ఇక అంతా నీఇష్టం(కవిత)- గంజాం భ్రమరాంబ

                                                          ఇక అంతా నీ ఇష్టం

నీవే తన స్నేహితుడివని నమ్మి
జీవితాంతం నీతో స్నేహం చేస్తుంటే..
మగవాడినని అహంకారంతో
విర్రవీగుతనం నీకెందుకోయి….
మహిళల గొప్పతనం
ఇకనైనా కళ్లు తెరిచి చూడవోయి…

కాస్త సానుభూతి చూపితే చాలు
నిన్ను హృదయానికి
రారాజు ను చేస్తుంది
తనవారిని అందరినీ
పుట్టిల్లులో వదలి
నీవే తనవాడివని
నమ్మకంతో నీ ఇంటికొచ్చింది
నీ ఇంటిపేరును స్వీకరించి
రేయింబవళ్ళు ఊడిగం చేసింది
నీ గెలుపుకోసం
తను నీ వెనుకకు జరిగింది
తన గెలుపును
నీ విజయాలలో వెతుక్కుంది
నీ వంశం పేరే వారసత్వం అన్నా
పునర్జన్మనెత్తి మరీ
బిడ్డల్నికన్నది.
నీకు శారీరకంగా.. మానసికంగా
ఎన్నో సంతోషాలనిచ్చింది
స్వార్థాన్ని మరచింది
అనురాగాన్ని పంచింది

నువ్వు..ఆడది..అని
వివక్షత చూపుతున్నా
ఎంతో సహనంతో క్షమించింది

ఆమెను గౌరవించక..
నువ్వు మూర్ఖుడివై
కూర్చున్న కొమ్మను నరుక్కుంటావో..

ఆమెని నీ సహచరిగా గుర్తించి
ఆమె హృదయాన్ని గెలుచుకుంటావా..

      @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

వేకువ పొలంలో చల్లిన
కిరణాల విత్తనాలు
ఇప్పుడిప్పుడే
మొలకెత్తే శుభతరుణంలో..

ఈ ఉదయపు వేళను
రాగరంజితం చేయడానికి
ఆకాశం అందమైన రంగులను
విరజిమ్ముతుంటే..
ఓ పిల్ల తెమ్మర చిలిపిగా
అలా చిటికేసి వెళుతుంటే..
ప్రత్యూష బిందువులు
ముత్యాలై మెరుస్తుంటే…
కొలను లోని తామరలు
ముద్దుగా మైమరపిస్తుంటే…

చిరునవ్వుల విరిజల్లులు
మన మనసులలో కురవాలని..
దైనందిన జీవితాలు
తేజోమయమవ్వాలని..
ఒక చక్కటి శుభోదయం
అందంగా కదలివచ్చింది
చిన్న కవితగా మారి
మీ ముందు నిలిచింది

                                             -గంజాం భ్రమరాంబ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , Permalink

2 Responses to ఇక అంతా నీఇష్టం(కవిత)- గంజాం భ్రమరాంబ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో