఉద్యోగినులు కొంత మంది ఈ సహజీవనం లేదా, కలిసి వుండటం గురించి ఆలోచిస్తున్నారు, అనుసరిస్తున్నారు. సమాజంలో ఈ మార్పులకు కారణాలు ఏమిటని వెతికే ఓపిక, సమయం ఎవరికీ లేవు. ఒక వేళ ఎవరికైనా వున్నా, అది ఒక తీసిస్ రాయడానికేమన్నా ఉపయోగ పడవచ్చేమో, అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు. అసలు మారాల్సింది మగ వాళ్ళేనేమో అనిపిస్తోంది! అలాకాకపోతే, వాళ్ళకే పరిస్థితులు మరింత బాధాకరంగా మారనున్నాయి.

మగపిల్లలకు చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్ల అయితే మంచిదని సంబంధాలు చూస్తారు. పెళ్లి అయ్యాక, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ భర్త, అత్త మామలను చూసుకుంటూ, పిల్లలను కని పెంచుతూ- ఇలా సవ్యసాచిలా పని చేయాలనుకోవడం ఈ స్పీడు యుగంలో సాధ్యపడేది కాదు. ఈ విషయం ముందు సరిగా అర్ధంచేసుకోగల్గిన వాడు భర్త ఒక్కడే. ఉద్యోగస్తురాలయిన అమ్మాయితో ఆ చేసుకునే వాడు ఎన్ని విషయాల్లో అడ్జస్ట్ కావాలో, ముందుగా ఎవరూ ఆలోచించరు. ఉమ్మడి కుటుంబంలో పొరపొచ్చాలు లేకుండా ఉండాలంటే అతనే కాదు, అతని తల్లిదండ్రి కూడా అనేక విషయాల్లో తమను తాము మార్చుకోవాల్సి వస్తోంది. లేకపోతే, కుటుంబంలో కలహాలు తప్పవు. అలాగని, వుద్యోగం చెయ్యని అమ్మాయి అయితే, అత్తింట్లో కలిసిపోతుందనే నమ్మకం ఏమీ లేదు. పోట్లాటలకు కావాల్సినంత సమయం మిగులుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన నిజాలే. కానీ, ఆలోచించం!

అమ్మా! నాన్న చెప్పినట్లు, నా స్నేహితుడి పరిస్థితి ఏం బాగా లేదు. వాడు తరచూ తన భార్యా, తల్లి మధ్య జరిగే యుద్దాలను నాకు వివరించి చెబుతూనే వున్నాడు. తల్లికేమో కోడలు తనను లెక్క చెయ్యదనీ, ఎంత మాటంటే అంత మాట మాట్లాడుతుందనీ, కొడుకు సంపాదన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తోందని కోపం. అతని భార్య ఏమో “నా మొగుడి సంపాదనలో నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను, ఈవిడకెందుకు బాధ” అంటుంది. పెద్దావిడ ఏదో అందిలెమ్మని ఆవిడా ఊరుకోదు. కొడుకుని అవహేళన చేస్తోందని అత్తగారు గట్టగా తిట్టడంతో, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. వాడు తల్లితో సహా వెళ్లి, క్షమాపణ చెప్పి, రమ్మని బతిమాలినా రాలేదు. ఆ అమ్మాయి విడాకులకు కేసు వేసింది. నిన్న వాడు ఫోన్ చేశాడు. వాడి నాన్నగారు కట్టిన ఇల్లు తన పేర రాస్తే, కేసు వెనక్కి తీసుకుంటానని కబురు చేసింది. ఎలా ఉన్నారో చూడు! పూర్వం భార్యభర్తల మధ్య ఏవైనా గొడవలొస్తే, ఆడ పిల్లలకు పెద్ద వాళ్ళు మంచి మాటలు చెప్పి, అత్తింటికి పంపేవారు. ఇప్పటి వాళ్ళు అలా చెయ్యడం లేదేమో. బహుశా చెప్పినా ఆవిడ వినే పరిస్థితి లేకపోయి ఉండవచ్చు కూడా.

(ఇంకా ఉంది )

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో