తాతచేతి ఊతకర్ర (కథ ) – ఆదూరి హైమావతి

” ఇక్కడ పచ్చళ్ళ సీసాలు పెట్టానే ఏవైనాయి?” రాగవడిగె. “యావో న్నాయ్న!మూడ్దినాలముందీ డ్నే ఉండె! యావయ్యినయ్యో!”అంట ఆగదిలోఉండేటి అర్లన్నీ ఎతికితి.దొరికినై గాదు. మారాగవకి సిన్నప్పటాల్నుంచీ పచ్చల్లంటే పేనం. “యాంది రబ్బయ్యా!యావైపోయినైరా!”అంటి. “రాణీ! ఇక్కడున్న పచ్చళ్ళ సీసాలేమైనై ?నీవే మన్నా తీశావా?”అంటా రాగవ పెల్లాన్నడిగె .

“ఏం ఆలం..ముం…కు పచ్చల్లు లేంది ముద్దదిగదా!” అంటా కోపంగ రానొచ్చె.

“ఏం వాగుతున్నా వ్! మాఅమ్మ లం..ముం..ఐతే నేనెవర్ని? నన్ను పెళ్ళాడిన నీవెవర్తెవే!?”అని రాగవ కోపంగానె.

“ఛీఛీ ఈ చదువు సంస్కారంలేని పల్లెకంపు ముం …ను ఇంట్లో చూస్తుంటే నాకసహ్యవేస్తున్నది ” అంటా నంజీదరించె.

” నోరుజాగ్రత్త! మాఅమ్మనింకోమాటన్నావంటే…”అమిత కోపంగ రాగవ కల్లు ఎరుపెక్కె.

“అంటే ఏం ?ఏంచేస్తావు?ఈ లం.ముం. కొంపలో ఉంటే నాపిల్లల్న తీసుకుని నేనుఇంట్లోంచీ వెళ్ళిపోతాను,దాన్ని పంపించే య్!“అంటా మగడన్న బయ్యం గూడలేకాండ రాని రాగవ పైపైకొచ్చె. నేను అడ్డం పోయ్యేలోంగనే రాగవ, రాని సెంపలు పటా పటాయించె. ” నీ అమ్మగార్ని నేనామాటలంతే ఏమవుతుంది? నన్ను కన్నమా అమ్మను ఆ మాటలతో తిడతావా?డర్టీ క్రీచర్!” అంటూ రాగవ వుగురుడాయె ! రాని తగ్గదాయె!

“కష్టపడిసంపాదిస్తున్న సొమ్మంతా దీనిచిన్నకొడుకు పిల్లలకు ఇస్తున్నావ్!ఆయధవలకు చదువు కావాల్సొచ్చిందా ! పాడు మూక , అసలు వాళ్ళు ఎవరికి పుట్టిన బిడ్దలు?నీకా? నీతమ్మునికా –” అంటా అంతంత లాసి పాప్పు మట్లనె.

” నీ పాపంకూలా ! నోర్ముయ్! చదువులేనివాళ్ళుకూడ ఇంతవెధవమాటలనరు.” అంటా నాకాడికొచ్చి, ” అమ్మా!నేను ఆఫీసు కెళ్తున్నా. సాయంత్రం ,నిన్నుతీసుకెళ్ళి మీఅన్నకొడుకింట్లోదింపేస్తా.నీ చీరలన్నీ సంచీలోపెట్టుకుని తయారుగాఉండు.ఇది మనుషులుండే తావు కాదమ్మ!. “అంటా ఉత్తి కడుపుతా రాగవ ఆపీంస్కు కార్మీదెల్లె.

నా తల్లి కడుపుసూరుమనె.ఇల్లనాంక తగాయిదాలుంటై. ఇట్టా అత్తల్ని ముం…అనంటా దిట్టడ వెక్కడా మాఇల్లల్ల జూడ్నైతి .సదూకున్న వాల్లిట్టామాట్టాడ్తరని నాకు తెలవదు. మా రాగవ కారెక్కి ల్లి పోయినాంక “బయటికి పోవే లం..ముం . .నీ వొచ్చిన దగ్గర్నుంచీ ఎప్పుడూలేంది మా ఇంట్లో రచ్చలవుతున్నై..”అంటా నా సీర లున్న సంచీ ఓ సేత్తా, నాజుత్తుముడి ఓసేత్తా పట్టి లాక్కెల్లి ఈధి గేటు దెర్సి ,నందోసేసి, సంచీ నాముకానేసి, ”మళ్ళావచ్చావంటే మర్యాదగా ఉండదు.పోయి చావు ఎక్కడైనా “అంటా గేటేసు కెల్లిపోయ రాని.

‘నా కొడుకు రాగవ పెల్లవా యిది ! నాకోడ్ల!!ఇంతింటమాట్లని నన్నిట్టదోసద్దా! తమ్ముల్లాంటి మరిద్ని, సెల్లెలట్టంటి తోటికోడల్ని ఇంత నీసంగంటద! ‘ అని మనస్సు లాగె. గుండెజారె. నాకా ఊర్కొత్త ,నాపల్లొదిలి

పదిరోజుల్నాడొస్తి,వొచ్చినకాడ్నుంసీ ఈపె కిదేదరువయ్యె. యానాడూ బస్సెక్కిందాన్నిగూడగాను .సంచిసంక నెట్కుని ఎదారంగున్న పారుక్కులో మూల్నున్న బెంచీ మ్మీంద గూర్సుంటి , నేకాన్రాకండ దుబ్బులడ్డం గుంతావున గూకుంటి. నా కడుపుల్ల నకనకలాడ తాండె. రేత్తిరిగూడ ‘సనోర’వని పస్తుంటి. దేవునికాడ దీపవెట్టి మా రాగవ కిట్టవని బియ్యన్నూక లుప్మ జేత్తి.నేగాసిన పప్పు సారంటా రాగవకు చెడ్డిట్టం. పచ్చల్ల కోసవెతకతాన్న రాగవ, ఈతగాయిదైనాంక యావీతినకండా అట్నెల్లిపాయ.

నాకు సదూంరాదు.మాది సీతమ్మోరిపల్లి.మాపల్లెకాడ ఏరు పారద్ది,ఏడాది పొడుక్కూ సెరువుల నీల్లె. నాపెనివిటి బల్రావయ్య పేరుకేగాంక మడిసీ బలంగుంటడు, సేయెత్తుమడిసి.కర్రట్టక నడత్తాంటే అంతా పక్కలపక్కల కెల్తాంటరు. పదోయాట్నే పెల్లై ,ఈడేరి నాంక మాఆయినెనికొచ్చి ,ఇంట్లా అడుగెడ్తి,ముగ్గురు కొడుకుల తల్లయితి ,అత్తామావల్ని నాపిల్లోల్లతోపాటుగ్గా సాకి సంతరిత్తి. ముగ్గురాడ బిడ్డల్కూ ,మరుదుల్కూ పెల్లిల్లూ, పేరంటకాలూ , తమ్ముల్లరీతి జేత్తి. మాపల్లిలో ‘సీతమ్మ మంచి మన సున్నదని ‘ పేర్దెచ్చుకుంటి. సదివేదీ రాసేదీ తెలీకాంటిగానీ నాపిల్లల్ను సదివింసాల్ని కోరుకాంటి. అందరి పెల్లిల్లకూ పాతికెక రాలపొలం పదై గూరుసాండె.నాకూ ఒక్క ఆడబిడ్డ నివ్వలేదేని బాదగాండె గానీ,ఆపెకు ఈ సమయాల్ల పెల్లి సక్కరంగ సేద్దునో లేదోనుకుంటి.మాయన్న కొడ్కులు పట్నాల్ల జదివి పెద్ద పెద్ద నౌకరీల్ల ఉంట్రి. ఆల్లోమారు నంజూడొస్తిరి .

” సీతత్తా! నీకెటూ చదువులేదు, నీకొడుకుల్నైనా చదవెయ్యకూడదా! ” అంజెప్పిన మాటలు నామదిలనాటె.అంద్కని పెద్దోన్నీ సిన్నోన్నీ మా బల్రావయ్యకు నజ్జెప్పి , నజ్జెప్పి మాయన్నకాడుంచి పట్నంల జదవేస్తి. ఆల్లసదూంలకు పొలంఐడెకరాలయ్య. మూడోడి సదూ కుంటయ్యె . పదకొండోకలాసుకెల్లే తలికి పైవోల్లు వింజెనీయరు, డాకటేర్లవుతాంట్రి.

“అమ్మా! అన్నల చదువులైనాక నేను చదువుకుంటానులే!నాయనకి పొలంకాడ సాయంచేస్తుంటాను అందాకా ” అని మూడో వోడు ముర్లి నాగ లట్టుకెల్లె. “ఒరే రాగవా! వామనా!తమ్ముని సదూమీ సేతల్లాండాదిర! ఆడు కర్సుకు బయ్యవై మాకా డంత సొమ్ముల్లేవని మీ సదూలయ్యేం తొరుకూ పొలంకాడ నాయ్నత పనిజేత్తన్నడు. ” అంటి.

“ఓస్ ! దాందేముందమ్మా! మరో రెండేళ్ళకి మేం ఉద్యోగాల్లోచేరుతాం.తమ్ముడ్ని ఆడుకోరుకున్నచదువు చదివిస్తాం” అని మాటిచ్చుంట్రి .పెద్దోడు వింజనీరయ్యేతలికి.రెండోవోడు డాకటరై పైసదూంలకని అమేరికెల్లె. ఆడికోసం ఇంకోఎకరం చేజారె. ఆడుఆడ్నే ఆడుండా పిల్లను పెల్లాడె. మాపెవేయవాం లేదయ్యె! అమేరికెల్లి నోడ్ని కంట సూడవైతివి,ఈనగాచిన వనూర్కుం టివి.

రాగవ వింజనీరయ్యి ఉజ్జోగాల్ల తిరగ తాండె. తమ్మున్ని, ఆడిసదూనూ మరిసె. ఆయేల్టికి ముర్లిరైతైపోయె,నాయ్నికి ఆసరగుండె. పొలాంల బంగారం పండిత్తాండె. పొరుగూరి గురునాదం తన కూతుర్నిస్త ననొచ్చె.

“ముర్లీ! సదూంకోవాఏందిర! రాగవ నిన్ను సదివిత్తా నన్లేదుర!”అంటి,దాంకి ముర్లి , “అమ్మా! నాయన పెద్దోడై పోయిండు గదా! పొలమెవరుజూస్తారు? నా బ్రతుకు ’ భూదేవమ్మసేవ’కె పోనీయమ్మా!, ఆ గుర్నాధం తన కూతురు కమలనునాకిచ్చి చేస్తానని కబురంపాడుగదా!ఆపెళ్ళి ఖాయం చేసేయమ్మా! కాస్తంత విశ్రాంతిగా ఉండు,

ఇంకెన్నాళ్ళు పోయ్యూత్తూ వంటచే స్తావ్? పల్లెపిల్ల ఇంత వండి పెడతుంది, మిమ్మల్ని చూసుకుంటుంది.”అనేతలికి పెల్లికుదిరిత్తి. రాగవ సెలవుఎట్టొచ్చె ,గానీ రెండో వోడి ఊసేలేదాయె .

“అన్నక్కాకండ తమ్ముని పెల్లెట్టాజేత్తం,నీవూ సేసేసుకోరాదుర రాగవా!!”అనేలికి ,“ అమ్మా! ముందు తమ్ముని పెళ్ళిగానీ, నీకు కాస్తంత చేతికింద ఉంటుందనే కదా తమ్ముడుచెప్పాడు, అట్టాగేగానీ, ముందుతమ్ముళ్ళ పెళ్ళుళ్ళూఆపైన నాపెళ్ళి” అనేల్కిముర్లికీ పెల్లిజేసేత్తివి. కవల బంగారబ్బొమ్మ , పెల్లైన కాడ్నుంసీ ,’ అత్తమ్మత్తమ్మాంటా ‘నాకు పొయ్యి కాడి కెల్లేపన్లే కండ ఇస్రాంతిచ్చె.ముర్లి మనస్సు ఆయిగుండె.

ముర్లి “ నాయనా! ఇంక పొలం కాడికిరామాక “అని ఆయన్ని సలగా లడగడవే గానీ పొలంకాడికి రానీపోయె. రెండెక రాల పొలాన్ని పదెక రాల్జేసె ముర్లి. ఆడికి ఓ మగపిల్గాడు, ఆపైనో ఆడగూతురు గలిగె.

“ఓరె రాగవా! తమ్ములిద్దరి పెల్లిల్లాయె! పెద్దోడివి నీవు కూడ సేసుకోర!”అనంగనంగ “అమ్మా! నాకు పట్నంల్లో ఉద్యోగంకదా ! పల్లె పిల్లలు అక్క డుండలేరు ” అనంగనే , “ఓరీ రాగవా! నీకు ఇట్టవైన పట్నంల్ల పిల్లనే జేస్కో రాదుర!” అన్నాడాల్నాయ్న.

దాంతా పట్నపిల్లని జూసొచ్చి కారెత్తకొచ్చి మమ్ముల్దీసు కెల్లి పిల్లన్జూపె రాగవ ,పిల్లసక్కంగుండె.ఈపిల్ల రెండోదంట, పెద్ద పిల్ల గ్గూడ పెల్లైందంట. పట్నంకాడ్నే ఆపెకూ, పెనివిటికీ ఉద్దోగవంట. రాగవ, రాని అమ్మా నాయన్లత , రానితో పెల్లిజూపుల్నాడే ,

” మా తమ్ముడు మురళి మమ్మల్ని చదివించను, వడు చదువు అపుకుని పొలంలో కష్టపడిపనిచేసి ఆడబ్బు మాచదువు లకు పెట్టాడు.ఎకరాలమ్మి మాకు డబ్బుసర్దారు.మా నాయన , మురళి మాకు చదువు జెప్పించను ఎంతో కష్టపడ్డారు.వారి చెమట తో మేంచదివాం. మాతమ్ముని పిల్లలను నేను జదివించాల, అది ఇంటికి పెద్ద కొడుగ్గానా ధర్మ.మా అమ్మానాయన్లను మనింట్లోనే పట్నంలో ఉంచుకుని బంగారంగ కళ్ళలోపెట్టుకుని చూసుకోవాలి.నీకు ఇవన్నీ ఇష్టమైతే పెళ్ళి ఖాయం చేసేస్తాము. “అనె. వాల్లంత తలలూసిర

“నాకు మా అమ్మ నాన్న ఎలాగో అలాగే మీ అమ్మానాన్నగార్లను చూసుకుంటాను. ఒట్టు” అనే రాని. దాంత రాగవ పెల్లై పాయె. రానీగూడ వింజనీరేంట! రాగవ లాగె సదువేంట, బాగాసదూంకున్నపిల్ల మమ్మల్న బానే సూసకుంటాదని నమ్మితి. కొత్తంగ పెల్లైనోల్ల కాడ మేవెందుకని రాగవపిల్సిన ఎల్లవైతి. ఆల్లు పట్నాల్న తిరగతాంట్రి. ఆల్లకూ ఇద్దరాడ బిడ్డలు బుట్టిరి. రెండో వోడి ఇసయాలే తెలీందాయె! బల్రావయ్య పెద్దోడైపాయె,ఆయన్కు రెండో వోడ్ని సూడ్నేలేదన్న దిగులెక్కువాయె.

“అయ్యా! పెనివిటికి జెప్పరాదు, ఐనా జెప్తాండ ,ఆడికి అమ్మా నాయన్లు వొద్దను కున్నాంక , ఒకపాలైనా సూడనైనా రాకు న్నాం క నీకెందుకాడిపై పేనం, ‘ఏరు దాటేంక తెప్ప తగలేసినోడు’ , ఊర్కోయే! మన రాగవలేడూ, ముర్లి మనకోసరవనీ అన్న ల్లాంగా కాకాండా ,సదూ సందెలొదిలేసి ఉండనేదా ఏంటయ్యా! ఆడిని మించినోల్లుంటరా!” అంటా బుజ్జగిస్తి. ఓరేతిరికాడ ఏవీ జెప్పకుండ్నే మా బల్రా వయ్య కన్మూసి మరితెరవడాయె.

రాగవ లగెత్తుకొచ్చె. బోరుబోరు నేడ్చె.”పోయినోల్లతో పోనేం కదయ్యా! ఆయ్యకు చిన్నోడి మీంద మనసాయె, ఆడిందల్చు కుంట్నేపాయ!”అని నేనే రాగవను బుజ్జెగిత్తి. రానికి పిల్లల్కి పల్లెల్ల ఎండ్లనీ, కరంటూ పాన్లూ లేవాయెనీరాలేదాయె. ముర్లే అయ్యకు కొరివెట్టి కరమలు జేసె.

రాగవ నన్ను తనెంట రమ్మనె. ” రాగవా! మల్లొస్తలేర! ముర్లి నొదిలి ఇప్పుడురాలే”నంటి. అట్టట్ట ముర్లి పిల్లలెదిగి రాసాగిరి.ఆల్లను దగ్గరి సిన్న పట్నంల ఇంగిలీసు బల్లల్లేత్తిరి.నేనాడుండి, వింతొన్నం వండెడుతుండంగా ఆల్లు సదూంకోసాగిరి. ముర్లికొడుకు మనోజ బాగా సదుంతాండె. ఆల్ల పెద్నాయిన్ల వింజనీరయ్యే సదూంకొచ్చె. యాడనో పోయి ఆకోరుస్సుల్ల జేరె. పిల్ల పదమకూ సదువంటే పేన వాయ, ఆల్లనాయ్న సదవనేదని ఆల్లు ఆలోటు దీర్సను సదవతాండ్రి.

పదమ కూడ అదాందోకంపూటరంట, ఆసదూంకని పెద్ద పట్న వెల్లినంక నేను పల్లె కొస్తి. ఇదో ఈరాగవ బలంతంసేసి నన్నాడి కాడికి ,ఈపట్నంకిదెచ్చె. ఆడికిట్టవని పచ్చల్లూ ,పొల్లూ జేసుకొస్తి.నెయ్యరిసిలూ, లడ్డుండ్లూ ,మణుగ్బూలూ పిల్లోల్ల కని దెస్తి.

ముర్లి పిల్లల్కి సదూంలకు డబ్బు శానాకావాల్చొచ్చే తలికి రాగవ ‘నా చదువుకని తాను చదువుమానేసిన మురళిపిల్లలిల్కి సాహాయం చేయడం నాధర్మం “అని ఆపిల్కాయల సదూంకని సొమ్మంపుతుండంగా ముర్వి అప్పుగానైతేనే తిసుకుంటానె.

రాని కది సానా కోపం గూండే. రాని, ఆడ పిల్లకాయలూ నాకేసికన్నెత్తి జూడరైరి. పన్నెత్తి పలకరైరి. నాకో గదిత్తిరి. రాగవ టీ వెట్టిచ్చె.అందుట్ల చినీమా లొస్తయి,యావో ఈదినాటకాలంటి వంట రాసాగె. దేవుల్ల ఇసయకాలు గూడ రాసాగె. జూత్తాంటి. పొద్దుటాల్నేలెగిసి,తానవాడి,దేవుని గదికాడ గూకుని దీప వెట్టి, పూజ్జేసి, రాగవలేసి నాంక టీజేసిచ్చి, ఆడికిట్టవైన పలారంజేసి ఎడుతాంటి .నేనొచ్చిన కాడ్నుంచీ రాని గూసగుసాంగుం టాండె.

‘అత్తమ్మాని ‘ పిలవ్దాయె.పెద్దపిల్ల పియంట! కాలే జంట! అది ’నాయ్నమ్మా! ‘అనదాయె. ఆపిల్దానికి చెలవులంట బల్లోకి, ఇంటి కాడ్నేఉంటాండె, యవురో ఆపిల్దాని కలాసంట, వాడెవుడో రోజూవస్తాండె ,ఆడ్ని జూత్తెనాకు ‘కీసగుడు‘గుర్తొంస్తాండె. రాని, రాగవ ఆపీసుల కెల్లి నాంక ఆడొచ్చి ఆపిల్దాని గదిలా గూకుం టాండె, ఓనాడు నేనడిగిందానికి రాని ఆకాసీమంత తెత్తెగిరె, “మీ మురిక్కంపు పల్లెల్లో వాళ్ళకేం తెలుస్తాయ్,సంకటితిని కబు ర్లాడు కుంటూ ఉంటారు. చదువుకునేవాళ్ళు కలిసి చదువుతారు.అదొకతప్పా?,నోరు మూసుక్కూచో” మనె.

నాకినొచ్చె,రాని ఆ పిల్దాంతో అంటాండె,”ఆ ముసిల్దాని దగ్గర కెళ్ళకు,ఆపల్లె కబుర్లినకు .అందుకే ఆపిల్లాడితోకల్సి చదువు కుంటూ ఉండు” అంజెప్పె. నాకాడ కూకుంటాందని ఆపిల్గాన్ని పిలిపిస్తాండాదని నా కరదమాయె. సిన్నపిల్ల సిత్రంట, పసిది ,మూడేల్లది ,అది ఆల్లమ్మ లేకున్నప్డు, ఆల్లనాయ్న జెప్పిండని,’ నాయ్నమ్మా!’ ని నాకాడికొచ్చి కూర్సుంటాండె, నేదెచ్చిన మణుగ్బూలూ తింటాండె. ఓనాడు రానొచ్చి జూసి పిల్దాన్ని టపటపాం మని గొట్టి” ఆముసలి ముం…దగ్గర కూర్చుని పల్లెల్లో తినే పాడు తిండం తా తింటావా? రోగమొస్తే ఎవరు చూస్తారే? “అని కొట్సాగె.. నేనడ్డమెల్దారంటే గదితలు పేస్కునె.

ఆరోజుకాడ్నించీ ఆసిన్నపిల్దాన్నీ దీస్కెల్లి ఆదాంద పిల్లల్న జూసేకాడెట్టె.రాగవ నన్ను కార్లఎక్కించ కెల్లి మూడ్దినాలు చలవులని ,ఆడుండే గుల్లన్నీసూపె. ఇదో ఇంటి కొచ్చేకాడికిది జరిగిందాయె! ఎట్టపండుంటినో !అంతాకలగాండె ,ఆ చిమెంటు బెంచీల్మీద పండి ,సంచీ తలకిందాట్టుకుని నిద్దరోతి. కడుపుకాల్తాండె, నీల్లవు తాండె!కల్లు తిరగతాండె.పేగులరుత్తాండె .పల్లె కాడుంటె ముర్లి , కవల నన్నిట్ట జూత్తర!’ కల్లెమ్మట జలజల నీర్గారె!ఎరక్క పోయొచ్చిఇట్ట సెట్లకింద ,దాగుండి సాటుసాటుగ ఉత్తకడుపుత పండాల్సొ చ్చిందేం టిర బగమంతుడ! వున్నకాడ్కి పేద సాదల్కు సాయంజేస్తి గంద!, కడుపుకింతెట్టి నాల్లవేనాయె! ఏం తప్పు సేస్తని ఈసిచ్చేసినవ్!’ అంటా దేవున్ని తిట్టుకాంటి.

రాని ఆపీసు కెల్పోయుంటది, కాత్తంత నీల్లైన తాగదార్ని , రాగ వొచ్చేయేల్టికి మాయన్న కొడుకులిల్లు యాడనో ,ఓపాలి తీసు కెల్లిండు రాగవ, గురుతులడక్కాంటా ఎల్లి పోదార్నిలేస్తి, సంచీ సంకనేస్కుని.గేడ్దీస్కని,లోగాకెల్తి. మా బల్రావయ్య వాడ్కున్న ఊతగర్ర దేవునిగదిల ఎట్టుంటి! అదినాకాడుంటె బల్రావయ్యున్నట్టె లెక్క .దాన్నెత్తు కెల్దవని దేవుని గదిల కెల్దవనుకుంటి.

ఆయనెల్లిపోయినాంక నాకా గర్రే ఊతం గుండె. అదెత్తుకుని ఎల్లి పోదవని మెల్లిగ గేటుదాంటెల్తి. ఆడ మోటర్ చైకిలూండె.! ఆది రో జొచ్చే ఆపిల్గానిది.ఆడొచ్చుంట డనుకుంటి. లోనికెల్లంగనె పెద్ద పిల్దాని గదిలాంచి అరుపులినొచ్చె.ముందున్న దేవుని గదిల ఎట్టిన మా బల్రావయ్య కర్రట్టుకుని, సంచాడ బడేంసి,పై నున్న పిల్దాని గదిలాంకి లగెడ్తి .తల్పు ముందల్కి వారాకిలి గేసుండె!.

లోనికెల్లి జూత్తి. పిల్లదికిందపడుండె. దానిపై పైకి ఆ కుర్రగాడు పోతాండె. పిల్లొంటి మీంద బట్టల్లే వాయె! నాకు పేనం గడగడాం లాడె! పిల్ల అర త్తాండె ” పోపో. వదులు, వదులు, హెల్ప్ హెల్ప్ ” అనీ అరత్తాండె.

ఇగాలోసిచ్చ కాండ గదిలోంకి గమ్మునెల్లి ఆడి నెత్తి మీంద నెత్తి మీంద కర్రతో బాదుకుంటి, కంచుపొన్ను ముల్గర్రది. నడుంమ్మీంద నడుమ్మీంద యిరగ్గొడ్తి. సేలల్ల కల్లాం సేసిన సేతులాయె. జొన్నల్దంచిన సేతులాయె! ఆడుమరి లేవలేంక పాయె! పిల్లకు నాసీర గొంగప్పి,గుండ్లే కద్దుకుని గది తలుపేసి బైట గడీంఎట్టేసి నాంక , గబుక్కునెల్లి దేవుని గదికాడున్న నా సంచీలాంచీ నా సీరలాక్కొచ్చి ,తెచ్చి పిల్దాని ఒంటి మీంజుడితి.

“నాయనమ్మా! నాయనమ్మా! ” అంటా నన్ను గావిలించ్కుని పిల్లదేడ్వ సాగె.

బిక్కజచ్చిపోయుండె!”మీనాయ్నకు పోంజెయ్యిముం”దంటి . పిల్ల పోనెత్తుకుని జేసె.

“నాయనమ్మా! నన్ను కాచావు ! క్షమించు నాయనమ్మ! మాఅమ్మ మాటలువిని నిన్ను చూడనైతి.

నీతోమాట్లాడనైతి. ” అంటేడ్వ సాగె. పిల్లనూర్కోబెడ తాం డం గనే రాగ వొచ్చె.”అమ్మా!ప్రియా! ఏమైంది తల్లీ !” అంటాడిగె, పిల్ల ఇంగిలీసుల యాందాందో జెప్పె. రాగవ పోలీసోల్లకు పోంజేసె. ఆల్లొత్తిరి. గదితపుల్దీసి ఆడ్నేస్కు పోయేకాడికి రానొచ్చె. జరిగిందినె . పిల్దాన్నిజూసె.

దగ్గిరికి రాబోంగనె పిల్ది, ” ఛీ!నీ వొకఅమ్మవా? నాయనమ్మతో మాట్లాడొద్దంటివి, కట్టడిచేస్తివి?ఆపిల్లాడిని నాకు కాపలాగా ఉంచి పోతుంటివి!వాడితో మాట్లాడు తూ ఉండమంటివి!.వాడుత్త వెధవాయె! నేచెప్పినా నా మాటవిన కుండా వాడిని రానిస్తుంటివి!..” పియ ఆల్లమ్మని ఇంగిలీ సు ల యాందాందోనె, సీదరింసె.

రాని నాకాడి కొచ్చి కాల్లట్టుకుని,” క్షమించత్తమ్మా! నిన్ననగూడని మాటలన్నాను, ఇంట్లోంచి వెళ్లగొట్టాను,ఐనాగానీ నీవు ప్రియను కాపాడినావ్!” అంటా ఇంకాయావావో అంటేడ్వసాగె.

రాగవ నాకాడికొచ్చి” అమ్మా! నీ రుణం తీర్చలేనే” అంటా కల్నీల్లు కార్చతా నాకాల్లట్టుకునె. రానితోపాటొచ్చిన సిన్ పిల్గూడ నాకాడి కొచ్చి వాటేస్కునె. పియ నన్నొదల్దాయె”పియా! ఊర్కోయేమ్మా! ఇదీ మీ తాత సేతి ఊతగర్రె ! మీతాత సకితంత ఇందుండాదె!మీతాతకి మీయందు న్నపేవంత దీన్లుండాదె! ఆదే నిన్ గాసినాదె ” అంటి..
ఆల్లంత నాసుట్టుంతాజేరి తాతసేతి ఊతగర్రకేసి సూత్తాంట్రి.

—ఆదూరి.హైమవతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో