సహ జీవనం – 26 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

టి.వి.యస్ .రామానుజరావు

ఉష మాట్లాడ లేదు. ఆమెకు ఇవన్నీ అలవాటయిపోయాయి. ప్రతి రోజు ఏదో మిషతో తనని తిట్టిపోయ్యందే అత్తగారికి పొద్దు గడవదు. భర్త తల్లి మాట జవదాటడు. అదే ఆ తల్లి ధీమా. కోడలి మీద చాడీలు చెప్పినా, తన ఇష్ట ప్రకారమే ఇల్లు నడిపించినా, కొడుకు తన చెప్పు చేతలలో ఉన్నాడనే ధైర్యం! కొంతమంది అభద్రతా భావం మూలంగా ఇలా ప్రవర్తిస్తారని ఉష ఎక్కడో చదివింది. ఆవిడ తత్వమే అంత, పోనిలే పెద్దావిడ అంటే అనని లెమ్మని ఊరుకునేది. అయితే అది రాన్రాను ఎక్కువైంది. ప్రతి విషయం లోనూ ఆవిడ తన అధికారం చూపిస్తూనే వుంటుంది. భోజనం చేసి,చేతులు కడుక్కుని ఉష కోసం వెతికాడు హేమంత్. ఆమె పడక గదిలో మంచం మీద వాలిపోయి ఉంది.

“ఏమిటి ఉషా, అలావున్నావ్ ?” మృదువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు హేమంత్. ఉష తలెత్తి అతని వంక చూసింది. అప్పటి దాక ఏడ్చినట్లు ఆమె మొహం వడిలిపోయింది.

”అత్త గారు నా మీద ప్రతి దానికి విరుచుకు పడుతున్నారు. కారణం ఏమీ లేకుండానే అన్నింటికీ నన్ను నిందించడం ఎక్కువై పోయింది.”

“ఉషా, ఆవిడ మాటలు పట్టించుకోకు. ఆమె వయసుకి ఇలాంటి భయాలు, ఆలోచనలు మామూలే. అదీగాక, నాన్న గారు పోయాక ఆవిడ ఒంటరిదై పోయింది. అందువల్లే ఇలా మాట్లాడుతుంది. ఇవన్నీ నువ్వు అర్ధం చేసుకున్నావను కున్నాను. ఇంకా అదే తలచుకుని బాధ పడవద్దు” అనునయించాడు.

“మీరు చెప్పేది నిజమే కావచ్చు. కానీ రోజంతా ఆవిడతో వుండేది నేను. ఆవిడ మాటిమాటికి పొరపాటున చేసుకున్నాం,తల్లి లేని పిల్లంటూ, ఏదో ఒకటి దెప్పుతుంటే నాకు ఎంత బాధగా ఉంటోందో మీరు అర్ధం చేసుకోవడం లేదు” ఉష మనసులో ఉక్రోషం వెళ్ళగక్కింది.

“నేను అర్ధం చేసుకోకపోవడం ఏమిటి? నీ మనసు నాకు తెలియదా? వచ్చిన ఇబ్బందల్లా ఆవిడకు నచ్చచెప్పడం లోనే. ఆవిడకు ఏదైనా చెప్పాననుకో, అదిగో పెళ్ళాన్ని వెనకేసు కోస్తున్నావంటూ మరింత రాద్ధాంతం చేస్తుంది. ఇప్పుడు నాతో చెప్పినందు వల్ల ఆవిడ మనసుకు శాంతి. నేను వినకపోతే, ఈ చిన్న చిన్న విషయాలు కూడా బజారున పడతాయి. నాకైనా అమ్మ తప్ప ఎవరున్నారు చెప్పు?” అంటూ ఆమె తలపై చెయ్యి వేసి నిమిరాడు.

“నాకిన్ని చెబుతారు, నేనెందుకలా పడుకున్నానో అడిగారా? మీరు టిఫిన్ చేసే వెళ్ళాక, కొంచెం తలనొప్పిగా వుండి పడుకున్నాను. ఇదిగో మీరు వచ్చాక, అత్తగారి దండకం విని లేచాను.”

“అయ్యో, నువ్వు ఇంతవరకూ అన్నం తినలేదా? సారీ, ఉషా, పద అన్నం తిందువుగాని” లేవదీ శాడు హేమంత్.

“ అత్త గారికి నేనెందుకు పడుకున్నానో, అసలు అన్నం తిన్నానో లేదో పట్టదు, కనీసం మీరన్నా అడగలేదు. మీ కోసమే ఆగానన్న ఆలోచన కూడా మీకు రాలేదు” ఉష కోపంగా అనేసి అవతలికి వెళ్ళిపోయింది.

హేమంత్ తను ఏదో ఆలోచనలో వుండి, భార్య భోజనం చేసిందీ లేనిదీ అడగనందుకు తనను తనే నిందించుకున్నాడు. రాగానే అమ్మ కోడలి మీద ఏదో చెప్పడంతో తనకు ఉష భోజనం విషయం గుర్తే లేదు. భార్య మనసు బాగా గాయ పడిందని, ఇప్పుడు తను ఏం చెప్పినా అర్ధం చేసుకునే పరిస్థితి లేదని హేమంత్ గ్రహించాడు. అమ్మ ఉషపై దాష్టీకం కాస్త తగ్గించుకుంటే, ఇల్లు స్వర్గంలా వుంటుంది. కానీ ఆవిడ మారదు. తను అలా ఉండకపోతే కోడలు నెత్తి నెక్కుతుందేమోననే భయం ఆమె లోని మంచితనాన్ని అణిచేస్తోంది. తను ఏదైనా చెబితే, సమస్య జటిలం అయ్యే అవకాశాలే ఎక్కువ.

“ఇలాంటి సమస్య ప్రతి మగవాడికి ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. అటు తల్లికీ చెప్పలేకా, ఇటు భార్యను సమాధాన పరచలేక మనసున్న ప్రతి మగవాడు అవస్థ పడుతూనే ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో?’ నిట్టూర్చాడు.

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో